ప్రభుత్వ విద్యపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యపై చిన్నచూపు

May 15 2025 2:14 AM | Updated on May 15 2025 2:14 AM

ప్రభు

ప్రభుత్వ విద్యపై చిన్నచూపు

● పాఠశాలల్లో స్వీపర్లు, స్కావెంజర్ల కొరత ● కంపుకొడుతున్న మూత్రశాలలు, మరుగుదొడ్లు ● విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయుల ఆరాటం ● సౌకర్యాలు లేక వెనుకాడుతున్న తల్లిదండ్రులు

సహాయకులను నియమించాలి

పాఠశాల విద్య మార్పుల్లో భాగంగా ప్రభుత్వం స్కావెంజర్‌ను నియమించడం హర్షణీయం. ఏక్‌భారత్‌ శ్రేష్ట భారత్‌, ఎకోక్లబ్‌ వంటి కార్యక్రమాల్లో కూడా స్కావెంజర్‌ అవసరం ఏర్పడుతుంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ (పూర్వ ప్రాథమిక విద్య) విద్యార్థులకు వారి కనీస అవసరాలకు అంగన్‌వాడీ పాఠశాల మాదిరిగా సహాయకులను నియమించడం ద్వారా విదార్థుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతుంది.

– నీలం సంపత్‌కుమార్‌,

డీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

వెల్గటూర్‌: ఓ వైపు మన ఊరు మన బడి.. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వం పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నా.. విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నా.. బడుల్లో స్వీపర్లు, స్కావెంజర్ల కొరతతో పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. స్వీపర్లు, స్కావెంజర్ల కొరతతో విద్యాలయాల్లో ఊడ్చే వారులేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలు పిచ్చిమొక్కలతో నిండిపోతున్నాయి. క్లాస్‌ రూములను శుభ్రం చేసేవారు లేక అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతుండడంతో విద్యార్థుల సంఖ్యను పెంచడం ప్రశ్నార్థకంగా మారింది.

ఉపాధ్యాయుల కసరత్తు

జిల్లాలో మొత్తం 757 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 471 ప్రాథమిక, 69 ప్రాథమికోన్నత, 218 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,500 మంది విద్య అభ్యసిస్తున్నారు. రానున్న విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇప్పటికే ఉపాధ్యాయులు బడిబాట ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే పాఠశాలల్లో స్వీపర్లు స్కావెంజర్ల పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో పిల్లలను బడికి పంపించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. విద్యార్థులు నిత్యం వినియోగించే తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు ప్రతీరోజు శుభ్రం చేయకపోవడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది, పట్టణాల్లో మున్సిపాలిటీ సిబ్బందితో పారిశుధ్య పనులు చేయించాలని ప్రభుత్వం సూచించినా పని ఒత్తిడి కారణంగా వారు ముందుకు రావడం లేదు. పాఠశాల కమిటీలే తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకుని పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నాయి.

అమలు కాని ప్రభుత్వ ఆదేశాలు

2024–25 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడం.. చెట్లకు నీరు పట్టడం వంటి పనులకు ఒకరిని నియమించుకోవాలని, వారికి విద్యార్థుల సంఖ్య ప్రకా రం జీతభత్యాలు అందించాలని రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా ప్రొసీడింగ్‌ ఇచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా అమలు కాకపోవడం.. ఒక్కో జిల్లాలో విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా ఎంతమంది విద్యార్థులు ఉన్నా.. ఒకేలా జీతం ఇవ్వడం.. అదికూడా సమయానికి రాకపోవడం వంటి కారణాలతో పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం వరకై నా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జీతభత్యాలు సక్రమంగా అందిస్తే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి బలో పేతం అవుతాయని మేధావులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ విద్యపై చిన్నచూపు1
1/1

ప్రభుత్వ విద్యపై చిన్నచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement