
పెద్ద జయంతికి ధర్మపురిలో ఏర్పాట్లు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని జయంతి వేడుకలకు ముస్తాబు చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు స్వామివారి జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించారు. లడ్డూ, ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ కుట్రతోనే కేసీఆర్‌కు నోటీసులు
జగిత్యాల: తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావ రి జలాలను తరలించడానికి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో గొప్పదని, రాజకీయ కుట్రతోనే కేసీఆర్‌కు కమిషనర్ నోటీసులు ఇచ్చారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రం దేశానికే అన్నం పెడుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు. త్వరలోనే కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు.

పెద్ద జయంతికి ధర్మపురిలో ఏర్పాట్లు