
గోడు వినండి.. పరిష్కారం చూపండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 43 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.
రశీదు కోసం ఎదురుచూపులు
ప్రజావాణికి వచ్చిన వారికి రశీదు ఇచ్చేందుకు అధికారులు గంటల తరబడి గడువు పెడుతున్నారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారిందని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఆలస్యంగా రశీదు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.