
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్‌కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్‌బుక్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్‌లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుగాపై నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరి కొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ సారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్‌లైన్ల ఏర్పా టు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మె యిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది.
కొత్తపల్లి–మనోహరాబాద్‌కు రూ.205 కోట్లు
అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబా ద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్‌పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్‌మానేరులో బ్రిడ్జి పనులు సవా లుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ సర్వేలకు..
ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్‌పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ ఎస్‌ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది.
మెయిన్‌లైన్‌కు
● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు
● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్‌కోసం రూ.36.99 కోట్లు
స్టేషన్ల కోసం..
● నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్‌ను బ్లాక్ స్టేషన్‌గా మార్చేందుకు రూ.15.85 కోట్లు
● కరీంనగర్‌లో అదనంగా రెండు లూప్‌లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు
● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్‌లో లింగపేట–జగిత్యాల స్టేషన్‌లోలూప్‌లైన్ కోసం రూ.19.89 కోట్లు
● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్‌ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు
● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు
● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు
● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్‌గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు
● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్‌కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు.
రైలు వంతెనల కోసం..
● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు
● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు
● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్‌యూబీ రూ.7.41 కోట్లు

మౌలిక సదుపాయాలకు పెద్దపీట!