
మాతృమరణాలు తగ్గించాలి
● అడిషనల్ కలెక్టర్ లత
జగిత్యాల: జిల్లాలో మాతృమరణాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. గురువారం వైద్యులతో సమావేశమయ్యారు. గర్భవతిగా నమోదు చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలని, హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే గైనకాలజిస్ట్‌లకు చూపించాలని పేర్కొన్నారు. మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ గర్భం దాల్చినప్పుటి నుంచే అన్నిరకాల పరీక్షలు, 2డీ ఈకో స్కానింగ్ చేయిస్తే వ్యాధులను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్‌రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎండీ.సమియోద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణులు పూర్ణచందర్, వైద్యులు పద్మిని, సాయిసుధ, సుదీర్, సతీశ్, అంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ఐదో స్థానం
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను జిల్లాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కొనసాగిస్తున్నామని, ఆలస్యంగా ప్రారంభమైనా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉన్నామని అదనపు కలెక్టర్ లత అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 428 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 26,557 మంది రైతుల నుంచి 19,17,940 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. 41 మంది రైతుల నుంచి సన్నరకం ధాన్యం 3,150 క్వింటాళ్లు కొన్నామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.303.57కోట్లు జమ చేశామన్నారు. కేంద్రాలు, రైస్‌మిల్లుల్లో సరిపడా హమాలీలను సమకూర్చుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.