
గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి
హుజూరాబాద్: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కంకణాల రాజ్‌కుమార్‌రెడ్డ్డి (47) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రాజ్‌కుమార్‌రెడ్డి భూమి కరీంనగర్– వరంగల్ బైపాస్ రోడ్డు కింద కోల్పోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రికి కుమార్తె శివాని అంత్యక్రియలు నిర్వహించింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి సంతాపం తెలిపారు.
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : పెళ్లి సంబంధం కుదరడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు దేవయ్య కుమారుడు ఒగ్గు మహేశ్(21) గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడు. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడనే సంబంధాలు కుదరడం లేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిపేట శివారులోని పొలాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతు ఛిటకి తల్లి రాజవ్వ, సోదరుడు నగేశ్ ఉన్నారు.
తల్లి మందలించిందని కూతురు..
గొల్లపల్లి: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిల్వాకోడూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ల లక్ష్మి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లింది. ఆమె కూతురు త్రిష అక్కడే ఇంటర్ చదివింది. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి స్వగ్రామానికి వచ్చారు. కూతురు ఆలస్యంగా నిద్రలేవడంతోపాటు ఏ పనీ చేయకపోవడంతో తల్లి మంగళవారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన త్రిష (21) మంగళవారం అర్ధరాత్రి తమ రేకులషెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
ప్రేమ విఫలమై యువకుడు..
జమ్మికుంట: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు బుధవారం జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. ఇల్లందకుంటకు చెందిన దార మొగిలి, రాజేశ్వరి దంపతుల కొడుకు దార ఎల్లేశ్(23) జమ్మికుంటలో ఇంటర్ చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు కలిసి తిరిగారు. తరువాత సదరు అమ్మాయి వేరే వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లేశ్ ‘ఆ అమ్మయిని నా శవం వద్దకు తీసుకరావాలని’ సెల్ఫీ వీడియో తీసుకొని జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి