
సైనికులకు అండగా ఉందాం
జగిత్యాల: భారత సైనికులకు ప్రతిఒక్కరూ అండగా ఉందామని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత్‌దే విజయమన్నారు. ఆయన టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్న సమయంలో కోదండ రామాలయానికి రూ.10 లక్షలు మంజూరు చేయించిన నిధులతో నిర్మించిన భజన మందిరాన్ని పరిశీలించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత మాట్లాడుతూ.. రక్షణ సాయుధ బలగాలకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, ఆపరేషన్ సిందూర్‌తో పహెల్గాం మృతులకు నివాళి అర్పించామని పేర్కొన్నారు. నాయకులు ఆనందరావు వొల్లం మల్లేశం, గంగాధర్, దేవేందర్‌నాయక్, శీలం ప్రియాంక, గంగాధర్ పాల్గొన్నారు.