breaking news
Students
-
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్‌లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్‌ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్‌ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్‌కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్‌కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కర్నూలు జిల్లాలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఐదవ తరగతి చెందిన విద్యార్థులే. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం.. గ్రామ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు చెరువులో మృత్యువాత పడ్డారు. మరో విద్యార్థి గ్రామస్థులకు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలిలో విషాదం నెలకొంది. -
గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్‌కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు. -
యాజమాన్య కోటా.. సగానికిపైగా ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం కన్పిస్తోంది. టాప్ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలు, రాజధాని పరిసర ప్రాంతాల్లోని సాధారణ కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 180 ఉన్నాయి. వీటి పరిధిలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లు 1,16,877 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 90,921 సీట్లు ఉన్నాయి. 156 ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద 25,956 సీట్లు ఉన్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో దాదాపు 7 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లే ఇంకా 11,638 మిగిలిపోయాయి. యాజమాన్య కోటా సీట్లు అన్ని కాలేజీల్లో కలిపి 8 వేలకు మించి భర్తీ అవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో కూడా యాజమాన్య కోటాలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. 15 వేల సీట్ల భర్తీ కూడా కష్టమే యాజమాన్య కోటాలో ఉన్న 25,956 సీట్లలో స్పాట్ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు 15 వేల సీట్లు భర్తీ అవ్వడం కూడా కష్టమేనని యాజమాన్యాలు అంటున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో ఒక్కో సీటుకు రూ.12 నుంచి రూ.19 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. ఇతర బ్రాంచీల్లో రూ.5 లక్షలకు సీటు ఇస్తామన్నా కాస్త మంచి ర్యాంకు ఉన్న విద్యార్థులు ముందుకు రావడం లేదు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ఉండే వార్షిక ఫీజుతోనే కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నాయి. సాధారణ కాలేజీల్లో సీఎస్ఈ సీటుకు రూ.3 లక్షలకు మించి డిమాండ్ రావడం లేదు. జిల్లాలు, గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కన్వీనర్ కోటా ఫీజుకే సీఎస్ఈ సీటు ఇస్తామన్నా విద్యార్థులు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులను ఆకర్శించేందుకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పీఆర్ఓలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలను రంగంలోకి దించాయి. వీటికి ఒక్కో విద్యార్థి ఫీజులో సాధారణ కాలేజీలు 30 శాతం కమీషన్ ఇస్తుంటే, మరికొన్ని 40 శాతం వరకూ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. -
పదిలో ముగ్గురే గ్రాడ్యుయేట్లు!
పదిలో ముగ్గురే.. అవును మీరు చదువుతున్నది నిజమే. దేశంలో పది మంది యువతలో ముగ్గురు మాత్రమే డిగ్రీ, ఆపై వరకు చదువుకున్నారు. మిగిలిన వారంతా ఇంటర్/డిప్లొమాకే పరిమితమవుతున్నారు. దేశంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 42 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 29%. వీరిలో సుమారు కోటికిపైగా నిరక్షరాస్యులు ఉన్నారు.ఒక వ్యక్తి ఆలోచనలను తీర్చిదిద్దడంలో సహాయపడే కీలక అంశాల్లో విద్య ఒకటి. ముఖ్యంగా యువత.. దేశంలో ఉత్పాదక శక్తులుగా, విలువైన మానవ వనరులుగా, వినూత్న పౌరులుగా మారడానికి వీలు కల్పించే ఆయుధం కూడా అదే. అలాంటి విద్య.. ప్రత్యేకించి ఉన్నత విద్య మనదేశంలో ఇప్పటికీ గ్రామీణులకు అందని ద్రాక్షలానే ఉంది.అక్షరాస్యత స్థాయులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న విద్య నాణ్యత ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని ‘పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కంజ్యూమర్ ఎకానమీ’ (పీఆర్‌ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రం వెల్లడించింది. ఈ విషయంలో పట్టణాలకు, పల్లెలకు మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.ఉన్నత చదువులు పట్టణాలకే..దేశవ్యాప్తంగా 2024–25 నాటికి మొత్తం యువతలో 24% మంది.. అంటే సుమారు 9.9 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేశారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల వారి వాటా 52 శాతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా దాదాపు 3 కోట్ల మంది అందుకున్నారు. వీరిలో 66 శాతం పట్టణవాసులే కావడం గమనార్హం. ఇతర ఉన్నత చదువులు చదివిన 20 లక్షల మంది యువతలో పట్టణ ప్రాంతాలవారు ఏకంగా 85 శాతం ఉన్నారు.అంటే ఉన్నత చదువులు పట్టణాలకే పరిమితం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. మొత్తం యువతలో ప్రాథమిక విద్య అభ్యసించిన వారు 7.3 కోట్లు (17%), మెట్రిక్ 7.6 కోట్లు (18%), ఇంటర్ 9.3 కోట్లు (22%), టెక్నికల్/డిప్లొమా చేసినవారు 3.6 కోట్లు (9%) ఉన్నారు. యూత్‌లో 3% అంటే 1.3 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ప్రాంతాలవారీగా చూస్తే డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. -
దోస్త్ రిపోర్టింగ్ గడువు 12 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేసే గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 6వ తేదీ వరకూ రిపోర్టు చేయాల్సి ఉంది.దీన్ని ఈ నెల 12 వరకూ పొడిగించారు. స్పాట్ అడ్మిషన్ల గడువును కూడా 14వ తేదీ వరకూ పెంచినట్టు తెలిపారు. వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు. -
హైస్కూల్ రోజుల నుంచే స్టార్టప్ ఐడియాలు!
యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థుల స్టార్టప్‌ల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్శిటీ, కాలేజీల నుంచి మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలు కూడా స్టార్టప్ ఐడియాలకు కేంద్రం అవుతున్నాయి. ఇటీవల దిల్లీ–ఎన్సీఆర్ విద్యార్థి సదస్సులో పాల్గొన్న విద్యార్థులు డెమో యాప్‌ల గురించి వివరించడంతోపాటు తమ ఫ్యూచర్ స్టార్టప్‌లకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వారి మాటల్లో ఉత్సాహం మాత్రమే కనిపించలేదు. నిర్మాణాత్మక ప్రణాళిక కనిపించింది.నో–కోడ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్స్, గ్లోబల్ బ్యాంక్ రిసోర్స్ ఇన్స్టంట్ యాక్సెస్... మొదలైన కారణాల వల్ల గతంతో పోల్చితే స్టార్టప్ ఆలోచన పట్టాలు ఎక్కించడం సులభం అయింది. స్టార్టప్‌లను ఎలా నిర్మించాలి, అస్థిరపరిస్థితులను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే దానిని అధిగమించి తిరిగి ఎలా వెనక్కి రావాలి... మొదలైన విషయాల గురించిపాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోనప్పటికీ వాటిపై హైస్కూల్ స్థాయి విద్యార్థులకు తగినంత అవగాహన ఉండడం విశేషం. చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుతమ కలలను సాకారం చేసుకోవడానికి స్కూల్లో నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు, పర్యావరణహిత ఆలోచనల ఆధారంగా స్టార్టప్ ఆలోచన చేస్తోంది యువతరం.ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్ -
పైసలు కడితేనే ప్రవేశం
కే.నవీన్ కుమార్ అనే ఎస్సీ కేటగిరీ విద్యార్థి టీజీఈఏపీసెట్–2025లో ర్యాంకు సాధించి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు. మూడు రోజుల క్రితం కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లాడు. నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న ధీమాతో వెళ్లిన అతడికి కాలేజీ యాజమాన్యం మాటలతో దిమ్మ తిరిగి పోయింది. ట్యూషన్ ఫీజు, ఇతర నిర్వహణ ఫీజులు కలిపి రూ.1.25 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తనకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ..ఆ డబ్బు విద్యార్థి వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తారని, ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. సీటును కాపాడుకొనేందుకు అప్పుచేసి ఎలాగోలా ట్యూషన్ ఫీజు చెల్లించాడు.మాసాబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ – సైఫాబాద్‌లో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతన్న ఎస్సీ విద్యారి్థకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ.. మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రూ.75వేలు (ఏటా రూ.25 వేల చొప్పున) చెల్లించాలని కాలేజీలో ఆదేశించింది. ఫీజు చెల్లించకపోతే క్లాసులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు విద్యారి్థ.. ఫీజు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఫీజుల చెల్లింపుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మార్పులు వారి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించినప్పటికీ.. వారు పూర్తి ఫీజును ముందుగా చెల్లిస్తేనే కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజులను సైతం విద్యా సంవత్సరం మొదట్లోనే వసూలు చేస్తున్నాయి. లేదంటే తరగతులకు అనుమతించటం లేదు. ప్రైవేటు కాలేజీలతోపాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ఇదే కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు వేలు.. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజుల కోసం అప్పులపాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉంటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు 1,22,205 (రెన్యూవల్స్), 77,722 (ఫ్రెషర్స్) దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు 45 వేల మంది ఉన్నారు. జనరల్ కోర్సుల ఫీజులు రూ.వేలల్లో ఉండగా.. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు రూ.లక్షలకు చేరాయి. ఇంత పెద్దమొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర భారంగా మారుతోంది. చదువును కొనసాగించాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనల మార్పుతో మొదటికే మోసం.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వాలు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్సీ విద్యార్థుల ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటా ఫీజు నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి కాలేజీలకు నేరుగా చెల్లించేది. ఈ విధానాన్ని మార్చి ఫీజులో తన వాటాను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఆ మేరకు విద్యార్థి వివరాలను ఈపాస్ ద్వారా లింక్ చేసుకుని నిధులు విడుదల చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఫీజును విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను లబి్ధదారులకు నేరుగా అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఫీజు విద్యార్థి ఖాతాలో జమ కావటానికి కొంత సమయం పడుతుంది. ఫీజు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానిని విద్యార్థి నుంచి కాలేజీలు తీసుకోవాలి. కానీ, అప్పటివరకు ఆగకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు మొత్తం వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. -
దుక్కి దున్ని.. నాట్లు వేసి
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని నాట్లు వేశారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినులు. మండలంలోని అవంచలో బుధవారం రైతులతో కలిసి పొలం బాట పట్టారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల దిగుబడిని పెంచే విధంగా తమ సేవలను అందించడానికే వ్యవసాయ విద్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను వివరించారు.ఎప్పుడు దారి కొచ్చేనో..?మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. అక్కడికి వెళ్లడానికి నర్సాపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి నర్సాపూర్–తూప్రాన్ రహదారి నుంచి ఉండగా, మరోటి నర్సాపూర్‌లోని జగన్నాథరావు కాలనీ నుంచి ఉంది. రెండు రోడ్లు గుంతలమయంగా మారగా, కనీస మరమ్మతులు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తుందన్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లోకలెవరు? కానిదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న ‘స్థానికత’వివాదంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీఓ 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూల తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. జీవో 33తో మొదలు..ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 15 శాతం రిజర్వే షన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50%సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ 114ను జారీచేసింది. ఆ జీఓను సవరిస్తూ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చింది. జీఓ 114 ఏముంది? ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానికతను నిర్ధారిస్తూ 2017 జూలై 5న బీఆర్ఎస్ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చింది. దీనిలో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజ్‌లను పొందుపరిచారు. మొదటి క్లాజ్ ప్రకారం 6వ తరగతి నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. రెండో క్లాజ్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెంటిలో ఏది ఉన్నా స్థానికులే. జీఓ 33లో ఏముంది? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీఓ 114ను సవరిస్తూ 2024 జూలై 19న ఈ జీఓను తీసుకొచ్చింది. 114 జీఓలోని మొదటి క్లాజ్ (6 నుంచి 12 తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధన) జీఓ 33 ద్వారా తొలగించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులు అని స్పష్టం చేశారు. జీఓ 114 దుర్వినియోగం జీఓ 33 ఆధారంగానే గత సంవత్సరం కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ వాదనలు జరుగుతుంగానే ఈ ఏడాది కూడా కాళోజీ వర్సిటీ జీఓ 33 ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల 24న సుప్రీంకోర్టు కేసును విచారించి, స్థానికత అంశం తేలే వరకు పాత నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. కాగా, 6 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనే నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాళోజీ యూనివర్సిటీ 2023లో గుర్తించింది. ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు 6 నుంచి 9 వరకు (నాలుగేళ్లు) తెలంగాణలో చదివినట్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి నకిలీ స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు తెచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తేల్చి ఏడుగురి సీట్లను రద్దు చేసింది. ఈ అక్రమాలను నివారించేందుకు బోర్డు పరీక్షలు ఉన్న 10వ తరగతిని తప్పనిసరి చూస్తూ 9 నుంచి 12 (ఇంటరీ్మడియట్) తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీఓ 33ను తెచ్చింది. జీఓ 33తో తెలంగాణవారూ నాన్ లోకల్ జీవో 33 వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్ కోల్పోవటంతో వివాదం ముదిరింది. నల్లగొండ, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన తెలంగాణ విద్యార్థులు 10వ తరగతి వరకు స్థానికంగా చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. వారు జీఓ 33 ప్రకారం స్థానికులు కాదు. -
‘ఆర్టీఈ అడ్మిషన్ల’తో సర్కారు ఆటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. సకాలంలో ఒక్క నిర్ణయం తీసుకోకుండా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఫీజుల ఖరారులో తీవ్ర జాప్యం చేసింది. ఆ సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు నిరాకరించినా చోద్యం చూస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి ఆర్టీఈ కింద అడ్మిషన్ల పేరుతో కొత్త నాటానికి తెరతీసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం నోటిఫికేషన్ ఇచి్చంది. జూన్‌లోనే పూర్తవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టులోనూ కొనసాగించడం గమనార్హం. నష్టం జరిగాక తీరిగ్గా ఫీజుల నిర్ణయం ఆర్టీఈ చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ప్రతి విద్యా సంవత్సరం మే నెలలో నోటిఫికేషన్ ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత గల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తుంది. గత మూడు విద్యా సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ ప్రక్రియ 2025–26లో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెండు విడతల్లో 31,701 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు.అయితే, ప్రభుత్వం చెల్లించే ఫీజులను సకాలంలో ఖరారు చేయలేదు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిపోవడంతో జూలైలో కొందరు పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా ప్రభుత్వం జూలై 24వ తేదీన ఫీజులు ఖరారు చేసింది. అప్పటికే విద్యార్థులకు నష్టం జరిగిపోయింది. మొత్తంమ్మీద 31,701 మందిలో సగం మందే ఆర్టీఈ కింద సీట్లు పొందినట్లు సమాచారం. ఇప్పుడు అడ్మిషన్లు ఇస్తాం.. ఫీజు కట్టుకోండి.. ఇప్పటి వరకు ఆర్టీఈ కింద సీట్లు పొందేందుకు విద్యార్థుల ఇళ్లకు 3 కి.మీ. పరిధిలోని ప్రైవేటు స్కూళ్లకే అవకాశం ఉంది. ఆ పరిధిని 5 కి.మీ. వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి చూపేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఆర్టీఈ కింద సీట్లు పొందేవారు ఫీజును స్వయంగా చెల్లించుకుంటామని రాసివ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆర్టీఈ ప్రవేశాలను పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. -
స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు
నరసాపురం/మైలవరం: ‘మా పాఠశాలలో ఫీజు మొత్తం ఒకేసారి కట్టినవారిని ఒకలా చూస్తున్నారు. విడతలవారీగా కట్టేవారిని మరోలా చూస్తూ కూలి పనులు చేయిస్తున్నారు...’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పంజా సెంటర్లో ఉన్న నారాయణ స్కూల్ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్వాహకుల వేధింపులు అధికమయ్యాయంటూ విద్యార్థులు గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి స్కూల్ వద్దకు పట్టణ ఎస్ఐ జయలక్ష్మి, పోలీసులు వచ్చారు.‘ఫీజులు కట్టకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తారు...’ అంటూ ఎస్ఐ స్కూల్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులను అడగాలి. మాతో చెత్త ఎత్తించడం, గ్రౌండ్లో మొక్కలు కోయించడం, బెంచీలు మోయించడం వంటి పనులు ఎందుకు చేయిస్తున్నారు? మంత్రి పాఠశాల కాబట్టి ఎస్ఐ వచ్చి యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారా?’ అని నిలదీశారు. అదే సమయంలో గేటుకు విద్యార్థులు వేసిన తాళాన్ని పాఠశాల సిబ్బంది రాడ్డుతో పగలగొట్టి కొందరు పిల్లలను లోపలికి పంపారు. వారిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల ఆందోళన అనంతరం పాఠశాల యాజమాన్యం తరఫు ప్రతినిధులు వచ్చి ఇకముందు విద్యార్థులకు ఎటువంటి పనులు చెప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ రాజన్ క్షమాపణలు చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు ముచ్చర్ల త్రిమూర్తులు తదితరులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. మైలవరంలో తల్లిదండ్రుల ఆందోళనఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అర్హులైనా తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. పాఠశాలల నుంచి విద్యార్థుల డేటాను ఎంఈవో కార్యాలయానికి పంపడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బలిపీఠంపై విద్యార్థుల భవిత
సాక్షి, అమరావతి: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అనాలోచిత నిర్ణయాలు, చట్టబద్ధత లేని జీవోలతో వారి బంగారు భవిష్యత్తును బలిచేస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వేళ ‘స్థానికత’ను సవరించి ఇచ్చిన జీవోలను న్యాయస్థానం తోసిపుచ్చడంతో ప్రభుత్వ పరిపాలనలో డొల్లతనం బయటపడింది. ఫలితంగా ఇంజినీరింగ్‌తో పాటు ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివి.. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా (అన్రిజర్వ్డ్) మాత్రమే గుర్తిస్తూ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏపీలో పుట్టి పెరిగి, ఇక్కడే కుటుంబం నివాసం ఉంటున్నప్పుడు ఆ విద్యార్థులను ‘స్థానికులు’గా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అర్ధంతరంగా ఈఏపీసెట్ రెండో దశ సీట్ల కేటాయింపుతో పాటు ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్) సీట్ల కేటాయింపును నిలిపివేసింది.విద్యార్థులకు న్యాయం జరిగేనా? జీవోల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికత కోటాలో 85 శాతం, స్థానికేతర (అన్రిజర్వ్డ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీకి అవకాశం కల్పించింది. అయితే, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు ఏపీలో చదివి.. ఇక్కడి స్థానికత ఉన్న విద్యార్థులను మాత్రమే స్థానిక కోటాలో సీట్లు కేటాయించింది. ఒక్క ఏడాది బయట చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలోకి నెట్టేసింది. ఫలితంగా ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోల్పోయారు. పైగా స్థానికేతర కోటా కావడంతో మంచి కళాశాలలో సీటు దక్కలేదు.ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే ఈఏపీసెట్ తొలి దశలో 1.18 లక్షల మందికి కనీ్వనర్ కోటాలో సీట్లు కేటాయింపు పూర్తయింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటే తొలి దశ కౌన్సెలింగ్‌లో మార్పు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీ మార్పులు తప్పని పరిస్థితి. అలా కాకుండా రెండో దశలో మాత్రమే అవకాశం కల్పిస్తామంటే.. తొలిదశలో మెరుగైన కళాశాలలో సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది.ఉదాహరణకు.. ఒక విద్యార్థికి స్థానిక కోటా కిందకి వస్తే ఎక్స్ అనే కళాశాలలో సీటు వస్తుందనుకుంటే.. తొలిదశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోతే.. రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామంటే అక్కడ సీటు వచ్చే వీలు ఉండదు. పోనీ, విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటును మార్పు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న విద్యార్థులకే స్థానిక కోటాను వర్తింపజేస్తే.. మిగిలిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే. ఇంత గందరగోళం మధ్య ఏం చేయాలో తెలియన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇది ఒక్క ఈఏపీసెట్కే కాకుండా ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తయి తరగతులు ప్రారంభమైన ఐసెట్, ఈసెట్ విద్యార్థులకూ వర్తిస్తుంది. ఇలా ఏపీకి చెందిన విద్యార్థులు స్థానికేతర కోటా సీట్లు పొందితే వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’..కూటమి ప్రభుత్వం విద్యాసంస్థల్లో స్థానికత మార్పు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిందంటూ ‘రాజ్యాంగ రక్షణలేని స్థానికత’ శీర్షికన తో మే 21 హెచ్చరించింది. పునర్విభజన చట్టం ప్రకారం గతేడాది పదేళ్ల గడువు ముగిసింది. దీనిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. వాస్తవానికి స్థానికత మార్పు అనేది ప్రభుత్వ ప్రధాన అజెండాగా ఉండాలి. దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు అనుసరించేలా కామన్ ఆర్డర్‌ను తీసుకురావాలి. కానీ, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.ప్రవేశాలకు సమయం దగ్గర పడిన సమయంలో హడావుడిగా ఉన్నత విద్యాశాఖ ద్వారా వివిధ సెట్స్ నిర్వహణ కోసం పాత జీవోలను సవరిస్తూ స్థానికతను ఖరారు చేసింది. రాజ్యాంగంలో ఆరి్టకల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరిచిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పు చేయాలని, అప్పటివరకు ఆ అంశాలు ఉనికిలోనే ఉంటాయని రాజ్యాంగ నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. వీటిని అనుసరించే హెల్త్ యూనివర్సిటీ, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు స్పెషల్ యూనివర్సిటీలు కూడా ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ వర్సిటీల్లో కౌన్సెలింగ్ పూర్తయి స్థానికేతర కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఏవిధంగా న్యాయం చేస్తారో వేచిచూడాలి. ఏం చేసినా లాభం లేదా? ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివినప్పటికీ.. ఉన్నత విద్య ప్రవేశాలల్లో స్థానికులుగా గుర్తించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఏపీ హెల్త్ యూనివర్సిటీ కేసులో స్థానికతపై హైకోర్టు డివిజినల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగానే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈఏపీ సెట్లో విద్యార్థులకు స్థానికత కల్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా నిలబడే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదంటున్నారు.తెలంగాణ హైకోర్టు సైతం అక్కడ హెల్త్ యూనివర్సిటీ కేసులో ఆ రాష్ట్రానికి వెలుపల చదివిన విద్యార్థులను కూడా స్థానికులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పును.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ, సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లితే తెలంగాణకు వర్తించిన తీర్పే ఇక్కడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఇలా అన్నిదారులు మూసుకుపోవడంతో కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక కోటాను కల్పించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
కుక్క ముట్టిన మధ్యాహ్న భోజనం.. 78 మంది పిల్లలకు రాబీస్ టీకా
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్షక్ష్యమే ఈ ఘటనకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఏమిటనుకుంటున్నారా? అదే.. ‘మధ్యాహ్న భోజనాన్ని కుక్క ముట్టడం’ వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్‌లోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికితోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం(ఎస్‌హెచ్‌జీ) ఈ ఆహారమేమీ కలుషితం కాలేదంటూ విద్యార్తులకు వడ్డించింది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్చ్జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మంది విద్యార్థులకు యాంటీ రాబీస్ టీకాలు ఇప్పించింది. ఈ ఘటన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల నిర్వహణ కమిటీని నిలదీశారు. ఎస్‌హెచ్‌జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఎస్‌హెచ్‌జీ సభ్యులు అధికారుల దర్యాప్తులో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు ముఖ్యమంత్రి విష్ణు డియో సాయికి లేఖ రాశారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
రూ.10 వేలు కట్టండి.. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది. ఈఏపీసెట్ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే రోజే(ఆగస్టు 4న) రూ.10 వేలు ఫీజు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. వాస్తవానికి కాలేజీల బోధన సామర్థ్యాలను పరిశీలించి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంటుంది. ఆ ప్రకారమే ఫీజులపై ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలి. కానీ, కొత్తగా చేరే విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి కాలేజీలు అదనంగా రూ.10 వేలు వసూలు చేస్తున్నాయి.అలాగే విద్యార్థుల నుంచి బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందుకే విద్యార్థుల నుంచి ఏదో రకంగా వసూలు చేయకతప్పట్లేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం. సీఎస్ఏబీ, ఈఏపీసెట్ మధ్య నలిగిపోతున్న విద్యార్థులు! ఇదిలా ఉండగా, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ఐటీల్లో మిగులు సీట్లకు ఎన్ఐటీ రూర్కెలా ఆధ్వర్యంలో సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీఎస్ఏబీ) నిర్వహిస్తున్న ప్రత్యేక కౌన్సెలింగ్ కంటే ముందే.. ఈఏపీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ముగుస్తుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 4న ఈఏపీసెట్ రెండో దశ సీట్లు కేటాయింపు చేయనుంది. 8వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. రాష్ట్రంలోని కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. కానీ, సీఎస్ఏబీ కౌన్సెలింగ్ ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్‌లో సీటు పొంది కాలేజీల్లో చేరిన తర్వాత.. సీఎస్‌ఏబీలో సీటు వస్తే విద్యార్థుల వద్ద సర్టిఫికెట్లు ఉండవు. సీటు రద్దు చేసుకోవాలంటే కాలేజీలు అడిగినంత ఇవ్వాలి. లేదంటే జాతీయ విద్యా సంస్థల్లో సీటును వదులుకోవాలి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. -
సర్కారు బడికి ‘రాం’ రాం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్ బాడీ) చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, డిజిటల్ పద్ధతిలో బోధన చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2019–20 నుంచి 2021–22 వరకు సర్కారు బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్.. ఆ తర్వాత 2022–23, 2023–24ల వరకు వచ్చే సరికి గణనీయంగా పడిపోయింది.2024–25లో కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక ఆశాజనకంగా లేదని యూనిఫైడ్ డిస్టిక్ట్ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఇ) నివేదికలు చెబుతున్నాయి. 2019–20 నుంచి 2023–24ల వరకు ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో నమోదైన విద్యార్థుల గణాంకాలను రెండు రోజుల కిందట కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2021–22 సంవత్సరంలో నమోదైన విద్యార్థుల సంఖ్య.. 2023–24లోని సంఖ్యతో పోలిస్తే రెండు సంవత్సరాల్లో 1,57,50,281 మంది తగ్గారు.దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..ఏటేటా సర్కారు బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2019–20లో 13,09,31,634 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉంటే.. 2020–21 నాటికి ఆ సంఖ్య 13,49,04,560లకు చేరింది. మరుసటి సంవత్సరం 2021–22లో 14,32,40,480 లకు పెరగ్గా ఆ తర్వాత నుంచి ఎన్రోల్మెంట్ తగ్గింది. 2022–23లో 13,62,04,917లు కాగా, 2023–24 నాటికి 12,74,90,199లకు పడిపోయినట్లు రికార్డులు చెప్తున్నా యి. ఈ లెక్కన అత్యధికంగా రెండేళ్లలో బిహార్‌లో 45,22,871, ఉత్తరప్రదేశ్‌లో 31,88,070, రాజస్థాన్‌లో 15,30,705, మధ్యప్రదేశ్‌లో 7,57,974, తెలంగాణలో 5,23,986 మంది సర్కారు బడులకు దూరం అయ్యారు. ఒడిశా, లక్షదీప్‌లు మినహా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి పలు రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గింది.ఉమ్మడి వరంగల్‌లో మూతబడులురాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనట్లు అప్పట్లో అధికా రులు ప్రకటించడం గమనార్హం. కాగా ఉమ్మడి వరంగల్లోనూ 298 వరకు ప్రభుత్వ పాఠశాల లు మూత బడినట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సంఖ్య తగ్గడానికి గురుకు లాలు, మోడల్ స్కూళ్లు కారణమవగా.. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వారు, గురుకులాల్లో సీట్లు దక్కని వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు బడుల్లో చేరుతున్నారని ఉపాధ్యా యులు చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో నాణ్యత తక్కువగా ఉంటుందని భావించి, ప్రైవే టు పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తు న్నారన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉండటం వల్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్తున్నారు.మూతబడులను పునఃప్రారంభించాలి సర్కారు బడులకు పిల్లలు రావడం లేదని చాలాచోట్ల స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదే కారణంతో నేను చదువుకున్న కుమ్మరికుంట తండా బడిని కూడా బంద్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పించి తిరిగి ప్రారంభించాలి. ఆ బడిని అన్ని వసతులతో మళ్లీ తెరిపిస్తే చాలామంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నాం. జిల్లా పాలనాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలను పునఃప్రారంభించాలి. – బానోత్ శ్రీను, కుమ్మరి కుంట తండా, మహబూబాబాద్ జిల్లా -
Anantapur: లోకేష్, పవన్ కు ఛాలెంజ్ విద్యార్థులతో పెట్టుకోవద్దు..
-
విద్యార్థులకు రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటినుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపునకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి ఒక కి.మీ. పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ. పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యావిధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను, తరగతులను మరో పాఠశాలలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళుతున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూళ్ల విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యారి్థకి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
సకాలంలో ఐసీజే హితవు
విజయం గ్యారెంటీగా దక్కుతుందంటేనే పోరాడాలన్న దృక్పథం ఉంటే ఈ ప్రపంచం ఇంతగా మారేది కాదు. ప్రగతి బాటన పయనించేది కాదు. యుద్ధాల్లో గెలిచేవీ ఉంటాయి, ఓటమికి తలవంచేవీ ఉంటాయి... పోరు మాత్రం ఆగొద్దని పసిఫిక్ మహాసముద్ర మారుమూల ప్రాంతంలో 300 ద్వీప సమూహాలతో కూడిన ఒక చిన్న దేశం ఫిజీలో సంకల్పం చెప్పుకున్న 27 మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు రాజేసిన ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఎన్నదగ్గ తీర్పు నివ్వటానికి దోహదపడింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ బాధ్యత అన్ని దేశాలకూ ఉంటుందనీ, ఈ ధరిత్రిని పరిరక్షించటం సకల దేశాల చట్టబద్ధ కర్తవ్యమనీ ఐసీజే వెలు వరించిన ఈ తీర్పు అందరినీ ఆలోచింపజేస్తోంది. తమ తమ దేశాల న్యాయస్థానాలనే బేఖాతరు చేస్తున్న ఏలికలు తామర తంపరగా పెరిగిన వర్తమానంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏ దేశమైనా పట్టించుకుంటుందని, అమలు చేస్తుందని భావించటం దురాశే కావొచ్చు. ఆ తీర్పు కేవలం సలహా పూర్వకమైనదే. కానీ బాధ్యతా రహితంగా వాతావరణానికి చేటు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటూ భూగోళపు మనుగడకే ముప్పు తెస్తున్న దేశాలపై నైతిక ఒత్తిడికి అది దోహద పడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదపుటంచుల్లో జీవనం సాగి స్తున్న ద్వీపకల్ప దేశాల గోడు ప్రపంచమంతా వినటానికీ, పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనల వెనకున్న వాస్తవ స్థితిగతుల్ని ప్రజానీకం అర్థం చేసుకోవటానికీ అది తోడ్పడుతుంది. ఈకృషిలో పాలుపంచుకున్న వన్నీ ద్వీపకల్ప దేశాలు. భూతాపోన్నతి హెచ్చితే సముద్ర మట్టాలు పెరిగి ముందుగా మునిగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానివి. భూగోళాన్ని 2050 కల్లా ఉద్గారాల రహితంగా మార్చాలన్న సంకల్పంతో 2015లో కుదిరిన ప్యారిస్ ఒడంబడికను అమెరికా బేఖాతరు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి ఏలుబడిలో ఒకసారి దీన్నుంచి బయటకొస్తున్నట్టు ప్రకటించగా, అటుతర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం మళ్లీ చేరింది. రెండోసారి వచ్చాక ట్రంప్ మళ్లీ ఒడంబడిక నుంచి నిష్క్రమించారు. బయటకు పోలేదన్న మాటేగానీ... ఒడంబడికపై సంతకాలు చేసిన ఇతర సంపన్న దేశాలు సైతం దాన్ని నీరుగార్చే విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఒడంబడిక నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నతమైనవి. వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తే భూగోళం సురక్షితంగా ఉంటుంది. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేయాలని, 2050–100 మధ్య అన్ని దేశాలూ శిలాజ ఇంధనాల ప్రమేయం లేని ఆర్థిక వ్యవస్థల రూపకల్పనకు దోహదపడాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం కార్యాచరణ ఏ విధంగా ఉన్నదో ప్రతి అయిదేళ్లకూ సమీక్షించాలని సూచించింది. ఆర్థిక స్తోమత అంతగా లేని దేశాలకు సంపన్న రాజ్యాలు చేయూతనివ్వాలని, హరిత ఇంధన సాంకేతికతలను చవగ్గా అందించాలని కూడా కోరింది. ఏం చేయాలో చెప్పిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు ఎలా చేయాలో చెప్పలేదు. నిర్దిష్టమైన చర్యలకు కట్టుబడి ఉంటామని సంతకాలు చేసిన దేశాలు విఫలమైన పక్షంలో తీసుకోదగిన చర్యలేమిటో ప్రకటించలేదు. అందుకే ఆ ఒడంబడిక అమలు నత్తనడక నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీజే తీర్పు ప్రపంచ పౌరులందరిలో ఆలోచన రేకెత్తించి, తమ తమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటానికి తోడ్పడుతుంది. ఎవరికీ పట్టని, ఎవరూ పరిగణనలోకి తీసుకోని ఈ సమస్య తీవ్రతను చాటడానికి తొలుత ఫిజీలోని దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుం బిగించారు. ఒక తరగతి గదిలో చర్చగా మొదలైన ఈ అంశం వాతావరణ మార్పులపై పోరాడే పసిఫిక్ ఐలాండ్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ ఛేంజ్ (పీఐఎస్ఎఫ్సీసీ) అనే సంస్థ ఆవిర్భావానికి 2019లో అంకురార్పణ చేసింది. ఈ సంస్థ పసి ఫిక్ ద్వీపకల్ప దేశాలను ఒప్పించటంతోపాటు అలాంటి ప్రమాదం పొంచివుండే మరికొన్ని దేశాలు కూడా కలిసివచ్చేలా చేసింది. ద్వీపకల్ప దేశం వనౌతు ఇందుకు చొరవచూపింది. చూస్తుండగానే యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇందులో భాగస్వామ్యం తీసు కున్నాయి. వివిధ దేశాలతో మూడు రౌండ్ల చర్చల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టే తీర్మా నంపై 105 దేశాలు సంతకం చేశాయి. ఐసీజే అభిప్రాయాన్ని కోరుతూ 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందటం, అది ఐసీజేకు చేరటం జరిగిపోయింది. నిజానికి ఒడంబడిక కుదిరేనాటికి వాతావరణ మార్పుల వల్ల పొంచివున్న ముప్పు గురించిన ప్రత్యక్షానుభవం ఈ స్థాయిలో లేదు. ఈ పదేళ్లలో ధనిక, బీద దేశాల తారతమ్యం లేకుండా అన్నిచోట్లా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. లక్షలమంది ప్రాణాలు తీస్తున్నాయి. రుతువులు పూర్తిగా గతి తప్పాయి. ఏదోమూల అతివృష్టి, అనావృష్టి రివాజుగా మారాయి. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల అంటురోగాల వ్యాప్తితోపాటు మానసిక వ్యాధులు సైతం పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించారు. కానీ సంపన్న దేశాల నిర్లక్ష్యం ఎలావుందో చెప్పుకోవటానికి నిరుడు అజర్బైజాన్ రాజధాని బాకూ నగరంలో జరిగిన ‘కాప్–29’ సదస్సే నిదర్శనం. ప్యారిస్ ఒడంబడికతో పడే ఆర్థిక భారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై జరిగిన ఆ సదస్సుకు దాదాపు సంపన్న దేశాలన్నీ ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో ఐసీజే వెలువరించిన తాజా తీర్పు ఈ బాపతు దేశాల కళ్లు తెరిపించటానికీ, వాతావరణం మరింత అధ్వాన్నం కాకుండా ఉండటానికీ దోహదపడుతుందని ఆశించాలి. -
‘కార్పొరేట్’ విద్యపై కొరడా!
ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలూ అందరినీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో... చివరికది ఎటు దారితీస్తుందో తెలియనంతగా తల్లిదండ్రులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. వాటిని పిల్లలకూ అంటిస్తున్నారు. విద్యావ్యాపారంలో తలమునకలైన సంస్థలు దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటున్నాయి. పర్యవసానంగా పిల్లలపై ఒత్తిళ్లు పెరిగి, బెంగ ఎక్కువై ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. తరాలు మారుతున్నా వదలని ఈ జాడ్యంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టని నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్ని పీకల దాకా పోటీలో ముంచి, వారిపై మానసిక ఒత్తిళ్లను పెంచి విద్యలోని ప్రాణధాతువునే వికృతీకరిస్తున్న తీరు ఇకపై కొనసాగనీయరాదంటూ శుక్రవారం కోచింగ్ కేంద్రాలతోసహా అన్ని విద్యాసంస్థలనూ హెచ్చరించింది. అవాంఛనీయమైన ఈ ధోరణిని అడ్డుకోవటానికి ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన 15 అంశాలతో కూడిన మార్గదర్శకాలను జారీచేసింది. పిల్లల మార్కుల ఆధారంగా వర్గీక రించి బోధించే విధానాన్ని నిలిపివేయాలనటం మొదలుకొని కౌన్సెలర్లు, సైకాలజిస్టుల నియా మకం వరకూ అందులో విలువైనవెన్నో వున్నాయి.ఆత్మహత్యలనేవి అన్నివేళలా వ్యక్తుల నిర్ణయమే కావొచ్చు... కానీ వాటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థ మాటేమిటని ప్రశ్నించాడు ఫ్రెంచ్ తత్వవేత్త, రచయిత ఆల్బర్ట్ కామూ. మూలాన్ని గుర్తించకుండా, దాన్ని దుంపనాశనం చేయకుండా ఏ సమస్యా దానంతటదే మాయం కాదు. కేంద్రంలో రాజీవ్ గాంధీ హయాంలో విడుదలైన నూతన జాతీయ విద్యావిధానం విద్య ప్రైవేటీకరణకు బీజం వేసింది మొదలు మన విద్యావ్యవస్థ వెర్రితలలు వేస్తోంది. చదువులో వెనకబడివున్నామనే ఆత్మ న్యూనతతో కొందరూ, తమకొచ్చిన మార్కుల్నీ/ర్యాంకునూ చూపించి తరగతి గదిలో టీచర్ ఎగతాళి చేశారనీ, దండించారనీ మరికొందరూ...పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమో లేదో అనే ఆందోళనతో ఇంకొందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు కేసులు పెడతాయి. మళ్లీ మరొకటి జరగనంతవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనబడుతుంది. ఇది చర్వితచరణంగా కొనసాగుతూనేవుంది. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలకు దారి తీసిన ఉదంతం విశాఖలోనే జరిగింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) కోసం విశాఖ విద్యా సంస్థలో చేరిన బెంగాల్ బాలిక భవనంపై నుంచి పడి మరణించిన ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని ఒకసారి, గుండెపోటుతో మరణించిందని మరోసారి, ఆత్మహత్య చేసుకుందని ఇంకోసారి ఆ విద్యాసంస్థ బుకాయించింది. ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థకూ వుంది. కన్నవాళ్లకు కనీసం పిల్లల మరణకారణాన్ని నిజాయతీగా చెప్పాలని కూడా ఆ సంస్థలు అనుకోవు. ధర్మాసనం వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి. 2022లో మన దేశంలో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యలు నమోదైతే అందులో ఏడు శాతంపైగా – అంటే 13,404 మరణాలు విద్యార్థులకు సంబంధించినవి. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చి, ఆకాశమే హద్దుగా భావించి దూసుకుపోవాల్సిన వయసులో పిల్లలు ఇంత బేలగా, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తనువు చాలిస్తున్న వైనం సమాజానికంతకూ సవాల్. చదువంటే తెలియనిది తెలుసుకోవటం, అవసరమైనప్పుడల్లా ప్రశ్నించి సందేహనివృత్తి చేసు కోవటం. సృజనాత్మకంగా ఆలోచించటం. నేటి విద్యావ్యవస్థ వాటన్నిటినీ చంపేసింది. పోటీ తత్వాన్ని ప్రతిష్ఠించింది. బట్టీపట్టడం మినహా మరేమీ లేకుండా చేసింది. పర్యవసానంగా ఎంతో ఇష్టంతో చదవాల్సిన విద్య కాస్తా పెను భారంగా, ఎంతకూ అర్థంకాని ప్రణాళికగా అఘోరిస్తోంది. తమను అన్నివిధాలా రుద్దుతూ, పరుగులు పెట్టిస్తూ బలవంతంగా మెదళ్లలోకి ఎక్కించి ‘మంచి ఫలితాలు’ రాబట్టి మున్ముందు మరింత వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడే విద్యాసంస్థలొక వైపూ... తమ ఎదుగుదలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులొక వైపూ విద్యార్థులకు ఊపిరి సలపనివ్వట్లేదు. ఆ ప్రస్థానంలో ఓటమి ఎదురయ్యేసరికి ఆ లేత హృదయాలు తట్టుకోలేకపోతు న్నాయి. అర్ధంతరంగా తనువు చాలించటం మినహా మరే మార్గమూ లేదని నిర్ణయానికొస్తున్నాయి. అంతక్రితం వరకూ ఇంటర్ స్థాయి నుంచి మొదలయ్యే పోటీతత్వం కార్పొరేట్ సంస్థల పుణ్యమా అని ప్రాథమిక విద్యకు కూడా పాకింది. ఈ దుఃస్థితి మారాలన్నదే సుప్రీంకోర్టు సంకల్పం. అయితే కనీసం స్వేచ్ఛగా కదలటానికైనా సావకాశంలేనంతగా ఇరుకైన స్థలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడవటానికి ఎడాపెడా అనుమతులిచ్చే చోట పిల్లలకు క్రీడల్లో, జీవన నైపుణ్యాల్లో, వ్యక్తిత్వవికసనంలో శిక్షణనివ్వాలన్న ధర్మాసనం మార్గదర్శకాలు సక్రమంగా అమలవుతాయా? లాభాపేక్షే ధ్యేయంగావున్నచోట అదనంగా కౌన్సెలర్లకూ, సైకాలజిస్టులకూ చోటిస్తారా? టీచర్లపై ఊపిరాడనీయనంత భారంవేస్తున్న సంస్థలు పిల్లలతో ఎలా మెలగాలో వారికి శిక్షణనిప్పిస్తాయా? పిల్లలు తమ బాధల్ని చెప్పుకోవటానికి అవసరమైన వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తాయా? డబ్బు ఎరవేసి ఎంతటి మహోన్నత ఆశయాలనైనా చాపచుట్టేయగలిగే కార్పొరేట్ సంస్థలు ఈ మార్గ దర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెబితే తప్ప ఇదంతా చక్కబడదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వాలి. -
ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు
-
కాలేజీలు ఖాళీ!
కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలో గతేడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే, ఈ ఏడాది 82 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్కసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఎమ్మిగనూరులో గతేడాది 278 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. కర్నూలు జిల్లాలోని 16 కాలేజీల్లో ఇదే దుస్థితి నెలకొంది.సాక్షి, అమరావతి: విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వాకంతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమన బాట పడుతోంది. విద్యకు సంబంధించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర గత ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను నీరుగార్చడంతో పాటు వికట ప్రయోగాలతో పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. ఫలితంగా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జూనియర్ కాలేజీల్లో చేరికలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే కాలేజీల్లో తరగతులు ప్రారంభించినా, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా.. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో సగం సీట్లు ఖాళీగా ఉన్నాయి. పిల్లల సంఖ్య రెండంకెలు దాటని కాలేజీలు 200పైగా ఉన్నాయంటే సర్కారు ఇంటర్ విద్య దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 70,677 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకుంటే, 2025–26 విద్యా సంవత్సరానికి అందులో మూడింట రెండో వంతు కంటే తక్కువగానే ప్రవేశాలు నమోదు కావడం కూటమి సర్కారు వైఫల్యానికి అద్దం పడుతోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం అమలు చేసినా, కొత్తగా ఎంబైపీసీ కోర్సును అందుబాటులోకి తెచ్చి, జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం లేకపోయింది. అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తే సరిపోదని తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. రేషనలైజేషన్‌తో లెక్చరర్ పోస్టులు రద్దువిద్యా సంబంధమైన మార్పులు చేసేటప్పుడు ఆ రంగంలోని నిపుణులతో కమిటీలు వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేలా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులు ఉన్న చోట నియమించాల్సిన లెక్చరర్లను అడ్మిషన్లు లేనిచోట నియమించడం, రేషనలైజేషన్ పేరుతో పోస్టులను రద్దు చేయడం వంటి చర్యలు ప్రభుత్వ కాలేజీలను ఖాళీ చేశాయి. ఈ విద్యా సంవత్సరం లెక్చరర్ల ‘మిగులు’ (సర్ప్లస్) పేరుతో 455 పోస్టులను ఆయా కాలేజీల్లో రద్దు చేసి, విద్యార్థులు లేనిచోట నియమించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మరో 150 మంది లెక్చరర్లనూ సర్ప్లస్ చేసేందుకు ప్రభుత్వం ఫైల్ సిద్ధం చేసినట్టు సమాచారం. కార్పొరేట్‌కు మేలు చేసేలా మార్పులుఓ కాలేజీలో కొత్త కోర్సులు, లేదా ఉన్న కోర్సుల్లో మార్పులు చేయాలంటే సంబంధిత కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపల్ అభిప్రాయాలు తీసుకోవాలి. తర్వాత ఆ కోర్సుల్లో ఎంత మంది విద్యార్థులు చేరుతారో నిపుణుల కమిటీ అంచనా వేస్తుంది. కానీ ఇవేమీ లేకుండానే కోర్సుల్లో మార్పులు చేసేశారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల్లోనే అధికంగా లెక్చరర్లను సర్ప్లస్ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల సన్నిహితులకు మేలు చేసేందుకు చేపట్టిన ఈ ప్రక్రియ కాస్తా కార్పొరేట్ కాలేజీలకు లాభించేలా మార్చేశారు. ఉదాహరణకు నెల్లూరులోని ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 200 మంది విద్యార్థులు ఉన్నారు, అత్యధిక మంది గ్రామీణ విద్యార్థులే. ప్రస్తుతం ఇక్కడ ద్వితీయ భాషగా తెలుగు కొనసాగుతోంది. కానీ, ఈ ఏడాది ఓ ఉన్నతాధికారి సన్నిహితులైన హిందీ కాంట్రాక్టు లెక్చరర్ బదిలీ కాకుండా ఉండేందుకు తెలుగు భాష స్థానంలో ద్వితీయ భాషగా హిందీని చేర్చి ఆమెకు అక్కడే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో హిందీ ఇష్టం లేని విద్యార్థులు ఆర్థిక భారమైనా ప్రైవేటు కాలేజీ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అధికారులు ఎంత యత్నించినా అడ్మిషన్లు 40 వేలు దాటలేదు. ఈ నెలాఖరు వరకు చూసినా కొత్తగా రెండు లేదా మూడు వేలు ప్రవేశాలు పెరగడం కూడా కష్టమేనని తెలుస్తోంది. వీటికి తోడు హైస్కూల్ ప్లస్‌లను ఇష్టానుసారంగా రద్దు చేస్తుండటం కూడా అడ్మిషన్లు పెరగక పోవడానికి ఓ కారణం. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఆరు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కలిపి రూ.6,400 కోట్లు బకాయి ఉండటం కూడా ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేసింది.ఇవిగో నిదర్శనాలు ⇒ ఒంగోలు నగరంలో 100 మంది విద్యార్థులు కూడా లేని కాలేజీ (నాన్ శాంక్షన్)కి 13 మంది లెక్చరర్లను కేటాయించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లా లింగాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో 17 మంది విద్యార్థులు ఉండగా, ఇక్కడున్న జువాలజీ లెక్చరర్‌ను ఆరుగురు విద్యార్థులు ఉన్న ప్రొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. ఎక్కడ ఎక్కువ మంది విద్యార్థులుంటే అక్కడ లెక్చరర్లను నియమించాల్సింది పోయి కేవలం ఆరుగురు బైపీసీ విద్యార్థులు ఉన్న కాలేజీకి మార్చడం గమనార్హం.⇒ నెల్లూరు జిల్లాలో 11 పోస్టులను రేషనలైజేషన్ ద్వారా తీసేశారు. నెల్లూరులోని 700 మంది విద్యార్థులు ఉన్న కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొమ్మిది పోస్టులను రద్దు చేశారు. ⇒ నెల్లూరు డీకే కాలేజీలో 300 మంది కామర్స్ విద్యార్థులు ఉంటే ఇద్దరు కామర్స్ లెక్చరర్లలో ఒకరిని సర్ప్లస్ చేశారు. ⇒ సింగరాయకొండలో 300 మంది విద్యార్థులు ఉంటే ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టును రద్దు చేశారు. కొండెపిలోనూ ఇదే పరిస్థితి. చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ కాలేజీలో హిస్టరీ విద్యార్థులు 150 మందికి గతంలో ఇద్దరు లెక్చరర్లు ఉంటే ఇప్పుడు ఒక్కరిని సర్ప్లస్ చేశారు. పెనుమాక కాలేజీలో మొత్తం విద్యార్థులు 50 మందే (అధికంగా తెలుగు) ఉన్నా ఇక్కడ కొత్తగా ఉర్దూ లెక్చరర్‌ను ఇచ్చారు. బోధనపై భరోసా లేక..ఇంటర్ విద్య డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు పదో తరగతి పరీక్షలు అవగానే క్యాంపెయిన్ ప్రారంభించారు. పదో తరగతి హాల్ టికెట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం గురించి విస్తృత ప్రచారం చేశారు. బోధనపై మాత్రం భరోసా ఇవ్వలేకపోయారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో 2024తో పోలిస్తే 2025లో అడ్మిషన్లు భారీగా పడిపోయాయి. ⇒ కర్నూలు జిల్లా దేవనకొండ జూనియర్ కాలేజీలో గతేడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 160 మంది చేరితే, ఈ ఏడాది 82 మంది మాత్రమే చేరారు. అంటే ఒక్కసారిగా 78 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ⇒ ఎమ్మిగనూరులో గతేడాది 278 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 182 మంది మాత్రమే చేరారు. ఇక్కడ 96 మంది తగ్గిపోయారు. ఒక్క కర్నూలు జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు మినహా మిగిలిన 16 కాలేజీల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల జూనియర్ కాలేజీలో గతేడాది 418 మంది విద్యార్థులు చేరితే, ఈ ఏడాది 285 మందే అడ్మిషన్లు తీసుకున్నారు. అంటే 133 మంది తగ్గిపోయారు. ఇక్కడ బాలుర కాలేజీలో గతేడాది 304 మంది చేరితే, ఈసారి 188 మంది మాత్రమే చేరారు. అంటే 116 అడ్మిషన్లు పడిపోయాయి. ఈ జిల్లాలో 18 కాలేజీల్లోనూ ఒక్క వెంకటగిరి కాలేజీలో తప్ప అన్ని కాలేజీల్లోను అడ్మిషన్లు తగ్గిపోయాయి. ⇒ నెల్లూరు జిల్లాలో గత విద్యా సంవత్సరం 3,500 మంది చేరితే, ఈ ఏడాది 2,185 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని కేఏసీ కళాశాలలో 250 మంది, ఆత్మకూరులో 134, కందుకూరులో 131, కోవూరులో 109, ఉదయగిరిలో 100, మంది మినహా మిగతా కాలేజీల్లో ప్రవేశాలు 40 శాతం దాటలేదు. -
స్పోర్ట్స్ టీచర్ నిర్వాకం.. విద్యార్థినులకు అస్వస్థత
తిరుపతి జిల్లా: జిల్లాలోని కోట జడ్పీ బాలికల హైస్కూల్లో స్పోర్ట్స్ టీచర్ నిర్వాకంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్‌కు యూనిఫామ్‌తో రాలేదని విద్యార్థినులతో గుంజిళ్లు తీయించాడు స్పోర్ట్స్ టీచర్. అయితే పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయయారు. దాంతో వారిని కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలియడంతో హాస్పిటల్ వద్దకు చేరుకున్న తల్లి దండ్రులు ఆందోళన చేపట్టారు. ఆ విద్యార్థులంతా ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. సుమారు 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. -
నరకంలో విద్యార్థులు.. నిమ్మకు నీరెత్తినట్లు బాబు ప్రభుత్వం
-
విద్యార్థుల ఆత్మహత్యలు వ్యవస్థాగత లోపమే: సుప్రీం
న్యూఢిల్లీ: యువత, ముఖ్యంగా విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఇది వ్యవస్థాగత లోపానికి నిదర్శనం. ఈ జాఢ్యాన్ని నిర్లక్ష్యం చేయలేం’’అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నానికి చెందిన ఓ 17 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదలాయించాలన్న పిటిషన్‌ను శుక్రవారం విచారించింది. ఈ అంశంపై 15 మార్గదర్శకాలు జారీ చేసింది. ‘‘విద్యా సంస్థల్లో విద్యార్థి–కౌన్సెలర్ నిష్పత్తిని గరిష్ట సంఖ్యకు పెంచాలి. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్ తదితరాల వేళ వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ హెల్ప్‌లైన్ నంబర్లు, టెలీ–మానస్ తదితర జాతీయ సేవల చిరునామా, ఫోన్ నంబర్లను విద్యా సంస్థలు, హాస్టళ్లు, తరగతి గదులతో పాటు వెబ్సైట్లలో కూడా ప్రముఖంగా కనిపించేలా ఉంచాలి. బోధన, బోధనేతర సిబ్బంది అందరూ ఏటా కనీసం రెండుసార్లు తప్పనిసరి మానసిక శిక్షణ తీసుకోవాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగి ఉండాలి. విద్యార్థుల్లో ఆత్మహత్యకు సంబంధించిన ధోరణులను తొలి దశలోనే గుర్తించి, సరిగా స్పందించగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్య అక్షరాస్యత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, జీవ కళా విద్య వంటివాటికి తరగతి గదుల్లో చోటివ్వాలి. విద్యాపరమైన ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యా సంస్థలే నివారణ చర్యలు చేపట్టాలి’’అని పేర్కొంది. ‘‘2022లో భారత్‌లో 1.7 లక్షల పైచిలుకు ఆత్మహత్యలు నమోదయ్యాయి. వాటిలో 7 శాతానికి పైగా, అంటే 13,044 విద్యార్థుల ఆత్మహత్యలే. వీటిలోనూ 2,248 ఆత్మహత్యలు నేరుగా పరీక్షల ఫలితాలతో సంబంధమున్నవే కావడం మరింత బాధాకరం’’అంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ఉటంకిస్తూ ధర్మాసనం పేర్కొంది. ‘‘స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు, శిక్షణ కేంద్రాల వంటివాటిలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఒక రకంగా మానసిక ఆరోగ్య సంక్షోభం. ఇదే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మానసిక ఆరోగ్యం రాజ్యాంగం కల్పించే జీవించే హక్కులో భాగం’’అని గుర్తు చేసింది. దీనిపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. -
ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తని కూటమి సర్కార్
-
ఏపీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బంద్... రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా ఆరు క్వార్టర్లు పెండింగ్
-
చదువు‘కొనలేం’
ఫీజు రీయింబర్స్మెంట్...! ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన గొప్ప పథకం..! మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కాలేజీకి వెళ్లి ఏకాగ్రతతో పాఠాలు విని తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఎందరో..? అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటి గొప్ప పథకానికి తూట్లు పడుతున్నాయి. మొండి బకాయిలతో.. యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోంది. ఒకటీ, అర కాదు.. ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కనపెట్టింది.. చివరకు విద్యార్థులు విసుగెత్తి చదువు మానేసేలా చేస్తోంది..సాక్షి, అమరావతి: ఏడాదికి పైగా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం.. అంటూ ఊరించి ఉసూరుమనిపించడం తప్ప కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు..! కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల విడుదల ఊసే లేదు..! ప్రభుత్వం కనీస కనికరం చూపకుండా.. తమ జీవితాలతో చెలగాటం ఆడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యకు భరోసా దక్కక దిగులు చెందుతున్నారు. దీంతో అర్థంతరంగా చదువులు మానేస్తున్నారు. ఇదంతాచూసి విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదేనా? ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి..?? అని నిలదీస్తున్నారు. ⇒ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా అగిపోయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క త్రైమాసికం (క్వార్టర్) కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్ మెయింటినెన్స్ (వసతి దీవెన) కింద మరో రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. వాస్తవానికి గత నెలలోనే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ సమావేశంలో, ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ స్పందన కొరవడింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చదువులతో పాటు హాస్టల్ వసతి దీవెన (మెయింటెనెన్స్) కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.1100 కోట్లు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు బకాయి పెట్టింది. నెలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ఖర్చు రాష్ట్రంలో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లలో 70 శాతం భర్తీ చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. అంటే, కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ, ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కారు తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు రూ.6–10 కోట్లు, పెద్ద కళాశాలలకు రూ.40–60 కోట్ల వరకు పెండింగ్ కనిపిస్తున్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. ⇒ ప్రైవేటు యాజమాన్యాల్లోని 20–30 శాతం కళాశాలలు మినహా.. మిగిలినవి ఏ పూటకు ఆ పూటే అన్న చందాన నిధుల కొరత ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు రూ.50 లక్షలు నుంచి పెద్ద కళాశాలలు రూ.3 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతోపాటు కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చూస్తే యాజమాన్యాల గుండె బరువెక్కుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుండడం ఆర్థికంగా భారం అవుతోంది. సర్కారు నుంచి మొండిచేయి ఎదురవుతుండడంతో నిర్వహణ కుంటుపడుతోంది. బాబ్బాబు కాస్త సర్దుకోరూ...! ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్మెంట్ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో 2–3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కాలేజీలైతే నెల జీతంలో కొంత మొత్తం చెల్లిస్తూ సర్దుకోండి అంటూ ఉద్యోగులను బతిమలాడుకునే పరిస్థితి. ఆర్థికంగా పరపతి ఉన్న కళాశాలలు అప్పు తెచ్చి ఉద్యోగులకు జీతాలిస్తున్నాయి. ⇒ కాలేజీలు ఇలా అప్పుల్లో నెట్టుకొస్తున్న తరుణంలో మారుతున్న సాంకేతిక అవసరాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయన్నది ప్రశ్న. మార్కెట్‌కు అనుగుణంగా బోధన అందించకుంటే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తద్వారా ఒక తరం వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మాటంటే.. జరగదంట? పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు, కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు. ⇒ గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమన్యాలకు జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోవడం గమనార్హం. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఓ పెద్ద ప్రహసనంగా మారింది. ఇదీ మా గోడు... ‘‘ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలువిడుదల కావట్లేదు. కళాశాలల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా? నాణ్యమైన బోధనా సామర్థ్యాలను సమకూర్చుకుని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడినుంచి తెస్తాం...? ఇంజనీరింగ్ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్లో రేట్లు లేవు. తాకట్టు పెట్టి తెద్దామంటే రూ.2–5 వరకు వడ్డీలు అవుతున్నాయి. ఇంకేం చేయాలి...?’’ అని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాని వాపోయారు. ఇక్కడ ఒక్క ఇంజినీరింగ్ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. తమ పరిస్థితి ఇలా ఉండగా... ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అనుభవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు చెల్లింపులుఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ⇒ 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 వరకు నాటి టీడీపీ సర్కారు 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిపెడితే వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు ప్రతి త్రైమాసికానికి క్రమంతప్పకుండా చెల్లించి... ఏ లోటు లేకుండా కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా ప్రోత్సహించింది. ⇒ ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. -
మీకు ఫ్రీ సీటు లేదు!
కూటమి ప్రభుత్వం పేదింటి విద్యార్థులను నిలువునా ముంచేసింది. వారి ఉన్నత చదువుల ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఏపీలో పుట్టి పెరిగి... దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న కుటుంబాలకు చెందినవారిని విద్యా ప్రోత్సాహకాలకు అనర్హులను చేసి తీరని వేదన మిగిల్చింది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వేళ తెలంగాణలో కేవలం ఇంటర్ చదివి, ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులను కూటమి సర్కారు స్థానికేతరులుగా గుర్తించింది. అయితే, వీరందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకుండా కష్టాల్లోకి నెడుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి పదకొండేళ్లయినా హైదరాబాద్‌తో ఏపీ ప్రజలది విడదీయలేని బంధం. పేదింటి తల్లిదండ్రులు కష్టనష్టాల కోర్చి తమ బిడ్డలకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్లో చేర్పిస్తుంటారు. మరికొందరు ఉపాధి కోసం రెండేళ్లు తెలంగాణ ప్రాంతంలో ఉండడంతో వారి పిల్లలు అక్కడే చదువుకునే పరిస్థితి. అలా ఇంటర్ చదవడమే వారికి శాపంగా మారింది. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేదింటి బిడ్డలు సొంత రాష్ట్రంలోనే స్థానికేతరులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది.పన్నులు కట్టించుకుని.. ‘ఫీజు’ ఎగ్గొట్టి!ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ ప్రాంత వాసులకు విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల వారీగా మూడు రీజియన్ల ద్వారా లోకల్ కోటాలో 85 శాతం, నాన్‌లోకల్ (అన్ రిజర్వుడ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీ చేసేవారు. గత ఏడాదితో ఆ పదేళ్ల గడువు ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర రీజియన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రవేశ పరీక్షలు నిర్వహించింది.లోకల్ 85 శాతం, నాన్ లోకల్ (అన్ రిజర్వుడ్)లో 15 శాతం సీట్లు కూడా ఏపీ విద్యార్థులకు దక్కేలా జీవోలు తీసుకొచ్చింది. అయితే, రీజియన్లలో స్థానికత విషయంలో మెలికపెట్టింది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏపీలో చదివిన విద్యార్థులకే ప్రవేశాలలో ప్రాధాన్యం కల్పించింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదువుకున్న విద్యార్థులను ఏపీలో నాన్‌లోకల్‌గా మార్చేసింది. వారి కుటుంబాలు ఏపీలోనే ఉంటూ, పన్నులు కూడా కడుతున్నప్పటికీ విద్యార్థి ఇంటర్మీడియట్ చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఏపీలో సీటు ఇచ్చేది లేదని మూర్ఖత్వం ప్రదర్శించింది.దీనిపై విమర్శలు రావడంతో ‘‘విద్యార్థి రెండేళ్లు ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదవినా వారి తల్లిదండ్రులు పదేళ్లు వరుసగా ఏపీలో ఉంటున్నట్టు నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే’’, నాన్ లోకల్ కోటా (అన్ రిజర్వుడ్) 15 శాతం సీట్లలో వెసులుబాటు ఇచ్చింది. కానీ, ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించకుండా నిలువునా మోసం చేసింది.రెండింటా నష్టపోయి...ఓవైపు ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం జిత్తులు వేస్తోంది. మరోవైపు కొత్తకొత్త మెలికలతో రాష్ట్ర విద్యార్థులకు మొండిచేయి చూపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదే స్థానికత అంశాల్లో మార్పులు చేసింది. ఏపీ విద్యార్థులకు తెలంగాణ విద్యా సంస్థల్లో సీట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్పింది. ఏపీకి చెందినవారు ఇంటర్ తెలంగాణలో చదివి.. అక్కడ ఈఏపీసెట్ రాసినప్పటికీ వారిని కన్వీనర్ కోటా సీట్ల నుంచి తప్పించింది. దీంతో ఎన్ఆర్ఐ కోటాలో రూ.లక్షలు పోసి చదువుకోవాల్సిన దుస్థితి దాపురించింది.పోనీ, సొంత రాష్ట్రంలో హాయిగా చదువుకుందామని అనుకుంటే కూటమి ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టింది. ఏపీలో ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివినవారినే లోకల్ కోటా కింద పరిగణించింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒక్క సంవత్సరం బయట చదివినా వారిని స్థానికేతరులుగా మార్చేసింది. ఈఏపీసెట్‌లో ప్రవేశాలకు విద్యార్థుల తల్లిదండ్రుల పదేళ్ల నివాస కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నాన్ లోకల్ (అన్ రిజర్వుడ్) కోటాలో సీట్లు కేటాయించింది. కానీ, ఫీజురీయింబర్స్‌మెంట్ మాత్రం ఎగ్గొట్టింది. ప్రస్తుతం విద్యార్థులు ఇంజనీరింగ్ సీటు అలాట్మెంట్ లెటర్లు పట్టుకుని కళాశాలలకు వెళ్తుంటే... ముందుగా ఫీజులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు.ముందుచూపులేని స్థానికత! సరిగ్గా నిరుడు కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి హైదరాబాద్‌పై పదేళ్ల గడువు ముగిసింది. ఈ క్రమంలో విద్య, ఉపాధి అంశాల్లో సమాన అవకాశాలపై స్థానికతను నిర్ధారించడంలో జాప్యం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక మునుపే అంటే ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువులో చివరి ఏడాది ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్లో చేరారు. వాళ్లు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ప్రభుత్వం ఆయా బ్యాచ్ విద్యార్థులకు కచ్చితంగా వెసులుబాటు ఇవ్వాల్సింది.ఇవేమీ పట్టించుకోకుండా కూటమి సర్కారు ముందుకెళ్లడంతో ఏపీ విద్యార్థులు స్థానికత కోల్పోవాల్సి వచ్చింది. పోనీ, గత ఏడాదే ఏపీ విద్యార్థులు తెలంగాణలో చదువుకోవడంపై అవగాహన కల్పించిందా..? అంటే స్థానికతపై తాత్సారం చేసింది. ఈలోగా నిరుడు ఇంటర్ కోసం చాలామంది హైదరాబాద్ వెళ్లారు. వచ్చే ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వీరు కూడా స్థానికేతరులుగా మారిపోతున్నారు. అసలు రాజ్యాంగ సవరణ లేకుండా ఏపీ స్థానికతను ఏ విధంగా మార్పు చేస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. -
పురుగుల అన్నం ఎలా తినాలి?
మద్దిలపాలెం (విశాఖ)/తిరుపతి సిటీ: పురుగుల అన్నం ఎలా తినాలంటూ ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు మండిపడ్డారు. మెస్ నాణ్యత, ఇతర సమస్యలపై మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం వర్సిటీ ముఖ ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. మూడు రోజుల కిందట చికెన్‌లో పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌ల్లో నాణ్యత లేని, పురుగులు, కీటకాలతో కూడిన భోజనం పెడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ బిల్లు, కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలు మెస్ బిల్లుతో కలిపి విద్యార్థులపై భారం మోపుతున్నారని చెప్పారు. బయటి వ్యక్తుల చొరబాటు, అసాంఘిక కార్యకలాపాలతో మహిళా వసతి గృహాల వద్ద భద్రత కరువైందని వాపోయారు. ప్రహరీల నిర్మాణం, సెక్యూరిటీ పెంపునకు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తరగతులు ప్రారంభం కాలేదని, గెస్ట్ అధ్యాపకుల రెన్యూవల్ ప్రక్రియ జాప్యమే దీనికి కారణమని తెలిపారు. ఆర్వో ప్లాంట్లు, ఆధునిక కిచెన్, డైనింగ్ హాల్, కొత్త మంచాలు, కుర్చీలు, డిస్పెన్సరీలలో మందుల లభ్యత, గ్రంథాలయ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటి అనేక సమస్యలను విద్యార్థులు ఏకరువు పెట్టారు. ‘ఇదేం రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. వీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇది నమ్మశక్యంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు జోక్యం చేసుకుని, ఆగస్టు 21వ తేదీలోగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఎస్వీయూ డీ మెస్ అన్నంలో వాన పాము!ఎస్వీయూ డీ మెస్‌లో బుధవారం రాత్రి భోజనంలో వాన పాము కనిపించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. 200 మందికిపైగా పీజీ విద్యార్థులు ప్రతి రోజు డీ మెస్‌లో ఆహారాన్ని స్వీకరిస్తారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా, విచారణ జరుపుతామంటూ దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పరిస్థితి ఇలా తయారైందని చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఆహారంలో జెర్రులు, పురుగులు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. వందల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నాసిరకం భోజనాలను అందించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాలుగేళ్ల స్థానికత నిబంధన పక్కకు
సాక్షి, హైదరాబాద్: ‘స్థానికత’కు సంబంధించిన నాలుగేళ్ల నిబంధనను పక్కకు పెట్టి నీట్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులను అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. 2025 సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సులకు అనుమతి ఇవ్వాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాము ఇచ్చే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యార్థులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. స్థానికతకు సంబంధించి మెడికల్, డెంటల్ కోర్సుల అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ గతేడాది జూలై 19న ప్రభుత్వం జీవో 33ను జారీ చేసిన విషయం తెలిసిందే. నీట్‌కు ముందు తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలన్నది నిబంధన. కాగా ఈసారి కౌన్సెలింగ్‌లో కూడా ఇదే జీవో అమలు చేస్తుండటాన్ని పలువురు నీట్ అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ శామ్‌కోషి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లే.. విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘2025 జూలై 15న అడ్మిషన్ల నోటిఫికేషన్ సందర్భంగా ఈ నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే నివాస ధ్రువీకరణ పత్రాలున్న శాశ్వత నివాసితులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గత సంవత్సరం హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వును నిలిపివేసినప్పటికీ సంబంధిత గడువు ముగిసింది. అలాంటప్పుడు హైకోర్టు ఉత్తర్వు అమలులో ఉంటుంది. పిటిషనర్లను దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలి..’అని కోరారు. కాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారమే విచారణ జరుపుతోందని వర్సిటీ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతానికి పిటిషనర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని వర్సిటీని ఆదేశించింది. గత సంవత్సరం హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రాష్ట్ర నివాసితులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించాలని తెలిపింది. నాలుగేళ్లు తెలంగాణలో చదువుకోలేదనే కారణంతో వారి దరఖాస్తులను తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. గతేడాదీ ఇలాగే పిటిషన్లు.. గతేడాది కూడా ఇలాగే పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. నాలుగేళ్ల నిబంధనతో సంబంధం లేకుండా స్థానికతను ధ్రువీకరిస్తూ తహసీల్దార్ ఇచ్చే పత్రాన్ని అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ సందర్భంగా.. 134 మంది పిటిషనర్లు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది. -
ధర్నా ఆపకపోతే కేసులు పెడతా..
-
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఏయూ విద్యార్ధుల నిరసన
-
భోజనంలో పురుగులు.. విశాఖలో రోడ్డెక్కిన ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు
-
డిగ్రీ ఫిజిక్స్.. ఏఐ ట్రెండ్స్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి ఇక నుంచి కేన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. హృద్రోగ చికిత్సలో ఎలక్ట్రికల్ వేవ్స్ మెకానిజం అందించబోతున్నాడు. బీఎస్సీ డిగ్రీ చేసిన విద్యార్థులే వైద్య రంగంలోని టెక్నికల్ విభాగంలో చక్రం తిప్పే వీలుంది. ఈ దిశగా డిగ్రీలో ఫిజిక్స్ పాత్రను తీర్చిదిద్దుతున్నారు. సిలబస్ మార్పుపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ నేతృత్వంలోని కమిటీ కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. మారిన సిలబస్‌కు మంగళవారం మండలిలో జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇక నుంచి అన్ని యూనివర్సిటీల్లోనూ ఫిజిక్స్ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. పాత చాప్టర్లన్నీ నవీకరించి అందించబోతున్నారు. ప్రతి చాప్టర్‌లోనూ కాలానుగుణంగా వస్తున్న మార్పులను తీసుకొచ్చారు. డిజిటల్ విధానాలను ఇందులో జోడించారు. తరగతి బోధనే కాకుండా, అనుభవ పూర్వకమైన విద్యా విధానం ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులు కూడా ఉపాధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేశారు. మెకానిక్స్‌లో మజా డిగ్రీ ఫిజిక్స్‌లో మెకానిక్స్ అండ్ ఆస్కిలేషన్స్ కీలకమైంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వైద్య పరికరాలు పనిచేస్తున్న ఈ కాలంలో దీని ప్రాధాన్యత ఎక్కువే. ఎనర్జీ, రొటేషనల్ మోషన్, తరంగ ధైర్ఘ్యం వంటి చాప్టర్స్ ప్రధానమైనవి. న్యూటన్ లా ఆధారంగా ఉండే ఈ చాప్టర్‌ను మరింత సరళీకరించారు. ఏఐతో పనిచేసే యంత్ర పరికరాలకు అనుగుణంగా సిలబస్‌లో ప్రాక్టికల్ వర్క్ జోడించారు. దీంతో విద్యార్థి కార్పొరేట్ వైద్య రంగంలో యంత్ర పరికరాల నిర్వహణలో మంచి ఉపాధి అవకాశాలు పొందే వీలుంది. తరంగాలు, ఎల్రక్టానిక్స్ కదలికలు వంటి మార్పులను రికార్డు చేసే రేడియేషన్ ఫిజిక్స్‌ను ఈసారి అత్యాధునిక టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ అందించబోతున్నారు. మోడ్రన్ ఫిజిక్స్‌లో మెరుపులు విద్యుత్ రంగంతోపాటు అత్యాధునిక లేబొరేటరీల్లో పనిచేసే యంత్ర పరికరాలకు ఆయువు పట్టు మోడ్రన్ ఫిజిక్స్. ఏఐ వచ్చిన తర్వాత అటామిక్, సబ్ అటామిక్ లెవల్స్‌ను బేరీజు వేసే విధానం పూర్తిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోడ్రన్ ఫిజిక్స్‌లో ప్రాక్టికల్ వర్క్‌ను పెంచబోతున్నారు. అత్యాధునిక యంత్రాల్లో క్వాంటం మెకానిక్స్‌ను పరిశీలించేలా ప్రాజెక్టు వర్క్ పెంచుతున్నారు. అణు ఇంధన రంగంలో వచ్చిన మార్పులను గమనించేలా న్యూక్లియర్ ఫిజిక్స్ చాప్టర్స్, సోలార్ ఎనర్జీ ట్రాకింగ్ విధానాల చాప్టర్స్‌ను డిగ్రీలో కొత్తగా నేర్చుకునే అవకాశం ఇక నుంచి ఉండబోతోంది. వేవ్స్, ఆప్టిక్స్‌లో వెరైటీ ఫిజిక్స్‌లో మరో కీలకమైన చాప్టర్ వేవ్స్ అండ్ ఆప్టిక్స్ పూర్తిగా ఉపాధికి బాటలు వేసేలా ఉండాలని నిపుణులు నిర్ణయించారు. తరంగాలు వాటి గతి, ధ్వని తరంగాలు, కాంతి వేగం, కాంతిలో మార్పులు తెలిపే ఈ చాప్టర్‌ను పూర్తిగా ఇప్పుడున్న టెక్నాలజీకి అనుసంధానం చేస్తారు. తరగతిలో కేవలం బోధన సాగితే, ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం ప్రధాన కంపెనీల ద్వారా నేర్చుకునే వీలుంటుంది. ఇలాంటి అనేక మార్పులతో కూడిన ఫిజిక్స్ సిలబస్ ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రాబోతోంది ఉపాధి పెంచడానికే మార్పులు సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునీకరిస్తున్నాం. నేటి తరం ఆలోచనలు, టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిలబస్ రూపొందిస్తున్నాం. ఫిజిక్స్‌లో ఆధునిక వైద్య రంగానికి ఉపయోగపడే చాప్టర్లు జోడిస్తున్నాం. విద్యార్థి ప్రాక్టికల్‌గా విషయ పరిజ్ఞానం సంపాదించేలా ప్రాజెక్టు పనులు ఇవ్వబోతున్నాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్. -
ఎంబీబీఎస్ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ షురూ
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ఆలిండియా కోటా మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించింది. నీట్ యూజీ–2025లో అర్హత సాధించిన విద్యార్థుల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 28 వరకూ రిజిస్ట్రేషన్లకు గడువు విధించారు. విద్యార్థులు మంగళవారం నుంచి ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 29, 30 తేదీల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం, డీమ్డ్, సెంట్రల్ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మర్ విద్యా సంస్థల్లో సీట్లను ఆలిండియా కోటాలో భర్తీచేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆలిండియా కోటాలోకి వెళ్తాయి. ఈ విదేశీ విద్యా సంస్థల్లో చేరొద్దు..భారత్‌కు చెందిన విద్యార్థులు వైద్య విద్య కోసం బెలిజ్ దేశంలోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చిర్చిక్ బ్రాంచ్‌లలో చేరొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సూచించింది. ఈ విశ్వవిద్యాలయాలు భారత విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల లేమి, ఇతర సమస్యలను గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయాలు నివేదించాయని ఎన్ఎంసీ తెలిపింది.ఈ సలహాను పాటించకుండా ఆ విద్యా సంస్థల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు భారత్‌లో రిజిస్ట్రేషన్‌కు అనర్హులని తెలిపింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారు ఎంచుకున్న కళాశాలల్లో కోర్సు వ్యవధి, సిలబస్, కరికులమ్, క్లినికల్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ వంటివి ఎన్ఎంసీ ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు యూడీఐడీ తప్పనిసరినీట్ యూజీ–2025 అర్హత సాధించిన దివ్యాంగ విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక వైద్య గుర్తింపు కార్డు(యూడీఐడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం వెల్లడించారు. యూడీఐడీ లేని దివ్యాంగ విద్యార్థులు https:// swavlambancard.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిలో యూడీఐడీ పొందాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) సూచించిన విధంగా సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్‌ను విద్యార్థులు సమర్పించాలన్నారు. దానికి మెడికల్ అసెస్మెంట్ రిపోర్ట్–2025ను జత చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులందరూ విశ్వవిద్యాలయం సూచించిన మెడికల్ బోర్డ్ ముందు హాజరవ్వాల్సి ఉంటుందన్నారు. -
అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా..
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు విదేశీ విద్య ఆశలు కల్పించారు.. కానీ ఏళ్ల తరబడి ఫీజులు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఫీజు, ఇతర ఖర్చులు భరించలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. 2022లో అప్పటి సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ రోనాల్డ్‌రోస్ గురుకులాల విద్యార్థులకు అత్యున్నత విద్యనందించేలా శాట్ క్యాంప్ ద్వారా శిక్షణ ఇప్పించారు. అదే ఏడాది ఇంటర్ విద్యార్థులకు శాట్ పరీక్ష నిర్వహిస్తే 20 మంది విద్యార్థులు (Students) హాజరయ్యారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు అమెరికాలోని కుడ్జ్టౌన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు 2023 ఆగస్టులో ఇంజనీరింగ్ సీఎస్సీ బ్రాంచ్‌లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొక్కెరగడ్డ అనూహ్య శాంతిశ్రీరాజ్, హైదరాబాద్‌కు చెందిన పి.సృజనసింహ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జి.అక్షయ చేరారు. రెండేళ్లయినా.. విదేశీ విద్యపై ఆశతో అమెరికా వెళ్లి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురికీ ఫీజు చెల్లించలేదు. ఏటా 6 వేల డాలర్ల చొప్పున రెండేళ్లకు ఒక్కొక్కరికి 12 వేల డాలర్లను రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్‌గా మంజూరు చేయాల్సి ఉంది. ఏటా ఆరు వేల డాలర్ల స్కాలర్షిప్ ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో విమాన టికెట్లు, ఫీజులకు అప్పులు చేసి పంపించారు. ఇప్పటికి ఒక్కొక్క విద్యార్థిపై సుమారు రూ.46 లక్షలు వెచ్చించినా.. ప్రభుత్వం నుంచి విడుదల కాక అప్పులు ఎలా తీర్చాలా? అని ఆందోళన చెందుతున్నారు.అధికారుల చుట్టూ తిరుగుతూ.. విదేశీ విద్య స్కాలర్షిప్లు (Overseas Education Scholarship) అందించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు రెండేళ్ల నుంచి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సచివాలయంలో ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకంటే ముందు బ్యాచ్‌కు స్కాలర్షిప్ ఇవ్వడంతో.. ఆ ఆశతోనే విదేశీ విద్య వైపు మొగ్గు చూపామని చెబుతున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో.. చదువు మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. సీఎం జోక్యం చేసుకుంటేనే.. విదేశీ విద్య స్కాలర్షిప్కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జోక్యం చేసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చొరవ చూపి ఎస్సీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయకుండా చూడాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినందున తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నారు. చదవండి: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. కటాఫ్ తగ్గింది.. పోటీ పెరిగింది -
వరంగల్‌లో తెలంగాణ క్రీడాపాఠశాల
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి.. అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శితో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్.నాగరాజులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చాలాసేపు మాట్లాడారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క స్టేడియం మాత్రమే ఉందని, జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడల నిర్వహణకు ఉపయోగపడుతోందని, శిక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. వరంగల్ అన్ని వైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభా పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా క్రీడా సేవల విషయంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అవసరాలను తీర్చలేకపోతోందని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలను మంజూరు చేయడం ద్వారా ప్రత్యేక క్రీడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించొచ్చని, ఈ పాఠశాలు ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల ప్రభుత్వ భూమి ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో అందుబాటులో ఉందన్నారు. వరంగల్‌కు చెందిన విద్యార్థులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో క్రికెట్ కోసం ప్రత్యేక స్టేడియం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. క్రీడా పాఠశాలతోపాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియాన్ని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో పాటు జిల్లా అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆసక్తికర భేటీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రి కొండా సురేఖ దంపతులకు విభేదాలు వచ్చిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్‌తో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో ఈ సమావేశంలో రాజకీయంగా ఏం చర్చ జరిగిందన్నది ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాలకు సర్దిచెప్పేందుకే రేవంత్ విడివిడిగా ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశమయ్యారని, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను కొంతకాలం పక్కనపెట్టేలా ఈ భేటీలో చర్చలు జరిగాయని తెలుస్తోంది. -
కటాఫ్ తగ్గింది... పోటీ పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మొదటి రౌండ్లో ఈసారి ప్రధాన కాలేజీల్లో కటాఫ్ బాగా తగ్గింది. దీంతో మంచి ర్యాంకర్లకే కోరుకున్న చోట సీట్లు వచ్చాయి. మిగతా రౌండ్లలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. 5 వేల ర్యాంకు దాటిన తర్వాత పోటీ తీవ్రంగా ఉంది. ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ సహా అన్ని టాప్ కాలేజీల్లోనూ గతేడాదితో పోలిస్తే కటాఫ్ ర్యాంకులు భారీగా తగ్గాయి. 2024లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కంప్యూటర్ కోర్‌గ్రూప్‌లో 1,850 ర్యాంకు వచ్చిన బాలురకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. ఈ ఏడాది కటాఫ్ 1,221 ర్యాంకు వద్దే ఆగిపోయింది. జేఎన్టీయూహెచ్లో ఇదే బ్రాంచీలో గతేడాది 873 ర్యాంకు కటాఫ్‌గా ఉంటే, ఈ ఏడాది 625తోనే ఆగిపోయింది. ఇతర ప్రధాన ప్రైవేటు కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నాన్–లోకల్ ఎత్తివేతతో..! ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)లో ఈ ఏడాది మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న నాన్–లోకల్ కోటాను ఈసారి నుంచి ఎత్తివేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందే వీల్లేకుండా పోయింది. ఏపీ నుంచి దాదాపు 75 వేల మంది ఏటా ఈఏపీసెట్‌లో పోటీ పడేవారు. వారితో కలుపుకుని 2.10 లక్షల మంది వరకు ఇంజనీరింగ్ సెట్లో అర్హత సాధించేవారు. ఈసారి 2,07,190 మంది ఇంజనీరింగ్ సెట్ రాస్తే, 1,51,779 మంది మాత్రమే అర్హత సాధించారు. ఏటా 5 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో తక్కువగానే చేరేవారు. వీరికి జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లేవారు. అక్కడ మంచి బ్రాంచీలో సీటు రానివాళ్లే రాష్ట్ర కాలేజీల్లో చేరేవారు. 10 వేల పైన ర్యాంకులు వచ్చిన ఏపీ విద్యార్థులు కూడా తెలంగాణలో పోటీపడటంతో కటాఫ్ పెరిగేది. ఈసారి రాష్ట్ర విద్యార్థులే పోటీ పడటం, వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో పోటీ తీవ్రంగా ఉండి కటాఫ్ ర్యాంకులు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. సీట్లు పక్కానే... ర్యాంకే కీలకం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 83,054 సీట్లున్నాయి. ఇందులో 58,742 సీట్లు కంప్యూటర్ సైన్స్, దానికి అనుబంధంగా ఉండే ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. తొలి రౌండ్లో ఇందులో 57,042 సీట్లు కేటాయించారు. సీఎస్ఈ బ్రాంచీలో ఓపెన్ కేటగిరీ కింద టాప్ కాలేజీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. జోసా కౌన్సెలింగ్ అన్ని రౌండ్లూ పూర్తవ్వడంతో ఈఏపీసెట్‌లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో చేరతారు. అయితే, టాప్ 25 కాలేజీల్లో సీఎస్ఈ సీటు వచ్చినప్పటికీ 2 వేల మంది వరకూ ఇతర రాష్ట్రాలు, యాజమాన్య కోటా సీట్లతో కాలేజీలు మారే వీలుంది. కాబట్టి 20 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులకు తర్వాతి రౌండ్లలో మంచి కాలేజీలు, బ్రాంచీల్లో సీట్లు వస్తాయని అంటున్నారు. తెలంగాణ విద్యార్థుల మధ్యే పోటీ కాబట్టి, 30 వేల ర్యాంకు వరకు సీఎస్సీ బ్రాంచీలో జనరల్ కేటగిరీ వారికి సీటు లభిస్తుందని చెబుతున్నారు. కాలేజీ ఏదైనా ఫర్వాలేదు... సీఎస్ఈ మాత్రమే అనుకునే వారికి ఈ ఛాన్స్ వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. కటాఫ్‌లు భారీగా మారాయి గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇంజనీరింగ్ సీట్ల కటాఫ్ పూర్తిగా మారాయి. స్థానికులే పోటీ పడటం దీనికి ప్రధాన కారణం. మంచి ర్యాంకులు వచ్చిన వారికే కోరుకున్న సీట్లు దక్కాయి. గతంలో మాదిరి మిగతా రౌండ్లలో సీట్లు వస్తాయన్న నమ్మకంతో విద్యార్థులు ఉండొద్దు. వచ్చిన సీటులో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి బ్రాంచీ, కాలేజీ మార్చుకోవడమే మంచిది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర సీనియర్ అధ్యాపకులు. -
ఏఐతో హోమ్‌వర్క్!
సాక్షి, స్పెషల్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ దొరికిందంటే గంటల తరబడి గేమ్స్ ఆడే పిల్లలు మనచుట్టూనే ఉన్నారు. వినోదానికి గేమ్స్ మాత్రమే కాదు.. హోమ్‌వర్క్ కూడా పూర్తి చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు! అది కూడా ఆధునిక సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో!! అవును.. ప్రపంచవ్యాప్తంగా 58 శాతం విద్యార్థులు హోంవర్క్, అసైన్మెంట్స్, పాఠాలపై అవగాహన పెంచుకునేందుకు ఇప్పటికే ఏఐ ఉపయోగిస్తున్నారట. అన్నింటా మనం అన్నట్టు భారతీయ విద్యార్థులూ ఈ విషయంలో ముందున్నారు.మొత్తం 29 దేశాలు..‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’సందర్భంగా ‘స్టూడెంట్స్ స్పీక్ ఆన్ ఏఐ’పేరుతో స్కిల్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రైట్చాంప్స్’ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ సాధించిన విజయాలు, మన జీవితాల్లో తెస్తున్న మంచి మార్పులకు గుర్తుగా ఏటా జూలై 16ను ‘అంతర్జాతీయ ఏఐ ప్రశంసా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. పిల్లలు ఏఐతో మమేకమవుతున్న తీరును ఈ అధ్యయనం వెల్లడించింది. భారత్, అమెరికా, వియత్నాం, యూఏఈ సహా 29 దేశాల్లోని 1,425 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో ఏఐని ఉపయోగిస్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. విద్యార్థులు చాట్‌జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్నారు. తాము ఎప్పుడూ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదని భారత్‌లో 95 శాతం, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు చెప్పడం గమనార్హం.‘ఏఐ చెప్తే నమ్మేయాలా?’మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏఐ ఇచ్చే సమాధానాలను విద్యార్థులు గుడ్డిగా నమ్మడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది. దాదాపు 70 శాతానికిపైగా పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకుండా సరిచూస్తున్నారట. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. దాదాపు 80 శాతం పిల్లలు ఏఐ ఇచ్చిన సమాధానాలను పూర్తిగా నమ్మడం లేదు.పిల్లలు – ఏఐ⇒ 58% హోంవర్క్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏఐ ఉపయోగిస్తున్న విద్యార్థులు⇒ ఏఐని తరచూ వినియోగిస్తున్నభారతీయ విద్యార్థులు 63%⇒ 62% చాట్‌జీపీటీని అత్యధికంగా ఉపయోగిస్తున్నవారు⇒ మోసం చేయడానికి ఏఐని ఉపయోగించలేదు 86%⇒ 34% ఏఐ పని చేసే విధానం తెలిసిన పిల్లలు⇒ ఏఐని సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకత్వం కోరుతున్నవారు 56%⇒ 38% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నవారు⇒ ఇమేజ్, వీడియో.. ఏఐతో రూపొందిందా లేదా అన్నది తెలియనివారు 50%⇒ 70% పాఠశాలల్లో ఏఐ బోధించాలని కోరుతున్న విద్యార్థులు⇒ తమకున్న ఏఐ అవగాహనపట్ల నమ్మకంగా ఉన్నవారు 10%⇒ 29% ఏఐ ఇచ్చిన సమాధానాలను సరిచూడని పిల్లలు⇒ ఏఐ ఇచ్చిన తప్పుడు జవాబులను నమ్మినవారు 20% -
'కెరీర్'.. వెరీ కేర్‌ఫుల్..!
ప్రస్తుతం నగరం చదువుల ఉత్సాహంతో ఉప్పొంగిపోతోంది. ఎక్కడ చూసినా నోటిఫికేషన్లు, ఎంట్రెన్స్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా కాలేజీ ఎంపికలు, సీట్ల కేటాయింపులు, కౌన్సెలింగ్‌ల ప్రక్రియల చర్చలు హోరెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ సందేహాలు, అనుమానాలతో ముందస్తు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో పలు కోర్సులపై, కాలేజీలపై, కెరీర్ అవకాశాలపై స్పష్టత లేనిదే నిర్ణయాలు తీసుకుంటే.. అది భవిష్యత్తు పట్ల ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చదువుల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, వివిధ కోణాల్లో విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇది కేవలం చదువు గురించి కాదు.. జీవితం గురించి. ఒక నిర్ణయం మీ జీవితానికి దిశ చూపుతుంది. మరి ఆ నిర్ణయం, నిజమైన సమాచారం ఆధారంగా ఉండాలి. ట్రెండ్లు చూసో, ఇష్టమైన రంగం అనో కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు సాగడం ముఖ్యమని నిపుణుల సూచన. విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎలాంటి కాలేజీ ఏ రంగానికి బాగా అనుకూలం? జాబ్ మార్కెట్లో ఏ రంగానికి డిమాండ్ ఉంది? ఇవన్నీ తెలుసుకోవడమే మొదటి మెట్టు. సమాచారం మూడు మార్గాల్లో సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు, అప్లికేషన్లు, కౌన్సెలింగ్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ తదితర తేదీలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లలో తెలుసుకుంటుండాలి. ప్రభుత్వ వెబ్సైట్లు (తప్పనిసరిగా చూడాల్సినవి): టీజీ ఈఏపీసీఈటీ, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల అధికారిక వెబ్సైట్లు, ఏఐసీటీఈ, యూజీసీ వంటి ప్రభుత్వ శిక్షణ సంస్థల వెబ్సైట్లు.నిపుణుల సలహాలు: కెరీర్ కౌన్సెలర్లు, సబ్జెక్ట్ నిపుణులు, సైకాలజిస్టులు విద్యార్థుల ప్రొఫైల్ ఆధారంగా సరైన మార్గదర్శనం అందించగలరు. ఉదాహరణకు ‘యూనివర్సిటీ, కెరీర్ ల్యాబ్స్, బైజూస్ కెరీర్ కౌన్సెలింగ్, టీసీఎస్ ఐఆన్’ వంటి ప్లాట్‌ఫాంలు ఉపయుక్తం.పూర్వ విద్యార్థుల అనుభవాలు: ఆయా కాలేజీల పూర్వ విద్యార్థులను సంప్రదించడం వల్ల కాలేజీ రియాలిటీ, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. తల్లిదండ్రుల పాత్ర.. పిల్లల కలలు మీ కోరికలు కావొద్దు. పిల్లల ఆసక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు, వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా గైడెన్స్ ఇవ్వాలి. ఎదుటివారి పిల్లలు చేసినట్లు చేయాలని అనడం ద్వారా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు. ఎవరి మాట నమ్మాలి..? ఫేక్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు: వీరి మాటలు చాలాసార్లు మోసం చేస్తాయి. వారి చెప్పినంతగా స్కాలర్ షిప్స్, సీట్లు ఉండవు. సోషల్ మీడియాలో డైరెక్ట్ యాడ్స్: వీరిని నమ్మొద్దు.. గుర్తింపు లేని సంస్థల్లో అవకతవకలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లలో సమాచారం ఉత్తమం. కార్యాచరణ సూచనలు.. నాకు ఏవైనా ఆసక్తులు ఉన్నాయా? నేనేం బాగా చేయగలను? అనే స్వీయ విశ్లేషణ అవసరం. స్కూల్, కాలేజీ కౌన్సెలర్లు/సీనియర్ల ప్రాథమిక గైడెన్స్ తీసుకోవడం ఆన్లైన్లో సర్టిఫైడ్ కౌన్సెలింగ్ పొందడం. చివరి ఎంపికకు ముందు కనీసం ఇద్దరు–ముగ్గురు నిపుణులను సంప్రదించండి. తప్పక తెలుసుకోవాల్సిన కోర్సులు.. ఇంజినీరింగ్ (బీ.టెక్): సీఎస్సీ, ఈసీఈ, ఏఐఎమ్ఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త స్పెషలైజేషన్లు డిమాండ్‌లో ఉన్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, సీబీఐటీ, వీఎన్ఆర్ వంటి కాలేజీలు మంచి పేరు తెచ్చుకున్నాయి. మెడిసిన్ (ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎమ్ఎస్, బీహెచ్ఎమ్ఎస్): నీట్ ఆధారంగా అఖిల భారత, రాష్ట్రస్థాయి కోటాలో సీట్లు లభిస్తాయి. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చాలా ఎక్కువ. ప్రభుత్వ కాలేజీలు అయితే అత్యుత్తమమైనవి. లిబరల్ ఆర్ట్స్, మాస్ కమ్యూనికేషన్, డిజైన్: ఎన్ఐడీ, నిఫ్ట్, ఎఫ్ఎల్ఏఎమ్ఈ యూనివర్సిటీ వంటి సంస్థలు ఆర్ట్స్‌కి ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులకు అనుకూలం. వృత్తి విద్యా కోర్సులు(డిప్లొమా, ఐటీఐ, పారామెడికల్): తక్కువ ఖర్చుతో, త్వరగా ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగే కోర్సులు కావాలంటే ఇవి బెస్ట్. రాష్ట్ర ప్రభుత్వాల మేనేజ్డ్ ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఈ కోణంలో మంచి పనితీరు కనబరుస్తున్నాయి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేషన్–యూజీ): ఇది విద్యార్థి కెరీర్‌కు బేసిక్‌గా పనిచేసే దశ. మూడేళ్ల (బీఏ, బీఎస్సీ, బీకాం) నుంచి నాలుగేళ్ల (బీటెక్, బీ.ఫార్మా) వరకు కోర్సులు ఉన్నాయి. యూజీలో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న బీఎస్సీ డేటా సైన్స్, న్యూట్రీషన్, ఫోరెన్సిక్ సైన్స్.. బీకాం ఫిన్‌టెక్, బిజినెస్ అనలైటిక్స్.. బీఏ సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్స్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. డిగ్రీలో నేర్చుకున్న ఫౌండేషన్ బలంగా ఉంటే పీజీలో విశ్లేషణాత్మక విద్యనూ, పరిశోధనాత్మక దృక్పథాన్నీ పొందొచ్చు. పీజీ (పోస్ట్‌గ్రాడ్యుయేషన్): పీజీ అనేది యూజీలో పొందిన జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకునే దశ. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి లేదా అధ్యాపక వృత్తిలోకి రావడానికి పీజీ ఉపయోగపడుతుంది. కొన్ని కోర్సులకు ప్రత్యేక ఎంట్రెన్స్ అవసరం: క్యాట్–ఎంబీఏ, సీయూఈటీ పీజీ లేదా టీజీ సీపీజీఈటీ–ఎమ్ఏ, ఎమ్మెస్సీ, ఎమ్‌కాం, గేట్–ఎమ్‌టెక్, నీట్ పీజీ–మెడికల్ పీజీ కోర్సులు. పీహెచ్డీ (డాక్టరల్ రీసెర్చ్): పరిశోధన రంగం అంటే సీరియస్‌గా గమనించాల్సిన అంశం. పీహెచ్డీ విద్యార్థి కొంత కాలం లోతుగా ఒక సబ్జెక్ట్ మీద పరిశోధన చేస్తూ సొంత థీసిస్ అందజేసే దశ. అభ్యాసం, పరిశోధన మీద ఆసక్తి ఉన్నవారికి మాత్రమే పీహెచ్డీ సరైన మార్గం. యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, గేట్, జేఆర్ఎఫ్ వంటి పరీక్షల ద్వారా స్కాలర్‌షిప్‌తో చేరొచ్చు. హై–ఎండ్ కార్పొరేట్ ఆర్అండ్డీ, యూనివర్సి టీలలో ప్రొఫెసర్ ఉద్యోగాలు సాధించాలంటే పీహెచ్డీ అవసరం. (చదవండి: 114 ఏళ్ల వయసులోనూ హుషారుగా.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!.. కానీ..) -
అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు. -
విద్యా రంగం బతికే భరోసా ఏది?
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నమోదు పెంచడానికి ఎవరికి తోచిన విధంగా వారు ఉచిత సలహాలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో అవేవీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచలేకపోతున్నాయి. ప్రభుత్వ విద్యారంగ గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకసారి పరిశీలన చేస్తే... 1990వ దశకం వరకు మన దేశంలో ప్రభుత్వ విద్యా రంగం పటిష్ఠంగా ఉండేది. నూటికి తొంభై ఐదు మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలోనే చదివేవారు. బడులన్నీ విద్యార్థులతో కళకళలాడేవి. ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత ప్రపంచ వాణిజ్యం కొరకు ‘ప్రపంచ వాణిజ్య ఒప్పందం (గాట్)–1994’లో మన దేశం చేరిన నాటినుండి విద్యారంగంలో ప్రయివేటు పెట్టుబడులు విపరీతంగా పెరిగి, విద్య కుడా లాభాలను ఆర్జించిపెట్టే ఒక సరుకుగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా నేడు వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న గోరుముద్ద’, ‘విద్యాకానుక కిట్’ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. వెఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనా కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, అధునీకరించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఇంతటితో సరిపెట్టుకోక, ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో ధనవంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్‌ను ప్రభుత్వ బడుల్లో అమలుకు ఆదేశాలు ఇచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలో అత్యుత్తమ బోధనకు పేరొందిన ఐబీ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో అమలుచేయడానికి ఏపీ స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌తో ఒప్పందం చేసుకోవడం ఊహకు కూడా అందని చారిత్రక ఘట్టం. అయితే, ఆ ప్రభుత్వం మారగానే ‘అమ్మ ఒడి’ భరోసాను భంగపాటుకు గురిచేసి రద్దుచేశారు. ‘తల్లికి వందనం’ అని పథకం పేరు మార్చినా పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. జూన్ నెల ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ బడుల్లో ఒకటో తగతిలో విద్యార్థుల తక్కువ నమోదు వెక్కిరిస్తున్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతెన్నులే ఇందుకు కారణం. దేశంలోనే సంపద సృష్టిలో, జీఎస్టీ వసూళ్లలో మొదటి వరుసలో ఉన్నామని చెప్పుకొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు... విద్యా ప్రగతి సూచికలో మాత్రం కింది స్థానానికి దిగజారాయి. ఉచిత భోజన వసతితో కూడిన గురుకులాలలో కూడా పిల్లలు అంతగా చేరడం లేదంటే కారణం ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పరచక పోవడం, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడమే అని చెప్పక తప్పదు. తెలంగాణలో పాఠశాల విద్యను, ఇంటర్ విద్యను కలపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది మరో సంక్షోభానికి దారితీయవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఆరేడు ఎన్జీఓలతో ‘సీఎస్సార్’ పథకం కింద ఎంఓయూ కుదుర్చుకోవడం చూస్తే... రెగ్యులర్ క్లాసుల బోధనకు కలిగే ఆటంకాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కడబడటం లేదు. ప్రభుత్వాలు మారగానే విద్యారంగం తీవ్రమైన ఒడుదొడుకులకు గురవుతోంది. గత ప్రభుత్వాల బ్రాండ్ కొనసాగింపుకన్నా తమ ప్రభుత్వ బ్రాండ్ ఉండాలనే తలంపు నేడు విద్యారంగానికి శాపంగా పరిణమిస్తున్నది. వెరసి చూస్తే విద్యారంగం ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు గోచరిస్తున్నది.అడ్మిషన్ల లేమితో ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు... పరిశ్రమలకు కల్పించే ఉద్దీపన చర్యలు తక్షణ అవసరం. ఒకవైపు ప్రయివేటు పాఠశాలల్లో కృత్రిమ మేధ సహాయంతో పాఠాల బోధన, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా సరళీకృత ఆర్థిక, వ్యాపార, సాంకేతిక విధానాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సమాజంలో పేద పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఇంగ్లీష్ విద్యతో పాటు, ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల కోర్సుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% ప్రత్యేక రిజర్వేషన్‌కు భరోసా ఇచ్చే చట్టం చేయాలి.మామిడి నారాయణ వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపక చైర్మన్ ‘ 94410 66032 -
పర్యవేక్షణ కరువై పెడదారి
వారం క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురం చెక్‌డ్యాం సమీపంలో తపోవనం హైస్కూల్ల్ పిల్లలు ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ బ్యాచ్‌లోని ఓ విద్యార్థి తండ్రి వీరి తతంగాన్ని కనిపెట్టాడు. తన కుమారుడిని పట్టుకొచ్చి బాగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అందరి పేర్లూ చెప్పాడు. విస్కీ తాగినట్టు వెల్లడించాడు. అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన విద్యారి్థ.. ఇటీవల స్కూల్లో టీసీ తీసుకుని 3వ రోడ్డులో ఉన్న ఓ హైస్కూల్ల్లో చేరాడు.బడిలో ఈ విద్యార్థి ఇటీవల గంజాయి తాగుతుండగా ఉపాధ్యాయుడు గుర్తించాడు. తల్లిదండ్రులను పిలుస్తా అని హెచ్చరిస్తే.. ‘‘పిలువు, నన్ను వాళ్లేం చేయగలరు’’ అంటూ విద్యార్థి ఎదురుతిరిగే సరికి ఉపాధ్యాయుడు భయపడి విషయాన్ని అంతటితో వదిలేశాడు. విద్యార్థుల్లో పెడ ధోరణలు ఎంతగా పెరిగాయో ఈ రెండు ఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ళ్లలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు కూడా తమకెందుకులే అని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో పిల్లలు పెడదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది. 14 ఏళ్లకే మద్య సేవనం... తపోవనం హైస్కూలు విద్యార్థులు మద్యం సేవించిన ఘటన అనంతపురం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు, ఎనిమిదో తరగతి చదువుతున్న వారు ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని పలువురు విస్తుపోతున్నారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్నారు. కో ఎడ్యుకేషన్ ఉన్నచోట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి బాలిక ఓ బాలుడికి ప్రేమలేఖ రాసిన ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఉదాసీన వైఖరి పిల్లలను ఏమంటే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది టీచర్లే క్రమశిక్షణ తప్పి క్లాసులకు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. సమయానికి స్కూలుకు వెళ్లకపోవ డం, వెళ్లినా క్లాసులు తీసుకోకపోవడం విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. ఇక పిల్లల తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటుండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేక శాపంగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి పిల్లల్లో పెడధోరణులను కాండాక్ట్ డిజార్డర్ అంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం. తల్లిదండ్రు లకు మద్యం అలవాటు ఉన్నా ఇలా జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కూడా పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం -
అవస్థలుబడి
ఎమ్మిగనూరు టౌన్: విద్యాభివృద్ధికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకున్నాయి. నాడు–నేడులో భాగంగా కల్పించిన మౌలిక సదుపాయాలతో అడ్మిషన్ల సంఖ్య కూడా మునుపెన్నడూ లేనివిధంగా పెరిగింది. దశాబ్దాలుగా శిథిలమైన పాఠశాలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో చూడచక్కన రూపాన్ని సంతరించుకుని విద్యార్థులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇదే సమయంలో జగనన్న విద్యా కానుకతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో తల్లిదండ్రులు ప్రయివేట్ చదువులను మాన్పించి ప్రభుత్వ పాఠశాల దిశగా అడుగులు వేయించడం విశేషం. విద్యార్థినుల అడ్మిషన్లలో రాష్ట్రంలోనే మొదటిస్థానం ప్రస్తుత విద్యాసంవత్సరంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య 3,680. వీరిలో ఒక్క 6వ తరగతిలోనే కొత్తగా 850 మంది విద్యార్థినులు ప్రవేశం పొందడం విశేషం. ఫలితంగా ఈ ఒక్క తరగతికే 11 సెక్షన్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. 7వ తరగతిలో 680 మంది విద్యార్థినులకు 10 సెక్షన్లు, 8వ తరగతిలో 750 మందికి 10 సెక్షన్లు, 9వ తరగతిలో 700 మందికి 10 సెక్షన్లు, 10వ తరగతికి 9 సెక్షన్లతో బోధన సాగిస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా 94 మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా 5 హిందీ, 6 ఒకేషనల్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏడాదైనా పూర్తికాని అదనపు తరగతి గదులు గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా రెండవ విడత నాడు–నేడు కింద 12 అదనపు తరగతి గదుల నిర్మాణానికి పూనుకుంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను పూర్తిగా విస్మరించింది. ఈ కారణంగా విద్యార్థినులు పాఠశాల ఆవరణలోని చెట్ల కింద, వరండాల్లో అష్టకష్టాలు పడుతూ చదువుకుంటున్నారు. ఇదే సమయంలో విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో నేల చదువులు తప్పడం లేదు. ఒకే తరగతి గదిలో కొందరు డెస్్కలపై, మరికొందరు నేలపై కూర్చోవడం వల్ల వివక్షను ఎదుర్కొంటున్నారు. 3,630 మంది విద్యార్థినులకు 22 మరుగుదొడ్లే.. రాష్ట్రంలోనే విద్యార్థినుల సంఖ్య పరంగా ఈ పాఠశాల మొదటిస్థానంలో ఉంది. మొత్తం 3,630 మంది విద్యార్థినీలు ఉన్న ఈ పాఠశాలలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థినీలు అత్యవసరమై మరుగుదొడ్లను ఉపయోగించుకోవాల్సి వస్తే క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది. సంఖ్యకు అనుగుణంగా మరో 20 మరుగుదొడ్లు అవసరం కాగా, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించని పరిస్థితి. ఇక విద్యార్థినుల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ కేవలం నలుగురు మాత్రమే ఆయాలు పని చేస్తున్నారు. ఈ కారణంగా పాఠశాలలో పారిశుద్ధ్య లోపం కొట్టిచ్చినట్లుగా కనిపిస్తోంది. నాడు–నేడు రెండో విడతకు రూ.2.08కోట్లు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి విడత నాడు–నేడు కింది టాయిలెట్స్ ఇతర మౌలిక సదుపాయాలకు రూ.1.01కోట్లు మంజురు కాగా ఆయా పనులన్నీ పూర్తయ్యాయి. ఇక రెండో విడత నాడు–నేడు కింద 20 అదనపు తరగతి గదులకు రూ.2.08కోట్లు మంజూరయ్యాయి. కాగా అందులో 8 తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా గదుల బయట ప్లాస్టింగ్ చేయకపోయినా సున్నం కొట్టించి వాటిలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. మిగిలిన 12 గదుల నిర్మాణాలు పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం గమనార్హం.పాఠశాలలో అన్నీ సమస్యలే.. ⇒ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ గత ఏడాది నుంచి పనిచేయక మూలనపడింది. ⇒ విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినీలు ఇంటి నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ⇒ మధ్యాహ్న భోజన సమయంలో వెక్కిళ్లు వస్తే వీళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ⇒ వర్షాకాలంలో పాఠశాల ఆవరణ తడిచి ముద్దవుతోంది. ⇒ గ్రౌండ్లోనూ వర్షం నీరు నిలుస్తుండటంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.ఈ విద్యార్థినులు మరుగు దొడ్లను వినియోగించుకునేందుకు ఇలా క్యూలో నిల్చొన్నారు. పాఠశాలలో 3,630 మంది విద్యార్థినులు ఉండగా 22 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఇలా క్యూలో నిల్చొని వీరు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.పాఠశాల విద్యలోనూ రాజకీయమే..గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యలోనూ రాజకీయం చొప్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ఏడాది కాలంగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ కారణంగా విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంఎస్ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం మా పాఠశాలలో విద్యార్థినీల సంఖ్యకు తగ్గట్టుగా తరగతి గదుల్లేవు. నాడు–నేడు కింద నిలిచిపోయిన 12 తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు నివేదించాం. పాఠశాల అభివృద్ధికి దాతలు కూడా ముందుకొస్తున్నారు. అధికారుల ఆదేశాలతో అవసరమైతే వారి సహకారం కూడా తీసుకొంటాం. అదనపు మరుగుదొడ్లు అత్యవసరం. – కృష్ణమూర్తి, ప్రధానోఫాధ్యాయులు, ఎంఎస్, జెడ్పీ బాలికల హైస్కూల్, ఎమ్మిగనూరుప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందో?మరుగుదొడ్లకు వెళ్లేందుకు కూడా విద్యార్థినులు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి చూస్తే ఈ ప్రభుత్వం ఎంతటి దిగజారుడు పాలన సాగిస్తుందో అర్థమవుతోంది. విద్యార్థుల విషయంలో కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం వీటిని పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణం. – బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మిగనూరు -
పల్లె బడిలో ఏఐ పాఠాలు
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్‌తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్‌ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్‌ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు.. టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్‌లో ఏఐ ఆధారిత పర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు. కార్పొరేట్‌కు దీటుగాఏఐ, పర్ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్రక్తం ఎందుకు గడ్డ కట్టదుపర్ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతిగణితంలో అన్ని పద్ధతులుఏఐ టూల్‌తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ యాప్‌లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతిఉపయోగం తెలుసుకున్నాఏఐ పర్‌ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్‌ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్‌తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్‌ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి -
‘మాక్’తో మేల్కొలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది. ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. 2 వేల ర్యాంకుకూ సీటు రాలే..మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశారు. ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్‌సెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలిఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్‌సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు. మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్‌లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం..
ఎటపాక: కూటమి ప్రభుత్వంలో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం నానాటికీ నాసిరకంగా మారుతోంది. ఇటీవల మధ్యాహ్న భోజనంలో బొద్దింకలు, పురుగులు రాగా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం వికటించి 21మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరిగా ఉడకని భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 139 మంది చదువుకుంటున్నారు. మెనూ ప్రకారం శుక్రవారం మధ్యాహ్న భోజనంలో 122 మందికి పులిహోర, టమాట చట్నీ, కోడిగుడ్డు, చిక్కీ అందించారు. పులిహోర సరిగా ఉడకకపోవడంతో చాలమంది విద్యార్థులు తినకుండానే బయట పారబోశారు. కొద్ది సమయం తరువాత పులిహోర తిన్న విద్యార్థుల్లో కొందరికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన 21 మంది విద్యార్థులను పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. బాధితుల్లో మూడు, నాలుగు తరగతులకు చెందిన రామలక్ష్మి, ప్రేమిక, లోకేశ్‌కు వాంతులు కూడా అవుతుండటంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. కాసేపటికి వీరంతా కోలుకున్నారు. వంట కారి్మకుల నిర్లక్ష్యం కారణంగా తరచూ భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓ సరియం రాజులు పాఠశాలకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఎంఈఓను చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్ ఆదేశించారు. మరోవైపు.. అస్వస్థతకు గురైన విద్యార్థులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వంటòÙడ్డు లేకపోవడంతో వంట చేసే సమయంలో పురుగులు పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని.. రాజకీయాలకు తావులేకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. -
అయిననూ.. మీరు నాన్‌లోకల్!
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ ప్రవేశాల వేళ లోకల్, నాన్‌లోకల్ కోటా విభజన విద్యార్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. పదో తరగతి వరకు ఏపీలోనే చదివి.. తెలంగాణలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను నాన్‌లోకల్ (స్థానికేతరులు)గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసిన ఏపీ విద్యార్థులు ఈఏపీసెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా వారికి స్థానిక కోటా వర్తించడం లేదు. స్థానికేతర కోటా పొందడానికి వీలులేకుండా వారి భవిష్యత్‌తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది.ఏడాదంతా ఏం చేసినట్టు?భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ ప్రకారం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. దీనిద్వారా తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో ఉపాధి, విద్యలో సమాన అవకాశాలు కల్పించాలనేది దీని ఉద్దేశం. దీనినే 2014 రాష్ట్ర విభజన సమయంలోనూ మరో పదేళ్లపాటు కొనసాగించేలా రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం ఉస్మానియా, ఆంధ్ర(ఏయూ), శ్రీవెంకటేశ్వర (ఎస్వీయూ) రీజియన్ల వారీగా స్థానికతను (లోకల్ 85 శాతం, నాన్‌లోకల్ 15శాతం) ప్రామాణికంగా తీసుకుని సీట్లు భర్తీ చేసేవారు. గతేడాది జూన్ 2వ తేదీతో పదేళ్ల గడువు ముగిసింది. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం నాన్‌లోకల్ 15 శాతం సీట్లను ఇకపై ఏపీ విద్యార్థులకు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి.. ఈ ఏడాది ప్రవేశాలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో హడావుడిగా జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిపై ఎవరికీ అవగాహన కల్పించకపోవడం గమనార్హం.న్యాయస్థానంలో సవాల్?ఉన్నత విద్యాశాఖ స్థానికతను సవరిస్తూ ఇచ్చిన జీవోలు చట్టం ముందు నిలవలేవని, న్యాయస్థానంలో సవాల్ చేస్తే.. పాత విధానాన్ని అమలు చేసేలా తీర్పు వస్తుందని.. దీనివల్ల తెలంగాణలో చదివినప్పటికీ ఎటువంటి చిక్కులు లేకుండానే ఏపీలో నాన్‌లోకల్ కోటా వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. స్థానికత అంశం ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు వర్తిస్తుంది.కానీ, ఒక్క ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు సంబంధించి మాత్రమే స్థానికతను మార్పుచేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పదేళ్లపాటు ఏపీలో నివసిస్తున్నట్టు చూపిస్తే స్థానికేతర కోటాలో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ప్రభుత్వం చెబుతోంది. కానీ,్థ తల్లిదండ్రులకు నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుంటే.. సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రుల స్టడీ సర్టిఫికెట్స్ ఏపీలో ఉంటే కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ అధికారులు చెబుతున్నారు. చదువు లేని తల్లిదండ్రులున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఈఏపీ సెట్ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
కంప్యూటర్ కోర్సుల వైపే..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలిదశ కౌన్సెలింగ్ ముగింపు దశకు చేరుకుంది. వెబ్ ఆప్షన్లు గురువారంతో ముగియగా ఈ నెల 13న మాక్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి మరో రెండు రోజుల గడువు లభించనుంది. ఈ నెల 18న తొలి దశ సీట్ల భర్తీ ఉంటుంది. ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య లక్ష దాటింది. దాదాపు 40 వేల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 78 శాతం మంది కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్‌గా పెట్టుకున్నారు. ఇందులోనూ ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ బ్రాంచీలకు ప్రాధాన్యమిచ్చారు. సివిల్, మెకానికల్, ఈసీసీ, ఈఈఈ, సీఈసీ వంటి కోర్సుల్లో మెజారిటీ విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా సీఎస్సీనే ఎంపిక చేసుకున్నారు. మిగతా కోర్ గ్రూపులకు పదవ ప్రాధాన్యతనిచ్చారు. ఓపెన్ కేటగిరీకి 10 వేల లోపే.. ప్రాధాన్యత క్రమాన్ని పరిశీలిస్తే కంప్యూటర్ కోర్సుల్లో పోటీ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 171 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. వాటి పరిధిలో కన్వీనర్ కోటా సీట్లు 76,795 ఉండగా అందులో 68 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్, ఐటీ కోర్సులే ఉన్నాయి. తొలి దశలో 500 ర్యాంకు వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు. వెయ్యి ర్యాంకు దాకా విద్యార్థులు సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సులతోపాటు ఇతర బ్రాంచీలకు ఆప్షన్లు ఇచ్చారు. వాళ్లంతా జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీలను ఎంచుకున్నారు. 2 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–10 కాలేజీలకు పోటీపడగా 5 వేల లోపు ర్యాంకు విద్యార్థులు టాప్–20 కాలేజీలకు ప్రాధాన్యమిచ్చారు. 10 వేల పైన ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలను, అన్ని బ్రాంచీలను ఆప్షన్లుగా పెట్టుకున్నారు. అయితే వారిలో 70 శాతం మంది కంప్యూటర్ కోర్సులకే తొలి ప్రాధాన్యమిచ్చారు. ఈసారి నాన్–లోకల్ కోటా ఎత్తేయడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. టాప్–10 కాలేజీల్లో జనరల్ కేటగిరీలో సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో 4 వేల లోపు ర్యాంకు వరకు సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర కాలేజీల్లో 10 వేలలోపు ర్యాంకు వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు. ఫీజులపై రగడ.. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఖరారైన ఫీజులను నిలిపేయడం, పాత ఫీజులనే అమలు చేయాలనే నిర్ణయాన్ని సీబీఐటీ కాలేజీ న్యాయస్థానంలో సవాల్ చేసింది. కాలేజీకి సానుకూలంగా కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై శుక్రవారం విచారించే వీలుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇతర కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు చేపడతారా లేక వాయిదా వేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. సాంకేతిక విద్యా విభాగం అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెబుతున్నారు. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
సర్కార్‌బడిలో ఐఐటీ పాఠాలు
సిరిసిల్ల కల్చరల్: డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న అధునాతన సాంకేతిక కోర్సులు సర్కార్ బడి విద్యార్థులకు కూడా చేరువ కానున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్ తన సాంకేతిక కోర్సుల విస్తరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పనుంది. స్థానిక గీతానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సాంకేతిక కోర్సుల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచి్చంది.ఆన్లైన్ విధానంలో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐఐటీ మద్రాస్ లేఖ రాసింది. స్కూల్ కనెక్ట్‌లో భాగంగా ఐఐటీ మద్రాస్ సిరిసిల్లలోని రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో భాగస్వామ్యమైంది. ఈ–మెయిల్ ద్వారా ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా శివనగర్, గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకుంది. ఇవీ కోర్సులు.. డేటా సైన్స్ అండ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్, బయోలాజికల్ సిస్టమ్స్, మేథ్స్ అన్ప్లగ్డ్ గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మేథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, హ్యుమానిటీస్ వంటి పది కోర్సులను రెండు నెలలపాటు బోధిస్తారు. ముందుగానే చిత్రీకరించిన వీడియోలను ప్రతి సోమవారం పోర్టల్‌లో ఉంచుతారు. ఐఐటీ ప్రొఫెసర్లతో ప్రతి శనివారం ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఫలితంగా ఆయా కోర్సుల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటారు.విద్యార్థులకు విస్తృత ప్రయోజనాలు ఐఐటీ మద్రాస్‌తో అనుసంధానానికి ఎంపికవడం వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుంది. అత్యాధునిక కోర్సుల మౌలికాంశాలపై శిక్షణ పిల్లల కెరీర్ నిర్మాణానికి ఉపకరిస్తుంది. డేటా సైన్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్తతరం సాంకేతికతల్లో సర్కార్ బడి పిల్లలు సత్తా చాటుతారు. – చకినాల శ్రీనివాస్, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపేద బిడ్డలకు టెక్నాలజీ చేరువవుతుంది ప్రభుత్వ బడిలో చదివే పేద విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు ఈ స్కూల్ కనెక్ట్ ఉపయోగపడుతుంది. ఐఐటీ మద్రాస్ తరగతులతోపాటు అక్కడి ప్రొఫెసర్లతో నేరుగా సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించడం విద్యార్థులకు వరంగా భావించాలి. ఇంజినీరింగ్ కోర్సుల్లో మాత్రమే లభ్యమయ్యే అంశాలను పాఠశాల స్థాయిలోనే నేర్చుకునే అరుదైన అవకాశం ఇది. – లోకిని శారద, హెచ్ఎం, గీతానగర్ జెడ్పీ హైస్కూల్ -
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలన్నారు.. ఏమైంది’
సాక్షి,కాకినాడ జిల్లా: ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు..’ ఏపీలో ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్లి మరీ మహిళలు, పిల్లలందరికీ ఈ వాగ్ధానమిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లు మాట్లాడారు. యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా.. ‘‘మీకు పద్దెనిమిది వేలు’’ అని, వలంటీర్ల దగ్గరకు వెళ్లి ‘‘మీకు నెలకు పదివేలు ఖాయం’’ అంటూ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి నేతలకు చెప్పిన మాటలకు చేసే చేతలకు అసలు పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా, హంసవరం జడ్పీ,మోడల్ స్కూల్స్‌లో మెగా పేరెంట్స్ సమావేశంలో రచ్చ జరిగింది. విద్యార్ధుల తల్లిదండ్రుల తరపున తల్లికి వందనంపై సర్పంచ్ మేరి అధికారులను ప్రశ్నించారు. చాలా మందికి తల్లికి వందనం రూ.8వేలే అందినట్లు చెప్పారు.తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. దీంతో మేరీ మాట్లాడుతుండగా..అధికారులు మైక్ కట్ చేశారు. కంగుతిన్న టీడీపీ నేతలు ప్రభుత్వం పరువుపోతుందంటూ మేరి చేతిలో మైకును లాక్కున్నారు. -
Andhra Pradesh: సర్కారు బడికి బైబై!
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్రోల్మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం. 2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్‌లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఏడాదిలో తారుమారు..బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. బడుల విలీనంతో...మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది. ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్‌కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు. నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు. 16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు! రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది. ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు. చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది. ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి. దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు. -
చంద్రబాబు పై అదిరిపోయే ముసలి కొంగ కథ
-
కొలిక్కిరాని పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్ గందరగోళం ఇంకా కొనసాగుతోంది. వెబ్సైట్ నుంచి తుడిచిపెట్టుకుపోయిన డేటాను రికవరీ చేసేందుకు సాంకేతిక విద్యా విభాగం అష్టకష్టాలు పడుతోంది. ఏం జరుగుతోందనేది మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. సీట్ల కేటాయింపు ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. వచ్చేవారం దీనిపై స్పష్టత రావచ్చని సంకేతాలిస్తున్నారు. ఈ గందరగోళంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకునేందుకు ఆదివారం కొంతమంది విద్యార్థులు పాలిసెట్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమతి లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై వివరాలు సేకరిస్తోంది. నిఘా వర్గాలు కూడా అసలేం జరిగిందని వాకబు చేస్తున్నాయి. పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీన చేపట్టాల్సి ఉంది. ఈలోగా పాలిసెట్ వెబ్ ఆప్షన్ల డేటా మొత్తం ఎరైజ్ అయిన విషయం బయటకు పొక్కింది. దాదాపు 22 వేల మంది విద్యార్థులు పాలిటెక్నిక్ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పదేపదే ఎర్రర్స్ డేటా రికవరీ కోసం సాంకేతిక విద్యా విభాగం శనివారం రాత్రి నుంచి పరుగులు పెడుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులను కొన్నాళ్లు ఆఫీసుకు రావద్దని ఆదేశించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సాఫ్ట్వేర్ పొరపాట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. డేటాను బ్యాకప్ ద్వారా రికవరీ చేసినప్పటికీ, ఆప్షన్ల విషయంలో సెకన్లలోనే డేటా స్క్రీన్ మీది నుంచి మాయమవుతున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు సర్వర్లు, హార్డ్ డిస్‌్కలను ఫార్మాట్ చేస్తారు. గుడ్ గవర్నెన్స్ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రాథమిక హార్డ్ డిస్్కల్లో కొన్ని రకాల బగ్స్ ఏర్పడినట్టు తెలిసింది. క్యాంపు కార్యాలయంలోని కంప్యూటర్స్‌లో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్‌లు వాడితే ఇలాంటి బగ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. లేదా ఆప్షన్ల డేటాను నెట్వర్క్ ద్వారా ఇతరులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నా సమస్య రావచ్చని తెలిపారు. ఇలా చేయగలిగే అవకావం కేవలం క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికే ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అప్షన్లు తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయా? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా ఓ కొలిక్కి రావాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు. సీట్ల కేటాయింపు వచ్చేవారం చేపడతామని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. రంగంలోకి నిఘా వర్గాలు ప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోవడంతో ప్రభుత్వ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. దీనిపై ప్రభుత్వం నిఘా వర్గాల సమాచారం కోరినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ వర్గాలు రాత్రి నుంచి సాంకేతిక విద్య వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారాన్ని ఆదివారం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. మరోవైపు సీట్ల కేటాయింపు ఆలస్యం కావడం, దీనిపై సరైన వివరణ లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. పాలిసెట్ క్యాంపు కార్యాలయం ఉండే సాంకేతిక విద్యా విభాగానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు అవరసమని ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో సమీప పోలీసుస్టేషన్లతో పాటు, స్పెషల్ బ్రాంచీతో సమన్వయం చేసుకోవాలని అధికారిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. క్యాంపు అధికారులు ఏం చెబుతున్నారు? పాలిసెట్ ఫీజుల వ్యవహారమే సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని అధికారులు అంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులు పెరిగాయి. రూ.15 వేల నుంచి రూ.39 వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.3,800 మాత్రమే ఫీజు వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.15 వేలు ఇస్తుంది. కానీ, మిగిలిన రూ.24 వేలు విద్యార్థులు చెల్లించాలా? ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందా? అనే విషయంలో స్పష్టత రాలేదని చెబుతున్నారు. దీనికోసమే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం తెలియదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. -
పాలిసెట్ డేటా ఎరేజ్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్య విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకూ ప్రయత్నించినా అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. కిందిస్థాయి సిబ్బంది కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్‌వేర్‌లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్సైట్లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దంటూ వారు వేడుకున్నారు. దీన్నిబట్టి సరిదిద్దలేని తప్పులేవో సాంకేతిక విద్య విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీనే ఉంటుందని కౌన్సెలింగ్ షెడ్యూల్లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రివరకూ ప్రకటించలేదు. కౌన్సెలింగ్ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని ఒకసారి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత రావాల్సి ఉందని మరోసారి బదులిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22 వేల మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రివరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వేల మంది విద్యార్థుల డేటా తారుమారైనట్టు తెలిసింది. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్టు సమాచారం. ఇంజనీరింగ్ కథేంటి? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఆదివారం నుంచి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు కాలేజీలు, సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూహెచ్ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలన్నీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. కానీ, శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవ్వకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా? షెడ్యూల్‌ను అనుసరిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్య ఉన్నతాధికారి, ఎప్‌సెట్ క్యాంప్ అధికారి, జేఎన్టీయూహెచ్ రిజి్రస్టార్ శనివారం ఉదయం 11 గంటల నుంచే విద్యాశాఖ కార్యదర్శి వద్ద సమావేశమయ్యారు. పాలిసెట్ డేటా గందరగోళం అవ్వడంపై కొంత సీరియస్‌గానే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై గంటల తరబడి చర్చించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత శనివారం రాత్రి ముఖ్యమంత్రి నివాసానికి అధికారులు వెళ్లి చాలా సమయం చర్చించడంతో అసలేం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది. -
హైస్కూల్లో విద్యార్థులకు పురుగుల బియ్యం
-
20 మంది విద్యార్థులుంటే కొత్తగా పాఠశాల
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రామాలు, పట్టణాల్లోని శివారు కాలనీల్లో 20 మంది విద్యార్థులున్నచోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇటీవల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్ అన్ని జిల్లాల డీఈవోలు, మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు.విద్యార్థులుండి పాఠశాలు లేనిచోట వెంటనే ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 359, గ్రామీణ ప్రాంతాల్లో 212 పాఠశాలలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు. కొన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు పంపాలని సూచించారు. -
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం నుంచి మొదలవుతుంది. విద్యార్థులకు ఇదే కీలకం. ఆప్షన్ల కోసం లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బ్రాంచీ, కాలేజీని ఎంపిక చేసుకునేది ఇప్పుడే. కౌన్సెలింగ్ ప్రక్రియ గత నెల 28 నుంచి మొదలైంది. తొలి దశ కౌన్సెలింగ్ కోసం 7వ తేదీ వరకు రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుని, ధృవపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. దీనికి 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం వరకు 92,013 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 55,120 మందికి సర్టీఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చే నాటికి దాదాపు 2 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది.ఇంకా తేలని కాలేజీలు, సీట్ల లెక్క వెబ్ ఆప్షన్ల సమయంలో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అన్ని కాలేజీలు, వాటిల్లో బ్రాంచీలు, సీట్ల వివరాలు ఆన్లైన్లో ఉంచాలి. కానీ, ఇప్పటివరకు జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) నుంచి సాంకేతిక విద్య విభాగానికి అఫిలియేషన్ వివరాలు అందలేదు. దీంతో సీట్ల సంఖ్యపై స్పష్టత కొరవడింది. జేఎన్టీయూహెచ్ పరిధిలో 139 అనుబంధ గుర్తింపు కాలేజీలున్నాయి. ఈ ఏడాది ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ సంస్థ డీమ్డ్ హోదా పొందింది. దీని పరిధిలోని కాలేజీలు కౌన్సెలింగ్‌లో ఉండే అవకాశం లేదు. మరో రెండు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేశాయి.రాష్ట్రవ్యాప్తంగా 156 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు చెందిన కాలేజీలు 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం కొత్తగా పాలమూరు, శాతవాహన, కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. దీంతో 176 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సెలింగ్ జాబితాలో ఉంటాయి. వీటి పరిధిలో 89,970 సీట్లు అందుబాటులో ఉండే వీలుంది. శనివారం సాయంత్రానికి గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలు సాంకేతిక విద్య విభాగానికి పంపుతామని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. విద్యార్థుల అవగాహనకు మాక్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు ఈసారి కొత్తగా మాక్ కౌన్సెలింగ్ చేపడుతున్నారు. ఈ నెల 13వ తేదీన విద్యార్థులకు సీటు, బ్రాంచీ వివరాలతో మెసేజ్ వస్తుంది. దీన్నిబట్టి కాలేజీలు, బ్రాంచీలను ఈ నెల 15వ తేదీ వరకు మార్చుకునే వీలుంది. 15న సీట్ల కేటాయిస్తారు. కొత్త సీట్లు లేనట్టే డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గింపు.. కంప్యూటర్స్, ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లు పెంపు కోసం దాదాపు 100 కాలేజీలు దరఖాస్తు చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. సర్కారు ఓకే చెప్పి ఉంటే దాదాపు 20 వేల సీట్లు కంప్యూటర్ కోర్సుల్లో పెరిగేవి. ప్రభుత్వం ఒప్పుకోకపోవటంతో ఈసారి సీట్లు పెరిగే వీలు లేదు. మరోవైపు పాత ఫీజులనే వసూలు చేయా లని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపైనా స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంజనీరింగ్ అయిపోయే వరకు ఇదే ఫీజు ఉంటుందా? ఒక వేళ ఫీజు పెంచితే కొత్త ఫీజు మధ్యలో వసూలు చేస్తారా? అనే స్పష్టత కోరుతున్నారు. అంతా సిద్ధం చేశాం వెబ్ ఆప్షన్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. సాంకేతిక సమస్యలొచ్చినా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చే నాటికి అఫిలియేషన్ కాలేజీలు, సీట్ల వివరాలు అందుబాటులోకి వస్తాయి. – శ్రీనివాస్, ఎప్‌సెట్ క్యాంప్ ఆఫీసర్జాబితా రెడీ చేశాం అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాం. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అన్నీ పరిశీలించి గుర్తింపు ఇచ్చాం. తుది జాబితాను సాంకేతిక విద్యకు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. సీట్ల పెంపు ప్రతిపాదనేమీ లేదు. – డాక్టర్ కె విజయకుమార్ రెడ్డి, జేఎన్టీయూహెచ్ రెక్టార్ -
హలో మేడం.. ఈ ఫైలింగ్ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు తికమక పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో సవాలక్ష సందేహాలొస్తున్నాయి. దీంతో ఎప్‌సెట్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇంజనీరింగ్‌తోపాటు పాలిసెట్, ఇతర సాంకేతిక కోర్సుల కోసం సాంకేతిక విద్యామండలి ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటే ఈ–మెయిల్స్ కూడా స్వీకరిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయంలో అనుమానాలు నివృత్తి చేసే ఏర్పాట్లూ చేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకూ విరామం లేకుండా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. రోజుకు కనీసం ఆరువందలకు తగ్గకుండా ఫోన్ కాల్స్, వందల కొద్దీ ఈ–మెయిల్స్ అందుతున్నాయి. క్యాంపు కార్యాలయానికీ రోజుకు వంద మంది వరకూ వస్తున్నారు. వీరందరికీ సమా ధానం చెప్పేందుకు ప్రత్యేక సిబ్బందిని నియ మించారు. ఫోన్‌కాల్స్, మెసేజ్, మెయి ల్స్‌కు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశాలపై వారికి ముందే శిక్షణ ఇచ్చారు. ఎన్నో అనుమానాలుటోల్ ఫ్రీ మొదలు పెట్టిన తొలినాళ్లలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయని క్యాంప్ కార్యాలయ అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడులైన తర్వాత స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్‌కు సంబంధించిన విధివిధానాలపై ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమంది అప్లికేషన్లు నింపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఏదైనా డేటా తప్పుగా ఇస్తే సరిచేస్తారా అని ముందే ప్రశ్నిస్తున్నారు. కుల ధ్రువీకరణ, ఆదాయ పత్రాలను ఎలా పొందాలని, ఎప్పుడు తీసుకున్నవి చెల్లుతాయని అడుగుతున్నారు. ప్రతీ దశలోనూ స్లాట్ బుక్ చేసుకోవాలా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎక్కడకు వెళ్లాలి? ఏఏ సరి్టఫికెట్లు తీసుకెళ్లాలని కొంతమంది అడుగుతున్నారు. స్లాట్ బుకింగ్, ఆప్షన్ల సమయంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఆప్షన్లు మొదలు కాకున్నా, ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని? ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్లాట్ బుకింగ్ కోసం ఏ గేట్ వే ద్వారా డబ్బులు చెల్లించాలని, మరికొంతమంది గేట్ వే ద్వారా చెల్లిస్తుంటే ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ క్యాంపు కార్యాలయం సిబ్బంది ఓపికగా సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచీ ఫోన్లు వస్తున్నాయి. ఈ ఏడాది నుంచి నాన్–లోకల్ తీసివేయడంతో తాము ఏ కేటగిరీ కింద సీటు పొందొచ్చని ప్రశ్నిస్తున్నారు. కాల్ సెంటర్‌కు మంచి స్పందన వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు వెళ్లే విద్యార్థి ప్రతీ సందేహాన్ని నివృత్తి చేసుకుంటున్నారు. ఇది మంచి స్పందనే. సాంకేతిక విద్య వెబ్‌లోకి వెళ్తే ఎప్‌సెట్ కౌన్సెలింగ్ వివరాలు తెలుస్తాయి. అంతేకాదు, గత ఏడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు వచ్చాయనేది అందుబాటులో ఉంచాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ టోల్ ప్రీ నంబరులో సిబ్బంది అందుబాటులో ఉంటారు. 7660009768– 79 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. – శ్రీనివాస్, ఎప్‌సెట్ క్యాంప్ ఆఫీసర్ ప్రతీ సందేహానికి సమాధానం విద్యార్థులు ఫోన్లో కౌన్సెలింగ్‌కు సంబంధించిన అనేక సందేహాలు అడుగుతున్నారు. మేం ఇచ్చే సమాధానాల తర్వాత సంతృప్తి చెందుతున్నారు. కొన్నిసార్లు స్లాట్ బుకింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని నివృత్తి చేస్తున్నాం. తిరిగి లాగిన్ అయ్యేలా చేస్తున్నాం. – శ్యామల, టోల్ ఫ్రీ నంబర్ సిబ్బంది మెయిల్స్ అన్నీ పరిశీలిస్తాం రోజూ వందల్లో మెయిల్స్ వస్తున్నాయి. విద్యార్థులు అడిగే ప్రశ్నల్లో కొన్నింటికీ ఎప్‌సెట్ వెబ్సైట్లో సమాచారం ఉంటుంది. ఆ లింక్‌ను వారికి పంపుతున్నాం. సాంకేతిక సమస్యలు ఉంటే ఆయా విభాగాలకు పంపి, తక్షణమే పరిష్కరించేలా చేస్తున్నాం. – నవ్య, ఈ–మెయిల్స్ పరిశీలించే ఉద్యోగి -
విద్యార్థులకు విషపు అన్నమా! ఉప్మాలో జెర్రి... భోజనంలో బొద్దింక
నాడు జగన్ పాలనలో బడి పిల్లలకు ‘గోరు ముద్ద’లతో పౌష్టికాహారం అందించారు. నేడు కూటమి పాలనలో ‘పురుగుల’ అన్నం పెడుతున్నారు. ఒకటో తారీకున పాయకారావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల వసతి గృహంలో బొద్దింక భోజనాన్ని సాక్షాత్తు హోం మంత్రి అనితే రుచి చూశారు. మూడో తేదీన ఇలాంటిదే మరో సంఘటన. తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులకు పెట్టిన ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. 64 మంది తినగా, ముగ్గురు ఆస్పత్రిపాలయ్యారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో తీసుకొస్తానంటున్న విప్లవాత్మక మార్పులు ఇవేనా? అని విద్యావంతులు ప్రశ్నిస్తున్నారు.శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులు తినే ఉప్మాలో జెర్రి ప్రత్యక్షమైంది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న భోజన వసతి ఏమేర ఉందో తేటతెల్లమవుతోంది. అసలేం జరిగిందంటే... తిరుపతి జిల్లా తొట్టంబేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో గురువారం ఉదయం ప్రార్థన జరుగుతుండగా ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారికి సపర్యలు చేసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉదయం తిన్న ఉప్మాలో జెర్రి వచ్చిందని విద్యార్థినులు వైద్యులకు తెలియజేశారు.విద్యార్థుల కథనం మేరకు.. తెలుగుగంగ కాలనీలోని బీసీ కళాశాల వసతి గృహంలో 84 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం ఉదయం 64 మంది విద్యార్థులకు ఉప్మాను అల్పాహారంగా అందించారు. యోష్ణ అనే విద్యార్థిని తనకు పెట్టిన ఉప్మాలో జెర్రి వచ్చిందని తోటి విద్యార్థులకు చూపించింది. దాంతో విద్యార్థులు ఎవరు ఉప్మా తినకుండా అక్కడ పడేసి కళాశాలకు బయలు దేరి వెళ్లిపోయారు.అయితే ప్రార్థన సమయంలో ఎం బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న యోష్ణ కళ్లు తిరిగి కిందపడిపోయింది. కడుపు నొప్పితో వాంతులు అయ్యేలా ఉన్నాయని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మునికుమారి, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న జ్యోత్స్న అధ్యాపకులకు చెప్పారు. అధ్యాపకులు వెంటనే వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో వారు కోలుకున్నారు. -
బాలికల విద్య భ్రష్టు!
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్‌లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్ జగన్‌పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్‌ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్‌లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్‌ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్‌లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్‌లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్‌లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్‌లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి, వారు మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జుంబా శిక్షణను అందిస్తోంది. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శిక్షణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేరళలోని పాఠశాలల్లో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జంబాలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ కేరళ సున్నీ యువజన సంఘం (ఎస్వైఎస్) రాష్ట్ర కార్యదర్శి అబ్దుస్సమద్ పూక్కొట్టూర్ ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి టికె అష్రఫ్ కూడా దీనిని వ్యతిరేకించారు. బాలురు, బాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గెంతులు వేయడం ఏమిటి? ఇది నృత్యం చేసే సంస్కృతి కాదని, ఇటువంటి పాఠశాలలో తన కుమారుడిని తాను జాయిన్ చేయనని అన్నారు. ఉపాధ్యాయునిగా తాను ఈ తరహా నృత్యాన్ని పాఠశాలలో అమలు చేయనివ్వనని, దీనికి ప్రతిగా ఏ చర్య తీసుకున్నా, తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ముస్లిం సంఘాల నుండి ఎదురవుతున్న విమర్శల మధ్య కేరళ విద్యా శాఖ.. జుంబా నృత్యం అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ -
Bangui: స్కూల్లో తొక్కిసలాట.. 26 మంది విద్యార్థులు మృతి
బంగుయ్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బంగుయ్‌లోని బార్తెలెమీ బోగాండా హై స్కూల్లో గురువారం ( జూన్ 26)న ఘోర ప్రమాదం జరిగింది.విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే సమయంలో ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా విద్యార్థులు భయంతో పరుగులు తీయగా, తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 260 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో 16 మంది బాలికలు ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 5,000 మంది విద్యార్థులు పరీక్షల కోసం అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. గాయపడిన విద్యార్థుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఆ దేశ విద్యా చరిత్రలో ఒక విషాదకరమైన సంఘటనగా నిలిచింది.#Breaking Une #bousculade suite à une explosion de transformateur fait une dizaine de morts cet après-midi au lycée Barthélémy #Boganda de #Bangui en #Centrafrique 🇨🇫. De nombreux blessés ont été transportés vers des hopitaux proches. pic.twitter.com/5loUFDnh5n— KOUAM JOEL HONORE (@honore123) June 25, 2025 -
విద్యార్థులు మెచ్చిన ఆహారం
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్‌ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో ఈ ఆఫర్‌ను విద్యార్థులు ఉపయోగించుకున్న తీరుపై, తమ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. స్విగ్గీ లిమిటెడ్ వెల్లడించిన ప్రకారం.. వెరైటీ వంటకాలకు ఓటువిద్యార్థులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీ, బర్గర్స్, పనీర్ టిక్కా క్యూసాడిల్లా, స్పాగెట్టి, అగ్లియో ఒలియో వంటి ఇటాలియన్, అరబిక్, మెడిటేరియన్ ఫుడ్, కింగ్ ఫిష్ తవా ఫ్రై, చికెన్ కాషాభునా వంటి సీఫుడ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఆరోగ్య స్పృహ కలిగిన పలువురు విద్యార్థులు, ఆరోగ్యకరమైన పాత్రలు, హోమ్‌స్టైల్ భోజనాల కోసం ది గుడ్ బౌల్ లంచ్బాక్స్లతో పాటు వీగన్ స్టైల్ వంటకాలను కోరుకున్నారు. బ్రాండెడ్ ఫుడ్ కోసం మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, సబ్వే, పిజ్జాహట్ నుంచి ఎంచుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి నగరాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు అత్యధికంగా నాగ్‌పూర్ స్టేషన్లో ఫుడ్ డెలివరీ చేయించుకున్నారు. రైళ్లలో ఆహారం కోసం దాదాపు 70శాతం ఆర్డర్లతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ఫుడ్ ఆన్ ట్రైన్ వినియోగించుకుని జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బీహెచ్‌యూ వారణాసి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. రైళ్లలో ఆర్డర్ చేసేటప్పుడు విద్యార్థులు సమయపాలన పాటించలేదు. ఉదయం 7 గంటలకు అల్పాహారం నుంచి రాత్రి 11 గంటలకు లేట్‌నైట్ స్నాక్స్, డెజర్ట్ దాకా విద్యార్థులు రొటీన్‌కు భిన్నంగా ఆర్డర్లు చేశారు. -
24 మంది విద్యార్థినులతో ‘అనుచితం’.. ఉపాధ్యాయుడు అరెస్ట్
సిర్మౌర్: పవిత్రమైన ఉపాధ్యాయు వృత్తిలో ఉంటూ అనైతిక పనులకు పాల్పడుతున్నవారిని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇదే కోవలోకి వచ్చే ఉదంతమొకటి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పాఠశాలలో 24 మంది బాలికలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన ఉదంతం హిమాచల్‌లోని సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక వేధింపుల కమిటీ సమావేశంలో విద్యార్థులు పాఠశాలలోని గణిత ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టంతో సహా వివిధ విభాగాల కింద కేసు నమోదు చేశారు.ఆ ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సంవాద్ కార్యక్రమం సందర్భంగా, ఎనిమిది నుంచి పదవ తరగతి వరకూ చదువుకుంటున్న 24 మంది విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయుని వేధింపులపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఉపాధ్యాయుడు తమను అనుచితంగా తాకారంటూ విద్యార్థులు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. దీంతో ప్రిన్సిపాల్ వారి తల్లిదండ్రులను పిలిపించి, పిల్లలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి అడగగా, వారు తమకు తెలియదని చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో పాటు ఆ ఉపాధ్యాయునికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు నిందితుడైన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వాదనలను రికార్డ్ చేసి, వారంలోపు తన కార్యాలయానికి నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. సిర్మౌర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ యోగేష్ రోల్టా మాట్లాడుతూ నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ ఖాతాలోకి కాల్పుల విరమణ క్రెడిట్? -
హోరెత్తిన ‘యువత పోరు’
సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ అంటూ ఉత్తుత్తి హామీతో... నిరుద్యోగ భృతి పేరిట నయవంచనకు పాల్పడిన కూటమి ప్రభుత్వంపై యువత, విద్యార్థులు కన్నెర్రజేశారు. అరొకరగా నిధులు విడుదల చేస్తూ.. విద్యా దీవెన, వసతి దీవెనపై కపట ప్రేమ చూపుతున్న సర్కారు తీరును ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీశారు. మాట తప్పి... వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. పోలీసుల అణచివేత చర్యలను ఎదుర్కొంటూ ముందుకు కదిలారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు ఏడాదైనా నెరవేర్చలేదని నిప్పులు చెరిగారు. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అప్పటివరకు యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అంటూ కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రచారానికే పరిమితమైంది. విద్యా దీవెన కింద రూ.4,200 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు... మొత్తం రూ.6,400 కోట్లకు గాను, రూ.750 కోట్లు విదిలించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెనలను క్రమంతప్పకుండా ఠంఛనుగా అందించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. 2024 జనవరి వరకు నిధులను క్లియర్ చేసింది. జనవరి నుంచి మార్చి వరకు త్రైమాసికం బిల్లులు ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి మేలో విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు క్వార్టర్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ సోమవారం ‘యువత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు కదంతొక్కారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు వందలాది మంది ప్లకార్డులు చేతబట్టి ‘బాబు వచ్చాడు... వాలంటీర్లను రోడ్డుపై నిలబెట్టాడు, ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు తొలగించాడు.. నిరుద్యోగ భృతి ఎప్పుడు?.. గ్రూప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇంకెప్పుడు... ప్రతి నిరుద్యోగికి రూ.36 వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలి.. ఫీజులు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం... వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి’ అని నినదించారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. వలంటీర్లను రోడ్డున పడేయడంతో పాటు ఇంటింటికి నిత్యావసర సరకులు అందిస్తున్న రేషన్ వాహనాలను నిలిపివేసి ఆపరేటర్ల జీవనోపాధిపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీ, యువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన యువతతో కార్యక్రమం విజయవంతమైంది. కాకినాడలో ‘యువత పోరు’ ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు ⇒ విజయవాడ ధర్నాచౌక్‌లో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు చేపట్టారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ధర్నాచౌక్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు (కాళీ) అధ్యక్షతన జరిగిన యువత పోరులో మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), సింహాద్రి వికాస్, పలువురు అనుబంధ విభాగాల నాయకులు ప్రసంగించారు.ఆంక్షల నడుమ..⇒ ప్రకాశం జిల్లాలో యువత పోరుపై అడుగడుగునా పోలీసులు అంక్షలు విధించారు. కలెక్టరేట్ వద్ద ఉదయం నుంచే భారీగా బలగాలను దించారు. అంబేడ్కర్ భవనానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలూ రాకపోకలు సాగించకుండా కట్టడి చేశారు. అయినా జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంబేడ్కర్ భవనం వద్ద జరిగిన సభలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు ⇒ రాష్ట్రంలో బెదిరింపులు, భయపెట్టడం, అక్రమ కేసులు, నెలల తరబడి జైళ్లలో ఉంచేలా కక్షసాధింపు రాజకీయాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ధ్వజమెత్తారు. ఏలూరులో యువత పోరులో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. రిక్షా తొక్కుతూ..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో యువతీ, యువకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై రిక్షా తొక్కుతూ పరిస్థితిని చాటి చెప్పారు. కలెక్టరేట్ వరకు ప్రభుత్వ తీరుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ తీశారు. ‘తూర్పు’న కదం తొక్కిన యువతరాజమహేంద్రవరంలో కలెక్టరేట్‌కు వెళ్తున్న యువత పోరు భారీ ర్యాలీని బొమ్మూరు సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి, యువజన సంఘం నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురంలో పోలీసులను దాటి మరీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైఎస్సార్సీపీ యువత పోరుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పారు. కలెక్టరేట్‌కు బయలుదేరిన ఆందోళనకారులను పోలీసులు మూడుసార్లు అడ్డుకున్నారు. కలెక్టరేట్ సమీపాన బారికేడ్లు, రోప్ పార్టీలతో నిలువరించారు. మహిళా నేతలు, కార్యకర్తలను సైతం పోలీసులు వెనక్కు నెట్టేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులను నెట్టుకుని ముందుకు వచ్చారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు భారీగా తరలివచ్చిన యువత ⇒ కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం, జెడ్పీ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు, విద్యార్థులు మూకుమ్మడిగా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, మహావీర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ చేరింది. అనంతరం డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ⇒ నంద్యాలలో యువత పోరుకు నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ⇒ తిరుపతిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, నగర అధ్యక్షుడు దినేష్‌రాయల్, విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి, చెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా యువత, విద్యార్థులు యువత పోరులో పాల్గొన్నారు.శ్రీకాకుళంలో జడివానలోనూ...⇒ శ్రీకాకుళంలో జడివానకు పార్టీ శ్రేణులు యువతతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో జిల్లా పరిషత్ ఏరియా దద్దరిల్లింది. జనమంతా వానలోనే ర్యాలీగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గరి నుంచి బయల్దేరారు. గంటకుపైగా నిరసన తెలిపారు. గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రం అందజేశారు. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓవైపు వర్షం, మరోవైపు పోలీసు ఆంక్షల వలయంలోనూ యువత పోరును విజయవంతం చేశారు. తమకు కావల్సింది యోగాంధ్ర కాదు.. ఉద్యోగాలంటూ నినదించారు. ⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో యువత పోరు హోరెత్తింది. వర్షానికి వెరవకుండా గర్జించింది. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా యువత తగ్గలేదు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టరేట్లు దద్దరిల్లాయి.⇒ పాడేరులో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో యువత వర్షం సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.పల్నాడులో లాఠీ ప్రతాపంపల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వందలాది విద్యార్థులు, యువత శాంతియుత ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ నమ్మక ద్రోహన్ని ప్రశ్నించేందుకు జిల్లా నలుమూలల నుంచి యువత, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనగా... వారిపై లాఠీలు ఝళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. తొలుత వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు బయల్దేరిన ర్యాలీని ఎస్పీ ఆఫీసు ఎదుట బారికేడ్లతో అడ్డుకున్నారు. నాయకులతో పాటు 50 మందిని మాత్రమే కలెక్టరేట్ వైపు అనుమతిస్తామని చెప్పారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు అంగీకరించడంతో బారికేడ్లను తెరిచారు. ఈ సమయంలో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బారికేడ్ల వద్ద ఉన్నవారిపై లాఠీలతో విరుచుకుపడడంతో యువత పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో కిందపడినవారి పైనా పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పి.గౌతమ్‌రెడ్డిలు దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.⇒ గుంటూరు జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చిన విద్యార్థులు, యువతను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవటంతో వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పడంతో పది మంది ముఖ్య నేతలను వినతిపత్రం అందజేసేందుకు అనుమతించారు. ⇒ బాపట్లలో భారీ నిరసనలతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. పోలీసులు ఆంక్షలు విధించినా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అక్కడే బైఠాయించారు. రథం బజారు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. -
విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం
సాక్షి, అమరావతి : పలు డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఆ కాలేజీల్లోని విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కాలేజీలు ఫీజు చెల్లించకుంటే, అందుకు విద్యార్థులు ఎందుకు మూల్యం చెల్లించుకోవాలని ప్రశ్నించింది. ‘ఫీజులు చెల్లించని కాలేజీలను ఉరి తియ్యండి. మేం ఎంతమాత్రం జోక్యం చేసుకోం.కానీ, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే మాత్రం చూస్తూ ఉరుకోం. మాకు విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. ఇంతకుమించి మాకు ఏదీ ముఖ్యంకాదు. ఫలితాలు వెల్లడించకుంటే అది విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరీక్ష ఫలితాలను వెల్లడించకుండా ఆపేస్తామంటే మాత్రం అంగీకరించే ప్రసక్తేలేదు. కాలేజీలు అఫిలియేషన్ ఫీజు చెల్లించకుంటే, అసలు ఈ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎందుకు అనుమతినిచ్చారు? చేరిన విద్యార్థులను మరో కాలేజీకి తరలించి ఉండాల్సింది.ఇవేవీ చేయకుండా విద్యార్థులను బాధ్యులుగా చేస్తూ వారి పరీక్ష ఫలితాలను నిలిపేయడం ఏంటి? మేం కాలేజీల వైపు లేం.. విద్యార్థుల పక్షానే ఉన్నాం. అసలు కోర్టుకొచి్చన డిగ్రీ కాలేజీలకు చెల్లించాలి్సన స్కాలర్‌షిప్పుల బకాయిలను ఇప్పటివరకు ఎంత మొత్తం చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? తదితర వివరాలను మా ముందుంచండి’.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాగార్జున యూనివర్సిటీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఆ కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాలి్సన అఫిలియేషన్ ఫీజు, పరీక్ష ఫీజులను చెల్లించలేదన్నారు. ఈ సమయంలో కాలేజీల తరఫు న్యాయవాది అనుపమాదేవి జోక్యం చేసుకుంటూ, పరీక్ష ఫీజులను చెల్లించామన్నారు. అఫిలియేషన్ ఫీజును మాత్రమే చెల్లించలేదని, కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. . న్యాయమూర్తి స్పందిస్తూ.. కాలేజీలు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో విద్యార్థుల పరీక్షల ఫలితాలను ఆపడానికి వీల్లేదన్నారు. బకాయిల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేశారు.ఫలితాల నిలుపుదలపై హైకోర్టుకు కాలేజీలు..తమ కాలేజీల్లో చదువుతూ 6వ సెమిస్టర్ పరీక్షలు రాసిన 2022–25 బ్యాచ్ విద్యార్థుల పరీక్ష ఫలితాలను నాగార్జున యూనివర్సిటీ వెల్లడించకుండా నిలిపేయడాన్ని సవాలుచేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్.. వర్సిటీ రిజిస్ట్రార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. -
యువతకు బాసటగా మరో పోరాటం
సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యువతకు బాసటగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. కృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ నిరుద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్ డెవలప్మెంట్తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు కాలేజీలకే ఫీజు రీయింబర్స్మెంట్ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్మెంట్ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ఏటా జ్యాబ్ క్యాలెండర్ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. 2.60 లక్షల మందిని వలంటీర్ల ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇంటివద్దకే రేషన్ బియ్యం, సరుకులు పంపిణీ చేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను రద్దు చేశారు. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడం ద్వారా వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు వంటి 20 వేల మందిని రోడ్డున పడేశారు. బెవరేజస్ కార్పొరేషన్లో పనిచేసే 15 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనూ తొలగించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను భారీ ఎత్తున తొలగించారు. ఏడాదిలోనే సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించారు. -
విశాఖలోని యోగా డేలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
-
పాపం పసివాళ్లు.. యోగా డేలో విద్యార్థుల ఆకలి కేకలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యోగా డే సందర్భంగా విద్యార్థులు అవస్థలు పడ్డారు. సమయానికి తిండిలేక ఆకలితో అలమటించారు. అర్ధరాత్రి పస్తులతోనే గిరిజన విద్యార్థులు పడుకున్నారు భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. గిరిజన విద్యార్థులను పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. యోగా కోసం తీసుకెళ్లి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.కాకినాడ జిల్లాలో కూడా యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆకలి బాధలు పడ్డారు. పిఠాపురం, సామర్లకోట ప్రభుత్వ పాఠశాలల్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నాసిరకం ఆహరం, అల్పాహారం సరఫరా చేశారు. జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం అన్నం, సాంబారు భోజనం సరఫరా చేశారు. కొందరు విద్యార్థులు భోజనం తినలేక ఆకలితో అలమటించారు.విద్యార్థులకు సరఫరా చేసిన ఆహారాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘం నేతలు, విద్యా కమిటీ సభ్యులు.. పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. నాసికరం ఆహారం సరఫరా చేసిన బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్ట్‌పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యోగాంధ్రలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం విశాఖలో అట్టహాసంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం, బస్సుల్లో నిద్రపోయారు. ప్రభుత్వం గిన్నిస్ రికార్డుపై పెట్టిన శ్రద్ధ.. చిన్నారులకు భోజనం, వసతి ఏర్పాట్లపై పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయడానికి అల్లూరి జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భోజనాల కోసం గలాటా.. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా అల్లూరి జిల్లా నుంచి 25 వేల మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖకు తరలించింది. శుక్రవారం తెల్లవారుజామునే అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో చిన్నారులను ఎక్కించి మధ్యాహ్నం 12 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేటు తీసుకోవడం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. తాగునీటి కోసం ఎండలో లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన యోగాసనాల కార్యక్రమం ఆలస్యమైంది. సాయంత్రం 4.45కు విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించారు. రాత్రి భోజనాలకూ అవే తిప్పలు.. బస్సుల్లో నిద్రపోయిన విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు గ్రౌండ్‌లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా, అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు ఎగబడ్డారు. ఈ సమయంలో గలాటా జరిగింది. కొంత సేపటికి మళ్లీ భోజనాలు తీసుకొచ్చి వారికి అందించారు. అనంతరం వారిలో కొంత మందిని విశాఖ వ్యాలీ, పెందుర్తి ప్రాంతంలోని కళ్యాణ మండపానికి తరలించారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లో, బస్సుల్లోనే నిద్రపోవాల్సి వచ్చింది. వీరందరినీ శనివారం వేకువజాము 4 గంటలకే సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించడం గమనార్హం. ప్రజాప్రతినిధులు, అధికారుల సేవల్లో జిల్లా యంత్రాంగం.. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు విశాఖకు వచ్చారు. అన్ని శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు 3రోజులు ముందుగానే నగరానికి చేరుకున్నారు. దీంతో జిల్లా అధికారులందరూ వారి సేవలోనే తరిస్తున్నారు. యోగాంధ్ర ఏర్పాట్లు, తరలించిన విద్యార్థుల పరిస్థితులను పట్టించుకునే దిక్కు లేదు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6.30 గంటల నుంచి 7.50 వరకు జరగనుంది.ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేవలం గంటలకు ముందు సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వలంటీర్లకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. యోగాంధ్ర కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఇతర విషయాలను వివరించేందుకు 2 వేల మందికి శుక్రవారం రాత్రి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు, మూడు రోజులకు ముందే శిక్షణ ఇవ్వాల్సి ఉండగా.. అధికారులందరూ కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సేవలో తరించడంతో ఈ కార్యక్రమంలో జాప్యం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
Au క్యాంపస్ లో ఆహార సౌకర్యాలు అస్సలు బాగోలేదు
-
మా స్కూల్ మాకే ఉంచాలి
జూపాడు బంగ్లా: ‘మా కాలనీలోని స్కూల్‌ను మాకే ఉంచాలి... మరో పాఠశాలలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు...’ అంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండ్లెం గ్రామ విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండ్లెం గ్రామ దళితకాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలను ఆ బడికి ఎలా పంపాలి? రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇరాన్లో ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్న వేళ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న విద్యార్థులను భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. తొలి దఫాలో ఈరోజు(గురువారం) ఉదయం 110 మంది విద్యార్తులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఢిల్లీ నుంచి తమ ప్రాంతానికి వెళ్లేందుకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అందించిన బస్సులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. The Chief Minister has taken note of the request of the students evacuated from Iran regarding the quality of buses arranged to transport them from Delhi to J&K. The Resident Commissioner has been tasked with coordinating with the JKRTC to ensure proper deluxe buses are arranged.— Office of Chief Minister, J&K (@CM_JnK) June 19, 2025Operation Sindhu brings people home.110 Indian students evacuated from Iran under #OperationSindhu have safely arrived in New Delhi on a special flight from Yerevan, Armenia. MoS @KVSinghMPGonda received them at the airport. Government of 🇮🇳 remains committed to the safety of… pic.twitter.com/GwhI5R26DE— Randhir Jaiswal (@MEAIndia) June 19, 2025దీనిపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం స్పందించింది. విద్యార్థులకు డీలక్స్ బస్సులు పంపేలా జమ్ముకశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఆదేశాలు జారీ చేశామని తెలిపింది. ఇరాన్‌లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన 110 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్బంగా ఆ విద్యార్థులలో ఒకరైన అలీ మీడియాతో మాట్లాడుతూ ఇది తమకు ఎంతో కష్టమైన ప్రయాణమని, టెహ్రాన్‌లో అధికంగా దాడులు జరిగాయన్నారు. భారత రాయబార కార్యాలయ అధికారులు తాము తొలుత అర్మేనియా సరిహద్దును దాటడానికి సహాయం చేశారని, అక్కడ తాము ఒక రోజు బస చేసిన తరువాత ఢిల్లీకి వచ్చామని తెలిపారు. కశ్మీర్ నివాసి షేక్ అఫ్సా మాట్లాడుతూ, తాము ఎంతగానో అలసిపోయామని, ఈ డొక్కు బస్సుల్లో తమ ఇళ్లకు వెళ్లడం ఎంతో కష్టమన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సమసిపోవాలని కోరుకుంటున్నామని, ఇవి తమ చదువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమకు త్వరలో ప్రాక్టికల్ తరగతులు ఉన్నాయని, తాము ఇరాన్ తిరిగి వెళ్లవలసి ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: ‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ కితాబు -
టెహ్రాన్‌లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం
టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న తరుణంలో టెహ్రాన్(ఇరాన్)లోని భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన తొలి రోజున టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 140 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిని వర్శిటీ నుంచి సురక్షితంగా వెళ్లిపోవాలని అక్కడి సీనియర్ అధికారులు విజ్ఞప్తి చేశారు.టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులు క్షణక్షణానికి దిగజారుతున్నాయని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో తమకు భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము కిటికీల నుండి బయటకు చూడగా, నల్లటి పొగ ఆవరించి ఉందన్నారు. ఆ తరువాత మరిన్ని పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని అన్నారు.తాము ఫైటర్ జెట్ల శబ్దం కూడా విన్నామని, ఆకాశం డ్రోన్లతో నిండిపోయిందని, శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు నిరంతరం శబ్దాలు వినిపించాయన్నారు. ఆ సమయంలో బ్లాక్అవుట్ కావడంతో డార్మిటరీ కింద కూర్చున్నామన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఆ సమయంలో తమకు సహకారం అందించారన్నారు. పేలుళ్లు జరిగిన వెంటనే తమ వైస్-డీన్ వచ్చి, ఏమీ జరగదని హామీ ఇచ్చారన్నారు. అయితే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం తమకు లేదన్నారు. భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, వీలైనంత త్వరగా టెహ్రాన్‌ను ఖాళీ చేయాలనుకుంటున్నట్లు వైద్య విద్యార్థులు చెప్పారు. గతంలో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో భారత విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారు గుర్తు చేశారు.ఇది కూడా చదవండి: టెహ్రాన్‌ను తక్షణం ఖాళీ చేయాలి: ట్రంప్ హెచ్చరిక -
ఇంటర్లో ఫెయిలై.. ముగ్గురి ఆత్మహత్య
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది. సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాటనీ సబ్జెక్ట్‌లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్‌పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఎంబీబీఎస్ కటాఫ్‌పై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు చర్చోపచర్చలకు దారితీశాయి. జాతీయ స్థాయి ర్యాంక్‌ల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు ఏ మేరకు వస్తాయన్న అంచనాలు వేసుకోవడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తలమునకలయ్యారు. ఈసారి రాష్ట్రం నుంచి 57,934 మంది పరీక్ష రాయగా 36,776 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో నీట్ రాసిన, అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. అదే విధంగా పేపర్ ఎంతో కఠినంగా ఉండటంతో గతేడాదికి పూర్తి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ర్యాంక్‌లు దక్కాయి. దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్ మార్కులు బాగా తగ్గుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గతేడాది ఏయూ రీజియన్‌లో ఓపెన్ కేటగిరిలో 601 మార్కులతో 75,427 ర్యాంక్ (నేషనల్) సాధించిన విద్యార్థికి ప్రభుత్వ (కన్వీనర్) కోటా చివరి సీటు దక్కింది. బీసీ, మైనార్టీల్లో 482 స్కోర్ వచ్చిన విద్యార్థుల వరకు సీట్లు వచ్చాయి. ఎస్వీయూ రీజియన్‌లో జనరల్ కేటగిరిలో 583 స్కోర్‌తో 93,186 ర్యాంకర్‌కు, బీసీల్లో 502 స్కోర్‌తో 2,01,883 ర్యాంకర్‌కు, ఎస్సీల్లో 500 స్కోర్‌తో 2,05,164, ఎస్టీల్లో 458 స్కోర్‌తో 2,69,020 ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మెడిసిన్ సీటు వచ్చింది. గత ఏడాది ఉన్న సీట్లలోనే.. రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ పరిధిలో ఒక్క సీటు పెరిగే అవకాశం లేదు. ఇక ప్రైవేట్‌లో కొత్త కళాశాలలు, సీట్ల పెరుగుదల లేదని తెలుస్తోంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న 6,510 సీట్లలోనే 2025–26 విద్యా సంవత్సరంలోనూ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ప్రస్తుత నీట్ ఫలితాల సరళి, ఆల్ ఇండియా ర్యాంక్‌ల సరళిని ఓసారి గమనిస్తే.. నీట్ 2024లో టాప్ 100లోపు విద్యార్థులు 715–720 మధ్య స్కోర్ చేశారు. ఏకంగా 80,117 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా 600పైబడి స్కోర్ చేశారు. ఈసారి జాతీయ స్థాయిలో టాప్ స్కోర్ 686 దగ్గరే ఆగిపోయింది. 651 నుంచి 686 మధ్య 73 మంది, 601–650 మధ్య 1259 మంది, 551–600 మధ్య 10,658 మంది చొప్పున విద్యార్థులు నిలిచారు. ఈసారి టాప్ స్కోరర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 400 నుంచి 500 మధ్య ఎక్కువ మంది స్కోర్ చేశారు. దీంతో 2025–26 ఎంబీబీఎస్ అడ్మిషన్లలో కటాఫ్‌లు 100 మార్కులకు పైబడి దిగిరానున్నాయి. ఇదిలా ఉండగా నీట్ అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల సమాచారం ఎన్టీఏ నుంచి ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఇంకా అందాల్సి ఉంది. ఎన్టీఏ నుంచి పిలుపు వస్తే విశ్వవిద్యాలయం ప్రతినిధి ఢిల్లీకి వెళ్లి నీట్ అర్హుల సమాచారాన్ని తీసుకురానున్నారు. ఇందుకు వారం రోజులు సమయం పట్టనుంది. కన్వీనర్ కోటాలో 4,046 సీట్లు ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. 2024–25 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఈ కళాశాలల్లో 6,510 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 4046 రాష్ట్ర స్థాయిలో కన్వీనర్ కోటాలోకి, 1,989 సీట్లు యాజమాన్య (బీ, సీ) కోటాలోకి వస్తాయి. ఇక బీడీఎస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 1,540 సీట్లుండగా, ఆల్ ఇండియా కోటాలో 21, రాష్ట్ర కన్వీనర్ కోటాలో 818, యాజమాన్య కోటాలో 700 సీట్లు భర్తీ చేస్తారు. -
విద్యార్థులు తగ్గుతున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లుసిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అత్యధికంగా వరంగల్‌లో మూసివేత ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.⇒ ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్‌లో 34, నిర్మల్‌లో 48, నిజామాబాద్‌లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్‌నగర్ జిల్లాలో 48, నాగర్‌కర్నూల్‌లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి. మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్‌గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది. ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. ⇒ 2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది. ⇒ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది. ⇒ ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది. -
విద్యార్థులకు చెల్లని చెక్కులు
-
చెల్లని చెక్కులు పంచిన మంత్రి లోకేష్!
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: షైనింగ్ స్టార్స్ పేరిట కూటమి ప్రభుత్వం పంచుతున్న చెక్‌ల విషయంలో దారుణం జరిగింది. స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పంచిన చెక్కులు చెల్లకుండా పోయాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురై అధికారులను ఆరాలు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్స్(Shinig Stars Cheques) పేరుతో అవార్డులను ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. వారం కిందట పార్వతీపురంలో 90 మంది ప్రతిభా వంతులైన విద్యార్థులకు స్వయంగా మంత్రి లోకేష్ రూ.20 వేల విలువైన చెక్‌లు అందించారు. అయితే ఆ చెక్‌లను బ్యాంక్‌లు వెనక్కి తిప్పి పంపించాయి. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విద్యా శాఖ కార్యాయాల వద్దకు చేరి ఆరాలు తీశారు. అయితే ఆ చెక్‌లపై ఉన్న డీఈవో, ఎంఈవోల సంతకాలు సరిపోలేదని చెబుతూ బ్యాంకులు తిప్పి పంపినట్లు తేలింది. దీంతో మంత్రి లోకేష్ చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కావడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఆ చెల్లని చెక్‌లు తీసుకుని విద్యార్థులను వెనక్కి పంపించేశారు. త్వరలోనే చెల్లే చెక్కులు పంపిణీ చేస్తామని వాళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్! -
ఫీజు చెల్లింపులు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం
-
ప్రభుత్వ బడుల్లో టెక్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ వాణిజ్యవేత్త నందన్ నీలేకని సారథ్యంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలు అందించే సేవలివీ.. –ఎక్‌స్టెప్ ఫౌండేషన్ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతోపాటు మ్యాథ్స్‌పై బేసిక్స్‌ను అందిస్తుంది. –ఫిజిక్స్‌వాలా ఇంటర్మీడియట్ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది. –ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌పై శిక్షణ ఇస్తుంది. –ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. –పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణ ఇస్తుంది. –ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది. -
తక్కువ మార్కులకే మంచి ర్యాంకులు
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2025లో రాష్ట్రం నుంచి 36,776 మంది అర్హత సాధించారు. టాప్–100 మందిలో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం గత నెల 4వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 22,09,318 మంది హాజరైన ఈ పరీక్షలో 12,36,531 మంది అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి 59,219 మంది దరఖాస్తు చేసుకోగా, 57,934 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 36,776 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో టాప్–100లో ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వీరిలో 19వ ర్యాంకుతో దర్భా కార్తీక్ రామ్ కిరీటి రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అలాగే, కొడవాటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు.. దేశిన సూర్యచరణ్ 59, పొదిలపు అవినాష్ 64 (ఓబీసీ), యర్రా సమీర్ కుమార్ 70 (ఓబీసీ), తుమ్మూరి శివ మణిదీప్ 92వ (ఓబీసీ) ర్యాంకులు సాధించారు. వీరుగాక కారు మంచి విక్రాంత్ జాతీయ స్థాయిలో 262 ర్యాంకుతో పాటు ఎస్సీ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచాడు.టాపర్‌గా రాజస్థాన్ విద్యార్థి ఈసారి నీట్ యూజీ పరీక్షలో టాప్–10 ర్యాంకులు ఉత్తరాది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. వీరిలో 9 మంది బాలురు, ఒక బాలిక ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ టాపర్‌గా నిలవగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్‡్ష అవాధియా రెండో ర్యాంకు, మహరాష్ట్ర విద్యార్థి క్రిషంగ్ జోషి మూడో ర్యాంకు, ఢిల్లీకి చెందిన మృణాల్ కిషోర్ ఝా నాలుగో ర్యాంకు, అవికా అగర్వాల్ (ఢిల్లీ) ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నారు. 73 మందికి అత్యుత్తమ మార్కులుఈ ఏడాది నీట్ మార్కుల సాధనలో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినట్టు ఎన్టీఏ వెల్లడించింది. 144 నుంచి 686 మార్కుల వరకు సాధించిన విద్యార్థులను ప్రకటించింది. ఇందులో 73 మంది 651 నుంచి 686 మధ్య మార్కులు సాధించారు. -
మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి అనే తేడా లేకుండా.. మద్యం షాపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులను బహిష్కరించి.. నిరసనలు చేపట్టారు.శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనలకు దిగారు. మద్యం షాపు ఎత్తివేయాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు.. మద్యం దుకాణం నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
AI 171 plane crash : కన్నీరుమున్నీరవుతున్న వైద్యుడి వీడియో వైరల్
అహ్మదాబాద్ (గుజరాత్): సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విధ్వంసకర AI 171 విమాన ప్రమాదం తర్వాత, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది , కుటుంబ సభ్యులులను శుక్రవారం BJమెడికల్ కాలేజీ వైద్యుల హాస్టల్ ప్రాంగణం నుండి ఖాళీ చేయిస్తున్నారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి ఈ సందర్భంగా ముఖ్యంగా డా. అనిల్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. తమను ఇప్పటికిపుడు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా మాండేటరీ ఆదేశాలిచ్చారు, రెండు మూడు రోజులు సమయం ఇవ్వండి, మానవత్వం చూపండిఅంటూ భావోద్వేగానికి గురి అవుతున్న వీడియో సంచలనంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. తన కుమార్తె, తన ఇంట్లో సహాయకురాలు ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారని, వారికి తనసాయం అవసరం అంటూ కంటతడి పెట్టారు. తన భార్య లేదని, చాలా నిస్సహాయంగా ఉన్నానంటూ భోరున విలపించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ కన్నీంటి పర్యంత మయ్యారు. ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే! View this post on Instagram A post shared by Vinay Sharma (@vinayshaarma)> కాగా 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘనినగర్ ప్రాంతంలో బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ సందర్బంగా మధ్యాహ్నం లంచ్‌కోసం వచ్చిన విద్యార్థులు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. -
తల్లికి వందనం మహా మోసం!
తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాం. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తాం. ఒకరుంటే రూ.15 వేలు.. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు ఇస్తాం. – ఎన్నికలప్పుడు నారా చంద్రబాబు నాయుడుఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం.. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం సక్రమంగా అమలు చేయడం లేదు.. రేపు కూటమి ప్రభుత్వం రాగానే మీ ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తాం. నిబంధనలను సాకుగా చూపి ఎవరికీ ఎగ్గొట్టం. – ఎన్నికలప్పుడు నారా లోకేశ్విద్యార్థుల లెక్కలు చెప్పేందుకు దేశంలో యూడైస్ డేటానే ప్రామాణికం. అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదిక ఇది. ఈ వివరాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారానే అప్లోడ్ చేస్తారు. ఈ లెక్కన రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులున్నట్టు యూడైస్ గణాంకాలు చెబుతున్నాయి. వీరందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ.8,745 కోట్లే. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెడుతున్నామని జీవో సాక్షిగా చెప్పారు.ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతుంటే ఆ ఇంట్లో మరెవ్వరికీ తల్లికి వందనం ఇవ్వం అని తేల్చి చెప్పింది. అసలు కూటమి ప్రభుత్వ పాలనలో వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు అమలవుతున్నాయా! ఎప్పుడొస్తుందో తెలియని.. అసలు వస్తుందో రాదో తెలియని ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై నెపం మోపి తల్లికి వందనం పథకాన్ని వారికి రద్దు చేయడం దుర్మార్గం కాదా?ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికీ ఏటా రూ.15 వేలు ఇస్తామని గురువారం అన్ని దినపత్రికల్లో (సాక్షి మినహా) ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. నేడే తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేస్తామని కూడా ఘనంగా చాటుకున్నారు. మీ మాటలు నమ్మి డబ్బులు పడతాయని లక్షలాది మంది తల్లులు రాత్రి పొద్దుపోయే వరకు ఎదురు చూశారు. తీరా సవాలక్ష నిబంధనలు పెట్టి, నగదు జమ చేయడానికి ఇంకో నెల గడువు తీసుకున్నారు. మీరు చెప్పిన పిల్లల సంఖ్యలో ఇంకా కోత వేయడానికే కదా ఈ గిమ్మిక్కులు! దీన్ని ఏమనాలి? మోసం అనాలా.. లేక దగా అనాలా? వీరందరూ అనర్హులు⇒ ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నట్లయితే, అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు.⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికీ పథకం రద్దు. ⇒ కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు.⇒ కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు.⇒ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండరాదు. పట్టణాలల్లో 1000 చ.అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ⇒ ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు.⇒ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు వేతనం పొందుతున్న వారికి పథకం రాదు. ⇒ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రీృమెట్రిక్, పోస్ట్ృమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఆ పథకాల కింద ఆయా శాఖలు అందిస్తున్న మొత్తం మినహాయించి, మిగిలిన నగదును మాత్రమే ‘తల్లికి వందనం’ పథకం కింద చెల్లిస్తారు. ⇒ సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదులొస్తే పథకాన్ని ఆపేస్తారు.సాక్షి, అమరావతి: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు షాకిచ్చింది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించేసింది. సవాలక్ష నిబంధనలు విధించి.. ఇంకా కోత కోయనుంది. మిగిలిన వారికి కూడా కేవలం రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. గురువారమే నిధులు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం.. వచ్చే నెలకు వాయిదా వేసింది. కేవలం విధివిధానాలు మాత్రమే విడుదల చేసి అనేక కఠిన నిబంధనలతో లబ్ధిదారులకు కోత పెట్టే ప్రక్రియకు పూనుకుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలు ఉన్న వారిని తొలగించనున్నారు. అర్హులుగా తేలిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వచ్చే నెలలో రూ.13 వేలు మాత్రమే జమ చేస్తారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు (26, 27 జీవోలు) విడుదల చేసింది. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇచ్చే రూ.13 వేలకు అనేక నిబంధనల ఆంక్షలు పెట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ పథకం వర్తిస్తుందని, ఈ ఏడాది హాజరుతో సంబంధం లేకుండా అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంత మందికీ పథకం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తీరా తల్లులపై ఫీజుల భారం మోపింది. ఇచ్చేది 54,94,703 మందికే.. ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్–6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 67,27,164 మందికి ఈ పథకాన్ని ఇస్తున్నట్టు ప్రకటించినా, ప్రస్తుతం ఇచ్చేది 54,94,703 మందికేనని తేల్చింది. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరికల అనంతరం లబ్ధిదారులను పరిశీలించనున్నట్టు పేర్కొంది. ఒకటో తరగతిలో 5,87,265 మంది, జూనియర్ ఇంటర్లో 5,32,485 మంది చేరుతారని అంచనా వేశారు. రికార్డుల్లో తప్పులున్నవారు 21,860 మంది, కుటుంబ వివరాలు లేని వారు 90,851 మంది ఉన్నట్లు అంచనా. వీరి వివరాలు తీసుకుని తర్వాత లెక్క సరిచేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ కులాలకు చెందిన 15 కార్పొరేషన్ల ద్వారా గుర్తించిన 54,94,703 మంది విద్యార్థుల వివరాలను స్థానిక గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. నిబంధనలు అన్నీ సరిపోతే.. ఇతరులెవరైనా ఫిర్యాదు చేయకపోతే వచ్చే నెల 5న ఆయా విద్యార్థులకు సంబంధించి 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం 75 శాతం హాజరు ఉన్న వారికే 2027లో పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. నాలుక మడతేసిన లోకేశ్!వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మఒడి అమలులో కఠిన నిబంధనలు పెట్టిందని ఎన్నికలప్పుడు ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ నీతులు వల్లించారు. కానీ ప్రస్తుతం తల్లికి వందనం అమలు నిబంధనలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వారు చెప్పిన ప్రకారం ఇప్పటికే రెండేళ్ల కాలానికి విద్యార్థులకు తల్లికి వందనం వేయాలి. కానీ తేదీల మతలబుతో మాయ చేసి 2026కు ఇప్పుడు ప్రకటించారు. అదీ 67,27,164 మంది లబ్ధిదారులని చెప్పి, ఇచ్చేది మాత్రం 54,94,703 మందికేనని.. కండిషన్స్ అప్లై అన్నారు. గత ప్రభుత్వంలో 75 శాతం హాజరు నిబంధన పెట్టినా పేదల పక్షపాతి అయిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుతో సంబంధం లేకుండా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ చేశారు. అయితే నాటి నిబంధనలను తప్పుబట్టిన లోకేశ్.. ఇప్పుడు తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకు కోత పెట్టారు. ఇప్పుడు అర్హులైన వారికి రూ.13 వేలు మాత్రమే ఇస్తామని, మరో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిధికి జమ చేస్తామంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేమిటి.. చేసిందేమిటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా లోకేశ్‌ను నిలదీస్తున్నారు. పైగా ఈ పథకాన్ని 2024 జూన్/జూలైలో విద్యార్థులకు ఇవ్వాల్సింది ఎగవేశారు. 2025 జూన్‌లో ఇవ్వాల్సిన పథకాన్ని ఇప్పుడు ప్రకటించి 2026కు కూడా ఇదే అని చెబుతున్నారు. పైగా ఒక ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందే విద్యార్థులుంటే తల్లికి వందనం వర్తించదని ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో గ్రాడ్యుయేషన్ చదువుకునే వారు ఎందరుంటే అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. అమ్మ ఒడి కూడా ఇచ్చారు. ఇంత పక్కాగా అమలు చేసిన అమ్మ ఒడిపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్.. ఇప్పుడు ఇన్ని కండిషన్లతో తల్లికి ఎగనామం పెట్టినట్టు కాదా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. -
బడి గంట మోగింది
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం మొదలవుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురువారం బడులు తెరుచుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని చోట్లా హడావుడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు బడులను అలంకరిస్తున్నారు. స్టేషనరీ, యూనిఫామ్ షాపులు, షూస్ అమ్మే దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, బస్సులు విద్యార్థుల కోసం సిద్ధమవుతున్నాయి. అధికారుల్లోనూ హడావుడి మొదలైంది. వసతి గృహాలకు వెళ్లే విద్యార్థులు పెట్టేబేడాతో సన్నద్ధమవుతున్నారు. టీచర్లు తమ స్కూళ్లలో రిజిస్టర్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టారు. ఉన్నతాధికారులు వాట్సాప్ మెసేజీలతో ప్రభుత్వ టీచర్లను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 41,354 స్కూళ్లలో సందడి వాతావరణం కనిపించబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు కలిపి మొత్తం 62 లక్షల మంది విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క వారం రోజుల్లో ప్రభుత్వ టీచర్ల సర్దుబాటు చేపడతామని అధికారులు అంటున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఉండేలా చేస్తామంటున్నారు. తక్కువ విద్యార్థులున్న చోట ఎక్కువ మంది టీచర్లు ఉంటే, వారిని టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మందికిపైగా టీచర్లను సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. సర్కారీ స్కూళ్ల సన్నాహాలుప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను నడిపించాలన్నది విద్యాశాఖ లక్ష్యం. ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యను కూడా అందించాలని నిర్ణయించారు. బోధనలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు 60 వేల మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సరికొత్త బోధన మెళకువలను రిసోర్స్ పర్సన్స్ ద్వారా అందించామని విద్యాశాఖ ధీమాగా ఉంది. విద్యార్థులను ఆకట్టుకునే బోధన ప్రణాళికనూ రూపొందించామని చెబుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం కేలండర్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్ వెల్లడించింది. ప్రతీ రోజు విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించింది. ఆటలు, పాటలు, సాంస్కృతిక హంగులు స్కూళ్లలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో చిన్న చిన్న రిపేర్లు వేసవిలోనే పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల మౌలిక వసతుల లోపం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెపుతున్నారు. స్కూళ్లు మొదలయ్యాక ఈ అంశంపై దృష్టి పెడతామని అంటున్నారు. ఇప్పటికే స్కూళ్లకు పుస్తకాలు, యూనిఫామ్‌లు చేరాయని, మొదటి రోజే వాటిని విద్యార్థులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, కొత్తగా చేరే విద్యార్థులకు కొంత ఆలస్యమయ్యే అవకాశముందని తెలిపారు. మరో పక్క ఈ నెలాఖరు వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చేరేలా ఆకర్షిస్తారు. ఏఐ పాఠాలు.. కంప్యూటర్ ల్యాబ్లుపాఠశాల విద్యాస్థాయి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం 3,412 స్కూళ్లను ఎంపిక చేశారు. పలు సంస్థలతో విద్యాశాఖ అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. 604 మండలాల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ విద్య, ఏఐ పాఠాలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. వీటిపై గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రచారం కల్పించాలని, విద్యార్థులను ఆకర్షించాలని ప్రభుత్వం డీఈవోలకు సూచించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలపై జాతీయ సర్వే సంస్థలు కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక లెర్నింగ్ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమిక విద్య స్థాయిలో తక్కువ ప్రమాణాలున్న వారిని గుర్తించి, శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
విద్యార్థుల సమస్యలపై రాహుల్ ఆవేదన.. ప్రధాని మోదీకి లేఖ
ఢిల్లీ: దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈబీసీల హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులను తగిన సమయంలో అందించి, విద్యార్థులను ఆదుకోవాలని రాహుల్ కోరారు.దేశంలోని దళిత, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని రాహుల్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల వారికి పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లలో జరుగుతున్న జాప్యాన్ని ఆయన తప్పుబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 90 శాతం మంది విద్యార్థుల విద్యకు కలిగించే సమస్యలను వెంటనే పరిష్కరించాలని గాంధీ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.ఇటీవల బీహార్‌లోని దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌ను తాను సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రమైన టాయిలెట్లు, అసురక్షిత తాగునీరు, మెస్ సౌకర్యాలు లేకపోవడం, లైబ్రరీలు, ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడాన్ని చూసినప్పుడు తనకు బాధ కలిగిందన్నారు. అలాగే అణగారిన వర్గాల విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడంలో ఆలస్యం జరుగుతున్నదన్నారు. అక్కడి స్కాలర్షిప్ పోర్టల్ మూడు సంవత్సరాలుగా పనిచేయడంలేదని, 2021-22లో ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లభించలేదని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి వైఫల్యాలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అట్టడుగు వర్గాల యువత అభివృద్ధి చెందకపోతే , దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని తాను భావిస్తానని ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు హైకోర్టు సమన్లు -
కార్పొరేట్స్కూళ్లలో ఫైనాన్షియర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.పుస్తకాలు, యూనిఫాం, యాప్‌ల పేరిట బాదుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం లేదు.. నియంత్రణ లేదు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగుతిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.చట్టం తేవాలిప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి. – పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)ప్రభుత్వ నియంత్రణ ఉండాలిప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)వడ్డీ వసూలు చేస్తున్నారుఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – ఆశ (విద్యార్థి తల్లి) -
'ప్రైవేటే షైనింగ్' స్టార్
విజయనగరం జిల్లా నుంచి షైనింగ్ స్టార్ అవార్డులకు 40 మంది జూనియర్ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేయగా, వీరిలో 29 మంది ప్రైవేటు కాలేజీవారు. 11 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల వారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే విధంగా అవార్డులకు ఎంపిక జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదికాలంలో ప్రభుత్వ విద్యను ఎంతగా దిగజార్చారో ఇదిఉదాహరణ మాత్రమే. సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్య అభాసుపాలవుతోంది. ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు దక్కాల్సిన గుర్తింపు ప్రైవేటు సంస్థలకు చెందుతోంది. తాజాగా ఇచ్చిన ‘షైనింగ్ స్టార్’ పురస్కారాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 4,168 పురస్కారాల్లో 3 వేలకు పైగా ఆ సంస్థల విద్యార్థులకే కట్టబెట్టారు. ప్రతి మండలంలో పదో తరగతిలో ఆరుగురు, ఇంటర్మీడియట్లో జిల్లాకు 36 మంది చొప్పున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.అయితే, గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్ కాలేజీ విద్యార్థులకే దక్కడంతో షైనింగ్ స్టార్లుగానూ వారే అధికంగా ఎంపికయ్యారు. అత్యంత గందరగోళంగా జరిగిన స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రైవేటుకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించలేదు. పైగా, ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకే షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చింది. రూ.20 వేల నగదు, మెడల్‌తో పాటు అభినందన పత్రం బహూకరించారు. సోమవారం 26 జిల్లా కేంద్రాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో 600కి 500 పైన (సగటున 83.33 శాతం) మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులను మండలానికి ఆరుగురు చొప్పున, 70 శాతం మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపికచేసి అవార్డులను ఇచ్చారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో 830పైగా మార్కులు పొందిన 36 మందిని, 700 మార్కులు పొందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సత్కరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకే గుర్తింపు నాడు జగనన్న ఆణిముత్యాలు అధికం ప్రభుత్వ విద్యార్థులకే రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువులో రాణిస్తే పేదరికం పోగొట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంక్షించారు. ఇంగ్లిష్ మీడియంలో చదివితే అద్భుతంగా రాణిస్తారని బలంగా నమ్మారు. దీనికోసం వైఎస్ జగన్ హయాంలో మనబడి నాడు–నేడు పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయి బోధనను అందించారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల వారిని తలదన్నేలా అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ‘జగనన్న ఆణిముత్యాలు’ కింద ఎంపికయ్యారు. కానీ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై కక్ష సాధించేందుకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్నవారు అక్కడ చదువుకుంటారు, మేధావులుగా తయారవుతారు. మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’ అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. దీనికితగ్గట్లే 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రహసనంగా మార్చేశారు. వేలాదిమంది ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. -
నదీగర్భంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్‌స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్ (18), శివమనోజ్ (15), కర్ణాల సాగర్ (16), తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్‌చరణ్ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్‌కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, డీడీఆర్ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి. ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్‌ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది. -
ఈత రాకున్నా నదిలోకి వెళ్లి..
భూపాలపల్లి/కాళేశ్వరం: వారంతా విద్యార్థులు.. పైగా సమీప బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు... ఎవరికీ ఈత రాకున్నా మేడిగడ్డను చూసి సరదాగా గోదావరిలో స్నానం చేద్దామని నదిలోకి దిగారు. కానీ నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఒకరిని కాపాడబోయి ఒకరు మొత్తం ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోల్కొండ మల్లయ్య కుమార్తె త్రివేణి వివాహం ఈ నెల 5న జరిగింది. వివాహం అనంతరం సమీప బంధువులైన అదే గ్రామానికి చెందిన పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16)తోపాటు మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్ (17), స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19), పట్టి శివమణి.. మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం 6 గంటలకు వెళ్లారు. మోకాలి లోతు నీళ్లలో స్నానం చేసే క్రమంలో ఆడుకుంటుండగా తొలుత ఒకరు నీటమునిగారు. ఆపై ఒకరిని కాపాడబోయి ఒకరు.. ఆరుగురు నీటమునిగారు. నది ఒడ్డునున్న పట్టి శివమణి వెంటనే పట్టి మధుసూదన్‌ను కాపాడేందుకు ప్రయత్నించాడు. సాధ్యంకాకపోవడంతో చివరకు ఒడ్డుకు వచ్చేశాడు. మిగిలిన ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. వద్దని వారిస్తున్నా వినకుండా... అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ ఉన్నారు. వారితోపాటు మిగిలిన ఐదుగురు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా వెంకటస్వామి అడ్డుకున్నాడు. నదిలో నీటిమట్టం ఎక్కువగా ఉందని.. వెళ్లొద్దని వారించినా వినకుండా వారు వెళ్లా రు. దీంతో అతను కూడా వారితో అక్కడికి వెళ్లాడు. మోకాలి లోతు వరకు వెళ్లాక తిరిగి రావాలని పిలుస్తున్న క్రమంలోనే తన కుమారులు సహా ఆరుగురు ఒకరి వెనుక ఒకరు నీటము నగడంతో వెంకటస్వామి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఘటనాస్థలిలో 5,100 క్యూసెక్కుల నీరు.. కొద్ది రోజులుగా గోదావరి ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదం జరిగిన మేడిగడ్డ ఎగువ భాగం మూడో బ్లాక్‌లో ప్రస్తుతం 5,100 క్యూసెక్కుల నీరు ఉంది. పిల్లలు నీటిని అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఆరుగురు యువకుల గల్లంతు వార్త తెలుసుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెంటనే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. అయినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి హసన్‌పర్తి: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువులో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మునిగి మృతిచెందాడు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. అదే హాస్టల్లోని నలుగురు స్నేహితులతో కలిసి రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. గణేశ్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గణేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
ట్రంప్‌కు చుక్కెదురు.. హార్వర్డ్‌కు ఊరట
బోస్టన్: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్(మసాచుసెట్స్) ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్‌కు తాత్కాలిక ఊరట లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్ సవాల్ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్ బర్రౌస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీన జరగనుంది.కాగా.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్‌లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్‌లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్‌కి పేరుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్ మారిందని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల కోత విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్‌హౌజ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ నిర్ణయాలపై హార్వర్డ్ దావా వేసింది. -
ఫీజుల కోసం హింసిస్తారా?
న్యూఢిల్లీ: మంచి మార్కులొచ్చే విద్యార్థులను ఉచిత బోధన పేరుతో గద్దల్లా తన్నుకుపోయే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజు సరిగా కట్టకపోతే కనీసం గేటు దాటి లోపలికి కూడా రానివ్వడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫీజు సవ్యంగా కట్టలేదన్న అక్కసుతో విద్యార్థులను బౌన్సర్లతో అడ్డుకోవడంపై మండిపడింది. విద్యాలయాల్లో ఇలాంటి పెడ ధోరణులను ఉపేక్షించే ప్రసక్తే లేదని జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఫీజు వివాదాన్ని సాకుగా చూపి విద్యార్థులను స్కూల్లోకి అనుమతించకపోవడం, అందరి ఎదుటా అవహేళన చేయడం క్షమార్హం కాదు. విద్యాలయాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగేందుకు వీల్లేదు. ఫీజు కట్టాలని బౌన్సర్లను పెట్టి మరీ బెదిరించడం విద్యార్థులను తీవ్రస్థాయిలో వేధించడమే. ఇది చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది వారి ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయడమే’’ అని పేర్కొంది. ఫీజులు సరిగా చెల్లించలేదని దేశ రాజధానిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 31 మంది విద్యార్థులను బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటోందని, బెదిరిస్తోందని నమోదైన కేసును ధర్మాసనం గురువారం విచారించింది. ఫీజు కట్టలేదని విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించి డిబార్ చేసిన యాజమాన్యం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో వారిని తిరిగి చేర్చుకుంటామని విన్నవించింది. ఇకపై విద్యార్థులను తొలగించాలంటే నిబంధనల ప్రకారం తొలుత తల్లిదండ్రులకు ముందస్తు సమాచారమిచ్చి ఫీజు చెల్లింపుపై వారి వాదన విని్పంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. 2025–26 విద్యా సంవత్సరానికి పెంచిన ఫీజులో సగం చెల్లించాలని తల్లిదండ్రులకు సూచించింది. -
Junicorn Summit 2025: అంతర్జాతీయ వేదికపై పల్లె బాలల ప్రతిభ
సాన్ మార్కస్, టెక్సాస్: టెక్సాస్ స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ISF గ్లోబల్ జ్యూనికార్న్ అండ్ AI సమ్మిట్ 2025 చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్‌కి చెందిన గ్రామీణ ప్రాంతాల నుండి ఎంపికైన 50 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులు ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి తదితర రంగాల్లో చిన్నారులు రూపొందించిన ఆవిష్కరణలు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ స్పెషల్ సెక్రటరీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమ్మిట్‌కు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ISF) ఆధ్వర్యం వహించగా, వ్యవస్థాపకుడు డా. జె.ఎ. చౌదరి దూరదృష్టితో, ISF USA అధ్యక్షుడు అట్లూరి సమన్వయ నాయకత్వంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులకు విమాన ప్రయాణం, నివాసం, వర్క్‌షాపులు, డెమో డే వంటి సౌకర్యాలు ఉచితంగా అందించారు.ప్రత్యక్షంగా ఆకట్టుకున్న విద్యార్థుల ఆవిష్కరణలుNaturaShe: బయోడిగ్రేడబుల్ సానిటరీ ప్యాడ్స్ – గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం రూపొందించిన ప్రయోగం.Sense Vibe: దివ్యాంగుల కోసం రూపొందించిన నావిగేషన్ పరికరం.Jalapatra: తక్కువ ఖర్చుతో నీటి శుద్ధి పరికరంNGreenTech: ఈ-వేస్ట్ రీసైక్లింగ్ మోడల్.. వీటికి తోడు మరెన్నో ఆవిష్కరణలకు ఇన్నోవేషన్, సోషల్ ఇంపాక్ట్, బ్రేకిత్రూ థింకర్, ప్రోటోటైప్, స్టోరిటెల్లింగ్ విభాగాల్లో ప్రత్యేక అవార్డులు ప్రదానం చేశారు.రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డుగత నెలలో ఆకస్మికంగా కన్నుమూసిన రామ్ పుప్పాల జ్ఞాపకార్థం ‘రామ్ పుప్పాల ఇన్నోవేషన్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ISF USA అధ్యక్షుడు అట్లూరి ప్రకటించారు.లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు – 2025ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి గౌరవప్రదంగా అవార్డులు అందజేశారు.జయ్ తల్లూరి – ఇన్ఫ్రా & సామాజిక అభివృద్ధి,ప్రసాద్ గుండుమోగుల – డిజిటల్ ట్రావెల్ టెక్నాలజీ,స్వాతి అట్లూరి – కళా, సాంస్కృతిక సేవలు,నిశిత్ దేశాయ్ – న్యాయ రంగ మార్గదర్శకత, లాక్స్ చెపూరి – ఇన్నోవేషన్ అవార్డు – టెక్ టాలెంట్ డెవలప్మెంట్.పద్మా అల్లూరి, ప్రకాశ్ బొద్ధాలు ఈవెంట్ యాంకర్లు వ్యవహరించగా, డా. మహేష్ తంగుటూరు, సత్యేంద్ర, శేషాద్రి వంగల, విశాలా రెడ్డి నిర్వాహణలో ముఖ్యపాత్ర వహించారు. వందలాది వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు కలిసి ఈ అరుదైన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమ్మిట్ అనంతరం విద్యార్థులు NASA స్పేస్ సెంటర్, Texas Science Museum, డల్లాస్, ఆస్టిన్ పరిధిలోని ఇన్నోవేషన్ హబ్‌లను సందర్శించే అవకాశం పొందారు. ఫాలో-అప్ మెంటారింగ్, పెట్టుబడులు, స్టార్టప్ స్కేలింగ్ అవకాశాలపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు.విజన్ 2030 – లక్ష్యంISF ప్రకటించిన దీర్ఘకాలిక విజన్ ప్రకారం, 2030 నాటికి లక్ష మంది గ్రామీణ యువ స్టార్టప్ వ్యవస్థాపకులను రూపొందించాలనే ధ్యేయంతో ఈ ఉద్యమం ముందుకు సాగుతోంది. ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు – ఒక సామాజిక ఆవిష్కరణ ఉద్యమం. ISF అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జ్యూనికార్న్ సమ్మిట్ 2026 ను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. -
టెన్త్ ఫెయిలయినా.. పాఠశాలకు వెళ్లొచ్చు
కర్ణాటక: ఎస్ఎస్ఎల్సీ (టెన్త్)లో 3 పాఠ్యాంశాల్లో ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని కూడా తెలిపింది. మళ్లీ పరీక్షలు రాసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలను విధించింది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలి. మామూలు విద్యార్థులకు మాదిరే చేరవచ్చు, చదువుకోవచ్చు. అందరు విద్యార్థులకు లభించే సౌకర్యాలు ఈ విద్యార్థులకూ లభిస్తాయి. డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి, ఫెయిలయ్యామని చదువు మానివేయకుండా ఈ వెసులుబాటును కల్పించినట్లు తెలిసింది. -
సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం
-
పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్
ప్రముఖ యూట్యూబర్, విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇపుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తలలో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధనా విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. ఆయన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. కానీ జూన్‌లో విద్యార్థులకోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాకు చెందినఖాన్ సర్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా, తాను ఎవరినీ ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నారు.భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు.. జూన్ 2న రిసెప్షన్ తర్వాత, జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందును ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఖాన్ సర్ వెడ్స్, ఏఎస్ ఖాన్ అని పేరున్న పోస్టర్ తప్ప, ఆయన తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎపుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సార్ వివాహంగా గుట్టుగా జరిగిపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపర్చింది. రానున్న విందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
‘నైపుణ్యం’గా నయా మోసం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో నైపుణ్య శిక్షణ వక్రమార్గం పడుతోంది. ముఖ్యంగా స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రైవేటు కాలేజీలు స్కిల్స్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. కాలేజీతో సంబంధం లేని కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వకుండా కేవలం ఉద్యోగం పొందేందుకు చాట్ జీపీటీ, ఏఐ సంబంధిత టెక్నాలజీపైనే షార్ట్ కట్స్ బోధిస్తున్నాయి. ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కాలేజీల్లో కాకుండా, స్కిల్ కేంద్రాల్లో బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించడం, డిగ్రీలు ఇవ్వడం మాత్రం కాలేజీల్లో జరుగుతోంది. ఈ క్రమంలో కీలకమైన ఫ్యాకలీ్టని తగ్గిస్తున్నాయి.ఇదంతా చట్టవిరుద్ధమని గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. హైదరాబాద్‌లో ఉన్న రెండు డీమ్డ్ వర్సిటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ వర్సిటీల ఆఫ్–క్యాంపస్పైనా ఇలాంటి ఫిర్యాదులొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఉద్యోగం వచ్చినా తిప్పలే.. ఇంజనీరింగ్ కాలేజీలు ఎమర్జింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పారిశ్రామిక భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే విద్యార్థి కోడింగ్‌పై పట్టు సాధిస్తాడు. చాట్ జీపీటీ, ఏఐని తేలికగా ఉపయోగిస్తాడు. ఏఐ చేసే కోడింగ్, డీ–కోడింగ్ కచ్చితమైనదేనా? కాదా? అనేది సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పుడే తెలుస్తుంది. ఉదాహరణకు పైథాన్ నేర్చుకునే విద్యార్థికి ముందుగా సీ, సీ ప్లస్ ప్లస్‌పై కనీస పరిజ్ఞానం ఉండాలి. అప్పుడు ఏఐలోని లాంగ్వేజ్ అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు కాలేజీలు దీన్ని విస్మరించడంతో కేవలం ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్‌ను మాత్రమే నేర్పడంతో ఉద్యోగం వచ్చినా, పనిలో పురోగతి సాధించలేకపోతున్నారు. గత ఐదేళ్లలో ఐటీ కంపెనీల్లో 560 మంది కోడింగ్‌పై పట్టు లేకపోవడం వల్లే ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఏఐకి ఫీడ్ చేసే డేటా ఆధారంగా వచ్చే కోడింగ్‌ను అర్థం చేసుకోకపోవడం వల్ల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్దఎత్తున డేటా గందరగోళం ఏర్పడినట్టు ఆ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తెలిపారు. ఏఐసీటీఈకి ప్రభుత్వం ఫిర్యాదు డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణ అధికారం ఉండదు. అవి ఇచ్చే డిగ్రీల్లో నాణ్యతపైనా ప్రశ్నించే అధికారం అనుమతి ఇచ్చిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కూడా ఉండదు. ఒక్కో విద్యార్థి నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు రూ. 16 లక్షల నుంచి రూ.24 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ బేసిక్స్ విస్మరించడం, సబ్జెక్టు అధ్యాపకులను తగ్గించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఏఐసీటీఈ దృష్టికి తేవాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా ఎమర్జింగ్ కోర్సుల్లో తగ్గించిన ఫ్యాకలీ్ట, స్కిల్‌పై శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలకు ఉన్న అర్హతలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరనుంది. కోడింగూ కీలకమే: హరీశ్ చంద్రారెడ్డి, వైస్‌చైర్మన్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీ భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. చాట్ జీపీటీ, జనరేటివ్ స్కిల్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉండాలి. అయితే, బేసిక్స్ నేర్పకుండా కేవలం స్కిల్‌పైనే దృష్టి పెడితే, భవిష్యత్‌లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం కష్టం. సెల్‌ఫోన్ వాడే వ్యక్తికి దాని తయారీ తెలియనవసరంలేదు. వాడకం తెలిస్తే చాలు. కానీ దాన్ని తయారు చేసే ఇంజనీర్‌కు అన్నీ తెలిసి ఉండాలి. కోడింగ్, డీకోడింగ్‌లో ఏఐ తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత ఇంజనీర్‌దే. కాబట్టి ఇంజనీరింగ్‌లో బేసిక్ కోడింగ్‌పై శిక్షణ తప్పించడం సరికాదు. -
వసతులు కరువు.. చదువులు బరువు
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా 30,116 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నట్లు ఇటీవల విద్యా శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు ప్రధాన కారణం అనేక పాఠశాలల్లో విద్యార్థులకు మౌలికసదుపాయాల కొరత ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాఠశాలకు స్వస్తి చెప్పిన విద్యార్థుల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. స్వచ్ఛమైన మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే కొన్ని పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవనే ఆశ్చర్యకరమైన విష యం బయటపడింది. 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా 530 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. కొన్ని పాఠశాల ల్లో ఆడ పిల్లల కోసం స్వతంత్రంగా మరుగు దొడ్లు లేవు. అలాగే 5,127 పాఠశాలల్లో అసలు మరు గుదొడ్లు లేవనే విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో గత్యంతరం లేక పాఠశాల ప్రహరీ గోడకు అవతల ఆనుకుని ఉన్న దట్టమైన పొదల్లోకి లేదా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రయత్నాలు ఘనం.. ఫలితం శూన్యం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ధనవంతులతోపాటు అనేక మంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోంచి డ్రాపౌట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోసాగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్డడం, మరగుదొడ్లకు మరమ్మతులు చేపట్టడం, తాగు నీరు, విద్యా బోధన మెరుగుపర్చడం ఇలా అనేక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. దీంతో ప్రతీ ఊరు, పల్లెటూర్లలో తిరిగి విద్యార్థులకు కౌన్సెలింగ్, తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 33,470 ఉండగా అదే 2024–25లో ఈ సంఖ్య 30,116 చేరింది. దీన్ని బట్టి గత విద్యా సంవత్సరంలో 3,354 మంది విద్యార్థుల సంఖ్య మాత్రమే పెరిగిందని స్పష్టమవుతోంది. అంటే ఇంకా 30,116 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. విద్యార్థులు ఖాళీగా తిరగడంవల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం లేకపోలేదు. నేరాలకు కూడా పాల్పడతారని విద్యా శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో చేపట్టిన కౌన్సెలింగ్, మార్గదర్శక కార్యక్రమాలవల్ల కొంతమేర సత్ఫలితాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన తరువాత 2025–26లో ఎంతమేర విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తోంది. దీన్ని బట్టి పాఠశాలకు ఇంక ఎంతమంది దూరంగా ఉంటున్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని విద్యా శాఖ పేర్కొంది. -
మందలా చేరికలు.. మందకొడి బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టికి తీసుకెళ్లేదుకు సిద్ధమైంది. డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఏఐసీటీఈకి వివరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు గురువారం చర్చించారు.ప్రభుత్వ సూచనల మేరకు ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డీమ్డ్ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న తీరు, దీనివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని అందులో వివరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రమాణాలు లేని బోధన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.కాలం చెల్లిన కోడింగ్గత ఏడాది డీమ్డ్ వర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులు కొన్ని రకాల కోడింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఏఐ వచి్చన తర్వాత పాతతరం కోడింగ్, డీకోడింగ్ అవసరమే లేకుండా పోయింది. అడ్వాన్స్డ్ కోడింగ్‌ను సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇవేవీ డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో కన్పించడం లేదని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు. డ్రిస్కియేట్ మేథమెటిక్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్ లేబోరేటరీపై బేసిక్స్ తప్ప, ఏఐ సమాంతర బోధనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని గుర్తించారు. కొన్ని సంస్థల కోసం జరిగే ఇంటర్వ్యూల్లో కీలకమైన బిజినెస్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్‌పై కనీస పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో ఉండటం లేదని టెక్ కంపెనీలు అంటున్నాయి. అడ్డగోలు ప్రవేశాలుతెలంగాణలో మొత్తం పదివరకు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ క్యాంపస్ బ్రాంచీలున్నాయి. డీమ్డ్ హోదా ఉన్న సంస్థలు తెలంగాణలో బ్రాంచీలు పెట్టాయి. భూమి, మౌలిక వసతులు, కొన్నేళ్లుగా సాధించిన ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ హోదాను ఏఐసీటీఈ ఇస్తుంది. ఈ హోదా వచి్చన వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అడ్మిషన్లు కూడా వాళ్ల ఇష్టమే.ఇష్టానుసారం అన్ని బ్రాంచీల్లోనూ సీట్లు పెంచుకోవచ్చు. డీమ్డ్ హోదా కోసం సంస్థలు వ్యూహాత్మకంగా జాతీయ ర్యాంకులు వచ్చేలా చూసుకుంటున్నాయి. ర్యాంకులిచ్చే జాతీయ సంస్థలకు ఇవి అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు అన్‌స్కిల్డ్ ఉద్యోగాల్లో చేరినా, వాటిని ర్యాంకింగ్ డేటాలో స్కిల్డ్గానే చూపిస్తున్నాయి. ఇలా హోదా తెచ్చుకున్న తర్వాత నియంత్రణ లేకుండా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో యూనివర్సిటీ ఇంజనీరింగ్‌లో ఏకంగా 3 వేలకుపైగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది.ఇందులో ప్రధానంగా డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులే ఉంటున్నాయి. అయితే, ఇంతమందికి సరిపడా ఫ్యాకల్టీ ఎలా తెస్తున్నారు? బోధించేవాళ్ల నాణ్యత ఎంత? అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో చదివిన విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఇటీవల రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం డేటా తెప్పించి పరిశీలించింది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారిలో కనీసం 32 శాతం కూడా సరైన ఉద్యోగాలకు ఎంపికవ్వడం లేదని గుర్తించారు.పనికి మాలిన ప్రాజెక్టులుప్రతీ కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి అనుసంధానమయ్యాయి. దానిని నిర్వహించే ఉద్యోగ అర్హతలకు కొన్ని ప్రాజెక్టులు ఇంజనీరింగ్‌లోనే చేయాలి. అయితే, డేటా అనలిటిక్స్ లేబొరేటరీల్లో సాధారణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్‌లో చేసే ప్రాజెక్టుల్లో ఎక్కడా ఏఐ కోడింగ్, మాడ్యూల్స్‌పై అధ్యయనం చేసిన దాఖలాలు డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో ఉండటం లేదని సాంకేతిక విద్య అధికారి ఒకరు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎథి్నకల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటిలిజెన్స్, ఢిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కన్పించడం లేదని అధికారులు సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. బోధన నాణ్యతమై ఆడిటింగ్ జరిగితే తప్ప డీమ్డ్ వర్సిటీలు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది. -
ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ను ఒక జోక్‌గా అభివర్ణించారు. హార్వర్డ్ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 18న కాన్పూర్ ఐఐటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(జేఈఈ అడ్వాన్స్డ్) రెస్పాన్స్ షీట్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కాన్పూర్ ఐఐటీ వర్గాలు తెలిపాయి. మే 26 లోపు కీ విడుదల చేసే వీలుంది. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జూన్ 2న ఆన్లైన్ ద్వారా ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 3 నుంచి ఎన్ఐటీ, ఐఐటీ ఇతర జాతీయ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) విడుదల చేస్తుంది. -
ఇంజనీరింగ్‌లో రెండు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌లో మరో రెండు కొత్త కోర్సులు రాబో తున్నాయి. ఐఐటీ మద్రాస్ వీటిని అందుబాటులోకి తెస్తోంది. 2025–26 విద్యా సంవత్సరంలో జరిగే జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్‌లో ఇవి ఉంటాయని మద్రాస్ ఐఐటీ తెలిపింది. మద్రాస్ ఐఐటీలోని అప్లైడ్ మెకానిక్స్, బయో మెడికల్ విభాగాలు ఈ కోర్సును డిజైన్ చేశాయి. ఒక్కో విభాగంలో 40 సీట్లు ఉంటాయని ఐఐటీ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ వి కామకోటి తెలిపారు. ఇవీ కోర్సులు ⇒ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతలను ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. కంప్యుటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ (సీఈఎం) కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. సాధారణ ఇంజనీరింగ్ విద్య కు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్‌పై పట్టు సాధిస్తాడు. సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటీరియల్ సైన్స్, డైనమిక్స్‌లో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానం చేశారు. ⇒ బయోమెడికల్ ఇంజనీరింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయో మెడికల్ ఇంజనీరింగ్ (ఐబీఎంఈ) ఉపయోగపడుతుంది. ఐవోటీ, ఏఐ, వెబ్ ఎనేబుల్డ్ మెడికల్ టెక్నాలజీని ఈ కోర్సు ద్వారా అందిస్తారు. మారుతున్న వైద్య రంగంలో మంచి ఉపాధికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. -
మిగులు టీచర్ల దిగులు
సాక్షి, అమరావతి: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, సర్దుబాటులో టీచర్లు భారీగా ప్రభావితమవుతున్నారు. వీరిలో అత్యధికులు స్కూల్ అసిస్టెంట్లే ఉన్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవో–117 ద్వారా 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ బోధన అందించేందుకు సీనియర్ ఎస్జీటీల్లో అర్హులైన దాదాపు 7,500 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయడంతో పాటు 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసింది. అంతేగాక.. ఉపాధ్యాయ, విద్యార్థులు నిష్పత్తిని సైతం భారీగా పెంచడంతో అంతేస్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల మిగులు ఏర్పడింది. మిగులు టీచర్లను వివిధ రకాలుగా సర్దుబాటు చేయగా, ఇంకా 6,428 మంది గాలిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగాను, హెచ్‌వోడీ పూల్‌లోను ఉంచారు. అయితే, వీరిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై విద్యాశాఖ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల హేతుబద్ధీకరణ, ఉపాధ్యాయుల సర్దుబాటుపై విడుదల చేసిన ఉత్తర్వుల్లో 2,754 మందిని క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా ప్రకటించారు. మరో 3,674 మందిని హెచ్‌వోడీ పూల్‌లో ఉంచారు. నిన్న 1,902.. నేడు 1772 మంది రాష్ట్రంలో సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్/సెకండరీ గ్రేడ్ టీచర్, తత్సమాన 2,754 పోస్టులను క్లస్టర్ మొబిలైజ్ టీచర్లుగా కొత్తగా మార్పు చేశారు. వీరిని ఆయా క్లస్టర్లలోని సర్వీస్ ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు వీరిని ఉపయోగించుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,815 క్లస్టర్లు ఉండగా, కేటాయించిన పోస్టులు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీరిని ఎలా ఉపయోగించుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది. సర్దుబాటు ఉత్తర్వుల మేరకు జిల్లాల్లోని మిగులు పోస్టులను ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, క్లస్టర్ లెవెల్ మొబిలైజ్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్, హెచ్‌వోడీ క్యాడర్, మున్సిపాలిటీ మేనేజ్మెంట్లకు బదలాయిస్తూ బుధవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సర్దుబాటు అనంతరం ఇంకా 8 జిల్లాల్లో 1,772 పోస్టులు మిగులుగా ప్రకటించారు. ఇందులో 362 స్కూల్ అసిస్టెంట్లు, మరో 1,410 ఎస్జీటీలు ఉన్నారు. వీరు మంగళవారం హెచ్‌వోడీ పూల్‌కు అప్పగించిన 1,902 మందికి అదనం. వీరి వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని డీఈవోలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పాఠశాల స్థాయిలో అవసరానికి అనుగుణంగా వృత్తి బోధకులు, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, సంగీత ఉపాధ్యాయ పోస్టులను కేటాయించాలని, 2024–25 విద్యా సంవత్సరంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల నమోదు ఆధారంగా అవసరమైన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మారిన పోస్టుల వివరాల మేరకు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను అప్డేట్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల పునర్ నిర్మాణానికి అనుగుణంగా పాఠశాల పేర్లను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘స్పెషల్’ టీచర్ల మాటేంటి? ప్రస్తుతం ఉన్నత పాఠశాలల్లో సుమారు 700 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరినే సర్దుబాటు చేయాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇటీవల ప్రభుత్వం 2,260 రెగ్యులర్ టీచర్ పోస్టులను స్పెషల్ టీచర్ పోస్టులుగా మార్చింది. ఇందులో1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే, కొత్త పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి పాఠశాలలోను స్పెషల్ టీచర్లను నియమించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం 2022లో జారీచేసిన గెజిట్, రిహేబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఆర్సీఐ) నిబంధనల ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 10 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్‌ను, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాలి. కొత్త పోస్టుల భర్తీ ఊసెత్తకుండా ఉన్న పోస్టులనే సర్దుబాటు చేయాలనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలు, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంచేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీల కింద నగదును అందిస్తోంది. వసతిగృహ సంక్షేమాధికారికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ నిధిని విడుదల చేస్తోంది. ఆ నిధి నుంచి విద్యార్థులకు చెల్లిస్తున్నారు. ఇకపై కాస్మెటిక్ చార్జీలను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి బ్యాంకు ఖాతాను తెరవనుంది. బ్యాంకు ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ కార్డు ద్వారా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించనుంది.ఈ స్మార్ట్ కార్డు డెబిట్ కార్డు మాధిరి పనిచేస్తుంది. ఈ కార్డుల వినియోగం వల్ల విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీల పైన చైతన్యం కలిగించినట్లవుతుంది. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.విద్యార్థులకు అవసరమైన సబ్బులు, షాంపూలు ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ కేంద్రాల ద్వారా కాస్మెటిక్ వస్తువులను కొనుగోలు చేసేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, బెడ్షిట్లు, కార్పెట్, బ్యాగులు తదితర సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, సెర్ప్ సీఈఓ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
3 రోజులకో స్టార్టప్
సాక్షి, అమరావతి: ఆవిష్కరణల దిశగా గొప్ప ముందడుగు వేయడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ చరిత్ర సృష్టిస్తోంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (ఐఐటీఎంఐసీ), స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ సంయుక్తంగా 2024–25లో ఏకంగా 104 స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం విశేషం. ఈ స్టార్టప్‌లలో సగానికిపైగా ఐఐటీ మద్రాస్ కమ్యూనిటీ సభ్యులైన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించారు. మిగిలిన వాటిని బయట వ్యక్తులకు ప్రోత్సాహకం అందించడం ద్వారా ప్రారంభించారు. ఇది ఐఐటీ మద్రాస్‌లోని స్టార్టప్ అనుకూల వ్యవస్థను బలంగా చాటుతోంది. 12 ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ శక్తివంతమైన డీప్‌టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిరి్మస్తోంది. ఇప్పటివరకు రూ.50,000 కోట్లకుపైగా సమష్టి విలువ కలిగిన 457 స్టార్టప్‌లు, 2 యూనికార్న్‌లను అందించింది.‘స్టార్టప్ మిషన్’ విజయవంతం.. గతేడాది ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ నిర్దేశించిన ‘స్టార్టప్ 100 మిషన్’ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇది ఏడాదికి సగటున 60 స్టార్టప్‌ల నుంచి 104కు చేరుకోవడం చరిత్రాత్మక విషయం. దీనికి తోడు ఐఐటీ మద్రాస్ ఏడాదిలో ఏకంగా 417 పేటెంట్లను దాఖలు చేసింది. అంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ పేటెంట్లు దాఖలైనట్లు లెక్క. ఈ స్టార్టప్‌ల్లో తయారీ, రోబోటిక్స్, ఆటోమోటివ్ మెటీరియల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్‌టెక్, స్పేస్, ఫార్మా, క్వాంటం టెక్నాలజీ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఐఓటీ, అగ్రిటెక్, కృత్రిమ మేధ వంటి ముఖ్యమైన డీప్ టెక్ రంగాల్లో సేవలందిస్తున్నాయి. ఇక్కడే ఇన్‌బౌండ్ ఏరోస్పేస్, మ్యాటరైజ్ వంటి నవ కంపెనీలకు ఐఐటీఎంఐసీ నుంచి తిరుగులేని సహకారం లభించడంతోనే సాధ్యపడింది. -
summer camps ఆటపాటలతో సమ్మర్ సందడి
వెంకటేశ్వరకాలనీ వేసవి సెలవుల్లో విద్యార్థులకు తెలియని విషయాలను తెలిసేలా... ఆహ్లాదంగా గడిపి వేసవి సెలవులను మరింత ఆనంద జ్ఞాపకాలుగా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం బడుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నం.7లోని గతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 80 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్‌లో అటు కంప్యూటర్ నేర్చుకోవడంతో పాటు ఇటు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. లిటిల్‌స్టార్ హైస్కూల్, గతి హైసూ్కల్, సెయింట్ ఆల్ఫాన్సెస్ హైసూ్కల్, ప్రాక్టీసింగ్ హైసూ్కల్, పంజగుట్ట పడవ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు, స్థానికులు ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొంటున్నారు. ఇదీ చదవండి: సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్! ఈనెల 15వ తేదీ వరకు సమ్మర్ క్యాంపు.. ఈ సమ్మర్ క్యాంప్ ఉదయం 8నుంచి 11గంటల వరకు ఉంటుందన్నారు. ఈ క్యాంపు ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కంప్యూటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగా, మెడిటేషన్, ఇంగ్లిష్, సైన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. గణితం ట్రిక్స్ ఇందులో నేర్పిస్తున్నారు. కబడ్డీ, ఖోఖో ఆటల్లో కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లిష్ టీచర్ ప్రసాద్‌బాబు ఈ సమ్మర్ క్యాంప్ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనేలా చేసి విద్యార్థులకు వివిధ అంశాల్లో మెలకువలు స్తున్నారు. సమ్మర్ క్యాంప్ తమకెంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వచ్చే నెలా 10వ తేదీ వరకు పొడిగిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్‌కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్‌లోని పగ్వరా రైల్వే స్టేషన్‌కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్‌రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్‌లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్‌లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్‌లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్‌లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్‌రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్య పూర్తయ్యే సరికి ఉద్యోగం!
సాక్షి, హైదరాబాద్: యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించే మరో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ‘ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రాం’కింద ఐదు నెలల శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ ఐయాన్ (టీసీఎస్ ఐయాన్) ముందుకొచి్చందని చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎస్ ఐయాన్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సచివాలయంలో హైదరాబాద్ జేఎన్టీయూ, టీసీఎస్ ఐయాన్ సంస్థల మధ్య విద్యార్థులకు శిక్షణకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పి యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. తొలుత మంథని జేఎన్టీయూ విద్యార్థులకు శిక్షణ: ‘సాంకేతిక నైపుణ్యాలు లేకుండా డిగ్రీలతో ఉద్యోగాలు రావడం కష్టం. దీనిని అర్థం చేసుకున్నందునే శిక్షణపై దృష్టి సారించాం. చదువు పూర్తి చేసే సమయానికి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం పెంచగలిగితే ఉద్యోగాలు ఇవ్వడం కోసం కంపెనీలు వాటికవే పరుగెత్తుకుంటూ వస్తాయి. టీసీఎస్ ఐయాన్ సంస్థ మొదటి దశలో ప్రతి ఐదు నెలల (20 వారాల)కు 100 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తుంది. ఆ సంస్థతో ఎంప్యానెల్ అయిన మూడు వేలకు పైగా కంపెనీలు వీరిలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాలు కల్పిస్తాయి. పైలట్ కార్యక్రమం కింద మొదట మంథనిలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులను నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తాం..’ అని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ సంసిద్ధత కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి, స్కిల్ ఎడ్యుకేషన్ బిజినెస్ హెడ్ స్మృతి ముల్యే, జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి.కిషన్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీటీఈఎల్ పరీక్షలు రాసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఆర్జియూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లోని ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు సోమవారం నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ (ఎన్పీటీఈఎల్) పరీక్షలను రాశారు. ఈ పరీక్షలకు నాలుగు క్యాంపస్‌లలో కలిపి 10,300 మందికిపైగా విద్యార్థులు హాజరైనట్టు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఎన్పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ రంగంలో సైతం అతి వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఉన్నవారికే సాంకేతిక రంగంలో ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ నిర్వహిస్తున్న 500కు పైగా ఎన్పీటీఈఎల్ కోర్సులను నేర్చుకునేందుకు నాలుగు ట్రిపుల్ ఐటీలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబర్చడంతో మద్రాస్ ఐఐటీతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది. యాక్సెలరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ నెట్వర్క్ అనాలసిస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ మెషీన్ లెర్నింగ్, ఆన్లైన్ ప్రైవసీ, బ్లాక్ చైన్, డేటాబేస్ సిస్టమ్స్, ఎథికల్ హ్యాకింగ్ తదితర అనేక సర్టిఫికెట్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఐఐటీ మద్రాస్ రూపొందించిన ఈ కోర్సులు ప్రత్యేకమైనవి. విద్యార్థులు తమ సిలబస్ లేదా బ్రాంచ్‌కు సంబంధం లేకుండా, నేటి సాంకేతిక అవసరాలకు అనుగుణంగా అదనపు జ్ఞానం, నైపుణ్యాలను పొందడానికి ఈ కోర్సులు దోహదపడతాయి. ఈ కోర్సులను నేర్చుకోవడానికి సాధారణ ఫీజు రూ.1000 కాగా, ఆర్జీయూకేటీ విద్యార్థులకు రూ.500 రాయితీ ఇచ్చింది., మిగిలిన మొత్తం యాజమాన్యం చెల్లిస్తుండటంతో విద్యార్థులపై ఏమాత్రం ఆర్థిక భారం పడట్లేదు.విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన డైరెక్టర్ఇదిలా ఉండగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ విద్యార్థులతో కలిసి పరీక్ష రాశారు. దీంతో పరీక్ష హాలులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తోటి విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు డైరెక్టర్ ఇలా పరీక్ష రాశారు. -
బయాలజీ ఈజీ... ఫిజిక్స్ టఫ్
సాక్షి ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పెన్–పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 550 పట్టణాల్లో 5వేలకుపైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. దాదాపు 22.7 లక్షల మంది నీట్ యూజీ– 2025కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...190 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 90 శాతానికి పైగా హాజరైనట్టు అధికారులు చెబుతున్నారు. 2024లో 77,849 మంది పరీక్ష రాయగా, 47,371 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జరిగిన పరీక్షకు హాజరైన విద్యార్థులు బయాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ నుంచి ఎక్కువ ప్రశ్నలు నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్ అత్యంత కఠినంగా, కెమిస్ట్రీ మధ్యస్తంగా, బయాలజీ తేలిగ్గా ఉన్నట్టు పరీక్షకు హాజరైన విద్యార్థులతోపాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. 11వ తరగతితో పోలిస్తే.. 12వ తరగతి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లోనూ థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. రీజన్, అసెర్షన్ ఆధారిత ప్రశ్నలు సైతం అడిగారు. మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ బేసిక్స్, కాన్సెప్ట్‌లు, ఫార్ములాలపై పట్టుతోపాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. బయాలజీ సులభం బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. బోటనీ, జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. జెనెటిక్స్, హుమ్యాన్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. థియరీ ఆధారిత, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. బోటనీ, జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. దీంతో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచి్చనట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమిస్ట్రీ మధ్యస్తం కెమిస్ట్రీ నుంచి అడిగిన 45 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండగా.. మొత్తమ్మీద ఈ విభాగం మధ్యస్తంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే మాత్రం ఈసారి కెమిస్ట్రీ విభాగంగా కొంత కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీల కాన్సెప్ట్‌ల నుంచి ప్రశ్నలు అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 ప్రశ్నలు, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వలిబ్రియంల నుంచి 1 ప్రశ్న చొప్పున అడిగారు. కెమిస్ట్రీలోనూ అధికంగా ఎన్సీఈఆర్టీ నుంచి ప్రశ్నలు అడిగారు. కొన్ని పశ్నలు మాత్రమే అప్లికేషన్ ఆధారితంగా, లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సినవి ఉన్నాయి. ఫిజిక్స్ క్లిష్టం ఫిజిక్స్ క్లిష్టంగా, ట్రిక్కీగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విభాగం నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో వీటికి సమాధానాలు సాధించడంలో సమయాభావం ఎదురైనట్టు చెప్పారు. ఫిజిక్స్ నుంచి అడిగిన 45 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు దాదాపు గంటర్నర సమయం పట్టినట్టు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. గతేడాది ఎక్కువగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగితే.. ఈ ఏడాది ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ప్రశ్నలు ఎదురైనట్టు పేర్కొంటున్నారు. బయాలజీ, కెమిస్ట్రీతో పోలి్చనప్పుడు ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్‌లో కాన్సెప్ట్‌లతోపాటు ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కాన్సెప్ట్లపై స్పష్టత తప్పనిసరిగా మారింది. ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నటిక్ ఎఫెక్ట్, కైనమేటిక్స్, థర్మోడైనమిక్స్ల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున; మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, యూనిట్ అండ్ డైమెన్షన్, రొటేషనల్ నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు. -
EPCET కు హాజరైన విద్యార్థులు (ఫోటోలు)
-
సెలవులొచ్చాయి ఆడించండి... చదివించండి..
‘వంక’లు లేవు వాగులు లేవు... చెప్పడానికి సాకులు లేవు. వేసవి సెలవులు వచ్చేశాయి. సోషల్ మీడియా బందీఖానా నుంచి పిల్లలను ఇప్పుడు రిలీజ్ చేయాలి. పుస్తకాలకు దగ్గరగా తీసుకురావాలి. విక్రమార్కుడి సింహాసనం ఎక్కిస్తే కథల దర్బారులోకి వారే ప్రవేశిస్తారు. వేసవి సెలవుల్లో ఉన్న 50 రోజుల్లో పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి, ఏవి చదవాలి? వేసవి శీర్షిక ‘వేసవి కాలమ్’లో మొదటి కథనం.పిల్లలకు బడి గంట ఇష్టమే. కాని స్కూల్ మొదలయ్యేప్పుడు కొట్టే గంట కంటే స్కూల్ వదిలేప్పుడు కొట్టే గంట ఎక్కువ ఇష్టం. ఆ గంట వినపడగానే పుస్తకాలు తీసుకుని క్లాస్ నుంచి పరిగెత్తుతారు. కొందరు ప్లేగ్రౌండ్‌కు వెళతారు. కొందరు ఇంటికి చేరి వెంటనే చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ను పోగేస్తారు. ఎందుకు? ఇంకెందుకు... ఆటలు ఆడటానికి.ఇంట్లో నుంచి అమ్మ పిలుస్తున్నా... ఏదైనా తిని వెళ్లమని అరుస్తున్నా పిల్లలు లెక్క చేయరు. ఆడుతుంటారు. ఆడుతూ అరుస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. పేచీ పెడుతూ ఉంటారు. ఓడుతూ ఉంటారు. గెలుస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ చెమట చిందిస్తూ ఉంటారు.పిల్లలూ చెమటా కవలలునేడు... పిల్లలకు చెమటే లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఆడటం లేదు కాబట్టి. ఆడే బదులు ఓ.టి.టి.లో, కంప్యూటర్లో, సోషల్ మీడియానో తమ బాల్యంతో ఆటలాడుకోవడానికి వీలు కల్పిస్తున్నారు కాబట్టి.దొంగ... పోలీస్‘దొంగ పోలీస్’ ఆట అందరికీ తెలుసు. ఇవాళ దొంగ పోలీస్ ఆట ఎంతమంది పిల్లలకు తెలుసు? ఎంత సింపుల్ ఆట ఇది! ఐదారు మంది పిల్లలు కలిసి పంటలు వేసి గెలుస్తారు. ఆఖరున మిగిలినవాడు పోలీస్ అయ్యి గోడ వైపు తిరిగి వంద లెక్కబెడతాడు. ఈ లోపు పిల్లలు దాక్కుంటారు. ఆ దాక్కున్న వాళ్లను పోలీస్ కనిపెట్టాలి. కనిపెట్టలేకపోతే పోలీస్ ఓడిపోతాడు. ఈ ఆట ఆషామాషీ ఆటనా? పిల్లల మెదడుకు తర్ఫీదు ఇస్తుంది.మున్ముందు జీవితంలో తారసపడబోయే వారిలో ఎవరు దొంగ.. ఎలాంటి దొంగ... వాడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది... ఎవరు ఏ మేరకు తప్పించుకోలరు... అదొక్కటేనా? మన వ్యక్తిత్వంలో దొంగ పనులు ఎలా చోటు చేసుకుంటున్నాయి... వాటిని వెతికి పట్టుకొని జైలుకు పంపితే ఎంత మంచి విద్యార్థులం కాగలం... అసలు దొంగలా దాక్కునే బతుకు ఎంత నీచమైనది.... ఇవన్నీ పైకి చెప్పకనే నేర్పిస్తుంది.ఇవాళ్టి పిల్లలకు కామిక్ హీరో, యూట్యూబ్ గేమర్ తెలుసుకాని దొంగ పోలీస్ తెలీదు. పైగా పిల్లలు ఆ ఆట ఆడుతూ కనిపిస్తే పెద్దలే నవ్వి, జోకులేసి ‘మరీ ఈ ఆటలా’ అని ఆపించేలా ఉన్నారు.ఆట లేకుంటే ఆందోళనపిల్లలు ఆడేందుకు పుట్టారు. ఆడి ఆడి వారు పెద్దవాళ్లవ్వాలి. ఆటకు దూరమయ్యి కాదు. ‘పిల్లల చైల్డ్‌హుడ్ యాంగ్జయిటీకి వారు ఆటలకు దూరం కావడమే కారణం’ అంటారు జోనాథన్ హైడ్ అనే సోషల్ సైకాలజిస్టు. ఆటకు బదులు టీవీ, కంప్యూటర్, సోషల్ మీడియాకు బానిసైన ఏ పిల్లవాడైనా దృష్టి చెడి, నిద్ర చెడి, కల్మషం నింపే కలకలం రేపే కంటెంట్‌ను చూసి ఆందోళనకు గురవుతాడు. కదలిక లేని మెదలిక లేని కుర్చీలో కూలబడి కేవలం మెదడుకు ఒత్తిడి ఇవ్వడం ద్వారా మెదడుతో పాటు శరీరం కూడా శుష్కమయ్యి మెదడకు తగిన శక్తి ఇవ్వడంలో వెనుకబడుతుంది.వివాదాల ఇల్లుఅయితే తల్లిదండ్రులు చాలా నియమాలు పెట్టాలని చూస్తారు. టీవీ ఆఫ్ చేస్తారు. రౌటర్ కట్ చేస్తారు. ఓటీటీ రెన్యువల్ చేయరు. ఈ తల్లిదండ్రులే కోవిడ్ కాలంలో ఇవన్నీ అలవాటు చేశారు. ఇప్పుడు వద్దంటే పిల్లలు మానుతారా? ఆటలు ఆడి శ్రమ చేయడానికి ఇష్టపడకపోగా కుర్చీలో కూలబడి పొందే వినోదం కోసం తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూ ఉంటారు. దాంతో ఇంట్లో ఆశాంతి నిండిపోతుంది. అందుకే జోనాథన్ హైడ్ ఏమంటారంటే ముందు పిల్లలకు పుస్తకాలు అలవాటు చేయండి. తర్వాత ఆటల్లోకి తీసుకురండి అని.కట్టెల మోపు కథచనిపోయే ముందు ఒక తండ్రి తన నలుగురు కొడుకులకు ఒక్కొక్క కట్టె ఇచ్చి విరవమంటాడు. వాళ్లు విరుస్తారు. ఇప్పుడు నలుగురి చేతుల్లో ఉన్న కట్టెలను మోపుగా కట్టి విరవమంటాడు. కొడుకులు విరవలేకపోతారు. ‘కలిసి ఉంటే ఇలా బలంగా ఉంటారు’ అని చనిపోతాడు తండ్రి. కొడుకులు ఆ ఐకమత్యాన్ని పాటిస్తారు. కథలు ఎన్నో విషయాలు చెబుతాయి. నేర్పుతాయి. సూక్ష్మబుద్ధిని చూపుతాయి.సమస్యలు ఎదురైతే తెనాలి రామలింగడిలా దొంగల చేతే బావిలోని నీళ్లన్నీ చేదించి పాదులు తడుపుకునే తెలివితేటలను ఇస్తాయి. భారతదేశంలో నుంచి ప్రపంచం కథలను తీసుకుంటే మన పిల్లలకు మనం కథలను దూరం చేస్తున్నాం. పిల్లల నిపుణులు ఏమంటారంటే బొమ్మలున్న కథల పుస్తకాలు చిన్న పిల్లలకు కామిక్సు, గ్రాఫిక్ నవలలు టీనేజర్లకు ఇచ్చి వారికి పుస్తకాలు అలవాటు చేయమని. పుస్తకం చదివిన పిల్లలు ఆ కథను తోటి పిల్లలతో పంచుకోవాలనుకుంటారు. నలుగురు పిల్లలూ కథలు చెప్పుకోవడానికి కూడతారు. ఆ తర్వాత? ఆడుకుంటారు. ఇదీ ఆరోగ్యకరమైన బాల్యం అంటే.క్లాసులు... స్పెషల్ క్లాసులు...ఆటల బదులు మార్కులు, సాటి పిల్లలకు బదులు ట్యూషన్ క్లాసులు చుట్టుముట్టి పిల్లలను ఆందోళనలోకి నెడుతున్నాయి. కాలూ చేయీ కదపని దేహం బుద్ధిని ఎలా కదుపుతుంది? ఫిట్‌గా లేని శరీరం ర్యాంకులు ఎలా తెస్తుంది? ఆటలో పడి లేస్తారు పిల్లలు. అది అలవాటైతే చదువులో పడినా లేవడం తెలుసుకుంటారు. లేదా లేవడానికి కథల్లో చదివిన ఒక ఉదాత్త నాయకుడిని తోడు తెచ్చుకుంటారు. ఆటపాటలు లేకపోవడం వల్లే నేడు పిల్లలు ర్యాంకు రాకపోయినా ఫెయిల్ అయినా చాలా దూరం పోతున్నారు. సెలవులొచ్చాయి. ఆడించండి. చదివించండి. -కె. -
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్య వన్నె తగ్గుతోంది. ఓవైపు ఏటికేటికీ తగ్గుతోన్న ప్రవేశాలు..కళాశాలల్లో అధ్యాపకుల కొరత ...ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు..మరోవైపు కొత్త పుంతలు తొక్కుతోన్న అధునాతన ఇంజినీరింగ్ కోర్సులు..వెరసి పాలిటెక్నిక్ ఉనికికి సవాల్ విసురుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ల కిందట అమలు చేయగా...ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్నాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. 59 శాతం ప్రైవేటు యాజమాన్యాలే.. పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు సీట్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2024–25లో ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో 3566 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే వాటిలో 59 శాతం ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండటం గమనార్హం. ఆదర్శం..ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలిటెక్నిక్ విద్య ప్రారంభంలో ప్రభుత్వ హయాంలోనే నడిచేది. కాల క్రమేణా ప్రైవేటు పరం చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో పాలిటెక్నిక్ విద్య నాసిరకంగా మారింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వమే నడిపిస్తోంది. వాటిలో గోవా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, దాద్రా–నాగర్ హవేలీ ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరగలేదు. ఏటా క్షీణిస్తున్న ప్రవేశాలు..పాలిటెక్నిక్‌లో ఏటా సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 2017–23 వరకు ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదో వంతు (19.7 శాతం) సీట్లు తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కూడా భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సవరించిన సంగతి తెలిసిందే. అయిననప్పటికీ తగిన ఫలితం కనిపించట్లేదు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యను ఢిల్లీ మాదిరిగా కొన్ని రాష్ట్రాలు నైపుణ్య విశ్వవిద్యాలయాల కిందకు తీసుకురావాలని భావిస్తున్నాయి. మరోవైపు ఫీజులు కూడా భారీగా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు మరలుతున్నారు.మెరుగుపడాలంటే.. ⇒ పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ⇒ ప్రభుత్వాలు కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ⇒ స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తి పరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. దీన్ని అధిగమించాలి. ⇒ ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్ విద్యను ప్రభావితం చేస్తోంది. ఈలోటును భర్తీ చేయాలి. ⇒ లైబ్రరీలు, ప్రయోగశాలలు, తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి. అలాగే వర్క్‌షాప్‌లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి: ఆప్టా
సాక్షి, అమరావతి: ప్రభుత్వం 117 జీవోకు ప్రత్యామ్నాయంగా తెస్తున్న మార్పులతో రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగి విద్యార్థుల చేరిక తగ్గిపోయి మూతబడే ప్రమాదముందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ పరిస్థితి రాకుండా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాసినట్టు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు తెలిపారు. మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంగా నియమించే కంటే వారిని యూపీ పాఠశాలలో నియమిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే, ఎస్జీటీలకు పదోన్నతి కలి్పంచి మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎంలుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. -
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడికి టాటా.. 50 రోజుల ఆట
సాక్షి, హైదరాబాద్: పరీక్షా కాలం ముగిసింది.. చదువుల ఒత్తిడి నుంచి పిల్లలకు విరామం లభించింది.. బడులకు టాటా చెప్పి ఆటపాటలతో సేదతీరే వేళయింది. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో దాదాపు 50 రోజులపాటు సందడే సందడి నెలకొననుంది. అయితే వినోదాల పేరిట పిల్లలు ఇష్టారీతిన వ్యవహరిస్తూ దారితప్పకుండా తల్లిదండ్రులు ఇప్పుడే దృష్టి పెట్టాలని.. వారు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. అవసరమైన మార్గదర్శనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక రచించాలంటున్నారు. కాసేపు టీవీలు చూడనిచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి ఆడుకొనే ఆటలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.ఆన్‌లైన్‌కు బానిసలు కానివ్వొద్దుపట్టణాలు, నగరాల్లో పిల్లలకు ఆటస్థలాల కొరత వల్ల చాలా మంది సెల్ఫోన్లు, ఆన్లైన్ ఆటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల 50 రోజుల్లో వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త అంజలా గౌరీ తెలిపారు. ఈ విధానం వల్ల రెండేళ్లలో మెదడు మొద్దుబారి విచిత్ర ధోరణి ప్రదర్శించిన 28 మందికి కౌన్సెలింగ్ ఇచి్చనట్లు చెప్పారు. రేయింబవళ్లు సెల్ఫోన్లకు పరిమితమవడం నిద్రలేమికి దారితీస్తుందని.. ఫలితంగా వారి మానసిక ధోరణిలో మార్పులొస్తాయని హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణులు అరోరీ వాగ్దేవి తెలిపారు. గతేడాది వేసవి సెలవుల్లో తన కుమారుడు అదేపనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల తిరిగి స్కూల్ తెరిచాక ఏడాదంతా పాఠ్యపుస్తకాలు చదవాలంటే ఒక రకమైన భయం పట్టుకుందని కూకట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి తల్లి పేర్కొన్నారు.బంధాల వైపు మళ్లించాలి పిల్లలకు అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లలో గడిపే అవకాశం ఇవ్వడం వల్ల సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు పొడుపు కథల వంటివి వారి నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుగు భాషపై వరంగల్ స్కాలర్ వినీత్ భార్గవ్ జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచి్చంది. నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మల అనుభవాల్లోంచి కథలు నేర్చుకొనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. 100 మందిలో 82 మంది తరగతి గదుల్లోనూ చురుకుగా వ్యవహరించిన తీరును గుర్తించామని ఆయన పేర్కొన్నారు.దీంతోపాటు గ్రామీణ అనుబంధాలు, బంధువులతో మమేకమైనప్పుడు కలిగే అనుభూతులు విద్యార్థుల మానసిక ధోరణిలో మార్పు తెస్తున్నాయన్నారు. అనుబంధాలు పెంచుకొనే పిల్లల మానసిక ధోరణి ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటోందని భారత సైకాలజీ అసోసియేషన్ జరిపిన ఓ పరిశోధన తేల్చింది. 468 మందిపై అసోసియన్ ఆన్లైన్ సర్వే చేపట్టింది. ఎవరికి ఎవరు అనే ధోరణి నుంచి బయటపడిన పిల్లల్లో 332 మంది వేసవి సెలవుల్లో పెద్దవాళ్ల దగ్గర నేర్చుకున్న జ్ఞానమేనని తేలింది.జాగ్రత్తగా వ్యాయామంఆట విడుపులో భాగంగా పిల్లలు నిత్యం క్రికెట్, కబడ్డీ లాంటి రకరకాల క్రీడలు ఆడుతుంటారు. దీనివల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా బలపడతారని వ్యాయామ కళాశాలలో విశేష అనుభవం ఉన్న జీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆటలతో స్నేహాలు మరింత మెరుగవుతాయని.. కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు.అయితే ఈ క్రమంలో పిల్లలు ఘర్షణలు, విభేదాల వైపు మళ్లకుండా మార్గదర్శకుల పర్యవేక్షణలో వారు ఆటలు ఆడేందుకు వీలున్న గ్రౌండ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తూ సేదతీరుతుంటారు. అయితే ఇందులో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఇలాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.⇒ వేసవి సెలవుల్లో పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడమో లేదా ఎండలో స్నేహితులతో తిరగడమో చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు నీతికథలు చెప్పాలి. గ్రామాల్లో ఇరుగుపొరుగు పిల్లలందరినీ ఒకచోట కూర్చోబెట్టి వారికి లోకజ్ఞానం నేరి్పంచే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలు కూడా ఇవే కోరుకుంటున్నారు. బోర్‌గా ఫీలవ్వడం లేదు. – కాకి వీరభద్రం, వనం వారి కృష్ణాపురం, ఖమ్మం జిల్లా⇒ కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లల్లో పెరిగింది. దాని గురించి నేర్పడానికి ఇదే మంచి తరుణం. వేసవిలో వారితో కూర్చొని ఏఐపై కసరత్తు చేస్తే పిల్లలు బోర్‌గా ఫీలవ్వరు. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా మోటివేషన్ బాగా పనిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దలు చొరవ తీసుకొని ఆన్లైన్లో ఏఐపై శిక్షణ ఇప్పించాలి. – కంకిపాటి శేషుకుమార్, హైదరాబాద్ -
చిన్నారి హల్ సెల్
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్‌లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్‌కు బానిసైనట్టు స్మార్ట్‌ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్‌ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్‌కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్‌ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్‌లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అనారోగ్య సమస్యలు తప్పవుసెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుసోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.comతో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడి యెట్ ఫలితాల్లో ప్రభుత్వ గురు కులాలు మంచి ఫలితాలు కనబరి చాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలే జీలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో సగటున 80% ఫలితాలు నమోద య్యాయి.అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం ఈసారి ఫలితాలు నిరాశే మిగి ల్చాయి. ఫస్టియర్‌లో 42 శాతం, సెకెండియర్లో 53 శాతానికి మాత్రమే రిజల్ట్ పరిమితమైంది. ఇక రూ.లక్షల్లో ఫీజులు తీసుకునే, గంటల కొద్దీ బోధన చేసే ప్రైవేటు కాలేజీల్లో 69.8 శాతం (ఫస్టియర్), 65.83 శాతానికే (సెకెండియర్) రిజల్ట్స్ పరిమితం కావడం గమనార్హం. -
ఎంపీసీలో టాప్ 996
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం ఎంపీసీ గ్రూప్‌లో నలుగురు విద్యార్థులు 1,000కి 996 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు ముగ్గురు విద్యార్థులు 469 మార్కులు సాధించారు. ఫస్టియర్ బైపీసీలోనూ 440 మార్కులకు నలుగురు 339 మార్కులు సాధించారు. ఈ సంవత్సరం బైపీసీలో టాప్ మార్కులు 997గా నమోదయ్యాయి. ఇంటర్‌బోర్డ్ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టాపర్ల వివరాలు ఇలా.. మొదటి సంవత్సరం (ఎంపీసీ): సి.అక్షయ, పుప్పాలగూడ, హైదరాబాద్ 469/470; పుట్టపోగుల వర్షిణి, బాచుపల్లి, హైదరాబాద్ 469/470; మామిడి సంహిత, వనస్థలిపురం, హైదరాబాద్ 469/470.బైపీసీ: బి. లావణ్య, టీఎస్ఆర్జేసీ, మహబూబ్‌నగర్ 439/ 440; సయ్యద్ అర్షియా సమ్రీన్, మలక్‌పేట్, హైదరాబాద్ 439/440; హస్పాబేగం, టోలీచౌక్, హైదరాబాద్ 439/440 ; వాదుల వైష్ణవి, బాలానగర్, మహబూబ్‌నగర్ 439/440. సీఈసీ: ఎండీ ఫర్హాన్, గుర్రంగూడ, రంగారెడ్డి జిల్లా495/500; మునీబ్ అహ్మద్ ఖాన్, కార్వాన్, హైదరాబాద్ 494/500.హెచ్ఈసీ: తంగోరు వెన్నెల, సుదిమళ్ల ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ 494/500; జంగం గ్లోరీ, సికింద్రాబాద్ 493/500.మొత్తంగా ఇంటర్ టాపర్స్ ఎంపీసీ: ఇందూరి రషి్మత, రోటరీనగర్, ఖమ్మం 996/1,000 ; వారణాసి మనస్వి, జీడిమెట్ల, రంగారెడ్డి 996/1,000; కూనా రుతి్వక్, కొత్తపల్లి, కరీంనగర్ 996/1,000; పల్లెపంగ వసంత్‌కుమార్, సూర్యాపేట 996/1,000.బైపీసీ: జక్కు అంజన, కొత్తపల్లి, కరీంనగర్ 997/1,000; కేతావత్ అఖిల, పెంచికల్‌పాడ్, దేవరకొండ 996/1,000; డి జ్యోత్స్నశ్రీ, కరీంనగర్ 996/1,000.సీఈసీ: ఎనుబారి కెవిక్ జోష్, మేడ్చల్ 988/1,000; భక్తు గ్రీష్మ, భగత్‌నగర్, కరీంనగర్ 987/1,000.హెచ్ఈసీ: గుండెబోయిన ధనప్రియ, మదీనాగూడ, రంగారెడ్డి 983/1,000; ఓనీ అభినా‹Ù, శేరిలింగంపల్లి, రంగారెడ్డి982/1,000. కాగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.గ్రూప్స్ సాధించడమే లక్ష్యంపల్లెపంగు వసంత్ కుమార్, (996) ఎంపీసీ, ప్రతిభ జూనియర్ కళాశాల, సూర్యాపేట సూర్యాపేట: స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో గ్రూప్– వన్ ఆఫీసర్ కావాలన్నదే నా కల. నాన్న కానిస్టేబుల్ శీనయ్య, అమ్మ జానకమ్మల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగాను. ప్రతిభ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.నా లక్ష్యం డాక్టర్ నేను చదివిన కాలేజీ యాజమాన్యం అందించిన ప్రణాళికాబద్ధమైన బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి రాష్ట్రంలో టాపర్‌గా నిలవడం గర్వంగా ఉంది. నీట్ పరీక్షలో సత్తాచాటి సీటు సాధించడంతో పాటు వైద్య విద్య అభ్యసించడమే నా లక్ష్యం.– జె.అంజనా, కొత్తపల్లి, కరీంనగర్ (బైపీసీ 997/1000)సివిల్ సర్వెంట్‌గా..ఇంటర్ సెకండియర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. పటిష్ట ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో అగ్రభాగాన నిలిచినందుకు సంతోషిస్తున్నా. రాబోయే కాలంలో ఉన్నత విద్యనభ్యసించి యూపీఎస్సీ సాధించి సివిల్ సర్వెంట్‌గా సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా. – కె.రుత్విక్, కొత్తపల్లి, కరీంనగర్ (ఎంపీసీ996/1000) -
సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
-
వేసవి సెలవులు.. విద్యార్థులకు ఆదాయ మార్గాలు..!
స్కూళ్లు, కాలేజీలకు విరామం వచ్చిన ఈ సమయం యువతకు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, స్వల్ప ఆదాయం సంపాదించడానికి మంచి అవకాశం. ఆదాయం, అనుభవం రెండింటికీ అనేక రంగాల్లో సమ్మర్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన దిశలో అడుగేస్తే, ఈ వేసవి తమ జీవితానికే మార్గనిర్ధేశం చేసేదిగా మారవచ్చని భావిస్తున్న విద్యార్థులు సెలవుల్లో పలు ఆదాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో కొన్ని.. కాల్ సెంటర్ / బీపీఓలు.. ఐటీ హబ్‌గా మారుతున్న నగరంలో పలు కంపెనీలు తాత్కాలిక కాల్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి 10వ తరగతి నుంచి ఇంటరీ్మడియట్ విద్యార్థులు సైతం అర్హులే. పనివేళలు షిఫ్ట్ ప్రాతిపదికన ఉండటంతో సెలవులు ముగిశాక కూడా అవసరం అనుకుంటే క్లాసుల వేళలతో సమన్వయం చేయవచ్చు. నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. ట్యూటరింగ్ /హోం ట్యూషన్లు.. పాతదే అయినా ఇప్పటికీ వన్నెతగ్గని ఉపాధి ఇది. ఇంటర్ లేదా డిగ్రీ చదువుతున్న యువత, పాఠశాల విద్యార్థులకు హోమ్ ట్యూషన్లు చెప్పడం ద్వారా నెలకు రూ.15 వేల వరకూ ఆదాయం వస్తోంది. కొంతమంది ఆన్లైన్ ట్యూటర్‌గా కూడా పని చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. రిటైల్, కస్టమర్ సర్వీస్ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ షోరూమ్స్‌లో కస్టమర్ సర్వీస్, క్యాషియర్, స్టాక్ మేనేజ్మెంట్ వంటి ఉద్యోగాలు వేసవిలో తాత్కాలికంగా లభిస్తాయి. వీటిలో నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుతుంది. ఈ ఉద్యోగం వల్ల ప్రధాన లాభం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కంపెనీలూ రెడీ.. స్వల్పకాలిక ప్రాజెక్ట్‌ల కోసం వేసవి సెలవుల్లో విద్యార్థులను నియమించుకోవడం అనేది కొంత కాలంగా కంపెనీలు అనుసరిస్తున్న విధానం. నగరంలోని ప్రొఫెషనల్ రెగ్యులర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ వేసవిలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పని చేయబోతున్నామని చెప్పారు. కళలు హ్యుమానిటీస్ నేపథ్యానికి చెందిన విద్యార్థులు కంటెంట్ రైటింగ్ నుంచి ఫీల్డ్ రీసెర్చ్ వరకు ఉద్యోగాలపై పని చేస్తుంటే, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి వచ్చిన వారు కంపెనీల ద్వారా అవుట్సోర్స్ చేసే ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు. విద్యార్థులు చెబుతున్న ప్రకారం, వేసవి ఉద్యోగాల ద్వారా నెలకు సగటున రూ. 20 వేల నుంచి రూ.35 వేల వరకు ఆదాయాలు ఉంటాయి. సెలవులు ప్రారంభం కావడానికి ముందే కళాశాలలు విద్యార్థులకు ఇలాంటి ఉద్యోగాలు అందుకోవడంలో సహకరిస్తున్నాయి.ఫుడ్ డెలివరీ అంతకంతకూ విస్తరిస్తున్న ఊబర్ ఈట్స్, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు ఎప్పుడూ ఉద్యోగుల అవసరం ఉంటుంది. డ్రైవింగ్ తెలిసిన యువతకు డెలివరీ బాయ్‌తో పాటు మరికొన్ని ఉద్యోగాలు కూడా లభిస్తాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించవచ్చు. ‘నేను ప్రస్తుతం ఒక ప్రసిద్ధ కంపెనీలో నెలకు రూ.12 వేల జీతంతో రెండున్నర నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. ఇది తక్కువ జీతానికి పని చేసినట్లుగా అనిపించవచ్చు. అయితే ఈ అనుభవం దీర్ఘకాలంలో సహాయపడుతుంది.‘ అని నగరానికి చెందిన విద్యార్థి హరితా సింగ్ చెప్పింది. (చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు) -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు దుర్గతి
-
ఫీజుల షెడ్యూల్‌కు బూజు!
ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్‌కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్‌షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్, బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్, హెచ్.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఎంటీఎఫ్) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్ జగన్ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఏప్రిల్‌లో ప్రాసెస్ చేసి షెడ్యూల్ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్‌గా ఫీజు రీయింబర్స్మెంట్ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇంజనీరింగ్ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్ ఇయర్ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్‌టికెట్ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్‌బుక్‌లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాకు మూడు టర్మ్‌లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్‌బుక్‌లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్ హుస్సేన్ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్ రిజ్వాన్ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా -
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్
ధర్మవరం: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్.. అదేమని అడిగిన తల్లిదండ్రులకూ అదే చెప్పు చూపించిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలో జీనియస్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో గొట్లూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సనధ్వైజ్, జశ్విన్, భరత్ 2వ తరగతి చదువుతున్నారు. రెండు రోజుల క్రితం టీచర్‌గా విధులు చేపట్టిన అనిత, తరగతిలో ఈ ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసి చెప్పుతో కొట్టింది. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వెళ్లి ప్రశ్నించారు. వారితోనూ ఆ టీచర్ అమర్యాదగా ప్రవర్తించారు. తాను కావాలని కొట్టలేదంటూనే.. ‘ఏదో అలా తగిలిందంటూ’ వారికి చెప్పు చూపించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురై, పాఠశాల కరస్పాండెంట్ ప్రేమ్ కిషోర్ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. టీచర్ అనిత, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది. -
Majji Srinivasa Rao: విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిన పవన్..
-
‘కంచ’ పోరు ఆగదు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అడవిని శాశ్వతంగా కాపాడుకునేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న అపూర్వ పోరాటంపై ప్రభుత్వం అపవాదులు వేస్తూ, బెదిరింపులకు దిగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులు నిస్వార్థంగా, ఉదాత్త లక్ష్యాలతో చేపట్టిన ఈ ఆందోళన అద్భుతమని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు, ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారిలా ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, భవిష్యత్ కోసం కంచ గచ్చిబౌలి స్థలం వేలాన్ని విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఎకో పార్క్ ఏర్పాటు, యూనివర్సిటీ తరలింపు వంటి ప్రతిపాదనలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. 50 ఏళ్లకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని, ఎకో పార్క్ కన్నా గొప్పగా ఈ క్యాంపస్ పర్యావరణ సమతుల్యతను కాపాడుతోందన్నారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలే ఉందని, ప్రభుత్వ బెదిరింపులను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. 400 ఎకరాల పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, విద్యార్థులకు అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. వేలం వేసే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పారు. -
నేటి నుంచి 1–9 తరగతుల పరీక్షలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి 1–9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్–2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1–8వ తరగతి వరకు ఉదయం 9–12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9–12.15 గంటల వరకు పరీక్షలుంటాయి. షెడ్యూల్ ఇదీ.. ⇒ ఉన్నత తరగతులకు (6–9) ఏప్రిల్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న థర్డ్ లాంగ్వేజ్, 10న గణితం, 11న జనరల్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, 12న బయాలజీ, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 16న కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం/ హిందీ, అరబిక్, పర్షియా లేదా ఓఎస్ఎస్సీ పేపర్–1, 17న ఓఎస్ఎస్సీ లేదా కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ఉంటుంది. ⇒ ప్రాథమిక తరగతులకు (1–5) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి‹Ù, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు), 15న ఓఎస్ఎస్సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి. పది రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు..! మరో 10 రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఈనెల ఒకటో తేదీ నుంచే ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి హాల్‌టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి, ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనున్నారు. -
టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు
ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు.వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది?అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేనివారు ఏ దేశంలోనూ ముందుకెళ్లలేరని చెబుతున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్ ఇక్కుర్తి (Venkat Ikkurthy). నైపుణ్యం ఉన్న ఎవరినీ ట్రంప్ కాదుకదా.. ఎవ్వరూ అడ్డుకోలేరని, నైపుణ్యం లేనివారిని ఎవ్వరూ రక్షించలేరని చెబుతున్నారాయన. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్‌కు డేటా సైంటిస్టుగా, అమెరికన్ యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా 30 ఏళ్ల అనుభవం ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తాజా పరిస్థితి, భారత విద్యార్థుల స్థితిగతుపై ‘జూమ్ ఇన్’లో ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రంప్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. అమెరికన్ చట్టాలనే కఠినంగా అమలు చేస్తున్నారు. తన దేశానికి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన. టారిఫ్‌లు వేయడం సర్వ సాధారణ విషయమే. కాకపోతే దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. భారత విద్యార్థులను అక్కడ వేధిస్తున్నారా? భారత్ నుంచి అమెరికాకు ఏటా 3.42 లక్షల మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఇందులో సగం మంది తెలుగు విద్యార్థులే. భారత విద్యార్థులంతా తెలివైన వాళ్లే. కాకపోతే నిబంధనలు వదిలేస్తారు. ఇప్పుడదే సమస్యగా మారింది. నిజానికి అమెరికావాళ్లు భారత పౌరులను గౌరవిస్తారు. గోల్డెన్ హ్యాండ్స్ (Golden Hands) అంటారు. అలాంటి వాళ్లు విద్యార్థులను ఎందుకు వేధిస్తారు. యూనివర్సిటీల్లో పార్ట్‌టైం జాబ్ చేసే ఎవరినీ ఏమీ అనడం లేదు. అడ్డదారిలో మాల్స్, హోటల్స్, ఇళ్లల్లో పనిచేయడాన్ని అడ్డుకుంటున్నారు. అమెరికాకు వచ్చేది దీని కోసమా? అసలు సమస్య ఏంటి? 2016లో అమెరికాకు వచ్చిన భారతీయులు (Indians) 40 వేలకు మించి లేరు. వీళ్లతా ఐఐటీ, ఎన్ఐటీ, పేరున్న వర్సిటీల్లో చదివిన వాళ్లే. ఎంఎస్ పూర్తయిన తర్వాత వాళ్లల్లో సగం మందిని అమెరికా మంచి ఉద్యోగాలిచ్చి ఉంచేసుకుంది. ఇప్పుడు వీళ్లే అమెరికాకు గొప్ప ఆస్తి. నైపుణ్యం ఉన్న విద్యార్థులను అమెరికా ఎప్పుడూ వదులుకోదు. కానీ ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. వీళ్లల్లో ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది? ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకే 295 జీఆర్ఈ స్కోర్ వస్తోంది. కానీ వీళ్లు 325 స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? కన్సల్టెన్సీలు తప్పుడు మార్గంలో జీఆర్ఈ రాయిస్తున్నాయి. వీటిని అమెరికా అధికారులు గుర్తించలేరా? మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి లేబర్ వీసాలపై వచ్చే నల్ల జాతీయుల ఉద్యోగాలు కూడా మనవాళ్లు చేస్తామని ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలకు ఇవే ప్రధాన కారణాలవుతున్నాయి. అమెరికా విద్యలో నాణ్యత ఉందా? అమెరికాలో 25 వేల విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు ఇవన్నీ ప్రైవేటువే. వీటిల్లో నాణ్యత ఉన్నవి కొన్నే. మిగతా వర్సిటీలు కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. కొన్ని వర్సిటీలు ఫీజుల్లో 40 శాతం కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. దీంతో కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ వర్సిటీలు విద్యార్థులు చదివినా చదవకపోయినా డిగ్రీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు 26 చోట్ల వాడారు. దీన్ని అమెరికా అధికారులు ప్రశ్నించారు. తన బంధువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లను కన్సల్టెన్సీలు ఇలా దుర్వినియోగం చేశాయి. నాణ్యత లేని వర్సిటీల్లో నెలకు ఒక క్లాస్ జరుగుతోంది. మిగతా రోజుల్లో మనవాళ్లు చట్ట విరుద్ధంగా డబ్బుల కోసం పని చేస్తున్నారు. ఒక హోటల్లో గంటలకొద్దీ పనిచేసే విద్యార్థి ఎంఎస్ ఎలా చదువుతాడు? అతడికి నైపుణ్యం ఎందుకు ఉంటుంది? అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది? అమెరికన్లు పనిచేయరు.. భారతీయులను ట్రంప్ అడ్డుకుంటున్నారు.. ఎలా? నిజమే.. అమెరికన్లు రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయరు. భారతీయులూ అలా చేయరనేది అమెరికన్ల నమ్మకం. అందుకే మెక్సికన్లకు ఈవీ–1 వీసా (అగ్రికల్చర్ లేబర్) ఇస్తారు. ఆ జాబితాలో భారత్ లేనేలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం మంచిదేనా? కరోనా తర్వాత యాంత్రీకరణ పెరిగింది. దీంతో హోటళ్లు, పెట్రోల్ బంకులు సహా అన్నింటిలోనూ రోబోలు వస్తున్నాయి. ముందుముందు మనవాళ్లు పోటీపడే పార్ట్‌టైం ఉద్యోగాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే స్కిల్ ఉద్యోగాలు కూడా కష్టమే. ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి? నైపుణ్యం ఉన్నవాళ్లను ఎవరూ అడ్డుకోలేరు. అది లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు. 2016కు ముందు వచ్చిన భారతీయుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వచ్చింది. వాళ్లిప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. కొత్తగా ఇండియా నుంచి వచ్చే పిల్లలకు అమెరికన్లు పోటీనే కాదు. పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వాళ్లే పోటీ. కాబట్టి నైపుణ్యం లేకుండా, డబ్బు సంపాదనే ధ్యేయంగా అమెరికా వస్తే ఇబ్బంది పడతారు. అమెరికా (America) వచ్చే ముందు ఒక్కసారి మీ నైపుణ్యం ఏమిటో? దేనికి సరిపోతారో బేరీజు వేసుకోండి. నైపుణ్యం పెరగాలంటే ముందుగా భారత విద్యా విధానంలో మార్పులు తేవాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల అవసరాలు తీర్చేలా లేదు. ఇంటర్వ్యూ: వనం దుర్గాప్రసాద్ -
చంద్రబాబుకు షాక్.. ఇంగ్లీష్ లో అదరగొట్టిన గురుకుల విద్యార్థులు
-
సెలవు చావుకొచ్చింది!
ఆదిలాబాద్‌రూరల్: సెలవు ఆ విద్యార్థుల చావుకొ చ్చింది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వైజాగ్‌కు చెందిన కాంబ్డే దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చారు. మావల మండల కేంద్రంలోని 170 కాలనీలో గుడిసెలు వే సుకుని నివాసం ఉంటున్నారు. వారికి రాహుల్ (9) (నాలుగో తరగతి), విశాల్ ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ మావల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్2లో చదివిస్తున్నారు. శనివారం పాఠశాలకు సెలవు ఉండడంతో రాహుల్, విశాల్, స్నేహితుడు చిప్పకుర్తి సంజీవ్ (10)తో కలిసి ఈత కొట్టేందుకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లారు. రాహుల్, సంజీవ్ స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. విశాల్ చెరువు చుట్టుపక్కల ఆడుకుంటూ ఉన్నాడు. కొంత సేపటికి రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోవడంతో గమనించిన విశాల్ విషయాన్ని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులకు స మాచారం అందించాడు. మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు.రెండు రోజుల్లో పుట్టిన రోజు..గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చిప్పకుర్తి రాజ్‌కుమార్ కుమారుడు సంజీవ్ నానమ్మ తారా బాయి వద్ద ఉండి మావల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో అతని పుట్టినరోజు ఉంది. ఇందుకోసం తారాబాయి తన పింఛన్ డబ్బులతో కొత్త బట్టలు కొనిచ్చేందుకు తీసుకెళ్దామని అనుకుంది. అంతలోనే స్నేహితులు రావడంతో వారితో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఈ విషాదకర వార్త తెలియడంతో తారాబాయి అక్కడికి చేరుకుని నా కోరిక తీరక ముందే వెళ్లిపోయావా.. అంటూ గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. -
కొంచెం సులభమే!
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ – 2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్లో రసాయనశాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చా యని తెలిపారు. న్యూమరికల్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోంచి ప్రశ్నలను ట్విస్ట్ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు. సాధారణంగా ఫిజిక్స్‌లో మధ్యస్తంగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉండేది. ఈసారి కెమిస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్నట్టు సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది రాస్తున్న ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది వరకు హాజరవుతున్నారు. బుధవారమే సీబీఎస్ఈ పరీక్ష కూడా ఉండటంతో, రెండూ ఎలా రాస్తారనే అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఎన్టీఏ సీబీఎస్ఈ పరీక్ష ఉన్న విద్యార్థుల స్లాట్ సమయాన్ని మార్చింది. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ వెసులుబాటు కల్పించింది. సబ్జెక్టులవారీగా ఇలా.. – మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని, ఫిజిక్స్ విభాగం క్లిష్టంగా, మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలు సుదీర్ఘంగా, మిగతా రెండు విభాగాలతో పోల్చితే కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. – ఫిజిక్స్‌లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, ఆప్టిక్స్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. న్యుమరికల్ ప్రశ్నల కారణంగా సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు తెలిపారు. రెండో షిఫ్ట్‌లో ఓ మోస్తరు కఠినమైన ప్రశ్నలు అడిగారు. మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్, మ్యాగ్నటిక్ ఫీల్డ్, యూనిట్ అండ్ డైమెన్షన్స్, రొటేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్ఫేస్ టెన్షన్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్, లాజిక్ గేట్, కైనమాటిక్స్ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. – జనవరి సెషన్‌తో పోల్చితే కెమిస్ట్రీలో ఈసారి ఓ మోస్తరు క్లిష్టతతో ప్రశ్నలడిగారని అంటున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోంచి నేరుగా అడిగారు. రెండో షిఫ్ట్‌లో కూడా ఇదే తరహాలో ప్రశ్నలు అడిగారు. ఫిజికల్ కెమిస్ట్రీలో న్యుమరికల్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. మొదటి షిఫ్ట్ మాదిరిగానే రెండో షిఫ్ట్‌లో కూడా ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. – మ్యాథమెటిక్స్ విభాగంలో జనవరి సెషన్‌తో పోల్చితే ఈసారి ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని, 5 ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా ఆధారంగా అడిగారని చెబుతున్నారు. రెండో షిఫ్ట్‌లో కూడా ఈ విభాగం ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. వెక్టార్ అండ్ 3డి, మ్యాట్రిసెస్, డిటరి్మనెంట్స్, లీనియర్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, కానిక్ సెక్షన్, ఎలిప్స్, ఏరియా అండర్ కర్వ్, ప్రాబబిలిటీలకు రెండో షిఫ్ట్‌లో ప్రాధాన్యం లభించింది. మొదటి షిఫ్ట్‌లో మాత్రం అధిక శాతం ప్రశ్నలు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్, బైనామియల్స్, సర్కిల్స్, లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్‌ల నుంచి అడిగారు. గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా.. రెండో సెషన్లో మొదటి రోజు పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు.. గత ప్రశ్న పత్రాల నుంచే అడిగారు. వీటిని బాగా ప్రాక్టీస్ చేసిన వారు ఎక్కువ సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. ఫార్ములాలు, కాన్సెప్్టలపై అవగాహన ఉన్నవారు కూడా సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలున్నాయి. కెమిస్ట్రీలో మిక్స్డ్ కాన్సెప్ట్ కొశ్చన్స్ అడిగారు. మ్యాథమెటిక్స్‌లో 52–56 మార్కులు; ఫిజిక్స్‌లో 75–85 మార్కులు; కెమిస్ట్రీలో 60–65 మార్కులతో 99 పర్సంటైల్ పొందే అవకాశం ఉంది. – ఎం.ఎన్. రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు. -
బూతులు తిడుతూ.. విద్యార్థినులను కొడుతూ..
వికారాబాద్: ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక స్కూల్ భవనం పైనుంచి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలిక ఘటనను మరువకముందే.. ఇదే స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినులను బూతులు తిడుతూ, కొడుతున్న వీడియో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నెల రోజుల కిందట ఓ పదో తరగతి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన బాలిక కాలు విరగగా ప్రాణాలతో బయటపడింది. ఇందుకు స్కూల్ సిబ్బంది వేధింపులే కారణమని బాధితురాలు తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఘటనను మరువక ముందే.. ముగ్గురు బాలికలను తన చాంబర్‌కు పిలిపించుకున్న ప్రిన్సిపల్ వారిని అసభ్యకరంగా తిడుతూ, ఇష్టానుసారం కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. జుట్టు ఎందుకు విరబోసుకున్నావ్.. యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు.. బయటకు ఎందుకు వెళ్లావ్ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేస్తున్న దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ బాలిక ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడుతున్నారు.… pic.twitter.com/hnk2eHUV0W— Telugu Scribe (@TeluguScribe) April 1, 2025 -
భోజనం లేదు.. పుస్తకాల్లేవు!
సాక్షి నెట్వర్క్/అమరావతి: అరకొర వసతుల మధ్య పుస్తకాల్లేకుండానే నూతన విద్యా విధానంలో ఇంటర్మీడియట్ మొదలైంది. మంగళవారం రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మార్చి 20వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తిరిగి పది రోజుల్లోనే రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులను కాలేజీలకు రప్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు.ఇంటర్మీడియట్ నూతన విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్య, అకడమిక్ సంస్కరణలపై మార్చి 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని బోర్డు కార్యదర్శి ఆదేశించినా అది విద్యార్థుల వరకు చేరలేదు. మంగళవారం ‘సాక్షి’ బృందం పలు కళాశాలలను సందర్శించగా, ఎక్కడా విద్యార్థుల హాజరు 10 శాతం మించలేదు. ఒకటో తేదీనే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో స్టూడెంట్ కిట్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేర లేదు. ఏ జిల్లాలోనూ విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చిన దాఖలా లేదు. వచ్చిన అరకొర విద్యార్థులకు చాలాచోట్ల మధ్యాహ్న భోజనం పెట్టలేదు.కొన్ని చోట్ల ఈనెల 3వ తేదీ వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉండడంతో ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి 801 ఉండగా, హైస్కూల్ ప్లస్‌లు 502, ప్రయివేట్ ఎయిడెడ్ కాలేజీలు 181 ఉన్నాయి. అయినప్పటికీ తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే నమోదైంది. తొలి ఏడాది పరీక్షలు రాసిన పది రోజుల్లోనే తిరిగి కాలేజీకి రావడం కొత్తగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఎండల తీవ్రత కారణంగా ఏప్రిల్‌లో తరగతులు సరికాదని మరి కొందరు పేర్కొన్నారు. అన్ని చోట్లా అరకొర హాజరే... ⇒ గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 401మంది విద్యార్థినులకు తొలిరోజు కేవలం 20 మందే హాజరయ్యారు. ఇక్కడ ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతుండడంతో ఉ.9 గంటలకు వచ్చిన విద్యార్థినులను అర్ధ గంటలోనే ఇళ్లకు పంపించారు. ⇒ ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలోకి 238 మంది విద్యార్థులు ప్రవేశించగా, మంగళవారం కేవలం 48 మందే వచ్చారు.⇒ ప్రకాశం జిల్లాలో 32 ప్రభుత్వ కళాశాలల్లో 2,200 మంది విద్యార్థులకు గాను, తొలిరోజు 120 మందే హాజరయ్యారు. ⇒ కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ కాలేజీలో 225 మంది విద్యార్థులకు గాను ఒక్కరూ హాజరుకాలేదు. చిప్పగిరి, హోళగుంద, గూడూరు, కోడుమూరు, కర్నూలు బి.క్యాంపు, మంత్రాలయం, నాగులదిన్నె, ఎమ్మిగనూరు కాలేజీల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 78 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ⇒ కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 171 మందికి కేవలం 29 మంది మాత్రమే వచ్చారు. ⇒ చిత్తూరు పీసీఆర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 258 మందికి గాను తొలి రోజు కేవలం 25 మంది హాజరయ్యారు. ఒకేషనల్ 196 మందికిగాను ఒక్కరూ హాజరు కాలేదు. పలమనేరు కళాశాలలో 339 మందికి 30 మంది, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 100 మందికి 10 మంది వచ్చారు. అన్ని కాలేజీల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలల్లో 1,372 మంది విద్యార్థులకుగాను, 344 మంది మాత్రమే హాజరయ్యారు.⇒ నెల్లూరు జిల్లాలో 51 ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను తొలి రోజు 500 మంది మాత్రమే వచ్చారు. కేజీబీవీ, మోడల్, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులే హాజరయ్యారు.మధ్యాహ్న భోజనం లేదు మా స్వగ్రామం లద్దగిరి నుంచి ప్రతిరోజు 15 కి.మీ ప్రయాణించి వెల్దుర్తి కాలేజీకి రావాలి. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. తొలిరోజు మధ్యాహ్న భోజనం పెట్టలేదు. ఇస్తామని చెప్పిన పుస్తకాలూ ఇవ్వలేదు. మా కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో సెకండియర్ వారు 78 మంది రావాలి. కానీ ఇద్దరమే వచ్చాం. అన్ని సౌకర్యాలు కల్పించాక తరగతులు ప్రారంభిస్తే బాగుండు. – దేవరాజు, సెకండియర్ సీఈసీ, లద్దగిరి, కర్నూలు జిల్లావేసవి సెలవులు ఇవ్వాలితొలి ఏడాది పరీక్షలు ముగిసిన పది రోజుల్లోనే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించడం కొత్తగా ఉంది. ప్రైవేట్ కాలేజీల్లో ఇప్పటికే ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. వారితో పోటీ పడాలంటే ఇప్పటి నుంచే తరగతులు నిర్వహిస్తే సబ్జెక్టులపై అవగాహన పెరుగుతుంది. అయితే ఎండలు ముదిరిన నేపథ్యంలో వేసవి సెలవులు ఇస్తే బావుంటుంది. – కె.సాయికృష్ణ, సెకండియర్ హెచ్ఈసీ విద్యార్థి, ఏలూరుపుస్తకాలు త్వరగా ఇస్తే మేలుగతంలో జూన్ లో కళాశాలలు ప్రారంభమయ్యేవి. ఇప్పుడేమో పరీక్షలు రాసిన పది రోజుల్లోనే కళాశాలకు రప్పించారు. ఈ విధానం మంచిదేననిపిస్తోంది. కాకపోతే ఎండల తీవ్రత అధికంగా ఉంది. అన్ని కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెడితే బావుంటుంది. పుస్తకాలు కూడా త్వరగా ఇవ్వాలి. – సయ్యద్ సమీర్, సెకండియర్ సీఈసీ, నక్కాస్, కడప -
పోలీసు పహారాలో హెచ్‌సీయూ
గచ్చిబౌలి/రాయదుర్గం: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడుకిపోతోంది. క్యాంపస్ మొత్తం పోలీసు పహారాలో ఉంది. మరోవైపు ఆందోలనలు కొనసాగిస్తున్న విద్యార్థులు, మంగళవారం నుంచి పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టబోమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు..క్యాంపస్‌లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ ప్రధాన ద్వారం వరకు స్టాపర్స్ అమర్చారు. ప్రధాన ద్వారం వద్ద యూనివర్సిటీ హస్టళ్ల ముందు గచ్చిబౌలి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించిన స్థలంలో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బందోబస్తును మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల రిమాండ్ పనులను అడ్డుకోవడం, తోపులాటకు దిగడంతో పోలీసు అధికారికి గాయాలయ్యాయంటూ టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హెచ్సీయూకు చెందిన ఇద్దరు పీహెచ్‌డి విద్యార్థులపై కేసు నమోదు చేశారు. పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ (ఎస్ఎఫ్ఐ) ఎర్రం నవీన్, కంప్యూటర్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్, ఏబీవీపీ నాయకులు రోహిత్ బొండుగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరిలించారు. వీరిపై బీఎన్ఎస్ 329 (3), 118(1), 132, 191(3), 351(3), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేటి నుంచి తరగతుల బహిష్కరణ హెచ్‌సీయూలో భూముల పరిరక్షణ కోసం మంగళవారం నుంచి తరగతులు బహిష్కరించి క్యాంపస్ లోని పరిపాలనా భవనం ముందు నిరవధిక నిరసన చేపట్టాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఇచ్చిన పిలుపునకు ఏఐఎస్ఏ, ఏఐఓబీసీఎస్ఏ, ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్‌యూ, ఫ్రటర్నిటీ, ఎంఎస్ఎఫ్, పీ డీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఎస్ఐఓ, టీఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం శవయాత్ర హెచ్‌సీయూ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శవయాత్రను నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కూల్ యూనిఫాం.. ఇక పక్కా కొలతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫాం తయారీలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకొచ్చింది. సగటు కొలతలకు బదులు కచ్చితమైన కొలతలతోనే యూనిఫాం అందించాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థి కొలతలనూ టైలర్లు వ్యక్తిగతంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులంతా దీన్ని విధిగా పాటించాలని ఆదేశించింది. గతం మాదిరి కాదు... గతంలో యూనిఫాంకు కొలతలు తీసుకొనే పద్ధతి వేరుగా ఉండేది. విద్యార్థులందరినీ గ్రూపులుగా విభజించే వారు. ఎత్తు, లావు ఆధారంగా 10 మందిలో ఒకరి కొలత తీసుకొని మిగతా వారికి కూడా అదే కొలతలతో కుట్టేవాళ్లు. దీనివల్ల కొందరికి పొట్టిగా, మరికొందరికి వదులుగా యూనిఫాం ఉంటోంది. దీంతో కొంత మంది విద్యార్థులు టైలర్ల దగ్గరకు వెళ్లి అవసరమైన సైజ్ మేరకు యూనిఫాంలో మార్పులు చేయించుకుంటున్నారు. నిరుపేద పిల్లలు మాత్రం ఇచ్చిందే వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ సిఫార్సులు, స్థానిక హెచ్ఎంల ఫిర్యాదుల దృష్ట్యా ప్రతి విద్యార్థికీ కచ్చితంగా కొలతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు పంపిణీ చేసిన తర్వాత విద్యార్థి నుంచి ఫిర్యాదు వస్తే తిరిగి దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి పూర్తిగా సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ)కు బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు నిక్కర్ బదులు ఫ్యాంట్లు ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెల్లడించింది. 19.91 లక్షల మంది విద్యార్థులు.. రెండేసి జతలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 19.91 లక్షల మంది విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందిస్తున్నారు. ఇందుకు అయ్యే వస్త్రం కోసం ప్రభుత్వం రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. స్థానిక స్వయం సహాయక సంఘాల చేత యూనిఫాం కుట్టిస్తోంది. ఇందుకుగాను వారికి కుట్టుకూలి కింద రూ. 30 కోట్లు చెల్లించనుంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాంను విద్యార్థులకు అందించాల్సి ఉంది. సాధ్యాసాధ్యాల మాటేమిటి? ప్రభుత్వ ఆదేశాలపై స్వయం సహాయక బృందాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలిచ్చేటప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులనూ తెలుసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వం వస్త్రం సేకరించి జిల్లాలు, మండలాలకు పంపేందుకే మే ఆఖరు వరకు సమయం పడుతుందని అంటున్నాయి. ఆ తర్వాత కేవలం 15 రోజుల్లోనే యూనిఫాం కుట్టి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టైలరింగ్ మహిళలు అంటున్నారు. అదీగాక.. ప్రతి విద్యార్థికి వస్త్రం సగటున అర మీటరే వస్తోందని.. దీనివల్ల కొందరికి సరిపోవట్లేదని చెబుతున్నారు. ప్రతి జతకు ప్రభుత్వం ఇచ్చే రూ. 75 కుట్టుకూలి కనీస వేతనంగా కూడా ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో స్వయం సహాయక బృందంలో కనీసం నలుగురు చొప్పున ఉండే సభ్యులు పాఠశాలల చివరి పనిదినంలోగా కొలతలు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు సొంతంగా కొలతలు తీసుకొని పంపిస్తే తమకు తేలికగా ఉంటుందని చెబుతున్నారు. టెన్షన్ పెడితే ఎలా? ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలీ కనీసం ట్రాన్స్‌పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వస్త్రం సగటున ప్రతీ విద్యార్ధికి 50 సెంటీమీటర్లే వస్తుంది. అదీగాక 15 రోజుల్లో కుట్టి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. మా పరిస్థితినీ ప్రభుత్వం ఆలోచించాలి. టెన్షన్ పెడితే ఎలా? ప్రతీ స్కూల్‌కు వెళ్ళి కొలతలు తీసుకొని, యూనిఫాం అందించాంటే 45 రోజులు పడుతుంది. అంత సమయం ఎక్కడిస్తున్నారు. కొలతలు వాళ్ళే తీసి ఇవ్వాలి. అప్పుడే సమయం కలిసి వస్తుంది. – ఎ. మాధవీగౌడ్ (టైలర్, కరీంనగర్) ఎక్కువ మంది టైలర్లను తీసుకుంటే సమస్యకు పరిష్కారం ప్రతి విద్యార్ధికి కచ్చితమైన కొలతలతో యూనిఫాం అందించాలనే నిర్ణయం సరైందే. సరిగా కుట్టలేదని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అయితే టైలర్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కుట్టడానికి ఎక్కువ మందిని పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. – పరాంకుశం రాజాభాను చంద్రప్రకాశ్ (ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధాయుల సంఘం పూర్వ అధ్యక్షుడు) -
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
హెచ్‌సీయూ రణరంగం
సాక్షి, హైదరాబాద్/ రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం ఉగాది రోజున జేసీబీలతో వందల సంఖ్యలో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి భూములను చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసి వందలమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగటంతో అందరినీ ఈడ్చుకెళ్లి లారీల్లో పడేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. అరుపులు.. కేకలు.. అరెస్టులు ఆదివారం సెలవు దినం, ఉగాది పర్వదినం కూడా కావటంతో క్యాంపస్‌లో ఉదయం వాతావరణం ప్రశాంతంగానే మొదలైంది. కొద్ది సేపటికే పోలీసులు తండోప తండాలుగా వచ్చి క్యాంపస్‌లోని అన్ని అంతర్గత రోడ్లను ఆ«దీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈస్ట్ క్యాంపస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేశారు. వర్సిటీ ప్రహరీ లోపలి భూములను జేసీబీలతో చదును చేయటం ప్రారంభించారు. విషయం తెలిసిన విద్యార్థులు రోడ్లపైకి దూసుకొచ్చారు.దీంతో పోలీసులకు, విద్యార్థులకు తోపులా జరిగింది. విద్యార్థుల నినాదాలతో క్యాంపస్ దద్దరిల్లింది. పోలీసులు ఏమాత్రం ఉపేక్షించకుండా కనిపించిన విద్యార్థిని కనిపించినట్లే వాహనాల్లోకి ఎక్కించి మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులను కూడా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో పడేశారు. మొత్తం 52 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళికతో హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని విక్రయించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతకాలంగాక్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనను అణచివేసేందుకు ప్రభుత్వం కూడా పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నట్లు ఆదివారం నాటి ఘటనను బట్టి తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచే పోలీసులు క్యాంపస్‌లో కొద్దిమొత్తంలో మకాం వేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా చాలామంది విద్యార్థులు స్వగృహాలకు వెళ్లే అవకాశం ఉందని గురించి క్యాంపస్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి బయటి వారు రాకుండా ముందు జాగ్రత్తగా మెయిన్ గేటుకు తాళం వేశారు. లోపలివారిని బయటకు కూడా వెళ్లనీయలేదు. శనివారం రాత్రే విద్యార్థులకు, పోలీసుల మధ్య జరిగిన తోపులాటలో చాలామంది గాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని«విధంగా హెచ్‌సీయూ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పీఎం విద్యాలక్ష్మీ రుణాలు
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్‌కు 8,300కి పైగా బ్రాంచ్‌లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు. -
విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు