
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని నాట్లు వేశారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినులు. మండలంలోని అవంచలో బుధవారం రైతులతో కలిసి పొలం బాట పట్టారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల దిగుబడిని పెంచే విధంగా తమ సేవలను అందించడానికే వ్యవసాయ విద్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను వివరించారు.
ఎప్పుడు దారి కొచ్చేనో..?
మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. అక్కడికి వెళ్లడానికి నర్సాపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి నర్సాపూర్–తూప్రాన్ రహదారి నుంచి ఉండగా, మరోటి నర్సాపూర్‌లోని జగన్నాథరావు కాలనీ నుంచి ఉంది. రెండు రోడ్లు గుంతలమయంగా మారగా, కనీస మరమ్మతులు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తుందన్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.