
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేసే గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 6వ తేదీ వరకూ రిపోర్టు చేయాల్సి ఉంది.
దీన్ని ఈ నెల 12 వరకూ పొడిగించారు. స్పాట్ అడ్మిషన్ల గడువును కూడా 14వ తేదీ వరకూ పెంచినట్టు తెలిపారు. వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు.