
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.
మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.