
తిరుపతి జిల్లా: జిల్లాలోని కోట జడ్పీ బాలికల హైస్కూల్‌లో స్పోర్ట్స్ టీచర్ నిర్వాకంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్‌కు యూనిఫామ్‌తో రాలేదని విద్యార్థినులతో గుంజిళ్లు తీయించాడు స్పోర్ట్స్ టీచర్.
అయితే పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయయారు. దాంతో వారిని కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలియడంతో హాస్పిటల్ వద్దకు చేరుకున్న తల్లి దండ్రులు ఆందోళన చేపట్టారు. ఆ విద్యార్థులంతా ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. సుమారు 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.