ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి | A 30 Day Warning For Foreign Nationals Staying In US | Sakshi
Sakshi News home page

ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి

Apr 13 2025 5:19 PM | Updated on Apr 14 2025 8:53 AM

A 30 Day Warning For Foreign Nationals Staying In US

వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.  

అక్రమంగా తమ దేశంలో  స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’
అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు  ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.

వారికి ఈ నిబంధన వర్తించదు..
స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో  ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన  ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement