
ఏఐ ద్వారా పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు
కార్పొరేట్‌కు దీటుగా గ్రామీణ విద్యార్థులకు ఆధునిక బోధన
పర్‌ప్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా బోధన
టీఫైబర్ నెట్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం
ఆదర్శంగా నిలిచిన అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్
పైలెట్ ప్రాజెక్టులోని మూడు పాఠశాలల్లో ఇదొకటి
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)
మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!
స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్‌తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్‌ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్‌ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.
పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు..
టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్‌లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్‌లో ఏఐ ఆధారిత పర్‌ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు.
కార్పొరేట్‌కు దీటుగా
ఏఐ, పర్‌ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్‌ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్
రక్తం ఎందుకు గడ్డ కట్టదు
పర్‌ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్‌ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతి
గణితంలో అన్ని పద్ధతులు
ఏఐ టూల్‌తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్‌ప్లెక్సిటీ యాప్‌లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతి
ఉపయోగం తెలుసుకున్నా
ఏఐ పర్‌ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్‌ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్‌తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్‌ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి