breaking news
Modern teaching methods
-
పల్లె బడిలో ఏఐ పాఠాలు
పట్టణాలు, నగరాలకు దీటుగా కృత్రిమ మేధస్సు (ఏఐ –ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో సాంకేతిక బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారుమూల గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు సమానస్థాయిలో ఆధునిక బోధన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. సర్కార్ టీ ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవడంతో ఉపాధ్యాయులు ఏఐ ఆధారంగా చదువు చెబుతున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు అదనపు సమాచారం అందించి వారి మేధకు పదును పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్ ఇందుకు వేదికైంది. – ముత్తారం (మంథని)మద్రాస్–ఐఐటీ నుంచి కోర్సు!స్థానిక ఉపాధ్యాయులకు గూగుల్‌తో ఏఐ బోధనలో శిక్షణకు ఇప్పించేందుకు టీ–ఫైబర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మద్రాస్ ఐఐటీ కళాశాల నుంచి కోర్సు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. టీ ఫైబర్ బృందం సోషల్ మీడియా వేదికగా దీనిపై ప్రచారం చేయడంతో అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పర్‌ఫ్లెక్సిటీ ఏఐ కో–¸ûండర్, సీఈవో అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమ ఉచిత ఏఐ టూల్‌ను వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం మెరుగుపర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ మార్పురావడం గొప్పవిషయమని చెప్పారు.పైలెట్ ప్రాజెక్టుగా మూడు గ్రామాలు.. టీ–ఫైబర్, పయనీర్ ఈల్యాబ్స్ కంపెనీ భాగస్వామ్యంతో పల్లెల్లో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మూడు గ్రామాల్లోని పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు జెడ్పీ హైస్కూళ్లను దీని కింద ఎంపిక చేసింది. అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో టీ–ఫైబర్ నెట్ నిర్వాహకులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి రెండు మానిటర్లు ఇవ్వగా.. ప్రభుత్వం ఇటీవల మరోమూడు కేటాయించింది. గత జూన్‌లో ఏఐ ఆధారిత పర్ప్లెక్సిటీ టూల్స్ ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఆధునిక బోధన ప్రారంభించారు. కార్పొరేట్‌కు దీటుగాఏఐ, పర్ప్లెక్సిటీ టూల్ సాయంతో బోధన ప్రారంభించాం. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పల్లె పాఠశాలలో ఆధునిక విద్య ఇస్తుండటంతో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరుగుతోంది. ఏఐ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతోంది. మరో 20 కంప్యూటర్లు, మైక్రోఫోన్స్ అందిస్తే ఏఐ బోధన మరింత సులువవుతుంది. – ఇరుగురాల ఓదెలు, హెచ్ఎం, అడవిశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్రక్తం ఎందుకు గడ్డ కట్టదుపర్ఫ్లెక్సిటీ ఏఐ టూల్ ద్వారా రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఎందుకు గడ్డ కట్టదనే ప్రశ్నకు సమాధానాన్ని సొంతంగా తెలుసుకున్నా. బయాలజీలో ఎర్ర, తెల్లరక్త కణాలు, కణ ఫలదీకరణ, నిర్మాణం, వాటి విధుల గురించి వివరంగా తెలుసుకున్నా. టీచర్ల బోధన తర్వాత అర్థం కాని విషయాలు, సందేహాలను పర్ప్లెక్సిటీ టూల్ నివృత్తి చేస్తోంది. – ఉప్పు మన్విత, తొమ్మిదో తరగతిగణితంలో అన్ని పద్ధతులుఏఐ టూల్‌తో విద్యార్థి శక్తిని అంచనావేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ యాప్‌లో గణితంలోని అన్ని పద్ధతులు పొందుపర్చడాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. చిత్రపటాలతో అర్థమయ్యే రీతిలో ఏఐ వివరిస్తోంది. – మార్త కోమలత, పదోతరగతిఉపయోగం తెలుసుకున్నాఏఐ పర్‌ప్లెక్సిటీలో నిక్ (ఆ్రస్టేలియాకు చెందిన ఈయన అరుదైన వ్యాధితో జని్మంచారు) గురించి సార్‌ను అడిగా. అంగవైకల్యం ఉన్నా.. విధిరాతను కూడా ఎలా మార్చుకోవచ్చో ఏఐ టూల్‌తో తెలుసుకున్నా. నిక్ చికెన్ లెగ్‌ను ఉపయోగించి నీటి గ్రావిటి బ్యాలెన్స్ చేసుకునే విధానం గురించి కూడా నేర్చుకున్నా. – చిగురు మధులాస్య, పదోతరగతి -
ఐఐటీల్లో ఆధునిక బోధన
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో బోధన విధానంలో మరిన్ని మార్పులను కేంద్రం సూచిస్తోంది. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఐఐటీల వైపు చూసే విద్యార్థుల చదువుల పరిస్థితిపై గతేడాది కేంద్ర విద్యాశాఖ అంతర్గత అధ్యయనం చేసింది. రెండేళ్లుగా విద్యార్థులు అడ్వాన్స్డ్ అంటేనే భయపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. మెయిన్స్ వరకే విద్యార్థులు పరిమితం కావడం వెనుక బలమైన కారణాలున్నాయని కేంద్రం గుర్తించింది. కోవిడ్ కాలంలో రెండేళ్లపాటు జరిగిన విద్యానష్టం వల్ల విద్యార్థుల్లో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అర్హత సాధించడం కష్టమనే భావన వచ్చిందని పరిశీలనలో తేలింది. అన్ని రాష్ట్రాల్లోనూ రెండేళ్లు 70 శాతమే సిలబస్ అమలు చేయడంతో కొన్ని చాప్టర్స్ విద్యార్థులకు అర్థంకాలేదని.. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఉన్న సిలబస్‌లో ఈ చాప్టర్లపట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది. ఐఐటీల్లో సీట్లు పొందిన మొదటి సంవత్సరం చదవాలనే జిజ్ఞాస విద్యార్థుల్లో ఉండటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్ స్థాయి నుంచి నష్టపోయిన చాప్టర్స్‌ను ఆధునిక పద్ధతిలో వారికి బోధించే ఓ ప్రక్రియ ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కొత్త సిలబస్‌ను ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. అమ్మో ఐఐటీ... కోవిడ్ కాలంలో రాష్ట్రాలు సిలబస్ తగ్గించినా... జేఈఈ పరీక్షల్లో మాత్రం అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. జేఈఈ మెయిన్స్ వరకూ చాయిస్ వల్ల విద్యార్థులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. కానీ అడ్వాన్స్‌డ్‌కు వచ్చే సరికి కష్టంగా భావిస్తున్నారు. ఈ కారణంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినా.. పరీక్ష రాసే వారి సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకూ జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. వారిలో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. ఇలా అర్హత పొందే 2.50 లక్షల మందిలో పరీక్ష రాస్తున్న వారు మాత్రం 60 శాతం మించి ఉండటం లేదు. ఇలా రాసేవాళ్లలోనూ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులయ్యే వారు 30 శాతం కూడా ఉండటం లేదు. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి దారుణంగా ఉంటోంది. అర్హత సాధించాం కాబట్టి అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. 2022 జేఈఈ ఫలితాలను పరిశీలిస్తే అడ్వాన్స్డ్ ఉత్తీర్ణత 26.17 శాతంగానే నమోదైంది. 2021లో ఇది 29.54 శాతంగా ఉంది. 2022లో అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హత సాధిస్తే పరీక్ష రాసింది మాత్రం 1,55,538 మంది మాత్రమే కావడం గమనార్హం. వారిలో ఉత్తీర్ణులైంది 40,712 మంది. 2023లో 1.46 లక్షల మంది పరీక్ష రాస్తే 24.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కోవిడ్ వేళ అర్థంకాని ఆన్లైన్ కోచింగ్... 2019 నుంచి 2021 వరకూ కోచింగ్ తీసుకొనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ కోచింగ్ పెరిగింది. కానీ గ్రామీణ, ఒక మాదిరి పట్టణ కేంద్రాల్లో చదువుకున్న విద్యార్థులు స్థానికేతరులు చెప్పే ఆన్లైన్ కోచింగ్‌ను అర్థం చేసుకోలేకపోయారు. 2022లో కోచింగ్ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నా, నాణ్యతలేని ఫ్యాకల్టీ చాలా చోట్ల ఉందనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు రెండేళ్లుగా చదువులో వెనుకబడటం కూడా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో శ్రద్ధ తగ్గడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థులు 31.67 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, ఎస్టీ అభ్యర్థులు 26.83 శాతం, ఓబీసీ అభ్యర్థులు 16.44 శాతం అర్హత పొందారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేఈఈతోపాటు ఐఐటీల విద్యావిధానంలోనూ మార్పులు అనివార్యమని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. -
తెరపై పాఠం.. ఏకాగ్రతకు నేస్తం
డోకులూరు ఆశ్రమంలో డిజిటల్ క్లాస్ రూమ్ అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్ పాడేరు: మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఆధునిక బోధన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దృశ్య శ్రవణ విధానంలో బోధిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాలకే ఇది పరిమితం. ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. మండలంలోని డోకులూరు ఆశ్రమ విద్యార్థులకు ఈ విధానంలో బోధించాలని గిరిజన ఉపాధ్యాయుడు సంకల్పించారు. ఈ పాఠశాలలో తెలుగు పండితుడిగా మూడేళ్లుగా పని చేస్తున్న శోభ నారాయణ సుమారు రూ.70 వేలు సొంత ఖర్చుతో ఇందుకు అవసరమైన ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్, సౌండ్‌సిస్టం, స్క్రీన్ వంటి ఆధునిక పరికరాలతో డిజిటల్ క్లాస్ రూంను ఏర్పాటు చేశారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు గురువారం నుంచి ఈ దృశ్య విద్యాబోధన ప్రారంభించారు. తెలుగు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల బోధనకు అవసరమైన డిజిటల్ సామగ్రిని సిద్ధం చేశారు. పాఠ్యపుస్తకాలలోని అంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో రూపొందించిన స్టడీమెటీరియల్ అంతర్జాలం నుంచి సేకరించి బోధిస్తున్నారు. ఇది విద్యార్థుల్లో ఏకాగ్రతను, ఆసక్తిని పెంచేవిధంగా ఉంది. రోజూ బోధనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. విద్యుత్ అంతరాయం కూడా లేకుండా ఇన్వెర్టర్ సమకూర్చారు. దిగువస్థాయి తరగతుల పిల్లలకు స్టడీ అవర్స్‌లో నీతిని బోధించే పంచతంత్ర కథలను దృశ్య, శ్రవణం ద్వారా బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. అభినందనీయం, ఆదర్శనీయం... ఆశ్రమ పాఠశాలలో దృశ్య శ్రవణ విద్యాబోధనను అందుబాటులోకి తెచ్చిన తెలుగు పండిట్ శోభ నారాయణ అభినందనీయులని, డిజిటల్ క్లాస్‌రూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు, ఎంఈవో బాబూరావు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.సూర్యనారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాణిక్యాలరావు ప్రశంసించారు. మన్యంలోనే ప్రథమంగా ఒక ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యాబోధనను ప్రారంభించి నారాయణ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారన్నారు. పాఠాలు గుర్తుండిపోతాయి.. దృశ్య, శ్రవణ విద్యాబోధన వల్ల విద్యార్థులకు పాఠాలు గుర్తుండిపోతాయి. పిల్లల్లో చదువుపట్ల అవగాహన, ఏకాగ్రతను పెంచుతుంది. ఈ దృశ్య విద్యను తరగతిలో విద్యార్థులను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. తెలుగు సబ్జెక్టులో పాఠ్యాంశాలను దృశ్య, శ్రవణ పద్ధతిలో బోధించడమే కాకుండా బోర్డు మీద రాసి చెప్పే వ్యాకరణం, పద్యాలు వంటి వాటిని కూడా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో సులువుగా బోధించడానికి ఎంతో ఆస్కారం ఉంది. అలాగే సైన్స్ పాఠ్యాంశాలను కూడా దృశ్య, శ్రవణ విద్య ద్వారా బోధించడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఏడాది పొడవునా పిల్లలకు ఈ దృశ్య, శ్రవణ విద్యాబోధనకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. - శోభ నారాయణ, తెలుగు పండిట్, డోకులూరు.