మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు | Students Protest Over Remove Wine Shop Near School At Ichchapuram | Sakshi
Sakshi News home page

మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు

Jun 14 2025 12:16 PM | Updated on Jun 14 2025 1:00 PM

Students Protest Over Remove Wine Shop Near School At Ichchapuram

సాక్షి, శ్రీకాకుళం: ​ఏపీలో కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి అనే తేడా లేకుండా.. మద్యం షాపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులను బహిష్కరించి.. నిరసనలు చేపట్టారు.

శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనలకు దిగారు. మద్యం షాపు ఎత్తివేయాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. మద్యం దుకాణం నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement