breaking news
Prabhas
-
మారుతికి అండగా ప్రభాస్.. పెద్ద సంస్థతో సినిమా
దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్‌తో తెరకెక్కించిన హారర్-కామెడీ చిత్రం 'ది రాజాసాబ్' పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు మారుతిని నెత్తిన పెట్టుకున్న వారే ఇప్పడు ట్రోలింగ్‌కు దిగారు. ఒక సినిమా ఫలితంలో దర్శకుడి పాత్ర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ మరీ ఇంతలా టార్గెట్ చేయడం ఏంటి అంటూ సోషల్‌మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మారుతి కోసం ఏదైనా చేయాలనే ప్రభాస్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తన ఫ్యాన్స్‌తో ఉన్న వైరాన్ని కాస్త తగ్గించాలని ఆయన ఉన్నారట.రాజాసాబ్ ఫలితం తర్వాత తన వంతు బాధ్యతగా మారుతి కోసం అండగా నిలవాలని ప్రభాస్ అనుకున్నారట. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రభాస్ పూర్తి చేశారు. మారుతి కొత్త సినిమాకి తనవంతుగా ప్రభాస్ సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో మారుతి తర్వాతి సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. కథ, సరైన హీరోను ఎంపిక చేసుకోవాలని అడ్వాన్స్ కూడా ఇప్పించడం జరిగిపోయింది. ఒక మిడ్ రేంజ్ హీరో ఎంపిక కోసం మారుతి వేట మొదలైంది. స్క్రిప్ట్ రెడీ అయితే.. మారుతి అనుకున్న హీరోతో మాట్లాడేందుకు కూడా ప్రభాస్ సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా తన దర్శకుడికి అండగా నిలివాలని ప్రభాస్ ఉన్నారు. ఇప్పటికే రాజాసాబ్ నిర్మాత నుంచి 40 శాతం రెమ్యునరేషన్ తీసుకోలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఏర్పాట్లు అన్ని పూర్తి అయితే, మారుతి ప్రాజెక్ట్ ఓపెనింగ్స్‌కు కూడా ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోనైనా డార్లింగ్ ఫ్యాన్స్‌తో మారుతి వివాదం ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పొచ్చు. మారుతి తర్వాత సినిమా గురించి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన
ఊహించని సర్ప్రైజ్. ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఫ్లాప్ అయింది. అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఆటు సరైన టాక్ తెచ్చుకోక.. కలెక్షన్స్ కూడా తెచ్చుకోలేక ఫెయిలైంది. దీంతో నెలలోపే స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఆషికా సినిమా)పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన కమర్షియల్ మూవీ ఇది. హారర్ ఫాంటసీ కథతో దర్శకుడు మారుతి ఈ సినిమా తీశాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రలు చేశారు. కంటెంట్ మరీ తీసికట్టుగా అర్థం కాని విధంగా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. హిందీకి మరికాస్త సమయం పట్టొచ్చు.'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థాన ఒకప్పటి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్).. ప్రస్తుతం తన మనవడు రాజు(ప్రభాస్)తో చాలా సాధారణ జీవితం గడుపుతుంటుంది. వయసు కారణంగా ఈమెకు మతిమరుపు సమస్య ఉంటుంది. కానీ తన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తన కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా తీసుకురమ్మని మనవడికి చెబుతుంది. కానీ కనకరాజు.. రాజుని నర్సాపుర్‌లోని రాజ మహల్‌కి రప్పించుకుంటాడు. మార్మిక విద్యలెన్నో తెలిసిన కనకరాజుని రాజు అలియాస్ రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? కనకరాజు గతమేమిటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
దసరాకి ఫౌజీ
వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.వరల్డ్ క్లాస్ ప్రోడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విజువల్ వండర్లా ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగ సందర్భంగా ‘ఫౌజీ’ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ. -
ఒక్క ఏడాది ఓపిక పట్టండి..! సీక్వెల్స్ తో దద్దరిల్లిపోద్ది
-
సలార్-2 ఆగిపోయిందా?.. మేకర్స్ లేటేస్ట్ పోస్ట్ వైరల్..!
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ చిత్రం సలార్(పార్ట్ 1 – సీజ్ఫైర్). 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఖాన్సార్ అనే ప్రాంతం నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా సలార్ 2 స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చాలని ప్రశాంత్ నీల్, ప్రభాస్ నిర్ణయించారనే మరో టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి.ఇలాంటి రూమర్స్ నేపథ్యంలో సలార్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్, శృతి హాసన్‌తో షూటింగ్ సమయంలో తీసిన స్టిల్‌ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై రూమర్స్ నిజం కాదని ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు స్పష్టత ఇచ్చేశారు. శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సలార్ 2లో తనకు ఏమి జరుగుతుందో దేవకు ఆద్య చూపిస్తోంది!! అది ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Aadya showing Deva what happens to her in #Salaar2!!What do you think it is? pic.twitter.com/lCSrbA0TSb— Salaar (@SalaarTheSaga) January 28, 2026 -
మారుతి ఇంటికి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్
దర్శకుడు మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి గట్టిగానే ఎదురుదెబ్బ తగులుతుంది. ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ ఫలితం మిశ్రమంగా రావడంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియాలో వారి ఎదురుదాడి ఎక్కవకావడంతో నిర్మాత ఎస్కేఎన్ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు. తమపై ట్రోలింగ్ పెద్ద తలనొప్పిగా తయారైందని ఆయన వాపోయాడు. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ది రాజా సాబ్’ నచ్చకుంటే కొండాపూర్‌లోని కొల్ల లగ్జరీలో ఉన్న తన ఫ్లాట్‌కు వచ్చేయండి.. అక్కడే మాట్లాడుకుందామని సరదాగా మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది.దర్శకుడి మాటలను ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. సినిమా నచ్చకపోవడంతో మారుతిని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ, వారిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో వారందరూ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో మారుతి ఇంటి అడ్రస్‌కు పార్శిల్ రూపంలో కొన్ని గిఫ్ట్‌లు పంపుతున్నారు. కాకపోతే ఇవి ప్రేమతో పంపుతున్న పార్సిల్స్ కావు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు పలు ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి వందలాది ఆర్డర్లు ఆయన ఇంటికి పంపారు. కానీ, వాటన్నింటినీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌తో బుక్ చేయడం విశేషం. దీంతో మారుతి ఫ్లాట్ వద్ద ఉన్న సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. అక్కడికి వచ్చిన డెలివరీ బాయ్స్‌ను వెనక్కి పంపడం సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. వింతగా ఉన్న ఈ నిరసన ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. -
'ది రాజాసాబ్' రిజల్ట్.. ప్రభాస్ ఇమేజ్‌పై ట్రోల్స్.. తుఫాన్‌లా తిరిగొస్తాడా?
"ది రాజాసాబ్" మూవీకి బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితం దక్కకపోవడంతో ప్రభాస్‌పై ట్రోలింగ్ మొదలైంది. పాన్ ఇండియా రేంజ్ హీరో మార్కెట్ ఇంతేనా అంటూ కొందరు కామెంట్లు చేశారు. అయితే, వాటిని డార్లింగ్ ఫ్యాన్స్ బలంగానే తిప్పికొడుతున్నారు. తెలుగు పరిశ్రమ కీర్తిని పాన్ ఇండియాకు పరిచయం చేసిందే ప్రభాస్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికీ బాహుబలి కలెక్షన్స్ రికార్డ్స్ పదిలంగానే ఉన్నాయని వారు గుర్తుచేస్తున్నారు. ఒక్క సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఏంతమాత్రం తగ్గదని అంతే రేంజ్లో విరుచుకుపడుతూనే రాబోయే కలెక్షన్ల తుఫాన్ గురించి హెచ్చరిస్తున్నారు. తమ అభిమాన హీరో ఫుల్లీ లోడెడ్ గన్స్‌తో రానున్నాడని హెచ్చరిస్తున్నారు."ది రాజాసాబ్" మూవీ ఫలితం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన విషయం వాస్తవమే.. దీనిని ప్రభాస్ కూడా గుర్తించినట్లు ఉన్నారు. అందుకే తను కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన ఫ్యాన్స్‌ను మళ్లీ సంతోషపెట్టేందుకు వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో పాటు కల్కి సీక్వెల్‌ను కూడా లైన్లో పెట్టారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రానున్న విషయం తెలిసిందే. ఏడాది గ్యాప్‌లోనే ప్రభాస్ నుంచి రెండు సినిమాలు విడుదల చేయాలని బలంగా ఉన్నారట. అయితే, మొదటగా ఫౌజీ రానుంది. ఆ తర్వాత స్పిరిట్ లైన్లో ఉంది. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పాన్ ఇండియాను షేక్ చేసే స్థాయిలో ఈ సినిమాలు ఉంటాయని ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. ఆపై కల్కీ రంగంలోకి రానుంది. ఇలా బిగ్ ప్రాజెక్ట్స్ వస్తుండటంతో ప్రభాస్ మార్కెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది సినీ విశ్లేషకుల మాట..రాజాసాబ్ కలెక్షన్స్ నిరాశ పరిచినా.. ప్రబాస్ మార్కెట్ ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గిపోలేదు. అతని స్టార్ పవర్ ఇంకా బలంగానే ఉంది. రాబోయే స్పిరిట్ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద మార్కెట్‌ను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీ ఒక ఫ్లాప్‌తో అది తగ్గిపోదు. రాజా సాబ్‌కు నష్టాలు రావడంతో తన రెమ్యూనరేషన్లో 40% తగ్గించుకున్నారని సమాచారం ఉంది. ఆపై స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను కూడా ఆ మూవీ నిర్మాతకు అందేలా ప్రభాస్ చేయడం విశేషం. ‘ రాజాసాబ్’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మళ్లీ తన సినిమాలను వరుసగా బాక్సాఫీస్ వద్దకు తీసుకురావాలని డార్లింగ్ కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారట. -
సుమతి పాత్రలో..?
‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్లో సాయిపల్లవి నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజైనప్పుడే ఈ చిత్రం సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ను మేకర్స్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపికా పదుకోన్ నటించడం లేదని, ఇటీవల ఓ సందర్భంలో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో కథలో కీలకమైన సుమతి (దీపిక క్యారెక్టర్) పాత్రలో ఎవరు నటించనున్నారనే చర్చ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా తదితర కథనాయికల పేర్లు వినిపించాయి. తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలోని సుమతి పాత్రలో దక్షిణాదికి బాగా సుపరిచితురాలైన సాయిపల్లవి నటిస్తే బాగుటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి... ‘కల్కి 2’లో సాయిపల్లవి భాగం అవుతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని, ప్రభాస్ కూడా పాల్గొంటారని భోగట్టా. ఈ సీక్వెల్‌ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్
ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. కల్కి ఫ్రాంచైజీ నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో చాలా కీలకమైనది. కల్కి పార్ట్-2 మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. కానీ అలాంటి ముఖ్యమైన పాత్ర నుంచి దీపిక తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట సాయిపల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. కల్కి చిత్ర యూనిట్ కూడా ఆమెను ఈ పాత్రకు అనుకూలంగా భావిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిజంగానే సాయిపల్లవినే ఫైనల్ చేశారా లేదా ఊహించని విధంగా మరో నటిని పరిచయం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. దాంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. దీపికను పార్ట్-1లో చూసిన ప్రేక్షకులు, అదే పాత్రలో మరో హీరోయిన్‌తో కనెక్ట్ అవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సవాల్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. -
అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!
ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. గ్లామర్ రోల్స్ చేయొచ్చు. కోట్లకు కోట్ల రుపాయల రెమ్యునరేషన్ సంపాదించొచ్చు. కానీ తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'రామాయణ్' మూవీలో సీత పాత్ర చేస్తోంది. ఓ హిందీ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లోనూ టైటిల్ రోల్ చేయనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు అనుకోని అవకాశం ఈమెని వరించినట్లు తెలుస్తోంది.ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సినిమా విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ తీసేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతుందో.. దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దీపిక వద్దనుకున్న ఈ పాత్ర ఎవరు చేస్తారా అనే డిస్కషన్ అప్పుడు నడిచింది. ఇప్పుడు అది సాయిపల్లవిని వరించినట్లు సమాచారం. దాదాపు ఇది ఖరారైపోయిందని, త్వరలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్)ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే గనుక ప్రభాస్, సాయిపల్లవి జోడీ సెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి వినిపిస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమనేది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.మూవీ టీమ్ ముందు సాయిపల్లవి కాకుండా వేరే ఆప్షన్స్ పెద్దగా లేనట్లే అనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం 'సుమతి' పాత్రని పోషించిగల హీరోయిన్లు లేరని చెప్పొచ్చు. బాలీవుడ్, దక్షిణాదిలోని మిగతా భాషల్లో అయినా సరే ఆలియా భట్ లాంటి ఒకరిద్దరి పేర్లు పరిశీలించొచ్చు కానీ 'కల్కి' టీమ్, సాయిపల్లవి వైపు మొగ్గుచూపినట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ) -
2030 వరకు సందీప్ వంగా వైల్డ్ ఫైర్
-
'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్
ఈ సంక్రాంతి రేసులో మొదటి విడుదలైన మూవీ ‘ది రాజాసాబ్’.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కవ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా హీరోయిన్స్‌ను ముగ్గురుని తీసుకోవడం.. ముఖ్యంగా ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ లేకపోవడంతో మైనస్ అయింది. అయితే, ఫ్యాన్స్ సూచన మేరకు సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి మరికొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇంతలో మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే. ఇప్పటి వరకు రూ. 250 కోట్ల మేరకు మాత్రమే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. రాజాసాబ్ మూవీపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎన్నో డిజాస్టర్ సినిమాలతో దెబ్బతిన్న ఆ సంస్థ ఈ మూవీతో గట్టెక్కుతుందని భావించారు. కానీ, రాజాసాబ్ తెచ్చిన నష్టాలు నిర్మాతను మరింత ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో ఆ సంస్థను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో సినిమా ప్లాన్ఏదైనా ఒక సినిమాతో భారీగా నష్టపోతే సదరు నిర్మాతల్ని హీరోలు ఆదుకోవడం పలు సందర్భాల్లో జరుగుతున్నదే.. ఈ క్రమంలోనే రాజాసాబ్ నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరో సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నిర్మాత విశ్వప్రసాద్‌కు ఆయన మాటిచ్చారట. ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సరైన కథతో పాటు దర్శకుడిని కూడా చూసుకోవాలని ప్రభాస్ సూచించారట. 'స్పిరిట్' హక్కులుఇదే సమయంలో స్పిరిట్ మూవీ పంపిణీ హక్కులను మైత్రీ మూవీస్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి అందేలా ప్రభాస్ చేశారు. అలా రాజాసాబ్ నిర్మాతను కాపాడేందుకు ప్రభాస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజాసాబ్ కోసం ప్రభాస్ పూర్తి రెమ్యునరేషన్‌ను కూడా తీసుకోలేదని టాక్ ఉంది. కేవలం అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం మాత్రమే తీసుకున్నారట. సినిమా విడుదల తర్వాత పరిస్థితి మారిపోవడంతో మిగిలిన పారితోషకం గురించి నిర్మాతతో చర్చించలేదట. -
ఫ్యాన్స్‌ను మెప్పించిన 'రెబల్ సాబ్' వచ్చేశాడు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' నుంచి మరో వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే..అయితే, అనుకున్నంత రేంజ్లో ప్రేక్షకులను మెప్పించలేదు. ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్న 'రెబల్ సాబ్' సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ఆడియో వర్షన్ విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్‌ను సంజిత్ హెగ్డే, బ్లేజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. -
ప్రభాస్ బాటలో బన్నీ.. స్ట్రాటజీ రిపీటు
టాలీవుడ్లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
ప్రభాస్ ‘స్పిరిట్’పై క్రేజీ గాసిప్.. గోపీచంద్ కీలక పాత్ర?
ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా, మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ‘స్పిరిట్’లో ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగెటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర చేయడం ఆయన కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు. విలన్ పాత్రపై గాసిప్ ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. కానీ ఆ పాత్రలో డెప్త్ ఉంటే మాత్రం చేస్తాను. ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సందీప్ వంగ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘యానిమల్’ చూసినవారికి తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్‌ను విలన్‌గా చూపించబోతున్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ మాత్రం స్పందించలేదు. గోపీచంద్ నిజంగా ‘స్పిరిట్’లో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఏదీ? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు మిస్టరీనే. -
నిధితో ప్రభాస్ రొమాంటిక్ సాంగ్.. ఫుల్ వీడియో రిలీజ్
డార్లింగ్ ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ సినిమా నుంచి సహన సహనా అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా సహనా సహనా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. 'సహనా సహనా నా సఖి సహనా.. కలలో నిన్నే చూశానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. తమన్ అందించిన ఈ ట్యూన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. సింగర్ విశాల్ మిశ్రా ఆలపించాడు. ఈ పాటలో ప్రభాస్.. నిధి అగర్వాల్‌తో రొమాంటిక్ స్టెప్పులేశాడు. ఇక సినిమా విషయానికి వస్తే జనవరి 9న విడుదలైన రాజాసాబ్ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వం వహించిన చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. -
'ప్రభాస్' సీక్వెల్ అదిరిపోతుంది.. సంగీత దర్శకుడు కామెంట్
ప్రభాస్ అభిమానులను ‘ది రాజాసాబ్’ కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ డార్లింగ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ తర్వాత ఆయన నుంచి ఫౌజీ, స్పిరిట్, సినిమాలు తెరపైకి రానున్నాయి. ఈ రెండూ ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతి త్వరలోనే ‘కల్కి 2’ కూడా మొదలు కానుంది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారు.కల్కి2 గురించి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఇలా అన్నారు. 'కల్కి -2 నా కెరీర్లోనే టాప్ సినిమాగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం నేను అందించబోయే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసం మా టీమ్ చాలా కష్టపడుతుంది. కల్కి 2898AD మా అందరికీ ఒక మెగా లెర్నింగ్. మేము ఇప్పటికే కల్కి పార్ట్-2 కోసం పని చేయడం ప్రారంభించాము. ఈ మూవీలో పాల్గొనే నటీనటుల తేదీలు సర్దుబాటు అయిన తర్వాత, షూటింగ్ ప్రారంభమవుతుంది.' అని ఆయన అన్నారు. సంతోష్ నారాయణన్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలను గణనీయంగా పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తదితరులు కీలక పాత్రలలలో పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, ప్రభాస్ మార్చి తర్వాత కల్కి-2 సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇందులో భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. "I hope #Kalki2 is going to be my best work🔥. We are putting a lot of effort. #Kalki2898AD was a mega learning for all of us🎶. We have already started work for Kalki Part-2. All are mega stars, once date align, shooting will begin✅"- #SanthoshNarayananpic.twitter.com/AEGd0TP7qM— AmuthaBharathi (@CinemaWithAB) January 23, 2026 -
టాప్ హీరోల ఫోకస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమా వారణాసి. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరూ మళ్లీ పాన్ వరల్డ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ రామ్ చరణ్ కోసం దర్శకుడు సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు. ఈసారి ఆయన రూపొందిస్తున్న కథ పాన్ వరల్డ్ స్థాయిలో యూనివర్సల్ అపీల్ కలిగిన జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంకా హీరోకు నెరేషన్ ఇవ్వలేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాతే చరణ్‌ను కలసి కథ వినిపించనున్నారు. ప్రస్తుతం సుకుమార్, ఆయన టీమ్ ఈ పనిపైనే దృష్టి సారించారు. మహేష్ బాబు స్వంత బ్యానర్లో కొత్త ప్రాజెక్ట్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను స్వంత బ్యానర్ జిఎంబిలో చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొదట్లో డొమెస్టిక్ మార్కెట్‌కు సరిపడే సినిమా చేయాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు ఒక దర్శకుడు చెప్పిన లైన్ మహేష్‌ను ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆ కథ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. జిఎంబితో పాటు మరో బ్యానర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందని సమాచారం. ఇకపై పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి టాప్ హీరోలు ఇకపై కేవలం మన మార్కెట్‌కు సరిపడే కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. వారి దృష్టి మొత్తం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్టులపైనే ఉంది. టాలీవుడ్లో ఇకపై ప్రతి పెద్ద సినిమా గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుందనే చెప్పాలి. -
దిల్ మాంగే మోర్ అనేలా 'ది రాజాసాబ్' వీడియో సాంగ్
ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ నుంచి "దిల్ మాంగే మోర్" పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. మాళవిక మోహనన్ ఫైట్ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కాసర్ల శ్యామ్, అద్వితీయ ఓజ్జల రాసిన ఈ సాంగ్‌ను నకాష్ అజీజ్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో మాళవిక మోహనన్ గ్లామర్‌తో పాటు తనదైన స్టైల్లో ఫైట్స్‌తో అదరగొట్టింది. -
పవన్ కల్యాణ్-ప్రభాస్.. నిధి కెరీర్ కంచికి చేరిందా!?
'వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి' అనేది పాత సామెత అయ్యిండొచ్చు. కానీ ఏ తరానికి అయినా కచ్చితంగా పనికొచ్చేదే. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. అందుకే చాలామంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడు వరసగా గ్లామరస్ మూవీస్ చేస్తారు. కొన్నాళ్లకు పూర్తిగా తెరమరుగైపోతుంటారు. కొందరు మాత్రం తన తలరాత మారుతుందని చెప్పి కొన్ని ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకుంటారు. తీరా చూస్తే అవి అడియాశలు అవుతుంటాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.(ఇదీ చదవండి: వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!)స్టార్ హీరో సినిమాలో నటించారని ప్రతి హీరోయిన్ అనుకుంటుంది. అందుకు తగ్గట్లే చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అదృష్టం కలిసొచ్చి ఫేట్ మారేది మాత్రం అతికొద్ది మందికే. మరికొందరికి మాత్రం ఘోరమైన దురదృష్టం తప్పితే మరొకటి మిగలదు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అలానే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై బోలెడంత నమ్మకం పెట్టుకుంది. నాలుగేళ్ల విలువైన సమాయాన్ని వెచ్చించింది. మరో సినిమా చేయలేదు. ఇప్పుడేమో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది.2017లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2022 వరకు తెలుగు, తమిళ, హిందీలో కలిపి ఎనిమిది సినిమాల వరకు చేసింది. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్ అయింది. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. 2019లో అలా పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటించే ఛాన్స్ నిధికి వచ్చింది. లాక్డౌన్, పవన్ రాజకీయాల వల్ల సినిమా చాలా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఘోరమైన ఫ్లాప్ అయింది. ఈ చిత్రం నిధికి ఏ మాత్రం ఉపయోగపడలేదు.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్)రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ 'రాజాసాబ్'లోనూ నిధి అగర్వాల్ ఓ హీరోయిన్గా చేసింది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం తనకు ఫేట్ మార్చేస్తుందని, హిట్ అవుతుందని నిధి చాలా నమ్మింది. కానీ బ్యాడ్ లక్. ఇది కూడా ఫ్లాప్ అయింది. సరేలే ఈ రెండు మూవీస్ ఫెయిలైతే అయ్యాయి అనుకోవచ్చు. వీటిలో నిధి అగర్వాల్ పాత్రలు ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా ఉండవు. దీంతో ఈ విషయంలోనూ ఈమెకు పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు.నిధి అగర్వాల్ ఇప్పటికైతే ఏ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తున్నట్లు అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక, శ్రీలీల, భాగ్యశ్రీ, మీనాక్షి చౌదరి లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వీళ్లు కాకుండా రుక్మిణి వసంత్, మృణాల్ ఠాకుర్ లాంటి బ్యూటీస్.. స్టార్ హీరోలకు మెయిన్ ఆప్షన్స్‌గా కనిపిస్తున్నారు. మరి ఇలాంటి ఈ ముద్దుగుమ్మలని దాటుకుని నిధి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటుందా? అనేది చూడాలి. ఒకవేళ లేదంటే మాత్రం నిధి అగర్వాల్ కెరీర్ పరంగా వెనకబడిపోయే ప్రమాదముంది!(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్) -
సినిమా ఫ్లాప్.. ప్రభాస్ రియాక్షన్ చెప్పిన నిధి అగర్వాల్
చాలామంది హిట్టు కొట్టగానే సంతోషంతో ఎగిరి గంతేస్తుంటారు, ఫ్లాప్ రాగానే ఒక్కసారిగా డీలా పడిపోతారు. అయితే ఈ జయాపజయాలను ప్రభాస్ అస్సలు లెక్క చేయడంటోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ "ది రాజాసాబ్". ఇందులో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. చతికిలపడ్డ రాజాసాబ్మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అన్నింటికంటే ముందుగా దిగింది. భారీ అంచనాలతో జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. నెగెటివ్ టాక్ వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టలేపోయింది. అయితే ప్రభాస్ వీటినేవీ పట్టించుకోడంటోంది నిధి అగర్వాల్.తలదూర్చడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడు. తన పనేదో తను చేసుకుపోతాడు. ఫేక్‌గా ఉండలేడు. చాలా మంచి వ్యక్తి. ఆయనంత హుందాగా నేను ఉండగలనా? అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. కానీ, ఆయనతో కలిసి పని చేశాక మరో విషయం అర్థమైంది. తనది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు. ప్రేమగా మాట్లాడతాడు.ప్రభాస్‌ను కలిస్తే..ఎవరైనా సరే.. ఆయన్ను కలిసినప్పుడు తను ఓ స్టార్ హీరో అన్న విషయమే మర్చిపోతారు. ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉంటాడు. దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్ గురించి అసలు పట్టించుకోడు అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. చదవండి: 40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోలింగ్ పట్టించుకోనంటున్న బ్యూటీ -
ఆరోజే సలార్ 2 టీజర్.. సోషల్ మీడియా ఎరుపెక్కాలా..
-
వాళ్లతో సినిమాలు.. ప్రభాస్‌కి అస్సలు అచ్చిరాలేదు!
ఏ హీరో.. ఏ దర్శకుడు.. ఏ నిర్మాత కూడా ఫ్లాప్ సినిమాని తీయాలనుకోరు. కొన్నిసార్లు అనుకోకుండా అలా జరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మాత్రం కాంబినేషన్ ప్రకటించినప్పుడే సందేహాలు వస్తుంటాయి. తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత అవి నిజమవుతుంటాయి. రీసెంట్ టైంలో 'రాజాసాబ్' ఓ ఉదాహరణ. ప్రభాస్ విషయంలో పలుమార్లు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది? ప్రభాస్ ఏం చేస్తున్నాడు?'బాహుబలి' ముందు వరకు ప్రభాస్ ఓ సాధారణ హీరోనే. చెప్పుకోవడానికి కొన్ని హిట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రాజమౌళితో ఈ మూవీ చేశాడో.. దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని నిలబెట్టుకునే క్రమంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సింది. తెలిసో తెలియకో ప్రభాస్ కొన్ని తప్పటడుగులు వేశాడు, ఇప్పటికీ వేస్తున్నాడా అనే సందేహం కలుగుతోంది.ఎందుకంటే పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన తర్వాత ఏ హీరో అయినా సరే తనకు సూట్ అయ్యే దర్శకుల్ని, స్టోరీల్ని ఎంచుకుని సినిమాలు చేయాలి. అప్పుడు రేంజ్ పెరిగేందుకు అవకాశముంటుంది. క్రేజ్ ఉంది కదా అని తొందరపడకూడదు. ప్రభాస్ కూడా ఇలానే స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లేని కొందరు మిడ్ రేంజ్ దర్శకులకు అవకాశాలిచ్చి తన విలువైన కాలాన్ని వృథా చేసుకున్నాడా అనిపిస్తుంది!'బాహుబలి' తర్వాత ఒకేఒక్క సినిమా తీసిన సుజీత్‌కి ప్రభాస్ అవకాశమిచ్చాడు. మూవీకి కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ ఎందుకో ఆడియెన్స్‌కి మూవీ పూర్తిస్థాయిలో నచ్చలేదు. దీంతో యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' అయితే డార్లింగ్ ఫ్యాన్స్‌కి పీడకలగా మిగిలిపోయింది. ప్రభాస్ లాంటి నటుడిని పెట్టుకుని ఇలాంటి సినిమానా తీసేది అని దర్శకుడు రాధాకృష్ణని విమర్శించని వాళ్లు లేరు. తర్వాత వచ్చిన 'ఆదిపురుష్' అయితే ఇంకా దారుణం. కథ పరంగా పెద్దగా కంప్లైంట్స్ లేనప్పటికీ ప్రభాస్‌ని చూపించిన విధానం, మూవీలో ఉపయోగించిన గ్రాఫిక్స్‌పై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్‌ని ప్రభాస్ అభిమానులు ఎంతలా ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సలార్, కల్కి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడని ఫ్యాన్స్ సంతోషించేలోపు.. 'రాజాసాబ్'తో ప్రభాస్‌కి మారుతి మర్చిపోలేని ఫ్లాప్ ఇచ్చాడు. కథ డిఫరెంట్‌గా ఉన్నప్పటికీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ అస్సలు వర్కౌట్ కాలేదు. మూవీలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ తలని వేరే బాడీకి అతికించినట్లు ఉన్న కొన్ని సీన్స్ అయితే విపరీతమైన ట్రోలింగ్కి కారణమయ్యాయి. ఈ సినిమాలన్నీ గమనిస్తే.. పాన్ ఇండియా చిత్రాలు తీసిన అనుభవం లేని రాధాకృష్ణ, మారుతి లాంటి దర్శకులకు అవకాశమిచ్చిన ప్రతిసారీ ప్రభాస్ దారుణమైన ఫలితాలు చూశాడు. ఇకనుంచైనా కాస్త అనుభవమున్న డైరెక్టర్స్‌తో, ఆలస్యమైనా సరే మంచి కాన్సెప్ట్ మూవీస్ చేస్తే బెటర్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తీస్తున్న 'స్పిరిట్', హను రాఘవపూడి తీస్తున్న 'ఫౌజీ' ఉన్నాయి. వీటిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. -
'రాజే యువరాజే' వీడియో సాంగ్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' నుంచి 'రాజే యువరాజే' వీడియో సాంగ్ తాజాగా విడుదలైంది. సినిమాలో నిధి అగర్వాల్‌తో పరిచయం అయిన సమయంలో ఈ పాట ఉంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల అయింది. అయితే, డార్లింగ్ ఫ్యాన్స్ ఆశించినంత రేంజ్లో మూవీ మెప్పించలేదు. -
ప్రభాస్ vs సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ పోటీ?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌తో ప్రభాస్ పోటీ పడ్డారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీ వీకెండ్‌తో పాటు ఈద్ పండుగ సీజన్‌కి దగ్గరగా ఉండటంతో భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా ప్రముఖ దర్శక ద్వయం రాజ్-డీకేతో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను 2027 రంజాన్ సీజన్లో విడుదల చేయాలనే ప్లాన్ జరుగుతోంది. సల్మాన్ ఖాన్‌కు రంజాన్ సీజన్‌పై ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. గతంలో అనేక సినిమాలను ఆయన ఈ సీజన్లో విడుదల చేసి విజయాలు సాధించాడు. అందుకే రాజ్-డీకే సినిమా కూడా అదే టైమ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమాతో ఆ సీజన్‌ను లాక్ చేసుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ సినిమా కూడా సిద్ధమవుతుందనే ప్రచారం నడుస్తోంది. రాజ్-డీకే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ రెండు భారీ సినిమాల మధ్య పోటీపై స్పష్టత వస్తుంది. బాలీవుడ్లో ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం ఆనవాయితీ కావడంతో ఈ పోటీపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. 2027 రంజాన్ బాక్సాఫీస్‌లో ప్రభాస్ స్పిరిట్ vs సల్మాన్ ఖాన్ – రాజ్-డీకే సినిమా పోటీ ఒకవేళ నిజమైతే ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద క్లాష్‌గా నిలిచే అవకాశం ఉంది. -
'రాజాసాబ్' హిట్ సాంగ్ వీడియో విడుదల
ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది. -
Prabhas : ఒకటి కాదు రెండు..! అస్సలు తగ్గేదేలే
-
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అప్పుడే స్పిరిట్ రిలీజ్..
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్. వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా స్పిరిట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది రిలీజ్2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అందులో ప్రభాస్ ఒళ్లంతా గాయాలై కట్టు కట్టి ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా నిలబడ్డ ప్రభాస్.. చేతిలో మందు బాటిల్‌తో వైల్డ్‌గా కనిపించాడు. త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది.సినిమాస్పిరిట్ నుంచి రిలీజైన వన్ బ్యాడ్ హ్యాబిట్ వాయిస్ ఓవర్ గ్లింప్స్ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్’ ఏ స్థానంలో ఉందంటే..
సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో టాప్ పొజిషన్లో షారుఖ్‌ఖాన్ కింగ్ సినిమా ఉండగా.. ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. ఐఎండీబీ ప్రకటించిన టాప్ 20 సినిమాలివే...1) కింగ్ (హిందీ) :‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్తున్నారు.2) రామాయణ (హిందీ)రణ్‌బీర్ ప్రధాన పాత్రలో నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్ రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్ హీరో యశ్.. రావణుడిగా కనిపించబోతున్నాడు.3) జననాయగన్(తమిళ్)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.4) స్పిరిట్(తెలుగు)ప్రభాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.5) టాక్సిక్(కన్నడ)యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.6) బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్సల్మాన్ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. ఇందులో సల్మాన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.7) ఆల్ఫా(హిందీ)అలియా భట్. శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్ రావేల్ తెరకెక్కిస్తున్నారు.8) దురంధర్ 2 (హిందీ)బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.9) బోర్డర్ 2 (హిందీ)1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.10) ఫౌజీహను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్) : ప్రదీప్ రంగనాథన్(హీరో)12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని13) పెద్ది(తెలుగు): రామ్ చరణ్14) డ్రాగన్(తెలుగు): ఎన్టీఆర్15) లవ్ అండ్ వార్(హిందీ): రన్బీర్ కపూర్16) బూత్ బంగ్లా(హిందీ): అక్షయ్ కుమార్17) బెంజ్(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ19) ‘పేట్రియాట్ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్20) ఓ రోమియో (హిందీ): షాహిద్ కపూర్ -
ప్రభాస్‌ను రెబల్ స్టార్ గా మార్చిన సంక్రాంతి..
-
ది రాజాసాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆదిపురుష్ కంటే తక్కువే..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మూడేళ్ల కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది
‘‘ది రాజా సాబ్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా కోసం యూనిట్ అంతా మూడేళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రేక్షకులు ఇచ్చారని భావిస్తున్నాం. ఈ సినిమాలో నన్‌గా నేను చేసిన బెస్సీ రోల్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను’’ అని నిధీ అగర్వాల్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల అయింది. ఈ నేపథ్యంలో నిధీ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ది రాజా సాబ్’లో తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా చూపించారు మారుతిగారు. ప్రభాస్‌గారు తానో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో విశ్వప్రసాద్‌గారు రాజీ పడలేదు. ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఒకే సమయంలో చేశాను. ఈ సినిమాల షూటింగ్స్, ప్రయాణం వల్ల నిద్ర కూడా ఉండేది కాదు. ఆ టైమ్‌లో ‘రాజా సాబ్’ మేకర్స్ సెట్లో నన్ను బాగా చూసుకునేవారు. అందుకే నేనంటే సెట్లో అందరికీ ఇష్టమని ప్రభాస్‌గారు చెప్పారు. ఈ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని కోరుకున్నాను. ఎందుకంటే... మేమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. ప్రస్తుతం తెలుగులో మూడు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్‌లో ఇల్లు తీసుకున్నాను’’ అని పేర్కొన్నారు. -
'ప్రభాస్'ను ఒంటరిని చేశారా..? వాళ్లందరూ ఎస్కేప్
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'ది రాజా సాబ్'.. జనవరి 9న అందరికంటే ముందే సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే, సినిమాలో కొన్ని సీన్స్ తొలగించి ప్రభాస్ ఓల్డ్ గెటప్ సన్నివేశాలు ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ కూడా అన్నారు. దీంతో మారుతి వెంటనే సరిచేసి రెండోరోజే రీవర్షన్ చేశారు. దీంతో సినిమాపై మళ్లీ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇంతలో పండగ సినిమాలన్ని వరుసగా వస్తున్నాయి. దీంతో రాజాసాబ్ కొన్ని స్క్రీన్స్ కోల్పోతూ వచ్చింది. అయితే, అడ్వాంటేజ్ ఉన్నప్పుడు సినిమాకు ప్రమోషన్ కరువైంది. సినిమా విడుదల ముందురోజు వరకు గట్టిగానే ప్రచారం చేశారు. కానీ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. సినిమాకు ఎటూ పాజిటీవ్ వస్తుంది కాబట్టి.. కనీసం ఈ వీకెండ్ వరకు అయినా కాస్త ప్రమోషన్స్ జోష్ పెంచితే బెటర్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రభాస్ దర్శకుల స్పందన కరువురాజా సాబ్ రిలీజ్ తర్వాత కేవలం ఓ ప్రెస్ మీట్ పెట్టి చిత్ర యూనిట్ మమ అనిపించింది. ఆ తర్వాత కేవలం సోషల్‌మీడియాకే పరిమితం అయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేడు కాబట్టి కనీసం తన పాత దర్శకులతో వీడియో బైట్స్, కామెంట్స్ అయినా చేపించుకోలేకపోయారు. పాన్ ఇండియా రేంజ్లో పేరున్న దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి వారందరికి ప్రభాస్‌తో మంచి స్నేహమే ఉంది. వాళ్లతో కలిసి ఆయన పనిచేశారు కూడా.. కానీ, వాళ్లు కూడా రాజా సాబ్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపారు. రాజా సాబ్ సినిమాను రీకట్ చేసిన తర్వాత చాలా బాగుందని టాక్ వస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ, సరైన ప్రమోషన్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరూ సినిమా గురించి మాట్లాడకపోవడం కాస్త డ్యామేజ్‌ను పెంచాయని ఎక్కువగా వినిపిస్తుంది.ఎస్కేఎన్.. ఎస్కేప్రాజా సాబ్ విడుదలకు నిర్మాత ఎస్కేఎన్ భారీ డైలాగ్స్ పేల్చాడు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని తనదైన స్టైల్లో పండగ..పండగ..రాజాసాబ్ పండగ అంటూ హైప్ పెంచాడు. అంతటితో ఆయన ఆగలేదు తన చొక్కా చించి మరీ రాజాసాబ్ పోస్టర్‌ను ఫ్యాన్స్‌కు చూపించి తన భక్తిని చూపించాడు. సినిమా విడుదల తర్వాత కనీసం ఆయన కూడా రాజాసాబ్‌కు దూరంగానే ఉన్నాడు. అయితే, సంగీత దర్శకులు తమన్ గతంలో రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు మూవీ ప్రమోషన్‌కు ఎవరూ రాలేదు. అప్పుడు స్వయంగా తమన్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెబుతూ కాస్త ప్రమోషన్ చేశాడు. ఇప్పుడు కనీసం తమన్‌ను మరోసారి రంగంలోకి దింపినా బాగుండు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ వరకు అయినా సరే మారుతి, తమన్, ఎస్కేఎన్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లను రంగంలోకి దింపి ప్రమోషన్స్ చేస్తే కాస్త కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రాజా సాబ్ రూ. 220 కోట్లకు దగ్గరలో ఉన్నాడు. -
ఆ సీన్స్‌లో ప్రభాస్ నటన అద్భుతం అంటున్నారు: దర్శకుడు మారుతి
‘‘ది రాజా సాబ్’ వంటి సినిమా చేయడం అంత సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్‌లోకి వెళ్లాడనే విషయాన్ని విజువల్‌గా స్క్రీన్‌పై చూపించడం చాలా కష్టం. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాను 40 రోజుల్లోనే రాసిన నేను, ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం రెండు నెలలు స్క్రిప్ట్ రాశాను. ఈ సీన్స్ గురించి నేను, ప్రభాస్‌గారు మాట్లాడుకున్నాం... ‘పెన్‌తో రాస్తున్నావా? లేదా గన్‌తో రాస్తున్నావా? డార్లింగ్’ అన్నారు ప్రభాస్‌గారు.ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ స్టార్ట్ కాకముందే నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల వసూళ్లు సాధించింది. మా ‘రాజా సాబ్’ ప్రేక్షకులకు నచ్చింది కాబట్టే ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ⇒ ‘ది రాజాసాబ్’లో సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో ఓ కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత సమయం పడుతుందని ముందే ఊహించాం. ‘కొత్త ప్రయత్నం చేశాం డార్లింగ్... ప్రేక్షకులకు చేరువ కావడానికి కొంత టైమ్ పడుతుంది.. నువ్వు ప్రశాంతంగా ఉండు’ అని ప్రభాస్‌గారు చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత మేం ట్రైలర్లో చూపించిన ప్రభాస్‌గారి ఓల్డ్ గెటప్ సీన్స్ లేవని కొందరు ఫ్యాన్స్ అన్నారు. దీంతో ఈ సీన్స్‌ను యాడ్ చేశాం. కొత్త సీన్స్ యాడ్ చేశాక, సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని ప్రభాస్‌గారు అన్నారు.⇒ ప్రభాస్గారిలాంటి పాన్ ఇండియా హీరోతో సాదా సీదా హారర్ కామెడీ సినిమా చేయకూడదనే ఈ సినిమాలో సైకలాజికల్, మైండ్ గేమ్ ఎలిమెంట్స్ యాడ్ చేశాను. తొలిసారి చూసినప్పుడు ఈ సినిమా నచ్చుతుంది. రెండోసారి కూడా చూస్తే ఈ సినిమాలోని కాన్సెప్ట్ లోతుగా అర్థం అవుతుంది. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటే అనుకున్నది సాధించవచ్చనే సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించాం.హాస్పిటల్ సీన్లో రాజా సాబ్ పాత్ర తనకు బుర్ర తిరిగిపోతుందని ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు నానమ్మపై ప్రేమతో దెయ్యంపై గెలుస్తాడు. వేదికపై నేను చాలెంజ్ చేయలేదు. హాస్పిటల్ ఎపిసోడ్లో ప్రభాస్‌గారి నటన అద్భుతంగా ఉంటుందనే కాన్ఫిడెన్స్‌తో మాట్లాడాను. నేను చెప్పినట్లుగానే రిలీజ్ తర్వాత ఆ సీన్లో ప్రభాస్‌గారి నటన అద్భుతం అని అందరూ అంటున్నారు. ⇒ నేను చిరంజీవిగారి ఫ్యాన్‌ని. ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తే నా లైఫ్ సర్కిల్ ఫుల్ అయిపోయినట్లుగా భావిస్తాను. -
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్’ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్ రిలీజ్ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్ రిలీజ్ రోజు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
200 కోట్ల క్లబ్లో ‘ది రాజాసాబ్’
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడం చూసి ట్రేడ్ వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్ స్థాయికి ఈ కలెక్షన్స్ తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. -
ప్రభాస్ గురించి తెలియని నిజాలు..! సోషల్ మీడియా షేక్ అవుతుందిగా
-
బిజీ బిజీ
హీరో ప్రభాస్ ఫుల్ బిజీ బిజీ కాబోతున్నారు. ఆయన హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. 2024 జూన్ 27న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని ఫిబ్రవరి నుంచి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట నాగ్ అశ్విన్. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ప్రభాస్. వచ్చే నెలలో ఆయన ఇండియాకు తిరిగి వచ్చినవెంటనే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణలో పాల్గొంటారు.ఈ షెడ్యూల్లో కమల్‌హాసన్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటుగా ‘ఫౌజి’, ‘స్పిరిట్’ చిత్రాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇలా బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు మూడు రోజుల్లోనే రూ.183 కోట్లు వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంది. -
రాజాసాబ్ 'బాడీ డబుల్' ఎఫెక్ట్.. ప్రభాస్‌పై ట్రోలింగ్
‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే. -
భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే?
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఫస్ట్ అండ్ లేటెస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు రాబట్టింది.మూడురోజుల్లో ఎంతంటే?అయితే తర్వాతి రోజు నుంచి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.183 కోట్లు కోట్లు మాత్రమే వసూలు చేసింది. చూస్తుంటే పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పైగా సోమవారం (జనవరి 12) నాడు చిరంజీవి మన శంకర వరప్రసాద్ రిలీజైంది. ఈ సినిమా బ్లాక్భస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రాజాసాబ్ వసూళ్లకు పెద్ద దెబ్బే పడేట్లు కనిపిస్తోంది. సినిమామరి సంక్రాంతి బరిలోని సినిమాల పోటీని తట్టుకుని రాజాసాబ్ నిలుస్తాడా? ఫైనల్‌గా ఎన్నికోట్ల మేర కలెక్షన్స్ రాబడతాడో చూడాలి! ది రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. A festival treat turned BOX OFFICE CARNAGE ❤️🔥❤️🔥#TheRajaSaab crosses 183+ Crores Worldwide Gross in just 3 days 🔥🔥&Gears up for the Sankranthi festive week with massive audience love ❤️❤️#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/KW6pv2nGkZ— People Media Factory (@peoplemediafcy) January 12, 2026 చదవండి: ది రాజాసాబ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రభాస్‌కు అచ్చిరాని R అక్షరం.. మరోసారి రుజువైందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో బ్లాక్బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్‌కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్ సినిమా టైటిల్ ముందు The అనేది యాడ్ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్ కొనసాగినట్లే కనిపిస్తోంది...R అక్షరం వల్లే..ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన మూవీ ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా టైటిల్ రాజాసాబ్ ఆర్ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. నెగెటివ్ టాక్ప్రభాస్ నటించిన సెకండ్ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్ అని భారీ బడ్జెట్ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.సాహసం చేస్తాడా?ఇలా ఆర్ లెటర్‌తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్‌ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి! -
మొన్న అల్లు అర్జున్, ఇప్పుడు ప్రభాస్.. హరీశ్‌రావు సంచలన కామెంట్
తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్ అయ్యారు.తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..సినిమా టికెట్ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్‌రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది.ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత… pic.twitter.com/2ADAbafJa6— Harish Rao Thanneeru (@BRSHarish) January 11, 2026 -
ఇది ప్రభాస్ గిఫ్ట్
బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించే హృదయం ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఆమె వ్యక్తిత్వం. భాషలు మారినా, పాత్రలు మారినా తన అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోని నటి రిద్ధి కుమార్. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..⇒ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఫోకస్, దేనికైనా ఈజీగా అడాప్ట్ అవడం అన్నీ సహజంగానే అలవాటయ్యాయి.⇒ భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్ సహా ఏడు భాషలు మాట్లాడగలను. కొత్త భాష అంటే నాకు కొత్త ప్రపంచం.⇒ మిస్ యూనివర్స్ ఇండియా వైల్డ్‌కార్డ్‌గా తిరిగి రావడం నాకే ఒక సర్ప్రైజ్. నటనతో పాటు నేనెవరో మళ్లీ గుర్తు చేసిన అనుభవం అది. అదే నన్ను సినిమాల్లోకి కూడా తీసుకొచ్చింది. ⇒ తొలిసారి ‘లవర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తర్వాత ‘అనగనగా ఓ అతిథి’, ‘రాధే శ్యామ్’ చేశాను. ఇలా ప్రతి సినిమా నాకు ఒక పాఠమే. ⇒ కెమెరా ముందు నటించడమే కాదు, కెమెరా వెనుక ప్రపంచాన్ని చూడడం కూడా నాకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీ చేస్తూ ‘ఈ క్షణం మళ్లీ రాదు’ అని అనిపిస్తుంది. ⇒ ట్రావెల్ అంటే టూరిస్టు స్పాట్స్ కంటే ‘హిడెన్ జెమ్స్’ నాకు ఎక్కువ ఇష్టం. ఇటీవల అహ్మదాబాద్ ఓల్డ్ సిటీ వైబ్స్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ⇒ పుస్తకాలు నా బలహీనత. చదివే సమయం లేకపోయినా, కొనకుండా ఉండలేను. ఫిలాసఫీ అంటే నాకు చాలా ఆసక్తి.⇒ ఎంత బిజీగా ఉన్నా చదువు మాత్రం వదల్లేదు. 2025లో కూడా మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ చేస్తున్నాను.⇒ స్కిన్ కేర్ విషయంలో కొన్ని తప్పులు చేశాను. మేకప్‌తోనే నిద్రపోవడం, వేడి నీళ్లతో ముఖం కడగడం ఇవన్నీ ఇప్పుడిప్పుడే మానేసి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాను.⇒ ఫ్యాషన్ విషయంలో నా స్టయిల్ మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం దేసీ స్టయిల్ ఇష్టం. ముఖ్యంగా చీరలో ఉన్న అందం వేరే లెవల్. ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్రభాస్ గిఫ్ట్‌గా ఇచ్చిందే. ఇది వేసుకున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ⇒ నేనొక పెద్ద ఫూడీ. పుణేలోని ఒక టిబెటన్ స్ట్రీట్ ఫుడ్ స్పాట్ నాకు చాలా ఇష్టం. మోమోస్, థుక్పా అంటే ప్రాణం. అలాగే నెయ్యి దోశ, నెయ్యి కారంపొడి ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ ఉంటే చాలు.⇒ ప్రతి ఒక్కరికీ కొన్ని ఆధ్యాత్మిక ట్రిప్స్ చాలా అవసరం. అలా శంకరాచార్య ఆలయంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.⇒ 2025 నాకు చాలా స్పెషల్. ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించడం నా కెరీర్లో పెద్ద అడుగు. అలాగే ఈ న్యూ ఇయర్‌కు మరాఠీ సినిమాతో కొత్త ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నాను. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్తగా ఆ సీన్స్..!
ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్‌లో ప్రభాస్‌ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్, పోస్టర్స్‌లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నామని తెలిపారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం.. వాటికి సెన్సార్ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్ యాడ్ అవుతాయని మారుతి వెల్లడించారు. THE ONE YOU ALL HAVE BEEN WAITING FOR 🔥🔥OLD GETUP SEQUENCE is finally adding from today’s evening shows onwards 🤙🏻🤙🏻#TheRajaSaab#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/aOz3n9XsqE— The RajaSaab (@rajasaabmovie) January 10, 2026 -
చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. ప్రభాస్‌కు నో.. కారణం ఇదేనా?
సంక్రాంతి పండగ సందర్భంగా 'మన శంకర వరప్రసాద్‌గారు, ది రాజా సాబ్' చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రీమియర్స్ లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. అయితే, కొన్ని గంటల్లోనే చిరంజీవి సినిమాకు ప్రీమియర్స్ షోలతో పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేశారు. ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రభాస్ సినిమాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.నాకు సంబంధం లేదు: మంత్రితాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకి రాలేదని పేర్కొన్నారు. నాకు తెలియకుండానే జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన చెందారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ నుంచి ప్రత్యేక జీవో వచ్చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ వేసుకునేందుకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధర రూ. 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్స్ షోలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా సానుకూలంగా అవకాశం కల్పించింది. అయితే,రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్‌కు రాత్రి 10.30 దాటినా ప్రత్యేక జీవో రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.ప్రభాస్ ఫోన్ కాల్ చేయకపోవడంతో..ప్రభాస్, చిరంజీవి సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ GO జారీ వెనుకున్న కీలక అధికారి రాజా సాబ్ గురించి కలత చెందాడట. ప్రభాస్ తనను నేరుగా సంప్రదించకపోవడంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మొదటి నుంచి రాజకీయ విషయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే.., కానీ ఆ అధికారి అతని నుండి నేరుగా కాల్ వస్తుందని ఆశించారని.. దీని కారణంగానే జీఓ విషయంలో ఆలస్యం అయిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది.రాజా సాబ్ నష్టం వెనుక నిర్మాత దిల్ రాజు ఉండవచ్చని కూడా కొందరు పేర్కొంటున్నారు. అతని వ్యాపార ప్రత్యర్థి నైజాం ఏరియాలో రాజా సాబ్ సినిమా పంపిణీదారుడిగా ఉన్నారట. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, అతను ప్రభుత్వంలోని తనకు తెలిసిన సన్నిహితులతో గేమ్ ప్లాన్ చేశారని మరికొందరు ఆరోపించారు.ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా విమర్శలు ఉన్నాయి. పలు రాజకీయ కారణాలతో జీఓను విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారని, పదేపదే మరో ఐదు నిమిషాలు అంటూ కాలక్షేపం చేశారని అంటున్నారు. అయితే, రాత్రి 10 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద రచ్చ చేయడంతో వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చివరి నిమిషంలో జీఓ విడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో, అబద్ధమో తేలాల్సి ఉంది.చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్.. కారణం ఇదేనా..?టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలౌతుందటే.. వారిని వేర్వేరుగా చూడటం ఏంటి అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా మండి పడుతున్నారు. అయితే, మన శంకర వర ప్రసాద్‌గారికి బెనిఫిట్స్ దొరకడం వెనుక నిర్మాత సాహు గారపాటి పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో ఆయనకు స్నేహం ఉందట. చాలా కాలంగా ఇరు కుటుంబాలు స్నేహంగా ఉండటం వల్లనే సకాలంలో జీఓను ఆయన తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు రకాలుగా రాజా సాబ్ అంశంలో వైరల్ అవుతుంది.మంత్రికి చెప్పకుండా జీఓ ఎవరిచ్చారు..?రాజా సాబ్, చిరంజీవి సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు విషయంలో జీఓ ఎవరిచ్చారో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా ఆయన ఇవ్వాల్సిన అనుమతులు ఎవరిచ్చారనేది రాజకీయ వర్గల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు. ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డి అనఫీషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారంటూ ప్రచారం ఉంది. ఆయన నేతృత్వంలో ఇదంతా జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. -
‘శరచ్చంద్రికా తేజయామిని..’ చాలా మందికి అర్థం కాలేదు
‘‘నేను లిరిసిస్ట్‌గా 2012లో కెరీర్ స్టార్ట్ చేస్తే, అప్పట్నుంచి నంది అవార్డులు లేవు. మన ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని భావిస్తాను. ఒకవేళ అవార్డ్స్ వస్తే అవి బోనస్’’ అని చెప్పారు ప్రముఖ గీత రచయిత కేకే (కృష్ణకాంత్). నేడు (శనివారం) కేకే పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘2025లో నేను పాటలు రాసిన 22 చిత్రాల నుంచి 45 పాటలు విడుదలయ్యాయి. 2025లో నాకు చాలెంజింగ్‌గా అనిపించిన పాట ‘ది రాజాసాబ్’ సినిమాలోని ‘సహనా సహనా’. ఇక ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌గార్లు కలిసి డ్యాన్స్ చేసిన ‘సలామ్ అనాలి’ (‘వార్ 2’ సినిమా) పాట రాయడం సంతోషంగా అనిపించింది. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలోని ‘మౌనిక’ పాట తెలుగు వెర్షన్ రాశాను. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సినిమాలోని అన్ని పాటలు రాశాను. ‘మిరాయ్’ చిత్రంలోని ‘వైబ్ ఉంది’ సాంగ్ యూట్యూబ్‌లో 130 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లింది. ప్రభాస్, నాని, శ్రీవిష్ణుగార్లు నన్ను నమ్మి అవకాశం కల్పిస్తున్నారు. నేను ప్రభాస్‌గారి అభిమానిని. కెరీర్ ఆరంభంలో ఆయన సినిమాలకు పాటలు రాస్తే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు ప్రభాస్‌గారి వరుస చిత్రాలకు (సాహో, రాధేశ్యామ్, సలార్, ఫౌజి) పాటలు రాయడం హ్యాపీ. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’, ఎన్టీఆర్‌గారి ‘ఎన్టీఆర్ నీల్’, విజయ్ సేతుపతి ‘పూరీ సేతుపతి’ సినిమాలతో పాటు చాలా సినిమాలకు పాటలు రాస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పాటల్లో ఇంగ్లిష్ పదాలు తక్కువగానే ఉంటాయి. ‘ది రాజాసాబ్’లో ‘శరచ్చంద్రికా తేజయామిని..’ పాట రాశాను. చాలామందికి ఈ పదాలు అర్థం కాలేదు. అర్థం కాలేదని తెలుగు రాయకుండాపోతే మన భాషను మర్చిపోతాం. అయితే ట్రెండ్‌నూ ఫాలో అవుతాను’’ అని చెప్పారు. -
'ది రాజా సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అధికారిక ప్రకటన
ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి. రాజా సాబ్ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ ఫస్ట్ లుక్ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజా సాబ్ సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ మొదటిరోజు కలెక్షన్స్ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్‌కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్ డే ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. -
ఇలా జరుగుతుందనుకోలేదు, సారీ..: మారుతి
'రాజాసాబ్ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు డిసప్పాయింట్ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్లో ప్రభాస్‌ను ఓల్డ్ గెటప్‌లో చూపించాం. థియేర్లో ఆ సీన్స్ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్లో నటించిన చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్ అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. 'రాజాసాబ్.. కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్ థియేటర్లో ప్రీమియర్స్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. సారీమారుతి మాట్లాడుతూ.. విమల్ థియేటర్ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్.మూడేళ్ల కష్టంనెక్స్ట్.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దుఇకపోతే సినిమా రిజల్ట్ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.రియల్ రాజాసాబ్ట్రైలర్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూపించాం. సినిమాలో ఆ సీన్స్ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.చదవండి: మాట మీద నిలబడ్డ మెగాస్టార్ చిరంజీవి -
మరో బిగ్ సీక్వెల్ కన్ఫర్మ్.. రెబల్ ఫ్యాన్‌కు పండగే..
-
నాచే నాచే కాపీనా? 'రాజాసాబ్'కు చెప్పు చూపించిన డీజే
ట్యూన్స్ కాపీ కొడతాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై ఓ అపవాదు ఉంది. కొన్ని పాటలైతే.. వాటిని ఎక్కడో విన్నట్లుందే అని ప్రేక్షకులే అనుమానపడతారు. కానీ ఈసారి ట్యూన్ కాపీ కొట్టి.. ఒరిజినల్ కంపోజర్కే దొరికిపోయాడు. తమన్ లేటెస్ట్గా ది రాజాసాబ్ సినిమాకు సంగీతం అందించాడు. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అదే 'నాచే నాచే'. ఇందులో ప్రభాస్.. ముగ్గురు హీరోయిన్లయిన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్‌తో కలిసి స్టెప్పులేశాడు.కాపీ కొట్టాడా?అయితే ఈ పాట ఒరిజినల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్.. తన ఒరిజినల్ సాంగ్ అలమేయో పాటను ప్లే చేశాడు. ఆ వెంటనే రాజాసాబ్‌లోని నాచే నాచే పాటను ప్లే చేశాడు. అది మక్కీకి మక్కీ అలాగే ఉండటంతో అతడి కోపం నషాళానికి అంటింది. ఆవేశంతో చెప్పు చూపిస్తూ వీడియో పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజాసాబ్ రిలీజ్ఇది చూసిన అభిమానులు ఈ సాంగ్ కూడా కాపీ కొట్టారా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కొద్దిమంది మాత్రం పోనీలే.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. View this post on Instagram A post shared by Vidojean (@vidojean) చదవండి: నావాడిని కలిసానోచ్.. రోహిణి -
'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?
ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం రాత్రి ప్రీమియర్లతో షోలు మొదలయ్యాయి. అయితే హారర్ ఫాంటసీ మూవీతో డార్లింగ్ హిట్ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అభిమానులకు అంతో ఇంతో నచ్చింది కానీ సగటు ప్రేక్షకుడి నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. మరి ఇలాంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? మార్కెట్లో వినిపిస్తున్న నంబర్స్ ఏంటి?ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తీశారు. హారర్ ఫాంటసీ కాన్సెప్ట్ అని అన్నారు గానీ ఇందులో హిప్నాటిజం, మైండ్ గేమ్, సైకాలజీ, ప్యారలల్ వరల్డ్.. ఇలా చాలా అంశాల్ని చూపించి వివరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. దీని వల్లే మూవీకి నెగిటివ్ టాక్ వస్తోంది. అలా అని బుకింగ్స్ ఏం డల్లుగా లేవు. తొలిరోజు డీసెంట్ నంబర్స్ నమోదయ్యాయి.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)ప్రీమియర్లు, తొలిరోజు కలిపి 'రాజాసాబ్' చిత్రానికి రూ.55-60 కోట్ల మధ్య నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. మూవీ టీమ్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేస్తే, దానిబట్టి వసూళ్ల విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరోకి ఈ కలెక్షన్ అనేది ఊహించిన దానికన్నా తక్కువే అని చెప్పొచ్చు. అసలు నంబర్స్ వస్తే ఎంతనేది క్లారిటీ వస్తుంది.'రాజాసాబ్' స్టోరీ విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!) -
'రాజాసాబ్'.. పాన్ ఇండియా పూర్ ప్లానింగ్!
బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు. తీరా థియేటర్లలోకి వచ్చే చివరి నిమిషం వరకు అంతా గందరగోళమే. మొత్తం ఆదరాబాదరానే. ఇంతకీ 'రాజాసాబ్' విషయంలో ఏమేం తప్పిదాలు జరిగాయి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)తెలంగాణలోని ప్రీమియర్స్ ప్లానింగ్ ఘోరంగా ఫెయిలైంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు జీవో ముందే వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. తెలంగాణకు వచ్చేసరికి రిలీజ్ రోజు(జనవరి 09న) వేకువజామున జీవో జారీ అయింది. 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. కానీ అటు జీవో రాకపోవడంతో విడుదలకు కొన్ని గంటల ముందు వరకు నిర్మాతలు.. బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సెన్సార్ త్వరగానే పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు గానీ నైజాంలో ప్రీమియర్స్, రెగ్యులర్ బుకింగ్స్ విషయంలో ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ 'రాజాసాబ్' టీమ్ సరైన ప్లానింగ్ చేసుకోలేదా అనిపించింది. ఎందుకంటే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి కాస్తోకూస్తో హైప్ వచ్చేలా చేశారు కానీ పాటలు మాత్రం ఎందుకనో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ విడుదలకు చాలా రోజులు ముందుగానే చేసేశారు. ప్రభాస్ పాల్గొన్న ఒకే ఒక్క ఇంటర్వ్యూని విడుదలకు ముందురోజు వరకు ఆన్లైన్లో వదల్లేదు. 'నాచో నాచో' అనే పాట కేవలం హిందీ, తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగులో సినిమా చేస్తూ తెలుగు వెర్షన్ పాట లేకపోవడం ఏంటో?(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)'రాజాసాబ్' కోసం దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజీ చిత్రీకరించామని స్వయంగా దర్శకుడి మారుతినే బయటపెట్టారు. తీరా చూస్తే మూడు గంటల సినిమాకే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభాస్.. ముసలి గెటప్‌లో కనిపించి, చేసే ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా తీసేశారు. కథకు అవసరమా లేదా అని ముందే ఆలోచించి ఉంటే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు ఉండేవి కాదుగా! అసలు ప్రభాస్ ఓల్డ్ గెటప్ వల్లే మూవీపై కాస్త హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే లేదని తెలిసి అందరూ నిరుత్సాహపడుతున్నారు.తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలోనూ మూవీ టీమ్ ప్లానింగ్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. సింగిల్ బెంచ్‌కి వెళ్లి అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పంపు మెమోని తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లు అమ్మాలని బుక్ మై షోని ఆదేశించింది. గత నెలలో 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు హంగామా జరిగినప్పుడే.. 'రాజాసాబ్' టీమ్ అలెర్ట్ అయి, సరైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. (ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?) -
టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమా 'రాజాసాబ్' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ కోర్టు ప్రశ్నించింది.టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్ బెంచ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు టికెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.తెలంగాణలో ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు. జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు ఆ ధరలను సడలించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది. -
'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ డీటైల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.'రాజాసాబ్' విడుదలకు కొన్ని నెలల ముందే ఓటీటీ హక్కుల్ని జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. రూ.160 కోట్లకు అన్ని భాషల హక్కుల్ని దక్కించుకుందని సమాచారం. నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది భాషలకు సంబంధించి ఫిబ్రవరి తొలివారంలో స్ట్రీమింగ్ ఉండొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగానే అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్)'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.ఇకపోతే 'రాజాసాబ్'కి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. మరోవైపు ప్రమోషన్లలో చూపించిన ప్రభాస్ వృద్ధుడి గెటప్, దానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని సినిమా నుంచి తీసేశారు. కావాలని తీసేశారా? లేదంటే సీక్వెల్ కోసం దాచుంచారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ) -
ఇంత మోసమా? 'రాజాసాబ్'లో ఆ సీన్స్ డిలీట్
ప్రభాస్‌ను వింటేజ్ లుక్‌లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్ టీమ్.. ప్రభాస్‌ను మోస్ట్ హ్యాండ్సమ్ లుక్‌లో చూపించారు. సినిమాలో డార్లింగ్ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్స్ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.అటు వింటేజ్ లుక్.. ఇటు ఓల్జ్ ఏజ్ లుక్టీజర్, ట్రైలర్లో ప్రభాస్‌ను ఓల్డ్ ఏజ్ లుక్‌లో చూపించారు. సినిమాకు హైప్ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్ లుక్, ఇటు ఓల్జ్ ఏజ్ లుక్‌లో ప్రభాస్‌ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది. సినిమాఅయితే ఈ సీన్స్ అన్నీ సెకండ్ పార్ట్‌లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaab https://t.co/EZYyncCc8R— Abhi063 (@Ab0612ish) January 9, 2026 View this post on Instagram A post shared by Movie Mirchi (@movie_mirchi___) First scam in 2026This look 😭😭pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?
-
రాజాసాబ్ రిలీజ్.. థియేటర్లలో మొసళ్లు!
డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్లో తొలిసారి నటించిన చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. గురువారం (జనవరి 8) నుంచే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు థియేటర్ లోపల, బయట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మొసళ్లు పట్టుకుని థియేటర్లో హంగామా చేసినట్లు వీడియోలు వైరలవుతున్నాయి.థియేటర్లో మొసళ్లు?అయితే అవి నిజం మొసళ్లు కాదు, డమ్మీవి.. ఆ మాటకొస్తే కొన్ని వీడియోలు కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఓ వీడియోలో సీట్లన్నీ ఒకవైపు ఉంటే.. స్క్రీన్ మాత్రం సీట్లకు ఎదురుగా కాకుండా కుడివైపు ఉంది. దీన్ని బట్టి అది ఫేక్ వీడియో అని ఇట్టే అర్థమవుతోంది. మరో వీడియోలో అయితే అందరూ మొసళ్లు పట్టుకుని రాజాసాబ్ అని నినాదాలు చేస్తున్నారు. అదీ సంగతి!ఇక ఇంకో వీడియోలో ఓ బొమ్మ మొసలిని పట్టుకుని ఆడించారు. ఇదైతే నిజమే అని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ మొసలితో పోరాడే సన్నివేశం ఉంటుంది. ట్రైలర్లోనూ ఆ క్లిప్ చూపించారు. దీంతో అభిమానులకు థియేటర్లో మొసళ్లు ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. కొందరు డమ్మీ బొమ్మలతో ఆడుతుంటే మరికొందరు ఏకంగా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నారు. సినిమారాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటులు సంజయ్‌దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది. Prompt crt ga eyaledu bhai adu screen atu side untey seats etu side pettadu https://t.co/mlcCuWnGui— Nikkar Narayana ™ (@urstrulynikkar1) January 8, 2026Omg 😱 see the Rebels bring crocodile 🐊 to #RajaSaab movie theatres 🥵🔥💥#Prabhas 🔥🔥🥵 pic.twitter.com/4FuA3V1UdP— ℙℝ𝔼𝔼𝕋𝕐 (@MySelf_Preety) January 8, 2026Ehh mental nakoduluu crocodile 🐊 ni sav dengaru climax lo edi USA ani chepandra vadikii 🥵🥵🥵😭😭💥💥💥💥💥#RajaSaab pic.twitter.com/e7Io1fZ1PZ— Virat Kohli (@Kranthi_1322) January 8, 2026 చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ -
అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)
-
‘ది రాజాసాబ్ 2’ కూడా ఉంది.. టైటిల్ ఇదే!
పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ చిత్రాలన్నింటికి పార్ట్ 2 ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలకు సీక్వెల్ కథలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి ‘ది రాజాసాబ్’ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'ది రాజాసాబ్' ఈరోజు(జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంది. ( చదవండి: ది రాజాసాబ్ మూవీ రివ్యూ)పార్ట్ 2కి ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించబోతున్నాడు. రాజాసాబ్ సినిమా ఎండింగ్లో సీక్వెల్‌కి లీడ్ ఇస్తూ ప్రభాస్ లుక్‌ని పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చనే చర్చ నడుస్తోంది. ట్రైలర్లో చూపించిన చాలా సన్నివేశాలు రాజాసాబ్‌లో చూపించలేదు. అవన్నీ పార్ట్ 2లో చూపించే అవకాశం ఉంది. 'ది రాజాసాబ్'లో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సీక్వెల్ ప్రకటన ఫ్యాన్స్‌కు ఊరట కలిగించింది.సీక్వెల్ వివరాలు, షూటింగ్ షెడ్యూల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. -
ప్రభాస్ కటవుట్ కి ఫ్యాన్స్ పాలాభిషేకం
-
‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : ది రాజాసాబ్నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్రచన-దర్శకత్వం: మారుతిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళనిఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జనవరి 9,2026ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటించిన తొలి హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో రాజాసాబ్‌పై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 9)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ(The Raja Saab Movie Review)లో చూద్దాంకథేంటంటే..రాజు అలియాస్ రాజాసాబ్(ప్రభాస్)కి నాన్నమ్మ గంగాదేవి(జరీనా) అంటే ప్రాణం. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయానైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని..అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి..తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీ(నిధి అగర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి(మాళవిక మోహన్)..రాజాసాబ్తో ప్రేమలో పడుతుంది. ఆమె ద్వారా తాత నర్సాపూర్ అడవిలో ఉన్న ఓ కోటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత రాజాసాబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకు ఉంది? కనకరాజు నేపథ్యం ఏంటి? దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగా... సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది? ఈ కథలో గంగరాజు(సముద్రఖని) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే( The Raja Saab Movie Review). ఎలా ఉందంటే..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్లే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ని స్టైలీష్ లుక్‌లో చూపించడమే కాకుండా ఆయనలో దాగిఉన్న కామెడీ యాంగిల్‌ని చాలాకాలం తర్వాత మరోసారి బయటకు తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను మాత్రం మారుతి పూర్తిగా అందుకోలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే కథను రాసుకున్నా.. దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెటుకోనే కొన్ని అనవసరపు సన్నివేశాలను ఇరికించి..అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది.ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నాన్నమ్మ-మనవడి కథే. నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా.. ఓవరాల్‌గా మాత్రం ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు.. ప్రభాస్ నటన ఆ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్నా.. ఒకటి,రెండు సీన్లు తప్ప మిగతావేవి భయపెట్టలేదుకమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాంగ్‌తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నాన్నమ్మ-మనవడిల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్లడం..అక్కడ బ్లెస్సీ, భైరవిలతో ప్రేమాయణం..ఇవన్నీ ఎంటర్టైనింగ్గా సాగుతూనే..మధ్యలో గంగరాజు పాత్రని చూపిస్తూ.. ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు-గంగాదేవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. (Positives And Negatives In Rajasaab Movie)ఇక ద్వితీయార్ధంలో కథనం మొత్తం అడవిలొ ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం.. వారిని తాత ఆత్మ అడ్డుకోవడం.. ఈ క్రమం వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమ్ మూవీని గుర్తుకు చేస్తాయి. హారర్ కంటే కామెడీ, రొమాంటిక్ సీన్లే బాగా పేలాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆస్పత్రి సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది. ఎవరెలా చేశారంటే..చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ..నాన్నమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచ్‌లు, ఫైట్స్ అన్నీ వింటేజ్ ప్రభాస్‌ని గుర్తు చేస్తాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీశాడు. ఆస్పత్రి సీన్లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాళవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యతలేదు.. నిడివి కూడా చాలా తక్కువే. నాన్నమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్‌లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్‌లోనే ఆయన్ని చూపించారు. ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేశ్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. కానీ వాటి ప్లేస్మెంట్ సరిగా కుదర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతిఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనిపించింది. ఆర్ట్‌వర్క్ బాగుంది. అయితే కోట సెట్ అనే విషయం తెలిసిపోతుంది. సహజత్వం లోపించింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి నిడివి( 3 గంటల 9నిమిషాలు) తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కగా తగ్గలేదని సినిమా చూస్తే అర్థవమవుతుంది.- అంజిశెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ది రాజాసాబ్ మేకర్స్‌కు బిగ్ షాక్..!
ది రాజాసాబ్ మూవీ మేకర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. -
ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత..!
ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.విమల్ థియేటర్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేకపోయినా... థియేటర్ కి వచ్చిన అభిమానులుమీడియా కోసం విమల్ లో ప్రత్యేక షో ఏర్పాటుఅభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం తో మీడియా షో తాత్కాలికంగా నిలిపివేత#TheRajasaaab #Prabhas #RajaSaab pic.twitter.com/9Eg9nu8BLF— Anji Shette (@AnjiShette) January 8, 2026 -
ది రాజాసాబ్ ట్విటర్ రివ్యూ.. ఫుల్ జోష్‌లో రెబల్ స్టార్ ఫ్యాన్స్..!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రీమియర్స్‌తో ఫ్యాన్స్ ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్‌తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఈ మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.హీరోయిన్ రిద్ది కుమార్ దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.సెకండాఫ్‌లో కూడా అలరించిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొసళ్లతో ఫైట్ అదిరిపోయిందని పోస్ట్ చేస్తున్నారు. చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఈ సినిమాకు హైలెట్ అని రాసుకొస్తున్నారు. ప్రభాస్ ఫర్మామెన్స్తో అదరగొట్టేశాడని చెబుతున్నారు. చివరి 40 నిమిషాల్లో ఎస్ఎస్ తమన్ బీజీఎం అద్భుతమని అంటున్నారు. Hospital sequence ➡️ crocodile fight ➡️ climax 🔥The last 30 minutes are the SOUL of the film.#Prabhas delivers a performance with par excellence 👌 Trying something different and nailing it.Brilliant writing by @DirectorMaruthi 👌 Truly surprising!@MusicThaman is the…— Suresh PRO (@SureshPRO_) January 8, 2026 #TheRajaSaab – First Half Review— STORY – #RajaSaab is about the hero’s journey in search of his grandfather.— #Prabhas’ performance is good. Each reaction he gives works well.Prabhas’ intro scene is superb.— #RiddhiKumar appears for about 5 minutes so far. Her look is… pic.twitter.com/Mj8iHpZbc9— Movie Tamil (@_MovieTamil) January 8, 2026 Musk changed like ❤️ button to celebrate 🔥🔥🔥 the release of #TheRajaasaab #TheRajaSaab #Prabhas𓃵 @prabhas pic.twitter.com/OmVMnJVyWS— R A J (@dune1411) January 8, 2026 -
తెలంగాణలో 'ది రాజాసాబ్' ఫ్యాన్స్‌కు నిరాశ..
తెలంగాణలో 'ది రాజా సాబ్' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాధతో థియేటర్స్ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్ అభిమానులు భగ్గుమంటున్నారు.'ది రాజా సాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్ ధరల పెంపునకు ఛాన్స్ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్ మొదలు కాలేదు. కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?టికెట్ ధరల పెంపు కోసం ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, ప్రబాస్ ‘ది రాజాసాబ్’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది. టికెట్ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ప్రభాస్‌కు తొలిసారి.. ‘ది రాజాసాబ్’ గురించి 10 ఆసక్తికర విషయాలు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజాసాబ్ గురించి పది ఆసక్తికరమైన విషయాలు..ప్రభాస్‌కి తొలి సినిమా: ప్రభాస్ కెరీర్లో చేస్తున్న తొలి హారర్ ఫాంటసీ కామెడీ చిత్రమిది. బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ తన రూట్ మార్చి వింటేజ్ లుక్‌లో ఫ్యాన్స్‌ని అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాలో మొదటిసారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు . మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్‌కి జోడీగా నటించారు. అతిపెద్ద సెట్: ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అజీజ్ నగర్లో హవేలి సెట్‌ను నిర్మించారు. దాదాపు 40,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్‌గా రికార్డ్ సృష్టించింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నాయర్ ఈ సెట్‌ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు. ఈ సెట్లోనే ఎక్కువ శాతం షూటింగ్ జరిగిందట. భారీ రన్‌టైమ్: ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు.థ్రిల్ చేసేలా ఫాంటసీ ఎలిమెంట్స్: ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంది. సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ వెల్లడించారు.23 కోట్లతో మొసలి సీన్ : ఈ సినిమాలో మొసలితో ప్రభాస్ చేసే ఫైట్ సీన్ అదిరిపోతుందట.ఈ ఒక్క సీన్ కోసమే దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్ కోసం హీరోయిన్ మాళవికా మోహనన్ 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందట. ‘ఒకవైపు చలికి చర్మం మొత్తం మొద్దుబారిపోతున్న ఫీలింగ్ కలిగేది. అదే సమయంలో మొసలి దాడి చేస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలన్నారు. ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అందరూ అందులోకి దిగి షూట్ చేస్తున్నారు. పెయింట్, కెమికల్స్, వాడిపారేసిన వస్తువులు అన్నీ అందులో ఉన్నాయి. ఆ నీటిలోనే 3 రోజులు షూట్ చేశాం. అదొక వింత అనుభవం’ అని ఓ ఇంటర్వ్యలో మాళవిక చెప్పుకొచ్చింది. రూ.450 కోట్ల బడ్జెట్.. ప్రభాస్‌కి తక్కువే: ఈ సినిమా కోసం పిపుల్స్ మీడియా దాదాపు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేసిందట. ఇందులో అత్యధికంగా రెమ్యునరేషన్లకే కేటాయించాల్సి వచ్చిదంట. అయితే ప్రభాస్ మాత్రం గత సినిమాల కంటే తక్కువ పారితోషికం తీసుకొని ఈ సినిమా చేశాడు. ప్రతి సినిమాకు రూ. 120-150 కోట్లు తీసుకునే ప్రభాస్.. రాజాసాబ్‌కి మాత్రం రూ.100 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. ఇక విలన్‌గా నటించిన సంజయ్ దత్ రూ. 6 కోట్లు, డైరెక్టర్ మారుతి రూ. 18 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే.. మాళవికా రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్ రూ. 1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.ఫస్ట్ టైటిల్ ఇదే: ఇది బామ్మ-మనవడి కథ. ఇందులో బామ్మ కూడా ఓ హీరోనే అంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాసే ఈ సినిమా కథను రివీల్ చేశాడు. ఇందులో బామ్మ భర్త విలన్. అనుకోని పరిస్థితుల్లో హీరో పాడుబడ్డ మహల్‌కు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకనేది సినిమా చూడాలి.ఈ సినిమాకు ముందుగా రెండు, మూడు టైటిల్స్ అనుకున్నారట. రాజా డీలక్స్, రాజా అనే టైటిల్ అనుకున్నారట. రాజా అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ పూర్తి చేసి.. చివరకు ‘ది రాజాసాబ్’ని ఫిక్స్ చేశారు. సినిమా అధికారిక టైటిల్ ని 2024 జనవరిలో ప్రకటించారు.విలన్‌గా సంజయ్: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో ప్రభాస్ తాతగారి ఘోస్ట్ పాత్ర పోషించారు . ప్రభాస్‌తో ఆయన క్లాష్ సీన్స్ హైలైట్ అవుతాయని టాక్.తమన్ సంగీతం: ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఉన్న సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బీజీఎం అయితే ఓ రేంజ్లో ఉంటుందట. తమన్ తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు మారుతితో పాటు ప్రభాస్ కూడా అన్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జోరుగా సాగుతున్నాయి .జనవరి 8న ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు భారీగా పెరిగాయి.ప్రీమియర్స్‌కి టికెట్ ధర ఏకంగా రూ. 1000 గా ఫిక్స్ చేశారు. -
'స్పిరిట్' పోస్టర్‌పై ప్రభాస్ కామెంట్.. 'సందీప్' వివరణ
ప్రభాస్- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్ నుంచి తెరకెక్కుతున్న హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’.. కొత్త ఏడాది సందర్భంగా ఆ మూవీ నుంచి అదరిపోయే పోస్టర్‌ను దర్శకుడు సందీప్ రిలీజ్ చేశారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో డార్లింగ్ కనిపించారు. ఒళ్లంతా గాయాలతో తను ఉండగా.. ఆయన ముందు త్రిప్తి దిమ్రీ నిలబడి ఉంది. చేతిలో వైన్ బాటిల్‌తో మరింత ఫైర్‌ను పెంచాడు. అందరినీ మెప్పించిన పోస్టర్‌పై సందీప్, ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి హోస్ట్‌గా ప్రభాస్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్‌లతో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వారు స్పిరిట్ ఫస్ట్ లుక్ గురించి ప్రభాస్ ఇలా అన్నారు. 'నా కెరీర్లోనే ఇది బెస్ట్ పోస్టర్.. కల్ట్ పోస్టర్' అంటూ దర్శకుడు సందీప్‌ను మెచ్చుకున్నారు. ఇలాంటి ఆలోచన సందీప్‌కి ఎలా వచ్చిందోగానీ అదిరిపోయిందంటే డార్లింగ్ ప్రశంసించారు. అయితే, సందీప్ రెడ్డి కూడా పోస్టర్ వెనుక జరిగిన కసరత్తు గురించి చెప్పుకొచ్చారు. బాహుబలి తర్వాత అంతే రేంజ్లో ప్రభాస్‌ను చూపించాలని ఆలోచించానని.. అందుకే ఆ పోస్టర్‌ను రెడీ చేశానన్నారు. అయితే, సినిమాలో ఒక సీన్ నుంచి ఆ పోస్టర్‌ను తీసుకున్నట్లు ఆయన పేర్కన్నారు. -
సినిమాలు తక్కువ.. ఇంటర్వ్యూలు ఎక్కువ!
సినిమాకు ప్రమోషన్స్ కచ్చితంగా కావాల్సిందే! కంటెంట్ సంగతి పక్కనపెడితే.. ఫలానా మూవీ థియేటర్లలో వస్తుందని తెలిసేది ప్రమోషన్స్ వల్లే! కాబట్టి రిలీజయ్యేవరకు గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సిందే.. తర్వాత టాక్ బాగుంటే సినిమా దానంతటదే పుంజుకుంటుంది! అందుకే ఈ మధ్య రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.సినిమాల కన్నా ఇంటర్వ్యూలే ఎక్కువఅయితే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కూడా ఈ ప్రమోషన్స్‌లోకి లాగుతున్నారు. సందీప్ రెడ్డి ఇప్పటివరకు మూడే మూడు సినిమాలు తీశాడు. 2017లో అర్జున్ రెడ్డితో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. దాన్నే హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా విజయం సాధించాడు. రెండేళ్ల క్రితం యానిమల్ మూవీతో మరోసారి రికార్డులు తిరగరాశాడు. తొమ్మిదేళ్లలో మూడు సినిమాలు తీస్తే.. ఇంటర్వ్యూలు మాత్రం అందుకు రెట్టింపు సంఖ్యలో చేశాడు.ఆర్ఆర్ఆర్ నుంచి..ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సమయంలో దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ, దేవర సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో, కింగ్డమ్ అప్పుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో, శివ రీరిలీజ్ సమయంలో రాంగోపాల్ వర్మతో.. ఇలా వరుసగా ఇంటర్వ్యూలు చేశాడు. హాయ్ నాన్న రిలీజ్ సమయంలో నానిని కూడా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు ది రాజా సాబ్ కోసం రంగంలోకి దిగాడు. రాజాసాబ్ హీరోహీరోయిన్లు ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లను ఇంటర్వ్యూ చేశాడు. బుల్లెట్ పాయింట్ ప్రశ్నలుఅందరూ సందీప్‌నే యాంకర్‌గా ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. జనాల్లో అతడికున్న క్రేజ్.. అలాగే తన ఇంటర్వ్యూలో సాగదీత అనేది ఉండదు. బుల్లెట్ పాయింట్స్‌లా ప్రశ్నలడుగుతాడు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా బోర్ కొట్టకుండా జనాలు మైమరచిపోయి చూస్తుండిపోయేలా చేయగలడు. అతడి అభిప్రాయాలు చాలామంది సినీప్రేక్షకులకు కనెక్ట్ అవడం మరో విశేషం. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి బాలీవుడ్‌లోనూ బజ్ క్రియేట్ అవుతుందన్న ఆశ కూడా ఉండొచ్చు! అందుకే వంగాతో ఇంటర్వ్యూ అంటే అటు చిత్రయూనిట్‌కు, ఇటు సినీప్రియులకు ఎంతో ఇష్టం! చదవండి: 23 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్క అవార్డు రాలే -
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ రూ.1,000
సాక్షి, అమరావతి: ప్రభాస్ నటించిన కొత్త సినిమా రాజాసాబ్ ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల ధరలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గురువారం సాయంత్రం ప్రదర్శించే ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని, ఒక్కో టికెట్‌పై అదనంగా సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభాస్ గారు గ్లోబల్‌స్టార్
‘‘ప్రభాస్‌గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన సినిమాలు విదేశాల్లోనూ విడుదల అవుతున్నాయి. ప్రభాస్‌గారు గ్లోబల్‌స్టార్. ‘ది రాజాసాబ్’ సినిమా చేసే విషయంలో నాకు ఒత్తిడి లేదు అని చెప్పలేను. అయితే సినిమా చూసుకున్నాను. హీరో క్యారెక్టర్‌తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ను కూడా సినిమాలో చూస్తారు. ప్రభాస్‌గారిని ఎలా చూడాలని ఆడియ న్స్ అనుకున్నారో అలానే చూస్తారు’’ అని చెప్పారు దర్శకుడు మారుతి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ , రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌దత్ మరో ప్రధాన పాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘నేడు మా సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రభాస్ ఫ్యా న్స్ ఎంత సంతోషంతో థియేటర్స్‌కి వెళ్తారో, అంతకు రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారు’’అని చెప్పారు. ‘‘హ్యూజ్ హారర్ ఫాంటసీ చిత్రంగా ‘ది రాజాసాబ్’ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈ పండక్కి ఏడు సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో థియేటర్స్‌ను షేర్ చేసుకోకతప్పదు’’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘‘ప్రభాస్‌గారి ఓవరాల్ పెర్ఫార్మె న్స్ ను ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు తమన్ . ‘‘ఈ నెల 9 నుంచి మా సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని పేర్కొన్నారు కృతీ ప్రసాద్. -
జీవో వచ్చేసింది.. 'రాజాసాబ్' టికెట్ ధర రూ.1000
ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్లు చెదిరే టికెట్ ధరల పెంపు కోసం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ముందురోజు అంటే జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 లోపు వేసే స్పెషల్ షో కోసం ఏకంగా రూ.1000 ధర పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలానే జనవరి 9 నుంచి తర్వాత పదిరోజుల పాటు కూడా భారీగా పెంపు ఇచ్చింది.రిలీజ్ రోజు (జనవరి 09) నుంచి తర్వాత 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్స్‌ల్లో రూ.200 వరకు ఒక్కో టికెట్‌పై పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు తెలంగాణలోనూ ఈ చిత్ర నిర్మాతలు.. హైకోర్టు నుంచి టికెట్ రేట్ల పెంపుపై ఉత్తర్వులు తెచ్చుకున్నారు.దాదాపు రెండు మూడేళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా, మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. -
‘రాజాసాబ్’కు రూ.1000 కోట్లు సాధ్యమేనా?
జనవరి 9... ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న డేట్ ఇది. ఆ రోజే ‘ది రాజాసాబ్’ థియేటర్స్‌లోకి రాబోతున్నాడు. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే జనవరి 8న ప్రీమియర్స్‌తో ప్రభాస్ అబిమానుల సందడి ప్రారంభం కానుంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ ఫాంటసీ మూవీ కావడంతో రాజాసాబ్(The Raja Saab)పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.పట్టుమని పది కూడా లేవు.. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటికే వేల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో చాలావరకు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మాత్రం పట్టుమని పది కూడా లేవు. పాన్ ఇండియా సినిమాల్లో ఇప్పటివకు దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, పఠాన్, జవాన్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ, దురంధర్ చిత్రాలు మాత్రమే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే ఇవన్నీ భారీ యాక్షన్ సినిమాలే. పాన్ ఇండియా ప్రేక్షుకులు మెచ్చే కంటెంట్‌తో విజువల్ వండర్స్‌గా వాటిని తెరకెక్కించారు. కానీ ది రాజాసాబ్ హారర్ కామెడి ఫాంటసీ. ఈ జోనర్ చిత్రాలు ఇప్పటివరకు రూ. 1000 కోట్లు వసూలు చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ రాజాసాబ్ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ఆ ఘనత సాధించిన తొలి హారర్-రొమాంటిక్ ఎంటర్టైనర్గా చరిత్రకెక్కుతుంది.ఆశలన్నీ ప్రభాస్‌పైనే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా రూ. వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే..బాక్సాఫీస్ షేక్ అవ్వాలిసందే. ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు(బాహుబలి 2: రూ.1800 కోట్లు, కల్కి: రూ.1100 కోట్ల) రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. యావరేజ్ టాక్ వచ్చిన సలార్, సాహో వంటి సినిమాలు కూడా ₹400-700 కోట్ల రేంజ్ లో నిలిచాయి. రాధేశ్యామ్ లాంటి ఫ్లాప్ చిత్రానికి కూడా రూ. 200 కోట్లకు పైగా వసూళ్ల వచ్చాయి. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు, మూడు వందల కోట్లు గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇప్పుడు ‘రాజా సాబ్’ ఆయన కెరీర్లో మరో రూ.1000 కోట్ల శిఖరాన్ని చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.రూ. 100 కోట్లు అంత ఈజీకాదు..అయితే రాజాసాబ్ రూ. 1000 కోట్ల క్లబ్ చేరడం మాత్రం అంత ఈజీకాదు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు తెలుగులో మరో ఆరు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బడాస్టార్ల పోటీని తట్టుకొని రాజాసాబ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తాడనేదానిపై సినిమా ఫలితం ఆదారపడి ఉంటుంది. ప్రభాస్(Prabhas)కు కలిసొచ్చే అంశాలు ఏంటంటే.. పండగ సీజన్, మిగతా హీరోలతో పోలిస్తే.. పాన్ ఇండియాలో ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. అయితే రాజాసాబ్‌కి హిట్ టాక్ వచ్చినా.. పుష్ప 2 లాగా కేవలం వారం రోజుల్లో రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం కష్టమే. ‘ధురంధర్’ లాగా లాంగ్ రన్ సాధిస్తే మాత్రం ఈజీగా రూ. 1000 కోట్ల మార్కుని అందుకుంటుంది. (ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలను GrabOn టీమ్ పరిశీలించి, క్రాస్-వెరిఫై చేసి, ధృవీకరించింది) -
తెలంగాణ హైకోర్టుకు చిరంజీవి, ప్రభాస్
-
‘ది రాజాసాబ్’ నుంచి ఆ రెండు సీన్లు కట్.. రన్‌టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్ పాత్రలో సంజయ్‌దత్ కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌గా ఎలా మారాడు?)ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. (చదవండి: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్టైమ్నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది. హారర్ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే. ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్’ మాత్రం రిస్క్ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
ముగ్గురు భామలతో నాచే.. నాచే...
‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్’ వంటి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్‌గారితో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్. ‘‘రాజా సాబ్’లో వీఎఫ్ఎక్స్ సహజంగా ఉంటాయి. స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరానీ మాట్లాడారు. -
ప్రభాస్ ది రాజా సాబ్.. ఫుల్ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. Gear up for the MOST GROOVING MADNESS in theatres this Sankranthi 💥💥💥#NacheNache song promo is out now ❤️🔥❤️🔥❤️🔥Full song from Jan 5th 😎🙌🏼A @MusicThaman Musical Vibe 🎧 #TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/WgwCLbXaF9— People Media Factory (@peoplemediafcy) January 3, 2026 -
గడియారం వెనక్కి...
కాలం ముందుకు వెళ్తుంది. 2026కి కూడా వెల్కమ్ చెప్పాం. కానీ తెలుగుతెరపై సినిమా కథలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి. వెండితెరపై గడియారాన్ని వెనక్కి తిప్పి, కొన్ని కథలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు హీరోలు. ఇలా ఆడియన్స్ ను ఎంటర్టైన్స్ చేసేందుకు గడియారాన్ని వెనక్కి మళ్లించిన కొంతమంది హీరోల గురించి ఓ లుక్ వేయండి.టైమ్ ట్రోటర్హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్స్ లో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో మహేశ్‌బాబు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. ప్రధానంగా రుద్ర పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తే, కొన్ని సన్నివేశాల్లో రాముడు పాత్రలో కనిపిస్తారు. మరికొన్ని సన్నివేశాల్లో శివుడుగా కూడా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కథ రీత్యా ఈ సినిమా కథనం విభిన్న మైన కాలమానాల్లో సాగుతుంది.భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి టైమ్ ట్రోటర్, గ్లోబ్ ట్రోటర్ అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్స్ , ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ వారణాసి చిత్రం 2027 వేసవిలో రిలీజ్ కానుంది.పుట్టకతోనే యోధుడు‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువులేని ఏకలవ్యుడు.. పుట్టుకతోనే అతనో యోధుడు..’’.. ‘ఫౌజి’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్ గురించే ఇదంతా. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు ప్రభాస్. 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం.. వంటి అంశాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.జయప్రద, అనుపమ్‌ఖేర్, మిథున్స్ చక్రవర్తి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ‘ఫౌజి’ సినిమాకు ప్రీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల ఓ సందర్భంగా పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్స్ లోని ‘సలార్’ ఫ్రాంచైజీ సినిమా సెమీ పీరియాడికల్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇంకా నాగ్ అశ్విన్స్ డైరెక్షన్స్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకూ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ్రపారంభం కానుందని తెలిసింది.డ్రాగన్స్ రాక ఈ ఏడాదేనా..ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ. 1960 సమయంలో ఈ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా, సరిహద్దుల్లో అక్రమ రవాణా వంటి అంశాల నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాలో కథ రీత్యా ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. తాజాగా చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్ బరువు తగ్గారు.ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్స్ గా నటి స్తున్నారు. మలయాళ యువ నటుడు టోవినో థామస్, బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ కాజోల్, అనిల్ కపూర్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్స్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్స్ ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాను తొలుత ఈ ఏడాది జనవరి 10న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దీంతో ఈ ఏడాది జూన్స్ 26న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ విడుదల తేదీలో కూడా మార్చు ఉండొచ్చనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి..‘ఎన్టీఆర్‌నీల్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.పెద్ది ఆటరామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మల్టీస్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీకపూర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వేందు శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.కథ రీత్యా ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగుతుంది. 1980 టైమ్‌లైన్స్ తో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ ‘పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీలో రామ్‌చరణ్ పాల్గొనగా, ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేశారు మేకర్స్. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు కూడా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది.బ్రిటీషర్లపైపోరాటంమంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘డేవిడ్‌రెడ్డి’. ఈ హిస్టారికల్ యాక్షన్స్ డ్రామా కథనం 1897–1922 నేపథ్యంతో సాగుతుంది. బ్రిటీషర్లకు ఎదురుతిరిగిన రెబల్ డేవిడ్‌రెడ్డి పాత్రలో మంచు మనోజ్ కనిపిస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగిన డేవిడ్‌రెడ్డి బ్రిటీషర్లకు ఎలా ఎదురు నిలిచాడు? అనేది సినిమాలో చూడొచ్చని మేకర్స్ చెబుతున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలోని డేవిడ్ పాత్ర ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఈ చిత్ర దర్శకుడు హనుమరెడ్డి పేర్కొన్నారు. భరత్, నల్లగంగుళ వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.ఉత్తర తెలంగాణలో భోగిశర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. 1960 నేపథ్యంతో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామాకు సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్స్ , డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ఓ భారీ సెట్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. కేకే రాధామోహన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మరో సినిమా ‘బైకర్’. మూడు తరాల నేపథ్యంతో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా కథనం 1990, 2000 టైమ్ పీరియడ్‌లో సాగుతుంది.ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్‌లో శర్వానంద్ రేసర్ విక్రమ్ పాత్రలో నటించారు. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరులోనే విడుదల కావాల్సింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, ఆడియన్స్ కు మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. త్వరలోనే ఈ ‘బైకర్’ సినిమా కొత్త విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది.జడల్ జమానా‘దసరా’ పీరియాడికల్ రూరల్ యాక్షన్స్ డ్రామా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్స్ లో వస్తున్న తాజా సినిమా ‘ది ΄్యారడైజ్’. 1980 నేపథ్యంతో సాగే పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా ఇది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ కుర్రాడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. మోహన్స్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్‌బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఓ వర్గం కోసం ఓ నాయకుడు చేసే వీరోచితపోరాటం నేపథ్యంతో ఈ మూవీ స్టోరీ సాగుతుందని తెలిసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.రౌడీ జనార్ధన‘కలింగపట్నంలో ఇంటొకకడు రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటి పేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’’ అంటూ గంభీరంగా చెబుతూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు విజయ్ దేవరకొండ. మరి.. ఈ రౌడీ జనార్ధన స్టోరీని ఈ ఏడాది డిసెంబరులో థియేటర్స్‌లో చూడొచ్చు. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘రౌడీ జనార్ధన’. కీర్తీసురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నేపథ్యంతో 1980 కాలమానంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ రూరల్ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు.‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా, ఈ ‘రౌడీ జనార్ధన’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయనున్నట్లుగా విజయ్ దేవరకొండ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు ‘టాక్సీ వాలా’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్స్ కాంబినేషన్స్ లో మరో సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీప్రోడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది.ఈ సినిమా ప్రధాన కథాంశం 1854–1878 నేపథ్యంతో సాగుతుంది. ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తారని, రష్మికా మందన్నా హీరోయిన్స్ గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ్రపారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్స్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించనున్నారు.ఆకాశంలో ఒకతార‘మహానటి, సీతారామం, కాంత’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్సల్మాన్స్ . ఎంతలా అంటే ఆయన ఏ భాషలో సినిమా చేసినా, ఆ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యేంతలా. తాజాగా దుల్కర్సల్మాన్స్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒకతార’. పవన్స్ సాధినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.గీతా ఆర్ట్స్, స్వ΄్నా సినిమాస్ల సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ పీరియాడికల్ యాక్షన్స్ డ్రామా కథనం ప్రధానంగా ఓ పల్లెటూరి నేపథ్యంతో సాగుతుందని, ఇందులో దుల్కర్ సల్మాన్స్ ఓ రైతు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.స్వాతంత్య్రానికి పూర్వం..నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1905 టైమ్‌లో జరుగుతుందని తెలిసింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం లండన్స్ ఉన్న కొందరు భారతీయులు ఎలాంటి వ్యూహరచన చేశారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో నిఖిల్, మరో కీలక పాత్రలో అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారు.స్వాతంత్య్ర సమరయోధుడు వీర్సవార్కర్ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సినిమాలో చూపిస్తారట మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆ మధ్య సెట్స్‌లో చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అప్పట్లో ఈ సినిమా చిత్రీకరణకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అధికా రికంగా మరో అప్డేట్ రావాల్సి ఉంది. రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఈ కోవలో పీరియాడికల్ ఫిల్మ్స్ చేస్తున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్‌లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్‌లో వైరస్ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్ జోన్లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/3kWJddv1qd— The RajaSaab (@rajasaabmovie) January 2, 2026 -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.ఎవరికి ఎంతంటే?మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
అందుకే ‘రాజాసాబ్’ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారు: మారుతి
ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్ కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక ఓ కారణం ఉంది. ఆయన ప్రభాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్(The Raja Saab) ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.‘ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్ పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్‌కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్ హిట్ అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్ వస్తే.. వాళ్లకు అది ఫుడ్ పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు. ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్ వచ్చినా..ఫ్లాప్ వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్‌తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి ఏ హీరో సెట్ అయితే ఆ హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటా’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్..!
-
ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్
-
ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా..: నవీన్ పొలిశెట్టి
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'.. ఈ సంక్రాంతికి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న వస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో నవీన్ పొలిశెట్టి పలు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు తాను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, తన సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉందన్నారు.ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా'అనగనగా ఒక రాజు' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన పెళ్లి గురించి నవీన్ పొలిశెట్టి ఇలా అన్నారు. 'ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది.' అంటూ సరదాగా చెప్పారు. అయితే, ప్రభాస్ అన్నయ్యతో తన స్నేహం చాలా గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి కామన్ అయిపోయిందన్నారు. ఏజెంట్ సాయి, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ మూడు చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయే 'అనగనగా ఒక రాజు' కూడా సరికొత్తగా మెప్పిస్తుందని తెలిపారు.ఫస్ట్ ప్రభాస్ సినిమా.. ఆ తర్వాత చిరు మూవీ వెళ్తా..'ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రభాస్ అన్నయ్య నేనూ మంచి స్నేహితులం.. మా మధ్య పోటీ ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ఎవరైనా సరే ఇండస్ట్రీలో స్టార్ అవ్వవచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తి ఆయన.. పరిశ్రమలో నాలాంటి వారికి ఎందరికో ఆయన దారిచూపించారు. అలాంటి గురువుగారి సినిమా వస్తుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు.. నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి.. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్తాను. అటునుంచి నా సినిమాకు వెళ్తా.' అని నవీన్ పొలిశెట్టి అన్నారు. -
రాజాసాబ్: 'రాజే.. యువరాజే' సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజాసాబ్' సినిమాతో 2026కి స్వాగతం పలుకుతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్‌మీడియాలో మంచి హైప్ వచ్చింది. కొత్త ఏడాది సందర్భంగా ది రాజాసాబ్ నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. రాజే యువరాజే సాంగ్'రాజే యువరాజే' పాటను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేకుండా కేవలం ఆడియో సాంగ్ మాత్రమే బయటకు వదిలారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ రియా సీపన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఒకేరోజు రెండు సర్ప్రైజ్లుకాగా ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో డార్లింగ్ ప్రభాస్ ఒంటి నిండా గాయాలు, కట్లతో కనిపించాడు. అయితే ప్రభాస్‌ను ముందువైపు నుంచి చూపించకుండా బ్యాక్‌సైడ్ ఫోటో మాత్రమే వదిలారు. దెబ్బలతో ఉన్న ప్రభాస్ ఓపక్క సిగరెట్, మరోపక్క మందు తాగుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
న్యూ ఇయర్ సర్ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో స్పిరిట్ ఒకటి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా నాలుగేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టును ప్రకటించగా కొద్దిరోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. ఆ మధ్య ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఓ చిన్నపాటి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడేమో కొత్త ఏడాది 2026కి స్వాగతం పలుకుతూ డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.మందు గ్లాసుతో ప్రభాస్"ఇండియన్ సినిమా... మీ ఆజానుబాహుడిని చూడు" అంటూ సోషల్ మీడియాలో స్పిరిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. పొడవు జుట్టు, గుబురు గడ్డంతో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఓ చేత్తో మందు గ్లాసు పట్టుకుని నిల్చున్నాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న ప్రభాస్ నోట్లో సిగరెట్ పెట్టుకోగా.. ఎదుట నిల్చున్న తృప్తి డిమ్రి లైటర్ వెలిగిస్తోంది. ఈ పోస్టర్లో ప్రభాస్‌ను షర్ట్ లేకుండా చూపించారు. కాకపోతే బ్యాక్‌సైడ్ లుక్‌ను మాత్రమే రివీల్ చేశారు.రెబల్ లుక్ఒంటి నిండా గాయాలు, కట్లతో ఉన్న ప్రభాస్(Prabhas) ను చూస్తుంటే స్పిరిట్ ఎంత వైల్డ్‌గా ఉండబోతుందనేది ఇట్టే అర్థమవుతుంది. స్పిరిట్ మూవీలో ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి.సిరీస్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. Beyond inspiration || Beyond aspiration || Into creation👆🏼#SpiritFirstLook #OneBadHabit #Prabhas @imvangasandeep @tripti_dimri23 @vivekoberoi @InSpiritMode @bnaveenkalyan1 @rameemusic @sureshsrajan #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @sivadow55122… pic.twitter.com/2slHYLnFy3— Bhadrakali Pictures (@VangaPictures) December 31, 2025 -
బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!
-
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో కనిపించేవారు స్టార్ హీరోలు. ట్రెండ్ మారాక ఏడాదికి ఒక్కసారి కనిపించడమే పెద్ద విషయంగా మారిపోయింది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడమో, అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదా పడటమో వంటి కారణాలతో ఈ ఏడాది కొందరు టాప్ స్టార్స్ వెండితెరపై కనిపించలేదు. కొందరు యువ హీరోలు కూడా వెండితెరకు ఎక్కలేదు. అయితే 2026లో ‘నో గ్యాప్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయనున్నారు. ఆ విశేషాల్లోకి...టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి 2024ని మాత్రమే కాదు... 2025ని కూడా మిస్సయ్యారు. అయితే 2026లో మాత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’ 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన ‘విశ్వంభర’ 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో చిరంజీవి సినిమా విడుదలై, దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. అయితే 2026లో సంక్రాంతి బరిలో దిగుతున్నారాయన. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ ఏడాది వాయిదా పడిన ‘విశ్వంభర’ సినిమా 2026 సమ్మర్లో విడుదల కానుంది. ఆ రకంగా అభిమానులకు డబుల్ ఫీస్ట్ ఇవ్వనున్నారు చిరంజీవి2026లోనూ నో?2024 సంక్రాంతికి ప్రేక్షకులకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపించిన మహేశ్‌బాబు 2025ని మిస్ అయ్యారు.‘గుంటూరు కారం’ తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రనిర్మాణానికి ఎక్కువ రోజులు పట్టడం సహజం. సో... ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ 2026లోనూ విడుదలయ్యే అవకాశం లేదు. 2027 వేసవిలో ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనా ఉంది. ఈ లెక్కన మహేశ్‌బాబు 2026లోనూ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అవుతున్నట్టే అన్నమాట.వచ్చే ఏడాదీ లేనట్లేనా?‘పుష్ప’ ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్ . ఆయన నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ 2024 డిసెంబరు 5న విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలవడంతోపాటు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. అయితే 2025 లో అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఏఏ 22 అండ్ ఏ 6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో సైన్ప్ ఫిక్షన్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అనుకున్నారు. భారీ కథ, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న కారణంగా చిత్రీకరణకు ఎక్కువ టైమ్ పడుతోందట. దాంతో 2027లో ఈ చిత్రం విడుదల కానుందని తెలుస్తోంది. అంటే వరుసగా 2025, 2026ని అల్లు అర్జున్ మిస్ అయినట్లే. వచ్చే ఏడాదిపోరాట యోధుడిగా...సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఈ ఏడాది తెరపై కనిపించలేదు. ఆయన హీరోగా నటించిన ‘విశ్వం’ సినిమా 2024 అక్టోబరు 11న విడుదలైంది. ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు గోపీచంద్. ఏడో శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టంతో ఈ చిత్రం రూపొందుతోందట. ఇంకా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ ని మిస్ అయిన సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. పైన పేర్కొన్నవారే కాదు.. మరికొందరు యువ హీరోలు కూడా 2025ని మిస్ అయిన వారి జాబితాలో ఉన్నారు. వారిలో కొందరయినా 2026లో వెండితెరపై వెలుగుతారని కోరుకుందాం.రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్ వెండితెరపై రెండు మూడేళ్ల గ్యాప్‌లో కనిపించారు. అయితే ఆ గ్యాప్ విలువైనదనే చె΄్పాలి. ప్రభాస్‌ని పాన్ ఇండియన్ స్టార్‌గా నిలబెట్టిన చిత్రం ‘బాహుబలి’. కానీ ఇకపై తమ అభిమాన హీరో సిల్వర్ స్క్రీన్ పై గ్యాప్ లేకుండా కనిపించాలనిఅభిమానులు ఆశించారు. గత ఏడాది ‘కల్కి 2898ఏడీ’లో హీరోగా కనిపించారు ప్రభాస్. అనుకోకుండా 2025లో గ్యాప్ వచ్చింది. కానీ ‘కన్నప్ప’లో చేసిన అతిథి పాత్ర కొంతవరకూ అభిమానులను సంతప్తిపరిచింది. ఇక ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ 2026 జనవరి 9న విడుదలవుతోంది. అలాగే ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. సో... అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.2026లో ఫుల్ మాస్2025 లో ఎన్టీఆర్ ఏ తెలుగు సినిమా చేయకపోయినా హిందీ చిత్రం ‘వార్ 2’లో కనిపించి, ఫ్యాన్స్‌ని ఆ విధంగా ఆనందపరిచారు. అయితే ఎంత లేదన్నా మాతృభాషలో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కి మజా వస్తుంది. ఆ కొరత ఈ ఏడాది ఉన్నప్పటికీ వచ్చే ఏడాది అసలు సిసలు ఫుల్ మాస్ కమర్షియల్ తెలుగు సినిమాలో కనిపిస్తారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. థాయ్‌ల్యాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అక్కడ జరిగే అక్రమ కార్యకలాపాలను హీరో పాత్ర ఎదుర్కొంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ చిత్రం విడుదల కానుంది.యువ హీరోలకు సైతం గ్యాప్కొందరు యువ హీరోలు సైతం 2025ని మిస్సయ్యారు. శర్వానంద్ నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న రిలీజైంది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన ‘నారీ నారీ నడుమ మురారి, బైకర్’ చిత్రాలు 2025లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాలూ 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది. వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి ఏడాదికి పైనే అయింది. ఆయన హీరోగా నటించిన ‘మట్కా’ మూవీ 2024 నవంబరు 14న రిలీజైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా 2026 లో విడుదలకానుంది.అడివి శేష్‌కి కూడా 2025లో గ్యాప్ వచ్చింది. ఆయన నటిస్తున్న ‘డెకాయిట్’, ‘జీ 2’ చిత్రాలు 2026లో రిలీజ్ కానున్నాయి. ఇక అక్కినేని అఖిల్ ఆడియన్స్ ముందుకొచ్చి రెండున్నరేళ్లకు పైనే అయింది. ఆయన నటించిన ‘ఏజెంట్’ మూవీ 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. మరో యువ హీరో సాయిదుర్గా తేజ్ కూడా ఆడియన్స్‌ని పలకరించి రెండున్నరేళ్లకు పైనే అవుతోంది.‘విరూపాక్ష’, ‘బ్రో’ (2023) వంటి సినిమాల తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రం 2026లో విడుదలకానుంది. అదే విధంగా నిఖిల్ సిద్ధార్థ్ సినిమా విడుదలై ఏడాదికి పైనే అయ్యింది. నిఖల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ 2024 నవంబరు 8న రిలీజైంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా 2026లో ఆడియన్స్ ముందుకు రానుంది. – డేరంగుల జగన్ మోహన్ -
అడ్రస్ చెప్పిన మారుతి.. కడుపు నింపేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి నిన్న మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన దానికంటే ఇందులో కథని మరింత రివీల్ చేశారు. విజువల్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. దీని దెబ్బకు మూవీపై హైప్ కూడా కాస్త పెరిగింది. ట్రైలర్‌కి హిట్ టాక్ రావడం ఏమో గానీ దర్శకుడు మారుతిని ప్రభాస్ ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. మారుతి ఇంటికి ఓ సర్ప్రైజ్ పంపించారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో 'రాజాసాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమా ఏ మాత్రం డిసప్పాయింట్ చేసిన తనని విమర్శించొచ్చని చెబుతూ కొండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా చెప్పేశాడు.(ఇదీ చదవండి: చిరు-వెంకటేశ్.. మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్)లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడిపోతున్న ప్రభాస్ అభిమానులు.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విటర్లో బయటపెట్టాడు. ఓ ఫొటో కూడా పోస్ట్ చేశాడు. ట్రైలర్‌కే ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్నారంటే.. మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇంకెన్ని పార్సిల్స్ పంపిస్తారో ఏంటో?'రాజాసాబ్' మూవీ జనవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ముందురోజు రాత్రి అంటే 8వ తేదీన రాత్రి ప్రీమియర్ల వేయనున్నారు. ఈ సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ థ్రిల్లర్ సినిమా)Meerentraaa intha violent ga unnaru… Address ichindi vere danikiMeeru ila kooda vaadeskuntunnaru 🤣🤣 https://t.co/8EJ1KZhH9y— The RajaSaab (@rajasaabmovie) December 30, 2025 -
గిఫ్ట్‌గా చీర ఇచ్చిన 'ప్రభాస్'.. ఎందుకో చెప్పిన హీరోయిన్
'ది రాజాసాబ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరాఠీ బ్యూటీ రిద్ది కుమార్ మాట్లాడుతూ.. తనకు ప్రభాస్ గిఫ్ట్‌గా ఒక చీరను ఇచ్చారని చెప్పిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత అదే చీరను ఈ కార్యక్రమం కోసం కట్టుకొని వచ్చానని ఆమె చెప్పింది. అయితే, రిద్ది కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమెకు చీర గిఫ్ట్‌గా ప్రభాస్ ఎందుకు ఇచ్చాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు వచ్చాయి. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసలు కారణం చెప్పింది.ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆయనకు ఒక గిఫ్ట్‌ను ఇచ్చానని అందుకు రిటర్న్‌గా ఒక చీరను ఇచ్చారని రిద్ది కుమార్ ఇలా చెప్పారు. 'మూడేళ్ల క్రితం నేను రాజా సాబ్ సెట్లో ఎంట్రీ ఇచ్చిన నాడే ప్రభాస్ పుట్టినరోజు.. ఆయనకు ఏదైనా ఒక కానుక ఇవ్వాలనుకున్నాను. ఆ సమయంలో కుదరలేదు. తర్వాత దీపావళి ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కర్ణుడి స్టోరీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రభాస్‌కు ఇచ్చాను. నిజజీవితంలో కూడా ప్రభాస్ స్వభావం కర్ణుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయనకు ఆ బుక్ ఇచ్చాను. దానికి రిటర్న్ గిఫ్ట్‌గా నాకు హనుమాన్ చాలీసా పుస్తకంతో పాటు కొన్ని చాక్లెట్స్, వైట్ శారీ ఇచ్చారు. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. నాటి నుంచి ఆ హనుమాన్ చాలీసా బుక్ నా బ్యాగ్‌లోనే ఉంది. అయితే, కొద్దిరోజుల తర్వాత కల్కి సినిమాలో కర్ణుడిగా ప్రభాస్ నటించారని తెలిసి ఆశ్చర్యపోయాను.' అని రిద్ది కూమార్ చెప్పారు.ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు. -
ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)
-
'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్
ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?) -
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
-
ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. నిధి అగర్వాల్ ట్వీట్
ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్‌కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్‌కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?PK sir PRABHAS sir NIDHHI me SRV #AskNidhhi #TheRajaSaab https://t.co/CG1GzbHyEV— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025 -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్‌గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
స్టేజ్ పైనే ఏడ్చిన దర్శకుడు మారుతి.. ఓదార్చిన ప్రభాస్
-
అరుపులు.. కేకలు.. ప్రభాస్ స్పీచ్ తో దద్దరిల్లిన ఈవెంట్
-
స్పిరిట్ డైరెక్టర్‌కు క్రేజీ ట్యాగ్ ఇచ్చిన రెబల్ స్టార్.. రాజమౌళికి కూడా!
రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్‌కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్‌కు బ్యూటీఫుల్ పర్సన్‌గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్‌ను జీనియస్‌గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
-
ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ గిఫ్ట్.. అంతా నీవల్లే అంటూ ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ రిద్ది కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. నీ వల్లే నేను ది రాజాసాబ్‌లో మూవీ నటిస్తున్నానని తెలిపింది. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చిన ప్రభాస్‌కు రుణపడి ఉంటానని తెలిపింది. ఈ రోజు ఈవెంట్‌కు మీరు నాకిచ్చిన శారీనే ధరించానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ రోజు కోసం మూడేళ్లుగా ఈ శారీని కట్టుకోలేదని భావోద్వేగానికి గురైంది. నా లైఫ్‌లో నీలాంటి పర్సన్ పరిచయం కావడం నా అదృష్టమని రిద్ధికుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. Riddhi కి Saree ఇచ్చిన ప్రభాస్.. She reveals it on stage! I'm wearing the saree that you gave me I saved it for 3 years Just to wear it tonightGrateful to have you in my life.#Prabhas #RiddhiKumar pic.twitter.com/8BXLXdj16Z— M9 NEWS (@M9News_) December 27, 2025 Thank you #riddhikumar gaaru 3 years wait chesi Ee day kosam ah saree wear chesaru 🫡🫡🫡🫡🫡🫡#TheRajaSaab pic.twitter.com/QSIQiF510G— PrabhasPandu (@Dreamer_998) December 27, 2025 -
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి: ప్రభాస్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్టైన్ చేయాలన్నాను. ఫైనల్‌గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్‌ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్‌గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్‌గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్‌గారు, మరొకరు విశ్వప్రసాద్‌గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్‌గారు తెలియడం మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు. -
రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి
సెలబ్రిటీలు స్టేజీ ఎక్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెంట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?#TheRajaSaab రెండు వేల రూపాయలు కొల్ల కొట్టే సినిమాఅలా అవ్వకపోతే నేను మీరు కలిపి ఇద్దాం..!#Prabhas pic.twitter.com/UlRXWfji7f— Telugu70mm (@Telugu70mmweb) December 27, 2025 -
మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా ఇదే గ్రౌండ్లో 220 ఫీట్ల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు. -
X లోకి ప్రభాస్ ఎంట్రీ ఫిక్సయ్యిందా..!
-
రాజే యువరాజే...
క్రిస్మస్ పండగని పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రాజే యువరాజే...’ అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధీ అగర్వాల్‌తో ప్రేయర్ చేయించుకోవడం వంటివి ఈ ప్రోమోలో చూపించారు.త్వరలోనే పూర్తి పాటని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 9న విడుదల కానుంది. -
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్'.. క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్
'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఊపేసిన బాహుబలి ప్రాంఛైజ్ రెండు సినిమాలు పదేళ్ల తర్వాత ఒక్కటిగా 'బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే, బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.'బాహుబలి: ది ఎపిక్' నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్టిక్స్ (NETFLIX) తన లిస్ట్‌లో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఏకంగా రూ. 55 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ చిత్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి..?బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. -
స్పిరిట్ కోసం సందీప్ వంగా మాస్
-
ప్రైవేట్ జెట్లలోనే ప్రభాస్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీనటులు అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ ఉంటారని తెలిసిదే.. వారు "రాజులా జీవించడం" అనే పదబంధానికి నిజంగా ప్రాణం పోసుకుంటారు. వారికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు తరచుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కనీసం ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. కానీ, సినిమా నటీనటులకు సొంతంగానే కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, నయనతార వంటి వారికి లగ్జరీ జెట్లు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరందరూ ఒక్కోసారి పబ్లిక్ విమానంలోనే ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకు సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి.ప్రభాస్ వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంలో కొందరు తనని తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు. ఇటీవల, ఒక నిర్మాతను ప్రభాస్ తన టీమ్ కోసం USAకి ప్రైవేట్ జెట్ బుక్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక కారణాలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, మరికొందరు కొన్ని ప్రధాన అంశాలను తెలిపారు. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. తన వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే అందుకు కావాల్సిన డబ్బు తనే సమకూర్చుకుంటారు. సినిమాకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ఆయా నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకానీ నిర్మాతల చేత అవసరం లేని ఖర్చులు పెట్టించరు అనే మంచి పేరు తనకు ఉంది.ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్, రాజాసాబ్, సలార్2, కల్కి2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, ఒక్కో చిత్రంలో ఒక్కో గెటప్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ కారణం వల్లే తన లుక్‌ను బహిరంగంగా వెల్లడించకూడదని మేకర్స్ సూచిస్తారు. యాదృచ్ఛికంగా పబ్లిక్‌లో ఆయన కనిపిస్తే అతని లుక్‌ను లీక్ చేసి వైరల్ చేస్తారు. గతంలో ఆది పురుష్ విడుదలకు ముందు ప్రభాస్ బహిరంగ ప్రదేశంలో కనిపించగానే కొందరు ఫోటోలు తీసి వైరల్ చేశారు. దీంతో జాతీయ స్థాయి ట్రోలింగ్‌కు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి, వాణిజ్య విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఆయన ఇష్టపడరని సమాచారం. వాస్తవంగా ప్రభాస్ జీవనశైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఉదార స్వభావంతో పలు సందర్భాల్లో భారీగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే పూర్తిగా రాజీ పడకుండా జీవిస్తారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ జెట్లలో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా సెట్స్‌లో అందరికీ భోజనాలు తెప్పించి వారితో కలిసి సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు కూడా ఒక రాజులాగే ఉండాలని తన జీవనశైలిని ఆస్వాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పేరులోనే రాజు ఉంది.. ప్రభాస్ జీవితం కూడా రాజులాగే ఉంటుందని తన సన్నిహితులు కూడా చెబుతుంటారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. JAN 8th - PremieresPre Release Event in Hyderabad #TheRajaSaab— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025 -
ప్రభాస్ ది రాజాసాబ్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించారు. -
టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు.. గత పదేళ్లలో ఏ సినిమాలంటే?
మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్న టాలీవుడ్.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.బాహుబలి-2 ప్రభంజనం.. గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 రికార్డ్..గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్ చూస్తే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ ఈ రికార్డ్ బ్రేక్ అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
పాన్ ఇండియా బ్యాచిలర్స్ వీళ్లే.. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టోరీ
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు యువత.. అదంటేనే భయపడుతున్నారు. సరే సరైన జాబ్ లేదు, పోషించేందుకు డబ్బులు లేవు కదా వివాహానికి నో చెబుతున్నారని అనుకోవచ్చు. బోలెడంత ఫేమ్, కోట్లాది ఆస్తి ఉన్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా కొందరు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయారు. అలాంటి కొందరి గురించి ఈ స్టోరీ.ఇండియన్ స్టార్స్‌లో బ్యాచిలర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్లో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో రిలేషన్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి గానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా ఇతడికున్న అనారోగ్య సమస్యలు కావొచ్చు. లేదంటే తన స్నేహితుల వైవాహిక జీవితంలో సమస్యల ప్రభావం కావొచ్చు సల్మాన్.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇతడికి 59 ఏళ్లు. ఇకపై చేసుకునే అవకాశమే లేదు.(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరస సినిమాలు చేస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తాం అని చాలాసార్లు చెప్పారు. కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ అన్నదే దొరకట్లేదు. గతంలో హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి గానీ తామిద్దరం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. అయితే ఇటు ప్రభాసే కాదు అటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ఇకపై కూడా వీళ్లిద్దరికీ(వేర్వేరుగా) జరుగుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో లేదు.రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ 'ధురంధర్'లో విలన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అక్షయ్ ఖన్నా కూడా బ్యాచిలరే. ప్రస్తుతం ఇతడి వయసు 50 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి చాలానే కారణాలున్నాయి. గతంలో కరిష్మా కపూర్‌తో ఇతడికి వివాహం సెట్ అయి, రద్దయిందని.. అప్పటినుంచి అక్షయ్ ఖన్నా ఒంటరిగానే ఉండిపోయాడనేది టాక్. అలానే మరో వ్యక్తి బాధ్యత తీసుకోవడం తనకు సూట్ కాని పనికాని కూడా అక్షయ్ చెప్పాడు. చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ లిస్టులో తర్వాతి నటి టబు. ఈమె వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. మరి పెళ్లి చేసుకుంటే నటిగా కెరీర్ ముగిసిపోతుందని భయపడిందో ఏమో గానీ అస్సలు ఆ వైపు చూడను కూడా చూడలేదు. ఇప్పటికీ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణాన్ని కూడా గతంలో చెప్పింది. జీవితంలో కలిసిన కొందరు పురుషులు.. చాలా నిరాశపరిచారని చెప్పింది. అలానే తను దత్తత తీసుకున్న పిల్లల (రెనీ, అలీసా) ప్రాధాన్యత.. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం లాంటివి కూడా కారణమని చెప్పుకొచ్చారు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లినప్పటికీ దేవుడే తనని రక్షించాడనేది ఈమె నమ్మకం.తమిళ హీరో శింబు జీవితంలో చాలా ప్రేమకథలే ఉన్నాయి. నయనతార, నిధి అగర్వాల్ లాంటి పలువురు హీరోయిన్లతో ఇతడు డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. పెళ్లి కూడా జరుగుతుందని మాట్లాడుకున్నారు. తీరా చూస్తే 42 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉండిపోయాడు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి జీవితంలోనూ విషాదం ఉంది. హీరోయిన్ రష్మికతో చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ ఇది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా పోయింది. (ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?) -
నిధి అగర్వాల్‌తో 'రాజాసాబ్' డ్యాన్స్.. ప్రోమో చూశారా?
డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సెకండ్ సాంగ్ ప్రోమోతాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది. It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025 -
పోలీస్ స్టేషన్లో పాట... ఫైట్
వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ‘స్పిరిట్’ ఒకటి. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో ప్రభాస్ సెట్స్‌లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఇతర నటీనటులపై సన్నివేశాలను చిత్రీక రిస్తున్నారు సందీప్. ఇదిలా ఉంటే.. ‘స్పిరిట్’లో ప్రభాస్ ఒక అకాడమీ టాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్‌ను రూపొందిస్తున్నారట మేకర్స్. ఈ సెట్లో ప్రభాస్‌కు ఒక వైల్డ్ ఎంట్రీ సాంగ్ ఉంటుందట.అంతేకాదు... ఇదే సెట్లో సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ పాట, ఫైట్ షూట్లో ప్రభాస్ పాల్గొంటారట. ఈ ఎపిసోడ్స్ ‘స్పిరిట్’కి హైలైట్‌గా నిలుస్తాయని ఫిల్మ్‌నగర్ టాక్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘స్పిరిట్’ నుంచి ‘సౌండ్ స్టోరీ’ పేరుతో టీమ్ ఒక యునిక్ ఆడియో టీజర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి
ప్రభాస్ నుంచి రాబోతున్న లేటెస్ట్ సినిమా 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ సాంకేతిక కారణాల వల్ల సంక్రాంతి బరిలో ఉంచారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దర్శకుడు మారుతి వద్దని అభిమానులు గోలగోల చేశారు. సోషల్ మీడియాలోనూ ఈ దర్శకుడిపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే అలా తిట్టకపోతే తాను 'రాజాసాబ్' తీసేవాడిని కాదని మారుతి చెప్పుకొచ్చాడు.'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ రెండో సీజన్.. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు వచ్చిన మారుతి.. తనపై వచ్చిన విమర్శల గురించి, ట్రోల్స్ గురించి ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇప్పుడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో పాల్గొన్న నటి ప్రగతి.. రీసెంట్‌గానే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కూడా గెలుచుకుంది. ఈమె గురించి కూడా మారుతి మాట్లాడారు.(ఇదీ చదవండి: రేణుకా స్వామి సమాధి ధ్వంసం.. ఇది ఎవరి పని?)'నటి ప్రగతి గారికి ఇదో ఎమోషనల్ డే అని అర్థమైంది. మేడమ్.. మిమ్మల్ని అందరూ ట్రోల్ చేస్తున్నారని ఏం అనుకోవద్దు. ఎందుకంటే అలా తిట్టకపోతే మీరు గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు. నేను 'రాజాసాబ్' తీసేవాడిని కాదు. ట్రోలర్స్ నిజంగా పనులన్నీ మానుకుని మనకోసం టైమ్ కేటాయించి, పాజిటివిటీ అంతా చంపుకొని, బ్రెయిన్‌లోకి నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని నాలుగు తిట్లు తిడుతున్నారు. పాపం వాళ్ల దగ్గరున్న నెగిటివిటీనే పంచుతున్నారు''వాళ్ల దగ్గర నాలుగు బూతు మాటలు.. నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయి. అవే పంచుతున్నారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ చూసినప్పుడు.. ఒరేయ్, ఇది తప్ప మీ దగ్గర ఇంకేమీ లేదా అనుకుంటాను. ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోండి. మీరు కూడా మిమ్మల్ని తిట్టేవాళ్లని ఎతుక్కోండి. లేకపోతే మీరు ఏమి సాధించలేరు. అలా ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే, మేము ఎదుగుతూ ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల నెగిటివ్ కామెంట్స్ చేసే వారందరికీ చాలా చాలా థాంక్స్. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము.. మేము సాధించలేం' అని మారుతి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో మిస్ అవుతున్న 'నవ్వు') -
భారీ ధరకు ది రాజాసాబ్ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ది రాజాసాబ్ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ ఓటీటీ డీల్‌పై అభిమానులతో పాటు ఆడియన్స్‌లోనూ సస్పెన్స్ ఆసక్తి నెలకొంది. ఇటీవలే జియో హాట్ స్టార్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మరి ఈ డీల్ విలువ ఎంతనే దానిపై ఆడియన్స్ ఆరా తీస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ది రాజాసాబ్ మూవీ హక్కులను దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్మామెన్స్ ఆధారంగా ఈ డీల్ మరింత పెరగొచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రిజల్ట్‌ను బట్టి ఈ డీల్ విలువ దాదాపు రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాథమికంగా కుదుర్చుకున్న డీల్ కంటే జియో హాట్ స్టార్ అదనంగా మరింత మొత్తాన్ని నిర్మాతలకు చెల్లించాల్సి రావొచ్చు. -
జపాన్‌లో భారీ భూకంపం.. ప్రభాస్ గురించి మారుతి ట్వీట్
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అమోరి, ఇవాటే, హొక్కైడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5 నుండి 7.6 వరకు నమోదైంది. దీంతో సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్‌లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌కు చల్లని వార్త ఇచ్చారు.దర్శకుడు మారుతి తన ఎక్స్ పేజీలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. "డార్లింగ్ (ప్రభాస్)తో మాట్లాడాను. అతను టోక్యోలో లేడు. ఎవరూ ఆందోళన చెందవద్దు. చాలా సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి" అని ఆయన రాశారు. ఆయన సందేశం అందరికీ భరోసా ఇచ్చింది. అయితే, ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు.ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్‌లో ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయింది. అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు. భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయిన తర్వాత వారు అందరూ అలెర్ట్ అయ్యారని సమాచారం. -
'ప్రభాస్ ఇప్పటికీ సిగ్గుపడతాడు'.. మంగళవారం బ్యూటీ క్యూట్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆర్ఎక్స్100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. మంగళవారం మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది. గతేడాది రక్షణ చిత్రంలో కనిపించిన భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ నెట్టింట చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు? అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేసింది. సినీ ఇండస్ట్రీ మనల్ని చాలా కఠినంగా మార్చుతుంది.. అంతేకాదు మంద చర్మం గలవారిగా మార్చేస్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికీ సిగ్గుపడతాడు.. అతని సిగ్గువల్ల చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతను అంత ముద్దుగా ఉంటాడా? దేవుడు అతన్ని దీవించునుగాక.. అంటూ ప్రభాస్ సో క్యూట్ తెగ పొగుడుతూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.How can someone be so innocent?The industry toughens people up, making them thick-skinned, yet this guy still blushes easily and speaks very little because of his shyness. Why so cute? God bless him 🪬♾️ pic.twitter.com/Y8w7ZZwcKp— paayal rajput (@starlingpayal) December 8, 2025 -
జపాన్ లో ప్రభాస్ ఫ్యాన్ బేస్.. స్పిరిట్ లుక్ లో అదరగొట్టాడు
-
జోరుగా... హుషారుగా...
ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేం ఉండదు అంటూ... బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు స్టార్స్. జోరుగా షూటింగ్స్ జరుగుతుంటే స్టూడియోలు కూడా కళకళలాడుతున్నాయి. కొన్ని స్టూడియోస్‌లో కలర్‌ఫుల్ సెట్స్ కనువిందు చేస్తున్నాయి. సీన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్స్‌లో మరికొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక... ఏ స్టార్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో చూద్దాం...దౌలతాబాద్ టు అన్నపూర్ణ... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నయనతార హీరోయిన్ . ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్రపోషిస్తున్నారు. కేథరిన్, సచిన్ ఖేడేకర్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. హైదరాబాద్‌లోని దౌలతాబాద్ అసెంబ్లీ పబ్‌లో రెండు రోజులపాటు పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఆ తర్వాత తిరిగి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ఆరంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవితోపాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది.ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలో తనపాత్రకు సంబంధించిన చిత్రీకరణ బుధవారంతో పూర్తయినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోఠిలో... వరుసపాన్ ఇండియా చిత్రాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్. సీనియర్ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఇతరపాత్రలుపోషిస్తున్నారు.భద్రకాళి పిక్చర్స్ప్రోడక్షన్ ్స, టీ–సిరీస్ బ్యానర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కృషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఓపోలీసాఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్పాల్గొనడం లేదు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి. నాన్ స్టాప్‌గా జరగనున్న ఈ మూవీ షూటింగ్లో తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ అవుతారట.ప్రభాస్ మొదటిసారిపోలీసాఫీసర్గా నటిస్తుండటం.. ‘అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్’ వంటి హ్యాట్రిక్ మూవీస్ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘స్పిరిట్’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.ఆర్ఎఫ్సీలో... ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ప్రస్తుతం అక్కడ మహేశ్‌బాబుతోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరులో నిర్వహించిన ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ప్రతినాయకుడు కుంభపాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ నినిమాకి సంగీతం అందిస్తున్నారు. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హిట్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో నానితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటోంది. ఈ చిత్రంలో నానిపాత్ర పేరు జడల్. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.అయితే ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్‌చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ΄్యారడైజ్’ చిత్రం విడుదల ఉంటుందా? లేదా? లేకుంటే మరో తేదీ ఫిక్స్ అవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. దండు మైలారంలో... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ‘ది ఎండ్, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘వీడీ 14’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట రాహుల్ సంకృత్యాన్.దండుమైలారంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. పతాక సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతోపాటు ఇతర నటీనటులుపాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ దిగ్గజ నటుడు (‘మమ్మీ’ సినిమా విలన్) ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్ అధికారిపాత్రలో ఆర్నాల్డ్ వస్లూ నెగటివ్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో వీరి మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ ్స, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది. ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది.హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. వరుణ్ కోసం తనదైన శైలిలో అద్భుతమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారు మేర్లపాక గాంధీ. గత కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్... జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్లు ఈసారి ఆడియన్స్‌కి వినోదాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే... అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఇటీవల ఓ ప్రత్యేక సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్, వరుణ్ తేజ్‌లపై ఈపాట తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి... అదే టైటిల్‌ని ఫిక్స్ చేస్తారా? లేకుంటే మరేదైనా నిర్ణయిస్తారా? అన్నది వేచి చూడాలి. తుక్కుగూడలో... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలకపాత్రలుపోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటిపాన్ ఇండియన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోపాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో గత కొన్నాళ్లు నుంచి లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట రోహిత్. అక్టోబరు 15న సాయి దుర్గాతేజ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.భూత్ బంగ్లాలో... అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు... పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా... పేరు ఉండదు, అట్నేపోయేటప్పుడు ఊపిరుండదు... పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీపై మంచి క్రేజ్ నెలకొంది. రామానాయుడులో క్లైమాక్స్... ‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అన్నది ట్యాగ్‌లైన్ . నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్ ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘పాన్ ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘నాగబంధం’. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. కేవలం క్లైమాక్స్ సెట్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశాం. ఓ మహద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ ఈ సెట్‌ని డిజైన్ చేశారు.థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దితున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమా కోసంప్రోడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్లో విరాట్ కర్ణతోపాటు 5000 మంది నృత్య కళాకారులతో ఓపాటని చిత్రీకరించడం విశేషం. పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
ఎట్టకేలకు 'రాజాసాబ్' ఓటీటీ డీల్ క్లోజ్
ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్టైన్మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రెమ్యునరేషన్‌లోనూ ప్రభాస్ రికార్డు.. ‘స్పిరిట్’ కోసం అన్ని కోట్లా?
పాన్ ఇండియా సినిమాల్లో 'నంబర్ వన్ హీరో' అంటే అందరూ చెప్పే మొదటి పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత అతని ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ఫ్లాప్ సినిమాలు వచ్చినా, అతని చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఈ ఇమేజ్ వల్లే ప్రభాస్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకింది. టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతడే. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 100-120 కోట్లు తీసుకుంటున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ ఇదే స్థాయిలో పుచ్చుకుంటున్నాడు. ఇది అందరికి తెలిసిన పాత వార్తే. కానీ, ఇప్పుడు మరోసారి ప్రభాస్(Prabhas) పారితోషికం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. స్పిరిట్ సినిమాకు ఆయన ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట. ఈ చిత్రానికి అత్యధికంగా రూ.160 కోట్లకుపైగా పారితోషికం(Remuneration) తీసుకుంటున్నారని టాలీవుడ్లో టాక్. ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సంస్థలు ఆ స్థాయితో పారితోషికం అందిస్తున్నాయి.స్పిరిట్ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి.సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మాతలు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
బుకింగ్ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్'
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ టైమ్ ఫిక్స్ అయింది. లెక్క ప్రకారం ఈ వారమే థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి రావాలని నిర్ణయించుకుని.. విడుదల తేదీని జనవరి 9కి మార్చారు. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా బాగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్నిరోజుల క్రితం రిలీజైన తొలి పాట మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సరే ఇవన్నీ పక్కనబెడితే తాజాగా యూఎస్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఓ విషయంలో ఫ్యాన్స్‌కి క్లారిటీ వచ్చేసింది.'రాజాసాబ్' ఓవర్సీస్కి సంబంధించిన టికెట్లని తాజాగా ఆన్లైన్లో పెట్టేశారు. ఈ క్రమంలోనే మూవీ రన్ టైమ్ ఎంతో బయటపడింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో సినిమా రాబోతుందని క్లారిటీ వచ్చింది. గతంలో మూడున్నర గంటలకు పైనే ఉండొచ్చని అన్నారు. ఇప్పుడు ఫైనల్‌గా ఈ టైమ్‌కి ఫిక్సయ్యారనమాట.(ఇదీ చదవండి: నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు)గత కొన్నేళ్లలో అర్జున్ రెడ్డి, పుష్ప 2, యానిమల్ తదితర చిత్రాలు 3 గంటలకు పైగా రన్ టైమ్‌తోనే థియేటర్లలోకి వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి. అవన్నీ డిఫరెంట్ జానర్స్. 'రాజాసాబ్' కూడా 3 గంటలకు పైనే ఉన్న పెద్ద మూవీ. కంటెంట్ పరంగా మెప్పిస్తే పర్లేదు లేదంటే మాత్రం చూసే ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశముంది. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త టెన్షన్. మరి 3 గంటల పాటు టీమ్ ఏ రేంజులో మెప్పిస్తారో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే.'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేశారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకత్వం వహించారు. హారర్ ఫాంటసీ కామెడీ కథతో దీన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టింది. సంక్రాంతి బరిలో తొలుత రాబోతున్న సినిమా ఇదే. తర్వాత మిగతా చిత్రాలు థియేటర్లలోకి వస్తాయి.(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్) -
ప్రభాస్ ది రాజా సాబ్.. అత్తారింటికి దారేది నటుడి స్పెషల్ పోస్టర్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ స్పిరిట్ లో మోహన్ లాల్ & రణబీర్ కపూర్ కన్ఫర్మ్..?
-
డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు అతి పెద్ద పండగ ఏది అంటే సగటు సినిమా ప్రేక్షకుడు సైతం టక్కున సంక్రాంతి అని చెబుతాడు. చిత్రపరిశ్రమకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా అత్యంత ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఈ పండగ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు ప్రేక్షకులు. ఈ సమయంలో తమ సినిమాలను రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్ ఆలోచన. సంక్రాంతి సమయంలో దాదాపు అన్ని సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది. అయినప్పటికీ ఫలానా సినిమా బాగుందనే టాక్ వచ్చిందంటే ఇక బ్లాక్‌బస్టరే. అందుకే సంక్రాంతికి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు హీరోలు, దర్శకులు, నిర్మాతలుపోటీ పడుతుంటారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను నిలిపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ కోవలోనే 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రసవత్తరపోరు నెలకొంది. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి చిత్రాలు పండగకి విడుదల కానున్నాయి. మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు సైతం తెలుగు హీరోలతో పాటు సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? ప్రేక్షకుల మనసులు గెలిచేది ఎవరు? బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించే సినిమా ఏది? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం... డబుల్ ఫెస్టివల్ 2026 సంక్రాంతికి అందరి హీరోల కంటే ముందుగా కర్చీఫ్ వేశారు చిరంజీవి. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతి లక్ష్యంగా షూటింగ్ ΄్లాన్ చేసి, శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్రపోషిస్తున్నారు.అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యమైన పాత్రపోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ట్రేడ్ వర్గాల్లోనూ మంచి జోష్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. పైగా చిరంజీవి–వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. రాజా సాబ్ ఫిక్స్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి రేసులో నిలిచింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావాల్సి ఉండగా సంక్రాంతికి వాయిదా పడింది.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ఆలోచన. అందుకే ‘ది రాజా సాబ్’ని జనవరి 9న విడుదల చేయనున్నట్లు టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీపోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌తో పాటు తాజాగా విడుదలైన పాటకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంజయ్ దత్ ప్రత్యేకపోస్టర్కి కూడా మంచి స్పందన వచ్చింది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్, కామెడీ మూవీ కావడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘మా పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చిత్రనిర్మాణ సంస్థ పేర్కొంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా తనదైన శైలిలో వినోదం అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అంతేకాదు... ఈ మూవీని 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు తీసుకు రానున్నట్లు తెలిపారు. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించాను.గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను.. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లను అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఆకట్టుకున్నాయి. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.సున్నితమైన అంశాలను తనదైన భావోద్వేగాలతో తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఈ చిత్రం ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం ప్రేక్షకులకు రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ్రపొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. నారీనారీ నడుమ మురారి హీరో శర్వానంద్ మరోసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2017లో ‘శతమానం భవతి’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన ఆయన ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మరోసారి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు శర్వానంద్. శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ (2023) వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ‘నారి నారి నడుమ మురారి’కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షీ వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆలస్యం వల్ల ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘శర్వానంద్ నటిస్తున్న ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్‌పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే...’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.దీపావళి సందర్భంగా సంప్రదాయ పంచె కట్టుతో ఉన్న శర్వానంద్ లుక్‌ని విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెపొ్పచ్చు. అందుకే మా ‘నారి నారి నడుమ మురారి’తో కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు మరో హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జ్ఞానశేఖర్, యువరాజ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. అనగనగా ఒక రాజు... ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న మరో కామెడీ చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట విడుదల వేడుకని భీమవరంలో ఘనంగా నిర్వహించారు.సంక్రాంతి పండగను కాస్త ముందుగానే తీసుకొచ్చినట్టుగా నవీన్ పొలిశెట్టి వేదిక వద్దకు ఎద్దుల బండిపై రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే నవీన్, మీనాక్షి కలిసి ‘భీమవరం బల్మా...’ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పైగా ‘భీమవరం బల్మా...’ పాటతో నవీన్ పొలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరింత విశేషం. ‘‘ఒక బైక్ ప్రమాదంలో గాయాలు కావడం వల్ల నేను కొంతకాలం షూటింగ్‌కి దూరమయ్యాను.ఆ సమయంలో ప్రేక్షకులకు ఎలా వినోదం అందించాలని ఆందోళన చెందాను. మీ అందరి ప్రేమ, అభిమానం వల్ల కోలుకొని ‘అనగనగా ఒక రాజు’ సినిమా షూటింగ్ చేసి, పండగకు మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అని నవీన్ పొలిశెట్టి పేర్కొన్నారు.ఈ సంక్రాంతికి తెలుగు హీరోల మధ్యపోటీ తీవ్రంగా ఉంది. పాంచ్ పటాకా అంటూ ఐదుగురు హీరోలు సంక్రాంతి రేసులో నిలవనుండటం ఒక విశేషం అయితే... మరోవైపు విజయ్, శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సంక్రాంతి ఎంత పెద్ద పండగో... తమిళ్లో పొంగల్ కూడా అంత పెద్ద ఫెస్టివల్. అందుకే విజయ్ ‘జన నాయగన్’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తున్నాయి. ఈ సినిమాలు ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ⇒ తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి తమిళ చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ్రపొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయగన్’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ‘‘విజయ్ చివరి చిత్రంగా ‘జన నాయగన్’ రాబోతోంది. విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ఉంటుంది. ఈ మూవీ విజయ్‌కి ఫేర్‌వెల్‌గా ఉండబోతోంది. ఆయన అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ⇒ శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరాశక్తి’. ‘గురు, ఆకాశమే నీ హద్దురా’ చిత్రాల ఫేమ్ సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. రవి మోహన్, అథర్వ, శ్రీలీల ఇతర ప్రధాన పాత్రలుపోషిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి సమర్పణలో ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రత్నమాల...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. శివ కార్తికేయన్, శ్రీలీలపై చిత్రీకరించిన ఈ మెలోడీకి మంచి స్పందన వచ్చింది. జనవరి టు జూన్... ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 2024లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2025లో ్రపారంభమైంది.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గడంతో పాటు పూర్తి స్థాయి గడ్డంతో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల కోసమే ఆయన ఈ లుక్‌లోకి మారారనే వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.ఇదిలా ఉంటే... తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల్లో తొలుత ప్రకటించిన చిత్రం కూడా ఇదే. అయితే ఆ తర్వాత ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా విడుదల కాస్తా జనవరి నుంచి జూన్‌కి మారింది. – డేరంగుల జగన్ మోహన్ -
'స్పిరిట్' సినిమా.. డైరెక్టర్ సందీప్ షాకింగ్ డెసిషన్!
రీసెంట్‌గానే ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా మొదలైంది. దీనికి 'స్పిరిట్' అనే టైటిల్ ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇకపోతే లాంచ్ అయిన రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని కోఠి మహిళల కాలేజీ దగ్గర చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ కోసమే విదేశాలకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ విషయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.'స్పిరిట్' షూటింగ్ మొదలుపెట్టాలని చాన్నాళ్లుగా సందీప్ ఎదురుచూస్తూ వచ్చాడు. ఇతర సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల అది ఆలస్యమైంది. తాజాగా ప్రభాస్ ఫ్రీ కావడంతో చిత్రీకరణ మొదలైంది. చిన్నపాటి షెడ్యూల్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ప్రాజెక్ట్ మొదలుపెడితే సదరు ప్రాజెక్టుని సందీప్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తుంటాడు. 'స్పిరిట్' విషయంలోనూ అదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఆరు నెలలు పాటు బయట కనిపించొద్దని ప్రభాస్‌కి చెప్పాడట. దీనికి హీరో కూడా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'స్పిరిట్' కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాన్నాళ్ల క్రితమే జరిగింది. పాటలు, నేపథ్య సంగీతం లాంటివి ముందే కంపోజ్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి షూటింగ్ త్వరగా పూర్తయితే చాలావరకు పని పూర్తయినట్లు అవుతుంది. అప్పటివరకు ప్రభాస్ లుక్స్ లీక్ అవకుండా ఉండేందుకు.. ప్రభాస్‌కి కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఈమెకు ఇది తొలి తెలుగు చిత్రమవుతుంది. ఇకపోతే ఈ మూవీ 2027లోనే వచ్చే అవకాశాలు ఎక్కువ!(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేషన్!?) -
స్పిరిట్ లో ముఖ్యమైన పాత్ర చేస్తున్న కాజోల్?
-
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
ప్రభాస్ 'రాజాసాబ్'లో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ నటి మాత్రం.. హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకుంది. తర్వాత ఎంక్వైరీ చేసి నమ్మకం తెచ్చుకుంది. ఈ మొత్తం విషయాన్ని స్వయంగానే సదరు నటి బయటపెట్టింది. ఆ మూవీ 'రాజాసాబ్' కాగా.. నటి పేరు రిద్ధి కుమార్. ఇంతకీ అసలేం జరిగింది?మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్.. 'లవర్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయింది. 2018లో వచ్చిన ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరో. దీని తర్వాత మలయాళ, మరాఠీ భాషల్లో తలో మూవీ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. 2022లో వచ్చిన 'రాధేశ్యామ్'లో అతిథి పాత్రలో కనిపించింది. అనంతరం హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా రిద్ధి చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ తెలుగు సినిమా)''రాజాసాబ్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్కేన్.. నాకు ఓసారి కాల్ చేశారు. మేం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం. నిన్ను హీరోయిన్గా అనుకుంటున్నాం అని చెప్పారు. మొదట ఇదంతా నేను నమ్మలేదు. ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నా. మా మేనేజర్ని ఫోన్ చేసి కనుక్కుంటే నిజమని క్లారిటీ వచ్చింది. తర్వాత లుక్ టెస్ట్, ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు' అని రిద్ధి కుమార్.. 'రాజాసాబ్'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ కామెడీ మూవీకి మారుతి దర్శకత్వం వహించారు. రిద్ధి కుమార్‌తో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా వేశారు. జనవరి 9న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్గా తొలి పాట రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌తో పాటు రిద్ధి కుమార్ కనిపించింది.(ఇదీ చదవండి: ఇంతకన్నా అవమానం ఉంటుందా?: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాత ఎమోషనల్)Riddhi - Her being Part of #TheRajaSaab: 😂❤️🔥Got Call from SKN garu: “We’re making Film with #Prabhas, we want you as Heroine.” Thought it was a prank! Called my manager to verify. They asked “Do you know Prabhas?” I said “Yes of course!” Gave look test, auditioned & Here I'm. pic.twitter.com/Latj2XAXbI— Prabhas (@HereForDarling) November 25, 2025 -
ప్రభాస్ స్పిరిట్.. సందీప్ రెడ్డి మరో బిగ్ ప్లాన్.!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)- యానిమల్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఇటీవలే ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ అఫీషియల్‌గా లాంఛ్ అయింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ప్రకటించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత షూట్ స్టార్ట్ చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌పై మరో టాక్ నడుస్తోంది.ఈ చిత్రంలో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ప్రభాస్ స్పిరిట్‌లో ఏ రోల్ చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. దీంతో స్పిరిట్‌లో యానిమల్ హీరో కనిపించడం ఖాయమని సినీ ప్రియులు ఫిక్సయ్యారు. దీనిపై ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.అయితే రణ్‌బీర్ కపూర్ స్పిరిట్‌లో కనిపిస్తే నార్త్‌లోనూ బిగ్ హైప్ తీసుకొచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ ఉన్నప్పటికీ.. యానిమల్ హీరో ఎంట్రీతో వేరే లెవెల్లో ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. -
పొంగల్ పోరులో ఏడు చిత్రాలు .. లిస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా?
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే అతిపెద్ద సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉండే సీజన్ ఇది. అందుకే స్టార్ హీరోలలో చాలా మంది తమ సినిమా ఒకటి సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి సంక్రాంతి మాదిరే ఈ సారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ పండక్కీ తెలుగులో మొత్తంగా ఆరేడు సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వచ్చే సంక్రాంతి సీజన్‌పై కొన్ని సినిమాలు కర్చీఫులు వేశాయి. అయితే వాటిల్లో ఏది రిలీజ్ కానుంది? ఏ సినిమా వెనక్కి తగ్గనుంది అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రానుంది.ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..మన శంకర వర ప్రసాద్ గారురాజాసాబ్భర్త మహాశయులకు విజ్ఞప్తిఅనగనగా ఒక రాజునారీ నారీ నడుమ మురారీజననాయగన్పరాశక్తి‘రాజాసాబ్’పై క్లారిటీ వచ్చేదిఈ సంక్రాంతి(Sankranthi 2026)కి బరిలో ఉన్న సినిమాలో తొలుత రిలీజ్ డేట్ ప్రకటించిన పెద్ద సినిమా ది రాజాసాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో కూడా పలుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి..వాయిదా వేయడంతో మరోసారి కూడా ఈ సినిమా వెనక్కి తగ్గిందనే రూమర్స్ వచ్చాయి. దీంతో పలు చిన్న సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే తాము తప్పుకోవడం లేదని ది రాజాసాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా స్టార్ చేయడంతో కొన్ని సినిమాలు బరి నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయి.రాజుగారు రావడం లేదా?సంక్రాంతి పోటీలో ఉన్నామని గట్టిగా చెబుతూ వచ్చిన నవీన్ పొలిశెట్టి..అందరికంటే ముందుగానే తప్పుకునే అవకాశం ఉంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) వచ్చే ఏడాది జనవరి 14న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. బాక్సాఫీస్ బరిలో చాలా చిత్రాలు ఉండడంతో నిర్మాత నాగవంశీ వెనక్కీ తగ్గాడట. అన్ని కుదిరితే రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ ఆలోచిస్తున్నాడట.ఇక శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి(Nari Nari Naduma Murari) చిత్రం కూడా ఈ సంక్రాంతికి వచ్చేలా లేదు. డిసెంబర్లో ఆయన బైకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం కూడా వెనక్కి తగ్గేలా ఉంది. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’పై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కూడా కచ్చితంగా పొంగల్ పోరులోకి రాబోతుంది.చిరు క్లారిటీ ఇస్తే.. డేట్ ప్రకటించలేదు కానీ.. సంక్రాంతి పండగకి పక్కా రాబోతున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). ‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్ పెట్టుకొని మరి ఈ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన అనిల్ రావిపూడి.. ఈసారి చిరంజీవి మూవీతో రాబోతున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తే కానీ సంక్రాంతి రిలీజ్ సినిమాలపై క్లారిటీ రాలేదు. ఒక వేళ చిరు సినిమా వాయిదా పడితే..కచ్చితంగా చిన్న సినిమాలన్నీ బరిలోకి దిగుతాయి. అయితే ఆ అవకాశం అయితే దాదాపు లేనట్లే. వీటితో పాటు ఈ పొంగల్ పోరులో తమిళ్ నుంచి రెండు భారీ చిత్రాలు నిలిచాయి. అందులో ఒకటి..విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్వకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. దీంతో పాటు శివకార్తికేయన్-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి పండక్కే రాబోతుంది. జవవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ పొంగల్ పోరులో ఎన్ని చిత్రాలు ఉంటాయనేది డిసెంబర్ మొదటి వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దర్శకుడు మారుతి క్షమాపణలు
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.మారుతిపై ట్రోలింగ్సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన రెండు కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు.క్షమాపణలు చెప్పిన మారుతిఇప్పుడు మారుతి.. ప్రభాస్ కటౌట్‌కి కాలర్ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు.నా ఉద్దేశం అది కాదుముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు. Dear Venky…Felt like clarifying this personally.First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025 చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్ -
చలిలో వెచ్చని టీ తాగుతున్న స్టార్ హీరోలు (ఫోటోలు)
-
ప్రభాస్ 'ది రాజా సాబ్'.. రెబల్ సాబ్ సాంగ్ రిలీజ్
రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ (Prabhas)- మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్సాబ్ పేరుతో ఈ ఫుల్ సాంగ్‌ను(The Raja Saab First Single) విడుదల చేశారు. ఈ పాట రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఊపేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. -
లాంఛనంగా మొదలైన ప్రభాస్ 'స్పిరిట్' (ఫొటోలు)
-
'స్పిరిట్'లో రవితేజ, త్రివిక్రమ్ కొడుకులు.. ఫొటో వైరల్
కొన్నిరోజుల క్రితం హీరో రవితేజ కొడుకు, డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. 'స్పిరిట్' మూవీ కోసం వీళ్లు పనిచేస్తున్నారనే న్యూస్ వైరల్ అయింది. ఇది నిజమా కాదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ ఫొటోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: గ్రాండ్‌గా నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి పెళ్లి)అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తన రేంజ్ పెంచుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే మూవీ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తి దిమ్రితో పాటు టీమ్ అంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లాంచ్ అయిపోయిన తర్వాత చిరంజీవితో కలిసి డైరెక్షన్ టీమ్ అంతా ఫొటో తీసుకున్నారు.అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఫొటోలోనే హీరో రవితేజ కొడుకు మహాధన్, దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు రిషి కనిపించారు. దీంతో కొన్నాళ్ల క్రితం వచ్చిన నిజమని క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ వారసుడు తనలానే డైరెక్టర్ అయ్యే పనిలో ఉండగా.. రవితేజ కొడుకు మాత్రం దర్శకత్వం వైపు రావడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. గతంలో 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ ప్రస్తుతానికైతే సందీప్ దగ్గర దర్శకత్వం నేర్చుకునే పనిలో పడ్డారు.(ఇదీ చదవండి: ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్) -
ప్రకటించిన నాలుగేళ్లకు ప్రభాస్ 'స్పిరిట్' లాంచ్
సాధారణంగా ఓ సినిమా గురించి ప్రకటించిన తర్వాత కొన్నాళ్లకే లాంచింగ్, షూటింగ్ లాంటివి పెట్టుకుంటారు. కానీ ప్రభాస్ 'స్పిరిట్'కి మాత్రం ఏకంగా నాలుగేళ్లు పట్టింది. అవును మీరు విన్నది నిజమే. 2021 అక్టోబరు 7న ఈ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశాడు. తర్వాత నుంచి అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఆలస్యమైపోయింది. ఇన్నాళ్లకు పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.(ఇదీ చదవండి: తెలిసిన విషయాలే కానీ మనసుని మెలిపెట్టేలా.. ఓటీటీ రివ్యూ)హైదరాబాద్ వేదికగా సందీప్ రెడ్డి వంగా ఆఫీస్‌లోనే పూజా కార్యక్రమంతో ఈ సినిమా మొదలైంది. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా వచ్చాడు గానీ ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బహుశా లుక్ ఏంటో తెలియకూడదని సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.స్వయంగా సందీప్.. 'స్పిరిట్' లాంచింగ్ కార్యక్రమానికి ప్రభాస్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రభాస్ అన్న చేతులు మీకు చాలు అనుకుంటా, అంచనాలు పెంచడానికి అని రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తృప్తి దిమ్రి, నిర్మాత భూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచే షూటింగ్ కూడా మొదలైపోయింది. ప్రస్తుతం ఈ లాంచ్ ఈవెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: హ్యాపీ బర్త్‌డే లవర్.. శోభిత లవ్లీ విషెస్) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
రాజాసాబ్: విజిల్స్ వేయించే సాంగ్ వస్తోంది!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలు చేస్తున్నాడు. హను రాఘవపూడితో 'ఫౌజీ', సందీప్‌రెడ్డి వంగాతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్‌తో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్, ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2', మారుతితో 'ది రాజాసాబ్' సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో ది రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజవుతుందని మొదట్లో ప్రకటించారు. ఫస్ట్ సాంగ్కానీ, పలు కారణాల రీత్యా దాన్ని వాయిదా వేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ది రాజాసాబ్ నుంచి ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ మాత్రమే చూశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాబోతుందని అప్డేట్ వదిలారు. నవంబర్ 23న రెబల్ సాంగ్ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు (#TheRajaSaab First Single #RebelSaab Release Date). విజిల్ కొట్టించేలా..ఈ పాట మీతో విజిల్ కొట్టించేలా ఉంటుందంటూ ప్రభాస్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అందులో ప్రభాస్ ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. Here comes #TheRajaSaab STYLE 😎Bringing you the MOST WHISTLE WORTHY TREAT #RebelSaab Song on NOV 23rd 🔥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani @vishwaprasadtg… pic.twitter.com/ceNYsGcCZ4— People Media Factory (@peoplemediafcy) November 21, 2025 చదవండి: అమల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? -
ప్రభాస్ ఒక్కడే సపరేట్!
-
డబుల్ ధమాకా
హీరో ప్రభాస్.. తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయన హీరోగా నటించిన ‘బాహుబలి’ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. అదేవిధంగా ‘సలార్, కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలకు కూడా రెండో భాగం ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫౌజి’ మూవీ కూడా టుపార్ట్స్గా ఆడియన్స్ ముందుకు రానుంది. ‘సీతా రామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఫౌజి’లో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేశభక్తి అంశాలతో పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే...‘ఫౌజి’ రెండు భాగాలుగా విడుదలకానుంది. ఈ విషయాన్ని హను రాఘవపూడి ఇటీవల స్పష్టం చేశారు.‘‘ఫౌజి’ తొలి భాగంలో ప్రభాస్పాత్ర తాలూకు ప్రపంచాన్ని చూస్తారు. రెండో భాగంలో(ప్రీక్వెల్) ఆయనపాత్ర పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర సమర యోధుల కథలను, నిజ జీవితంలో నాకు స్ఫూర్తినిచ్చిన వాస్తవ ఘటనలను ప్రీక్వెల్‌లో చూస్తారు’’ అన్నారు హను రాఘవపూడి. 2026 ఆగస్టులో ఈ మూవీ రిలీజ్ కానుందని టాక్. -
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్‌కి, వర్కింగ్ లైఫ్‌కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్‌లో ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్‌గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్‌గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్‌ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్‌జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్‌ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్‌దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్‌గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్‌లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్‌హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్‌తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్‌ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్‌స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్‌కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. -
ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్లో ఫ్యాన్స్!
ప్రస్తుతం హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతుంది. ఒక సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించి.. షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas ) మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలను ప్రకటించి..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఎప్పుడో ప్రకటించినవే. ఆయన చేతిలో ఇంకా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ది రాజాసాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది.ప్రస్తుతం ఆయన పౌజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్ రిలీజ్ తర్వాత స్పిరిట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మరోవైపు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఇవీ కాకుండా ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్..తాజాగా ఇంకో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కొరియోగ్రాఫర్‌కి చాన్స్..ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్(Prem Rakshit)తో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడట. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇప్పుడీ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది . ఇప్పటికే ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయంలో పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ది రాజాసాబ్ షూటింగ్ సమయంలోనే ప్రేమ్ రక్షిత్..ప్రభాస్‌కి కథ చెప్పాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. టెన్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయన సినిమా కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి భారీ హిట్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ కల్కి మినహా మిగతా చిత్రాలన్నీ బాహుబలి స్థాయిలో విజయం సాధించలేదు. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడుకి చాన్స్ ఇచ్చి ప్రభాస్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే ఇందులో ప్రభాస్ నటించడని.. ఇదొక యానిమేషన్ సినిమా అని, ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించడానికే ఓకే చెప్పినట్లు టాక్. ఇందులో వాస్తవం ఏంటనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది. -
టాలీవుడ్లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలివే
సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ భలే ఉంటాయి. అందుకే అలాంటి కథలకు చాన్స్ వచ్చినప్పుడు స్టార్ హీరో నుంచి స్మాల్ హీరో వరకూ వెంటనే ‘సై’ అనేస్తారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలు పది వరకూ ఉన్నాయి. ఆ సైన్స్ ఫిక్షన్స్ గురించి తెలుసుకుందాం.సత్యలోకం నేపథ్యంలో...చిరంజీవి హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాట నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందిన ‘విశ్వంభర’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘మనకి తెలిసినవి 14 లోకాలు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఆ 14 లోకాలకు పైన ఉన్న లోకమే సత్యలోకం. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. ‘విశ్వంభర’ కోసం వాటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని మా సినిమాలో చూపించాం. ఆ లోకంలో ఉండే హీరోయిన్ను వెతుక్కుంటూ హీరో 14 లోకాలు దాటి వెళ్లి తిరిగి భూమి మీదకు ఆమెను ఎలా తీసుకొచ్చాడు? అనేది ఈ చిత్రకథ’’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పారు డైరెక్టర్ వశిష్ట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా 2026 వేసవిలో విడుదలకు వాయిదా వేశారు మేకర్స్. ‘‘విశ్వంభర’ ఒక చందమామ కథలా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలను సైతం ఇది అలరిస్తుంది.. వినోదపరుస్తుంది. ‘విశ్వంభర’లో సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ప్రేక్షకులకు అత్యున్నతమైన ప్రమాణాలతో బెస్ట్ క్వాలిటీ అందివ్వాలని మేం కష్టపడుతున్నాం’’ అని హీరో చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ’సంక్రాంతికి రాజాసాబ్‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ప్రభాస్ . ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత ‘సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ..’ ఇలా వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చే స్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాల సమ్మిళితంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్, టీజర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండస్ట్రీలోనూ మంచి బజ్ నడుస్తోంది. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో ‘ది రాజా సాబ్’ ద్వారా వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం’’ అంటూ మారుతి తెలిపారు. ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల కై్లమాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో...‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు అల్లు అర్జున్. అంతేకాదు... ‘పుష్ప: ది రైజ్’కి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారాయన. ‘పుష్ప’ ఫ్రాంచైజీ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఏఏ 22 ఏ 6’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ వీఎఫ్ఎక్స్ కంపెనీలతో, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులతో సమావేశం అయింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తోందట యూనిట్. పాన్ ఇండియా కాదు,.. పాన్ వరల్డ్ స్కేల్లో ఈ మూవీ రూపొందనుందనే వార్తలూ వినిపించాయి. ‘‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. మీకు మేం ఓ కొత్త ప్రపంచం చూపించడానికి వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూడనిది వెండితెరపై చూపిస్తామని భరోసా ఇవ్వగలను. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్లతో మేం వర్క్ చేస్తున్నాం. వాళ్లు సైతం తమకు ఈ సినిమా సవాల్‌గా ఉందని చెబుతున్నారు. అంటే మేం ఓ భారీ సినిమా చేస్తున్నామని అర్థం’’ అంటూ అట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపికా పదుకోన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్‌గా ‘ఏఏ 22 ఏ 6’ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని సన్ పిక్చర్స్ సంస్థ పేర్కొంది. ఈ మూవీకి సాయి అభ్యంకర్ స్వరక్తర. జనవరిలో ఆరంభంకన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబర్ 2న పలు భాషల్లో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. ‘కాంతార’కు మించి వసూళ్లు సాధించింది ఈ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న స్ట్రైట్ తెలుగు చిత్రం ‘జై హనుమాన్’. ‘హను–మాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు రిషబ్ శెట్టి. ‘‘కాంతార : చాప్టర్ 1’ విడుదలకు ముందే మరో సినిమాకు సైన్ చేయాలనుకోలేదు. కానీ, ప్రశాంత్ వర్మ చెప్పిన ‘జై హనుమాన్’ కథ నన్ను ఎంతలా ఆకట్టుకుందంటే, వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికే ఫొటోషూట్ పూర్తి చేశాం’’ అంటూ ఇటీవల ఓ సందర్భంలో రిషబ్ శెట్టి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో రానా కూడా నటించనున్నారే వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టి, రానాతో కలిసి ఉన్న ఫొటోని ప్రశాంత్ వర్మ గతంలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హనుమంతుడి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టిలాంటి నటుడికి ధీటుగా నిలబడాలంటే ఆ స్థాయి దేహం, ఆహార్యం ఉండాలంటే రానా కరెక్ట్ అని దర్శకుడి ఆలోచన అట. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు ధీటుగా భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. మరి... ‘జై హనుమాన్’లో రానా పాత్ర ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సరికొత్త అనుభూతినాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్?సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఇలా... సూపర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, కార్తీక్ దండు కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య.. ‘ఎన్సీ 24’లో నాగచైతన్య నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్‌గా రూ΄÷ందుతోన్న ఈ చిత్రంలో దక్ష అనే ఆర్కియాలజిస్ట్‌గా సరికొత్త ΄ాత్రలో కనిపిస్తారు మీనాక్షీ చౌదరి. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ కథలో ఆమె ΄ాత్ర చాలా క్రూషియల్‌గా ఉండబోతోందట. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే దక్ష క్యారెక్టర్ ఆమె కెరీర్లో ఓ మైలురాయిగా నిలవనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలి΄ారు. ఈ సినిమాకి అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ (2014), ‘కార్తికేయ 2’ (2022) చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకదానికి మించి ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘కార్తికేయ 2’తో వందకోట్లకు పైగా వసూళ్లు సాధించారు నిఖిల్. కృష్ణతత్వం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , అనుపమ్ ఖేర్, హర్ష, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. కృష్ణతత్వాన్ని ఉద్దేశించి అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్ అందుకుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ చిత్రం ఉంటుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్ చేసే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అంటూ నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాలతో పోలిస్తే ‘కార్తికేయ 3’ మరింత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇదిలా ఉంటే... నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ని కూడా జోడించారట మేకర్స్. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుందని టాక్. ఏటిగట్టుపై అద్భుతం‘విరూపాక్ష, బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. అక్టోబరు 15న సాయిదుర్గా తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘నా జీవితంలో ‘ఎస్వైజీ’(సంబరాల యేటిగట్టు) చిత్రం చాలా ముఖ్యమైనది. ఈ సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. అద్భుతమైన క్వాలిటీతో సినిమా ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాం. నిరంజన్, చైతన్యగార్లు ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రోహిత్ తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది.. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్’’ అంటూ ఇటీవల సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ఈ మూవీకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు సమాయత్తం అవుతున్నాయి. -
ప్రభాస్ స్పిరిట్.. ఏకంగా స్టార్ హీరో తనయుడు కూడా!
ప్రభాస్(Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్రేజీ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ స్పిరిట్(Spirit Movie). ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. జిగ్రీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందీప్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. స్పిరిట్ చిత్ర షూటింగ్ ఈ నెలఖరులో ప్రారంభించినున్నట్లు తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్పిరిట్‌పై రూమర్స్..అయితే బిగ్ ప్రాజెక్ట్‌పై రూమర్స్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్‌తో పాటు కొరియన్ స్టార్ డాన్లీ కూడా నటించనున్నారని వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా స్పిరిట్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కుమారులు ఎంట్రీ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, అలాగే హీరో రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు స్పిరిట్‌కు పని చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు సందీప్ రెడ్డికి అసిస్టెంట్స్ డైరెక్టర్స్‌గా పని చేస్తారని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. #SandeepReddyVanga ropes in two star kids as assistant directors for #Spirit 🔥Rishie Manoj (#Trivikram’s son) & Mahadhan (#RaviTeja’s son) join the team! 🎬#Prabhas pic.twitter.com/vHb7KbucL8— CHITRAMBHALARE (@chitrambhalareI) November 13, 2025 -
ఫుల్ బిజీగా...
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్‌ఫుల్‌గా 23 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ 2002 నవంబరు 11న విడుదలైంది. ఈ చిత్రాన్ని జయంత్. సి పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్ కుమార్ నిర్మించారు. కాగా, హీరోగా ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తాజా చిత్రాల్లో ఒకటైన ‘ది రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. ఇక ఈ సినిమా కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలోని పీరియాడికల్ సినిమా ‘ఫౌజి’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి 2’ (‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్) చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభం కానుంది. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు కొత్త సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు ప్రభాస్. -
‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అయితే ఇటీవల స్పిరిట్ గురించి వస్తున్న రూమర్స్‌పై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ‘జిగ్రీస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.సందీప్ వంగా మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు నిజం కాదు. మా ఇద్దరి మద్య అలాంటి చర్చలు జరగలేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే” అని తెలిపారు. కాగా “ఎప్పుడైనా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది తప్పకుండా సోలో ఫిలిం రూపంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఏ జానర్లో, ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను” అని అన్నాడు.మరోవైపు సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా సందీప్ స్పందించాడు. అది కూడా రూమర్ మాత్రమే అని స్పష్టం చేశాడు. -
ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన ఫౌజీ హీరోయిన్.. ఎందుకంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ లాంటి భారీ బడ్జెట్ మూవీలో చేస్తున్నారు. అంతేకాకుండా హను రాఘవపూడితో జతకట్టారు మన బాహుబలి హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంంలో హీరోయిన్గా ఇమాన్వి కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది.తాజాగా ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్యాప్షన్ రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ ఇమాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను వీడియోను రూపంలో పోస్ట్ చేసింది. కాగా.. ప్రభాస్ గతంలో కూడా తన సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తానే భోజనాలు తయారు చేయించారు. తన మూవీ షూటింగ్లో పాల్గొన్న అందరికీ కూడా కడుపునిండా భోజనం పెట్టి తన గొప్ప మనసును చాటుకుంటూనే ఉన్నారు.(ఇది చదవండి: 'ఫౌజీ'లో జూనియర్ ప్రభాస్‌గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ)ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో పీరియాడికల్ డ్రామా 'ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.


