ఆచితూచి సినిమాలు చేసే హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. గ్లామర్ రోల్స్ చేయొచ్చు. కోట్లకు కోట్ల రుపాయల రెమ్యునరేషన్ సంపాదించొచ్చు. కానీ తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'రామాయణ్' మూవీలో సీత పాత్ర చేస్తోంది. ఓ హిందీ చిత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లోనూ టైటిల్ రోల్ చేయనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు అనుకోని అవకాశం ఈమెని వరించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సినిమా విషయంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ తీసేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతుందో.. దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే దీపిక వద్దనుకున్న ఈ పాత్ర ఎవరు చేస్తారా అనే డిస్కషన్ అప్పుడు నడిచింది. ఇప్పుడు అది సాయిపల్లవిని వరించినట్లు సమాచారం. దాదాపు ఇది ఖరారైపోయిందని, త్వరలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు.
(ఇదీ చదవండి: 'ది రాజాసాబ్' నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్)
ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే గనుక ప్రభాస్, సాయిపల్లవి జోడీ సెట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి వినిపిస్తున్న పుకార్లు ఎంతవరకు నిజమనేది మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మూవీ టీమ్ ముందు సాయిపల్లవి కాకుండా వేరే ఆప్షన్స్ పెద్దగా లేనట్లే అనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో ప్రస్తుతం 'సుమతి' పాత్రని పోషించిగల హీరోయిన్లు లేరని చెప్పొచ్చు. బాలీవుడ్, దక్షిణాదిలోని మిగతా భాషల్లో అయినా సరే ఆలియా భట్ లాంటి ఒకరిద్దరి పేర్లు పరిశీలించొచ్చు కానీ 'కల్కి' టీమ్, సాయిపల్లవి వైపు మొగ్గుచూపినట్లు అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)


