ప్రభాస్ అభిమానులను ‘ది రాజాసాబ్’ కాస్త నిరాశపరిచింది. అయినప్పటికీ డార్లింగ్ ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మూవీ తర్వాత ఆయన నుంచి ఫౌజీ, స్పిరిట్, సినిమాలు తెరపైకి రానున్నాయి. ఈ రెండూ ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అతి త్వరలోనే ‘కల్కి 2’ కూడా మొదలు కానుంది. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’కి కొనసాగింపుగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారు.
కల్కి2 గురించి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఇలా అన్నారు. 'కల్కి -2 నా కెరీర్‌లోనే టాప్ సినిమాగా ఉండబోతుంది. ఈ మూవీ కోసం నేను అందించబోయే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసం మా టీమ్ చాలా కష్టపడుతుంది. కల్కి 2898AD మా అందరికీ ఒక మెగా లెర్నింగ్. మేము ఇప్పటికే కల్కి పార్ట్-2 కోసం పని చేయడం ప్రారంభించాము. ఈ మూవీలో పాల్గొనే నటీనటుల తేదీలు సర్దుబాటు అయిన తర్వాత, షూటింగ్ ప్రారంభమవుతుంది.' అని ఆయన అన్నారు. సంతోష్ నారాయణన్ చేసిన తాజా ప్రకటనతో అంచనాలను గణనీయంగా పెంచారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే ఉంది.
భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తదితరులు కీలక పాత్రలలలో పోషిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, ప్రభాస్ మార్చి తర్వాత కల్కి-2 సెట్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇందులో భైరవగా, కర్ణగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
"I hope #Kalki2 is going to be my best work🔥. We are putting a lot of effort. #Kalki2898AD was a mega learning for all of us🎶. We have already started work for Kalki Part-2. All are mega stars, once date align, shooting will begin✅"
- #SanthoshNarayananpic.twitter.com/AEGd0TP7qM— AmuthaBharathi (@CinemaWithAB) January 23, 2026


