బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ భామ మాళవిక మోహన్. మాతృభాషతో పాటు, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తున్న ఈమె తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించి గర్తుంపు పొందారు. తర్వాత విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీలో ప్రతినాయకిగా విలక్షణ నటనను ప్రదర్శించారు.
ఇకపోతే తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన రాజాసాబ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మోహన్‌లాల్ సరసన నటించిన హృదయపూర్వం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో కార్తీకి జంటగా సర్ధార్–2లో నటిస్తున్నారు. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే మాళవికమోహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు భాష విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు ఎమోషనల్ సన్నివేశాల్లో కేవలం ముఖభావాలనే చూపించి ఎలాంటి సంభాషణలు చెప్పకుండా ఒన్, టూ, త్రీ అని చెబుతారని విమర్శించారు.
అదే.. కోపంగా ఉన్న డైలాగులు చెప్పమంటే.. ఏ,బీ, సీ, డీ అంటారని పేర్కొంది. అలా చెప్పిన వాటిని డబ్బింగ్‌లో అనువాద కళాకారులు సరి చేస్తున్నారని చెప్పారు. కొందరు నటీమణులైతే కెరీర్ మొత్తం ఇదే పని చేస్తున్నారని విమర్శించారు. ఇలా ఈమె ఏ నటిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. మరి కొందరు అయితే నయనతార గురించే ఆమె అలా విమర్శిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కారణం ఇంతకుముందు కూడా ఈమె నయనతారపై విమర్శలు చేశారన్నది గమనార్హం. ఈ విషయంలో ఏ నటి ఎలా స్పందిస్తారో చూడాలి . ఈ సంక్రాంతి రేసులో రాజా సాబ్‌తో మాళవిక మోహన్.. మన శంకరవరప్రసాద్ గారు మూవీతో నయనతార తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.


