రేవంత్–మౌనికల ప్రేమకథ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ లవ్‌స్టోరీ సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి రానుంది. రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయి పల్లవి నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. 2020లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడి, 2021లో విడుదలైంది.
శేఖర్ కమ్ముల తనదైన శైలిలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రానికి అద్భుత స్పందన లభించింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే సంగీతదర్శకుడు పవన్ సీహెచ్ అందించిన పాటల్లో ‘నీ చిత్రమ్ చూసి...’, ‘సారంగ దరియా... పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న మళ్లీ విడుదల చేయనున్నారు. సో... ప్రేమికుల దినోత్స వానికి రేవంత్–మౌనిక తమ ప్రేమకథతో మరో సారి అలరించనున్నారన్న మాట.


