ఫైట్‌కి రెడీ | Gopichand upcoming movie updates | Sakshi
Sakshi News home page

ఫైట్‌కి రెడీ

Jan 24 2026 4:02 AM | Updated on Jan 24 2026 4:02 AM

Gopichand upcoming movie updates

ఫైట్‌ చేయడానికి రెడీ అయ్యారు గోపీచంద్‌. ఈ ఫైట్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కోసమే ఈ ఫైట్‌ను షూట్‌ చేయడానికి రెడీ అయింది యూనిట్‌. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ ఫైట్‌ని 25 రోజుల పాటు చిత్రీకరించడానికి ΄ప్లాన్‌ చేశారు.

ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ పర్యవేక్షణలో ఈ చిత్రీకరణ ఆరంభమైంది. ‘‘భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తిమంతమైన అధ్యాయాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. ఈ చిత్రంలో గోపీచంద్‌ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇక రాత్రిపూట చిత్రీకరించే  క్లైమాక్స్‌ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ నిర్మించాం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ హిస్టారికల్‌ మూవీలోని క్లైమాక్స్‌ తెలుగులో ఇప్పటివరకు చూడని విధంగా వినూత్నంగా ఉంటుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement