Visakhapatnam
-
కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి ఊస్టింగా?
తిరుపతి మంగళం/తణుకు అర్బన్/బీచ్‌రోడ్డు (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు మండిపడ్డారు.ఈ ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పేదవాడి ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోగత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు ఆపరేటర్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎండీయూ ఆపరేటర్లు జేసీకి, తణుకులో తహసీల్దార్ డి. అశోక్‌వర్మకు వినతిపత్రం అందించారు. -
పదహారేళ్ల తర్వాత ముందస్తు పలకరింపు..!
సాక్షి, విశాఖపట్నం: పదహారేళ్ల తర్వాత.. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా.. ఈ నెల 26 నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలున్నాయి. మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం 2009 తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఎల్‌నినో ప్రభావం లేకపోవడం రుతుపవనాల ముందస్తు రాకకు కారణమని పేర్కొంటున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం.. » తూర్పు–పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుండి నడిపిస్తోంది. » ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్, అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది. » ఈనెల 24 నాటికి రుతు పవనాలు కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 26 నాటికి రాయలసీమ అంతటా.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి. 28 నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం, 29 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. » ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు 104 శాతం కంటే 5 శాతం అదనంగా పడే సూచనలున్నాయి.27న అల్పపీడనం!ఓవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో.. మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ నెల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు. ఈనెల 1 నుంచి 21 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ సగటు వర్షపాతం 39.2 మిమీ కాగా, 126 శాతం అధికంగా 88.5 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు. -
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
సాక్షి,పాయకరావుపేట: టీడీపీ మినీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన మిని మహానాడు పాయకరావు పేట నియోజకవర్గంలో జనం లేక వెలవెలబోయింది.గురువారం పాయకరావుపేటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించింది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.అయితే, మినీమహానాడు ప్రారంభమైన అరగంటకే సభకు వచ్చిన శ్రేణులు మధ్యలోనే వెళ్లిపోవడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా.. కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సభను వదిలి వెళుతున్న జనాలకు నచ్చచెప్పి కూర్చేబెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసుల మాటల్ని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు కంగుతిన్నారు. -
రెయిన్ అలెర్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్‌ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. బుధవారం నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇందుకనుగుణంగా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులు 93 ఖాళీగా ఉన్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. క్లియర్ వేకెన్సీ 46 పోస్టులు ఉండగా, రేషనలైజేషన్‌లో భాగంగా 24 పోస్టులు ఖాళీ చూపించారు. ఫారిన్ సర్వీసుపై వెళ్లిన వారి ఖాళీలు రెండు ఉన్నాయి. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయ్యే జాబితాలో 15 మంది లెక్క తేలారు. వీరు గురువారం సాయంత్రం 5 గంటల్లోగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలి. కంపల్సరీ ట్రాన్స్ఫర్ జాబితాలో ఉన్న వారెవరైనా బదిలీ చేయనట్లయితే, వారికి చివరిగా మిగిలిన ఖాళీల్లో పోస్టింగ్ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, బాలికల పాఠశాలలో 50 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా బదిలీ చేస్తున్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గుర్తించి, వారి జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. వీరు కూడా తప్పనిసరిగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఈవో వెల్లడించారు. విశాఖలోని సీతమ్మధారలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల వారీగా ఖాళీల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు. తొలుత గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీ ఉమ్మడి విశాఖ జిల్లాలో 93 ఖాళీలు మొదలైన దరఖాస్తుల ప్రక్రియ బాలికల పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకే చోటు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో హెల్ప్ డెస్క్ -
సీఎస్ఆర్ఎంవోగాడాక్టర్ శ్రీహరి
మహారాణిపేట: కేజీహెచ్‌లో ఎట్టకేలకు సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సీఎస్‌ఆర్‌ఎంవో) పోస్టు భర్తీ అయింది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టు భర్తీ కాలేదు. ఇన్చార్జిలతో ఈ పోస్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీహరిని కేజిహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్చార్జిగా డీఎస్ఆర్ఎంవో డాక్టర్ మోహర్ కుమార్ పనిచేస్తున్నారు. తొలుత కేజీహెచ్‌కు చేరుకున్న డాక్టర్ సీహెచ్ శ్రీహరి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు వైద్యులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
రాదండి!
ఇంటింటికీరేషన్ బండి.. మహారాణిపేట: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు భారాలు, కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు అన్నింటిపైనా భారం మోపుతూ.. మరోవైపు ఉన్న సౌకర్యాలను దూరం చేస్తోంది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో నెలా నెలా ఠంచనుగా ఇంటి వద్దకే వచ్చే రేషన్(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్–ఎండీయూ) బండికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడరాదన్న ఆశయంతో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇప్పటికే కార్డుదారులకు అరకొర సరుకులను అందిస్తున్న ప్రభుత్వం.. జూన్ 1 నుంచి ఎండీయూ వాహనాలతో రేషన్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చాలనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు రేషన్ సరకులు తీసుకోవడం ఓ ప్రహసనం. రోజంతా పనులు మానుకుని మరీ రేషన్ డీపోల దగ్గర పడిగాపులు కాసేవారు. బియ్యానికి ఒక రోజు, పంచదారకు ఓ రోజు.. ఇలా ఒక్కో సరకుకు ఒక్కో రోజున వెళ్లాల్సి వచ్చేది. చాంతాడంత లైన్లలో గంటల తరబడి నిరీక్షించేవారు. ఇక సర్వర్లు మొరాయిస్తే ఉస్సూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిందే. ఈ కష్టాలను తెలుసుకున్న గత సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనవరి 2021లో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ఇంటి ముందుకే వ్యాన్ల ద్వారా సరకులు అందించడం మొదలెట్టారు. దీంతో రేషన్ కోసం తిప్పలు పడాల్సిన పని తప్పింది. ఆరేళ్లకు అగ్రిమెంట్ నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎండీయూ వాహనాలను బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించి, ఆరేళ్ల(72 నెలలు)కు అగ్రిమెంటు చేశారు. జనవరి 2027 వరకు ఆ గడువు ఉంది. అప్పటికి వాహనాల బ్యాంకు రుణాలు కూడా దాదాపు ముగిసి, వాహనం నిరుద్యోగ యువత సొంతమవుతుంది. అయితే 20 నెలల ముందుగానే దీనికి ముగింపు పలకడంతో ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డున పడ్డ సిబ్బంది ఈ పథకం ద్వారా జిల్లాలో 351 మంది ప్రత్యక్షంగా, మరికొంత మంది పరోక్షంగా బతుకున్నారు. నెలకు కుటుంబానికి సరిపడా వచ్చే సొమ్ముతో ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా ఈ పథకానికి మంగళం పలకడంతో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. దశల వారీ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించనున్నారు.కష్టం తెలియకుండా ఇంటి వద్దే రేషన్ తీసుకోవడం ఇక గత చరిత్రే. టీడీపీ ప్రభుత్వ నిత్యకృత్యాలైన నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర కాలినడక, నెత్తిన బరువుల మోత, గంటల తరబడి నిరీక్షణ మళ్లీ ప్రజలు అనుభవించాల్సిందే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల సౌకర్యార్థం అమల్లోకి తెచ్చిన ఒక్కో పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 351 ఎండీయూ వాహనాల డీలర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎండీయూ వాహనాలకు మంగళం జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు రోడ్డున పడ్డ 702 కుటుంబాలు జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారానే సరకులు ఎండీయూ వాహనాలు 351 ఆధారపడ్డ సిబ్బంది 702 జిల్లాలో వివరాలు తెలుపు రేషన్ కార్డులు 5,12,619 చౌక ధరల డిపోలు 625 ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ వాహనాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి. వీటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా నిలుపుదల చేయడంతో రోడ్డున పడ్డాం. ఈ వయస్సులో ఎక్కడకై నా వెళ్లి పనిచేయలేం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మాలాంటి చిన్నస్థాయి బతుకులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదు. – నీరు కొండ సతీష్, ఎండీయూ ఆపరేటర్అగ్రిమెంట్ గడువు ఇంకా ఉంది 2027 జనవరి వరకు అగ్రిమెంటు ఉంది. ఇంతలోనే తొలగించడం అన్యాయం. ఒక వేళ తొలగిస్తే రానున్న 20 నెలల జీతాలు చెల్లించాలి. కరోనా సమయంలో ఎండీయూ డీలర్లు ఎన్నో సేవలు అందించారు. వైరస్‌కు భయపడకుండా పనిచేశారు. రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మేమంతా రోడ్డున పడతాం. మా కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. – ఎన్.సతీష్ కుమార్, అధ్యక్షుడు, ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ -
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
గంటా రవితేజ నోట.. జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేశ్‌బాబు!
మధురవాడ(విశాఖపట్నం): భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎంపాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె.బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. రాజబాబు వర్గం డుమ్మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంత కాలంగా గంటా, కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫొటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్చార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలుపోతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్చార్జిగా ప్రకటించేశారు. స్థానిక కమిటీలపై అసంతృప్తి పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రా«ధాన్యత దక్కట్లేదన్న విమర్శలున్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలో సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు.జోహార్ సీఎం సర్! గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్.. జోహార్ సీఎం సర్.. జోహార్ లోకేశ్‌బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అరి్పంచేది అంటూ.. పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో.. పొరపాటున అలా అనేశానంటూ.. వివరణ ఇచ్చుకున్నారు. -
ఖైదీల సమస్యలు తెలుసుకున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు సందర్శించారు. జైలు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సన్యాసినాయుడు ఖైదీలు ఉండే బ్యారక్‌లు, పరిసరాలను పరిశీలించి, వారికి కల్పించిన సౌకర్యాలు, వైద్యం, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు సమావేశ మందిరంలో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయ సహాయం గురించి వివరించారు. ఖైదీలు మంచి నడవడికతో ఉండాలని, విడుదలయ్యాక బాహ్య ప్రపంచంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్.సూర్యకుమార్, జైలర్లు, డీఎల్ఎస్ఏసిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయ అండదండలతో..
నగరంలో పలువురు రౌడీషీటర్లకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్లు ప్రతిరోజు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది రౌడీషీటర్లు తమకు సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో పోలీసులపై ఒత్తిడి చేయించి రోజువారీ హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.రాజకీయ నేతలే స్వయంగా ఫోన్ చేసి ఆదేశించడంతో పోలీసులు రౌడీషీటర్ల జోలికి వెళ్లడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పోలీసులు వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నగరంలో శాంతిభద్రతలకు సవాలుగా మారింది -
ఉప మేయర్‌గా దల్లి ఏకగ్రీవం
● మేయర్ చాంబర్లో దాచిపెట్టి మరీ.. సభ్యుల్ని తీసుకొచ్చారు! ● సోమవారంనాటి పరాభవంతో ముందుజాగ్రత్త ● పనిచేసిన బుజ్జగింపులు, తాయిళాలు? డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఉప మేయర్‌గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. బీ ఫారం అందుకున్న గోవిందరెడ్డికి పోటీగా మరెవరైనా ఉన్నారా? అని అడుగుతూ, ఎన్నికల నియమ నిబంధనలను వివరించారు. ఎవరూ పోటీ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. గోవిందరెడ్డిని ఉప మేయర్‌గా టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. అంతా.. పావుగంట లోపే.. ఉదయం 10.55 గంటలకు నలుగురు ఎమ్మెల్యేలు(జనసేన నుంచి పంచకర్ల రమేష్‌బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ నుంచి విష్ణుకుమార్‌రాజు, టీడీపీ నుంచి గణబాబు), వివిధ పార్టీలకు చెందిన 41 మంది కౌన్సిల్ సభ్యులు సభకు హాజరయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ ఆశోక్ చేరుకున్నారు. ఆ సమయంలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు(కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు) వచ్చారు. తర్వాత 5 నిమిషాలకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో ఇంకో 11 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. దీంతో సభ్యుల సంఖ్య 59కి చేరింది. ఈలోగా ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు వివరించారు. మరో 8 నిమిషాల్లో ఉప మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త! ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం. యాదవ, కాపులకు వెన్నుపోటు జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేయర్‌గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్‌గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. -
ల్యాండ్ సెటిల్మెంట్ల దందా
● మొన్న మంగమారిపేటలో వాచ్‌మన్‌ను కిడ్నాప్ చేసి భూకబ్జాకు ప్రయత్నం ● నిన్న లాసెన్స్ బే కాలనీలో ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులకు బెదిరింపులు ● కొంతమందికి రాజకీయ నేతల అండదండలు ● సంఘటన జరిగినప్పుడే పోలీసుల హడావుడి ● వరుస ఘటనలతో హడలిపోతున్న ప్రజలు విశాఖ సిటీ: ప్రశాంత విశాఖలో సుపారీ గ్యాంగ్‌లు అలజడి సృష్టిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో సుపారీ గ్యాంగ్‌ల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నెలలోనే జరిగిన రెండు ఘటనలు జిల్లాలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. -
చరిత్ర సృష్టించేలా యోగా దినోత్సవం
మహారాణిపేట: విశాఖలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నందున, దీనిని చారిత్రక కార్యక్రమంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21 వరకు ‘యోగా మాసం’ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి 8 గంటల మధ్య ఆర్కే బీచ్ రోడ్లో 1,000 మందితో ప్రాథమిక వేడుకలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు, శిక్షణలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజిత వేజెండ్ల, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్‌తో పాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐసెట్‌లో మెరిసిన మనోళ్లు
● విశాఖ జిల్లాకే నంబర్‌వన్ ర్యాంక్ ● టాప్‌టెన్‌లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు ● రాష్ట్రంలో విశాఖ నుంచే అత్యధిక మంది హాజరు విశాఖ విద్య: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఐసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది మొత్తం 32,719 మంది ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధించగా, విశాఖ జిల్లాకు చెందిన మేక మనోజ్ రాష్ట్రంలోనే నంబర్ వన్ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. టాప్–10లో ముగ్గురు విశాఖ వాసులే.. టాప్–10 ర్యాంకుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. అనకాపల్లి జిల్లాకు చెందిన షేక్ బషీరున్నీషా 6వ ర్యాంకు సాధించగా, పెదగంట్యాడ మండలంలోని శరగడ గణేష్ రెడ్డి 9వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అధిక సంఖ్యలో బాలికల ఉత్తీర్ణత ఐసెట్ పరీక్షకు అనకాపల్లి జిల్లా నుంచి 169 మంది హాజరుకాగా, వారిలో 167 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 120 మంది బాలికలు ఉన్నారు. అదే విధంగా, విశాఖపట్నం జిల్లా నుంచి 4,397 మంది పరీక్ష రాయగా, వీరిలో 4,303 మంది క్వాలిఫై అయ్యారు. విశేషమేమిటంటే, ఉత్తీర్ణులైన వారిలో 2,377 మంది బాలికలు ఉండటం గమనార్హం. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పట్ల బాలికలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దీని ద్వారా తెలుస్తోంది. అత్యధిక హాజరు విశాఖ నుంచే రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఐసెట్‌కు హాజరైన విద్యార్థుల్లో విశాఖ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం మరో విశేషం. ఇది జిల్లాలో విద్యాభ్యాసం పట్ల ఉన్న ఆసక్తిని, ఉన్నత విద్యపై విద్యార్థులకున్న ఆకాంక్షను స్పష్టం చేస్తోంది. శభాష్ గణేష్‌రెడ్డి పెదగంట్యాడ: ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో మండలంలోని పెదకోరాడ గ్రామానికి చెందిన విద్యార్థి శరగడ గణేష్‌రెడ్డి 9వర్యాంకు సాధించి సత్తాచాటాడు. పెదకోరాడకు చెందిన శరగడ ఎల్లయ్యరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్‌రెడ్డి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా గణేష్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో స్థిరపడతానని తన లక్ష్యాన్ని వెల్లడించాడు. అతని ప్రతిభకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. -
ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష
డాబాగార్డెన్స్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు చేపట్టే చర్యలపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(యూఎన్‌యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్(ఎన్ఐయూఏ), ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) ప్రతినిధులు నగర మేయర్ పీలా శ్రీనివాస్‌ను మంగళవారం కలిసి వివరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయా సంస్థల ప్రతినిధులు ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఆవశ్యకతను తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో కలిగే విపత్తులు, వడగాల్పులు, వరదలు తదితర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల సహకారంతో నష్ట నివారణ ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు. -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మైన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతలు అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్‌లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
స్టీల్‌ప్లాంట్‌లో కార్మిక సమ్మె ప్రశాంతం
● బైక్ ర్యాలీకి యత్నం ● పోలీసుల అదుపులో కార్మిక నాయకులు ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం జరిగిన కార్మిక సమ్మెలో ఆరుగురు కార్మిక సంఘ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మినహా ప్రశాంతంగా జరిగింది. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సక్రమంగా జీతాల చెల్లింపు, హెచ్ఆర్ఏ పునరుద్ధరణ, కరెంట్ చార్జీల తగ్గింపు, సొంత గనుల కేటాయింపు తదితర డిమాండ్లపై శాశ్వత కార్మికులు ఒక రోజు సమ్మె చేశారు. ఇక కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పాత పద్ధతిలో అందరికీ ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏలను చెల్లించాలని తదితర డిమాండ్లపై కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల షిఫ్ట్ వేళల్లో ప్లాంట్ లోపలికి వెళ్లినప్పటికీ, గేట్ల వద్ద బయోమెట్రిక్ నమోదు చేయించుకోలేదు. షిఫ్ట్–ఎలో కొంత మంది విధులకు హాజరైనప్పటికీ ఆ తర్వాత కొంత మంది కార్మికులు వారికి నచ్చచెప్పి విధుల నుంచి బయటకు తీసుకు వెళ్లిపోయారు. పోలీసుల అదుపులో కార్మిక నాయకులు సెంట్రల్ స్టోర్స్ నుంచి కూర్మన్నపాలెం టెంట్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు నమ్మి రమణ, యు.సోమేష్, అప్పలరాజు, వంశీ, బి.అప్పారావు, ఉరుకూటి అప్పారావులను జీపులో ఎక్కించి స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. అధిక శాతం విధులకు హాజరు ఇదిలా ఉండగా శాశ్వత ఉద్యోగులు రెండు షిఫ్ట్‌లలో 85–90 శాతం వరకు విధులకు హాజరు కాగా, కాంట్రాక్ట్ కార్మికులు 60–70 శాతం హాజరయ్యారు. సర్వీసు విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా విధులకు హాజరు కాగా, కొన్ని ఉత్పత్తి విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో గైర్హాజరయ్యారు. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కార్మికుల సమ్మె సందర్భంగా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, తొమ్మిది మంది సీఐలు, 19 మంది ఎస్ఐలతో పాటు సుమారు 500 మంది సిబ్బందిని ఆయా గేట్ల వద్ద, ఈడీ(వర్క్స్) బిల్డింగ్, అడ్మిన్ బిల్డింగ్, సెంట్రల్ స్టోర్స్ కూడలితో పాటు అన్ని ముఖ్య విభాగాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే కార్మికులను సమ్మె చేస్తున్నవారు అడ్డుకోకుండా చర్యలు చేపట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. ఇప్పటికే వందలాది మందిని తొలగించడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. వారి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. -
కిరాణాషాపులో ఫ్రిడ్జ్ షాక్ కొట్టి విద్యార్థి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం చందకలో మంగళవారం కిరాణా షాపులో పనిచేస్తున్న 6వ తరగతి విద్యార్థి రెడ్డి దశ్వంత్(13) ఫ్రిడ్జ్ డోర్ తీయడానికి ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపురం పంచాయతీ దండువారి కళ్లాలలకు చెందిన లారీ డ్రైవర్ అయిన రెడ్డి శివ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ ఆనందపురం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వేసవి సెలవుల కారణంగా పెద్ద కుమారుడు చందకలో మహేష్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం కురిసిన వర్షానికి తడిసిన ఫ్రిడ్జ్‌ను తాకడంతో షాక్‌కు గురై పడిపోయాడు. అందుబాటులో ఉన్న గ్రామీణ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో, మధురవాడలోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దంచి కొట్టిన వర్షం
మహారాణిపేట: పగలంతా భానుడి తీవ్రతకు తోడు.. గాలిలో తేమ కారణంగా ఉక్కబోత. సాయంత్రానికి కాస్త మబ్బులు పట్టిన ఆకాశం. అర్ధరాత్రి దాటాక దంచికొట్టిన వాన. ఇదీ సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నగరంలో వాతావరణ పరిస్థితి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో కూడిన హోరు వాన నగరాన్ని ముంచెత్తింది. కాసేపు విరామమిచ్చి మళ్లీ కురిసింది. మంగళవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి. వర్షం తగ్గాక.. ఉదయం 9 గంటల నుంచి మళ్లీ ఎండలు షరామామూలే. ఉక్కబోత వాతావరణం గత కొద్ది రోజులుగా ఉదయం పూట ఎండ తీవ్రత వల్ల విశాఖ వాసులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. వర్షం కురిసిన తర్వాత కూడా ఎండ వచ్చాక, అదే పరిస్థితి. బంగాళాఖాతంలో రుతుపవనాలు, అల్పపీడనం, పశ్చిమ, నైరుతి నుంచి వీస్తున్న గాలుల వల్ల వర్షాలు పడుతున్నట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. జ్ఞానాపురం రైల్వే వంతెన వర్షపు నీటితో నిండిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్ణామార్కెట్ ఏరియాలో పలు ప్రాంతాల్లో గంటల తరబడి నీరు నిలిచిపోయింది. ఇక్కడే ఓ రోడ్డు కుంగిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డు, డాబాగార్డెన్స్, రైల్వే న్యూకాలనీ, దొండపర్తి, చావులమదుం అక్కయ్యపాలెం, వెలంపేట, పూర్ణామార్కెట్, ఆశీలమెట్ట, కంచరపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, పాతపోస్టాఫీసు, సీతమ్మధార, కేఆర్ఎం కాలనీ, మద్లిపాలెం తదితర ప్రాంతాల్లో చాలా వీధులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వైఎస్సార్ సెంట్రల్ పార్కు వద్దనున్న నైట్ ఫుడ్ కోర్టులో వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం తగ్గాక చుర్రుమన్న ఎండలు నగరంలో కురిసిన వర్షపాతం ప్రాంతం వర్షపాతం (మి.మీ.) విశాఖ రూరల్ 72.4 సీతమ్మధార 65.0 మహారాణిపేట 38.2 గోపాలపట్నం 29.4 భీమునిపట్నం 26.2 ఆనందపురం 24.6 పెదగంట్యాడ 18.6 గాజువాక 18.6 పద్మనాభం 10.4 పెందుర్తి 4.8 -
వైఎస్సార్సీపీ తూర్పు సమన్వయకర్తగా మొల్లి
ఆరిలోవ: విఽశాఖ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మొల్లి అప్పారావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ పరిధి మద్దిలపాలేనికి చెందిన ఆయన పార్టీలో ప్రారంభం నుంచి సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య మొల్లి లక్ష్మి 16వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన్ని సమన్వయకర్తగా నియమించడంపై పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మరింత అభివృద్ధి సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత జగన్‌కు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
భగ్గుమన్న కార్మిక సంఘాలు
బీచ్‌రోడ్డు: స్టీల్‌ప్లాంట్‌లోని కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులను తక్షణమే నిలిపివేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ నుంచి పోలీసులను వెనక్కి రప్పించాలని కూడా ఆయన కోరారు. సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 9కి వాయిదా పడిన అఖిల భారత సమ్మెకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మికులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అక్రమ తొలగింపులు, పెండింగ్ జీతాలు, హెచ్ఆర్ఏ అమలు, నాయకులపై సస్పెన్షన్ల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రదర్శన, సభ జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించిన జేఏసీ నాయకులు, సొంత గనులు కేటాయించాలని గత నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఎన్నికల ముందు స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన రాష్ట్ర కూటమి నాయకులు, ఇప్పుడు 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగిస్తుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం, ప్లాంట్‌లో పోలీసులను మోహరించడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగించడానికి, కార్మికుల ఉపాధిని రక్షించడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ కార్మికుల సమ్మెలకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జూలై 9న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఆశా, అంగన్వాడీ వంటి వివిధ ప్రభుత్వ పథకాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చెర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం.మన్మథరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఎఫ్‌టీయూఐ అఖిలభారత అధ్యక్షుడు కనకారావు ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులపై ఆందోళన -
36 గంటల్లో హత్య కేసు నిందితుల అరెస్ట్
పరవాడ: ముత్యాలమ్మపాలెంలో ఈ నెల 18న మైలపల్లి బంగార్రాజుపై కత్తులు, రాళ్లతో దాడి చేసి, హతమార్చిన నిందితులను 36 గంటల వ్యవధిలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన ముద్దాయి చింతకాయల ఎర్రయ్య, మృతుడు బంగార్రాజు వద్ద గతంలో రూ.63 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ మొత్తం నుంచి రూ.45 వేలు చెల్లించి, ఇంకా రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయమై ఎర్రయ్యను పలుమార్లు బంగార్రాజు అడిగాడు. అంతే కాకుండా అందరికీ చెప్తూ తనను అబాసుపాల్జేస్తున్నాడని ముద్దాయి కోపంతో మృతుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న రాత్రి 9.30 సమయంలో పథకం ప్రకారం ప్రథమ మద్దాయి కొవిరి కామేష్, కొవిరి శివాజీ, కొవిరి ముత్యా లు(ఆర్మీ), చింతకాయల ఎర్రయ్య, కొవిరి ముత్యాలు, వాసుపల్లి ప్రవీణ్‌కుమార్, కొవిరి ముత్యాలమ్మలు కలసి కత్తులు, రాళ్లు, ఐరన్ రాడ్‌తో బంగార్రాజుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బంగార్రాజును వైద్యం కోసం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుడి సోదరుడు మైలపల్లి పోలరాజు గాయపడినట్లు డీఎస్పీ చెప్పారు. మృతుడి భార్య మైలపల్లి బంగారం ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీరిని మడుతూరు జంక్షన్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, అచ్యుతాపురం సీఐ గణేష్, రాంబిల్లి ఎస్ఐ నరసింగరావు, పరవాడ ఎస్ఐలు బి.కృష్ణారావు, వి.సత్యనారాయణ, సిబ్బందిని అభినందించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘటనను ఆసరాగా తీసుకుని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్ఐలు బి.కృష్ణారావు, సత్యనారాయణ, ఏఎస్ఐ బి.ఎర్రునాయుడు పాల్గొన్నారు. ఏడుగురు నిందితులకు రిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్‌కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి!
సాక్షి,విశాఖ: ఏపీలో ఎంబీఏ,ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్- 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్ పరీక్షా ఫలితాల్లో 95.86శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో విశాఖకు చెందిన మేక మనోజ్ మొదటి ర్యాంక్ సాధించగా.. వైఎస్సార్ జిల్లాకు చెందిన సందీప్‌రెడ్డి రెండో ర్యాంక్‌ను సాధించారు. 👉 ఏపీ ఐసెట్-2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి!
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
పరవాడలో యువకుడి హత్య
పరవాడ: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఆదివారం రాత్రి చీటి డబ్బుల విషయంలో జరిగిన ఘర్షణలో మైలపల్లి బంగార్రాజు (35) అనే యువకుడు కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న బంగార్రాజు చీటిల వ్యాపారం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన చింతకాయల ఎర్రయ్య అతనికి రూ.18 వేలు బాకీ ఉన్నాడు. ఈ విషయంపై ఫోన్లో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అక్కడే ఉన్న ఎర్రయ్య మేనల్లుడు కొవిరి కామేష్ కత్తితో బంగార్రాజును పొడవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, క్లూస్ టీం ఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కామేష్‌తో పాటు మరో ఆరుగురు దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంగార్రాజు భార్య బంగారమ్మ, కుటుంబ సభ్యులు సోమవారం పరవాడ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చీటి డబ్బుల వివాదమే కారణం -
కృత్రిమ ఆవాసాలు, సీ వీడ్‌కు మంచి గిరాకీ
మంత్రి అచ్చెన్నాయుడుమహారాణిపేట: ఉత్తరాంధ్ర సముద్ర జలాల్లో మత్స్య సంపద వృద్ధి కోసం మొదటి విడతగా 22 కృత్రిమ ఆవాసాల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జాలారి ఎండాడ సముద్రంలో కృత్రిమ ఆవాసాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్లో మరపడవల బోట్లకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 634 ట్రాన్స్పాండర్లను 100 శాతం సబ్సిడీపై అందజేసినట్లు తెలిపారు. ట్రాన్స్పాండర్ల వాడకం వల్ల సముద్రంలో బోటు స్థానాన్ని తెలుసుకోవడం, తుఫానులు, ప్రమాదాల సమయంలో ఉపయోగపడుతుందని చెప్పారు. మత్స్యకారులకు జీపీఎస్, బోట్లు, ఇంజన్లు, వలలు వంటి పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో క్రేన్, క్రెడిల్స్ ఏర్పాటుకు పోర్టు చైర్మన్‌తో మాట్లాడతానని చెప్పారు. ఆర్కే బీచ్ ఎదురుగా ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్, సీ వీడ్ కల్చర్ యూనిట్‌ను మంత్రి సందర్శించారు. వసీవీడ్కు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 22 సీవీడ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 45 రోజుల్లోనే ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. కేజ్ కల్చర్ ద్వారా మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవచ్చని, సీవీడ్‌ను ఆధారం చేసుకుని చిన్న పరిశ్రమగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.లక్ష్మణరావు, సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కిజాకుద్దీన్, మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, మాజీ అధ్యక్షుడు పీసీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీ కేజ్ అమ్మకాలు ద్వారా వచ్చిన రూ.3.25 లక్షల చెక్కును లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. -
నాణ్యతే ప్రామాణికం..అవగాహనే కీలకం
● వస్తువులు కొనుగోలు చేసేటప్పడు జాగ్రత్తలు పాటించాలి ● కొలతల్లో మోసాలు జరిగితే అధికారులను సంప్రదించాలి ● నేడు ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం తాటిచెట్లపాలెం: వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు పొందడం ఎంత ముఖ్యమో, వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండటం కూడా అంతే కీలకం. కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించడంతో పాటు, వాటి తయారీ, కొలతలు, ధర వంటి వివరాలపై అవగాహన పెంచుకుంటే మోసాల నుంచి బయటపడొచ్చు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులోనూ తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్త వహించాలని లీగల్ మెట్రాలజీ ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కే థామస్ రవికుమార్ సూచించారు. మంగళవారం ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయమై మాట్లాడారు. ప్రతి సంవత్సరం మే 20న ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1875లో పారిస్‌లో జరిగిన మీటర్ కన్వెన్షన్‌కు గుర్తుగా ఈ దినోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం లీగల్ మెట్రాలజీ 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2025 లీగల్ మెట్రాలజీ డే ‘కొలతలు అన్ని కాలాలకు – అందరు ప్రజలకు’ నినాదంతో సాగుతుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ విభాగం ఈ నెల 8 నుంచి 19 వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవగాహన శిబిరాలు, తనిఖీలు నిర్వహించింది. ఆయా ప్రాంతాలలో వస్తువులను కొనుగోలు చేసేటపుడు ప్రజలు ఎలా మోసపోతారో, ప్రజలను వ్యాపరులు ఎలా మోసగిస్తారో వివరించారు. తూనికలు, కొలతలు, ప్యాకేజీ వస్తువుల విషయంలో వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. బంగారు ఆభరణాల విషయంలో... బంగారు ఆభరణాలు కొనేటప్పుడు రాళ్లు, బంగారం వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో చూడాలి. బిల్లులో నికర బరువు, ధర, స్వచ్ఛత వివరాలు పరిశీలించాలి. కొనుగోలు సమయంలో మిల్లీగ్రాము వరకు ఖచ్చితత్వమున్న ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలను, వాటికి లీగల్ మెట్రాలజీ సీల్ ఉందో లేదో గమనించాలి. పెట్రోలు బంకుల్లోనూ.. పెట్రోల్, డీజిల్ కొనే ముందు పంప్ మీటర్ 0 తో మొదలయ్యేలా చూడాలి. సరైన ధర చెల్లిస్తున్నారో లేదో గమనించాలి. అనుమానం ఉంటే, పెట్రోల్ బంకుల్లో ఉండే లీగల్ మెట్రాలజీ సీల్ ఉన్న ఐదు లీటర్ల కొలత పాత్రతో పరిమాణం సరిచూసుకోవాలి. ప్యాకేజీ వస్తువుల విషయంలో.. ప్యాకేజీ వస్తువులు కొనే ముందు బరువు, కొలత, తయారీ తేదీ, గరిష్ట అమ్మకపు ధర, కస్టమర్ కేర్ వివరాలు చూడాలి. ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేస్తే లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, మార్కెట్లు, కిరాణా, సూపర్ మార్కెట్లలో ఎంఆర్పీ కంటే ఎక్కువ చెల్లించకూడదు. 2024–25 సంవత్సరంలో లీగల్ మెట్రాలజీ గణాంకాలు... జిల్లాలో నమోదు చేసిన కేసులు – 1500 స్టాంపింగ్ ఫీజు – రూ.2,34,88,983 కాంపౌండింగ్ ఫీజు (అపరాధరుసుము/ జరిమానాలు)– రూ.1,16,75,710 -
పల్లా శ్రీనివాసరావుపై న్యాయపోరాటం
● అన్ని పార్టీల మద్దతు కోరతా ● ఎమ్మెల్యే పదవి నుంచి గాజువాక ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి ● తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తాటిచెట్లపాలెం: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుపై అన్ని పార్టీల మద్దతుతో న్యాయపోరాటం చేస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలిపారు. తాను వ్యక్తిగతంగానే పోరాడుతున్నానని, ఈ పోరాటానికి కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర పార్టీల మద్దతు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం హోటల్ సింకా గ్రాండ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో పాల్గొన్న పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీకి ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా? అని రామ్ ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ తనపై హత్యాయత్నం చేశారని, గాజువాకలో భూకబ్జాల మాఫియాకు మారుపేరుగా పల్లా శ్రీనివాస్ నిలిచారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించి, చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై జరిగిన దాడి విషయమై గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, పోలీస్ కమిషనర్‌ను కూడా కలిశానని, ఆయనపై నమ్మకం ఉందన్నారు. పల్లా శ్రీనివాసరావుపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేశానని రామ్ తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించానని, కానీ టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. పల్లా శ్రీనివాసరావు దగ్గర ఉండే మురళీ అతని వ్యవహారాలన్నీ చూస్తూ సెటిల్మెంట్లు, కలెక్షన్స్ చేస్తుంటాడని ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయమై ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిశానని, కాంగ్రెస్ నాయకులను కలిశానని, త్వరలోనే వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్టులు, లోక్‌సత్తా నాయకులను కలుస్తానని రామ్ తెలిపారు. ప్రాణ రక్షణ కోసం తనకు గన్ లైసెన్స్ ఇప్పించాలని పోలీస్ కమిషనర్‌ను కోరనున్నట్లు బీవీ రామ్ తెలిపారు. -
అర్జీల రీ ఓపెన్‌పై కలెక్టర్ అసంతృప్తి
● వచ్చే వారం అర్జీదారులతోస్వయంగా నేనే మాట్లాడతా ● అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు 225 వినతులు మహారాణిపేట: జిల్లాలో గ్రామ సభల్లోని సమర్పించిన అర్జీలు రీ–ఓపెన్ అవుతుండడంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండిం గ్ అర్జీలపై సమీక్షించి, అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, కచ్చితమైన సమాచారంతో పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు, అర్జీదారులు మీకోసం.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో లేదా 1100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. వచ్చే సోమవారం పీజీఆర్ఎస్ సందర్భంగా అధికారుల సమక్షంలో అర్జీదారులతో ఫోన్లో మాట్లాడతానని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లో తెరిచి, పూర్తిగా విచారణ చేసి, మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల సమస్యలు వింటూ, వాటిని సంబంధిత అధికారులకు పంపి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సోమవారం మొత్తం 225 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 91 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 18, జీవీఎంసీ సంబంధించి 51 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 65 వినతులు వచ్చాయి. -
షర్మిలతో కాంగ్రెస్ పూర్తి నిర్వీర్యం
తాటిచెట్లపాలెం: పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి షర్మిలకు, ఆమె తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మెమోరాండంలు కిల్లి కృపారాణికి అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా.. అధినాయకత్వం ప్రకటించిన వారిని కాదని షర్మిల కొత్త వారికి టికెట్లిచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యారని మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పక్షంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కలిసిపోయిందని.. ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ, దూషిస్తూ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో నిలిచేందుకు తప్ప మరేమి చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పోసుకోవాలంటే రాష్ట్ర నాయకత్వ మార్పు అత్యవసరమని నేతలంతా కుండబద్దలు కొట్టారు. కిల్లి కృపారాణి మాట్లాడుతూ ఇక్కడి విషయాలను సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలియజేసి, వినతులను పార్టీ అధిష్టానానికి అందజేస్తానన్నారు. -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
జీవీఎంసీ జోన్–2, మధురవాడలోని ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. బొట్టవానిపాలెంలోని ఈడబ్ల్యూఎస్ లేఔట్, స్వతంత్ర నగర్‌లోని కోట్ల రూపాయల విలువైన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ఆలయం పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నెల 5న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కళానగర్‌లోని కృష్ణ నగర్ పార్కు, బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో పార్కు స్థలం కూడా కబ్జాకు గురయ్యాయి. ఆక్రమణదారులకు జోనల్ కమిషనర్ మద్దతు ఇస్తున్నారు. కలెక్టర్, జీవీఎంసీ అధికారులు స్పందించి పార్కులను కాపాడాలి. –చేకూరి రజని, సామాజిక కార్యకర్త, మధురవాడ -
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై ససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యతా రాగం ‘కౌన్సిల్ సాక్షిగా’ విచ్ఛిన్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025ముగ్గురు సీఐలకు స్థానచలనంవిశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ జి.అప్పారావును మల్కాపురం లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విద్యాసాగర్‌పై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై వేటు పడింది. ఒక ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్‌కు వస్తే.. సీఐ ఫోన్లు, మెసేజ్‌లతో వేధింపులకు గురిచేస్తున్నారని సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ అనంతరం విద్యాసాగర్‌ను రేంజ్‌కు సరెండర్ చేశారు. దీంతో ఆ స్థానంలో అప్పారావును నియమించారు. అలాగే సీఎస్బీ–3లో ఉన్న ఎన్.వి.ప్రభాకరరావును గోపాలపట్నం లా అండ్ ఆర్డర్‌కు, వీఆర్–1లో ఉన్న జి.గోవిందరావును సీఎస్బీ–3కు బదిలీ చేశారు. హాజరైన ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి, ఎమ్మెల్సీ వేపాడ డాబాగార్డెన్స్ : ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లు కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. పదవుల కోసం తప్ప ప్రజలకు మేలు చేయాలని వారు కలవలేదని తేలిపోయింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ పదవిని జనసేనకు కేటాయించగా టీడీపీ ఆశావహులు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎలాగైనా తమకే ఈ పదవి దక్కాలని భీష్మించారు. దీంతో కోరం లేక సమావేశం మంగళవారం నాటికి వాయిదా పడింది. జనసేన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. చివరి వరకు ఆశావహుల ప్రయత్నాలు మేయర్‌గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు. కారాలు మిరియాలు జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు. న్యూస్రీల్జంప్ జిలానీలు తెల్లముఖంస్వార్థ రాజకీయాలు, డబ్బులకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్లముఖం వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే అంత.. దల్లిపై ఎన్ని ఫిర్యాదులో.. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని నమ్మిన పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా ఖంగుతిన్నట్టయింది. టీడీపీలో ముసలానికి కారణంవీరే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ గాజవాక నియోజకవర్గానికి చెందిన గంధం శ్రీనివాస్‌కు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆ నియోజకవర్గ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రెక్కిత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ఏది ఏమైనా కూటమిలో చిచ్చుకు కారకులు వీరేనంటూ పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. చరిత్రలోనే లేదు.. కోరం లేక సమావేశం వాయిదా పడడం జీవీఎంసీ చరిత్రలోనే లేదని వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల సత్య శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమిలో సఖ్యత లేదనడానికి సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికే నిదర్శనమని పేర్కొన్నారు. 63 మంది కార్పొరేటర్లలో 20 మంది వరకు డిప్యూటీ మేయర్ ఎన్నికకు డుమ్మా కొట్టారంటే కూటమిలో లుకలుకలు తేటతెల్లమయ్యాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప.. ప్రజాసమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ పేరుతో ఫేక్ వాట్సాప్!
సాక్షి, విశాఖపట్నం: ‘నేను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి. మీ విద్యుత్ కనెక్షన్ల విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి.. మీపై యాక్షన్ తీసుకుంటాను..’ అంటూ ఓ ఫేక్ నంబర్‌తో కొందరు వినియోగదారులకు వాట్సాప్‌ల్లో మెసేజ్‌లు వెళ్లాయి. మరికొందరికి తొలుత హాయ్.. అని మెసేజ్పెట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తుంటే.. అర్జెంట్‌గా లక్ష రూపాయిలు కావాలంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్(డీపీ)లో సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి ఫొటో ఉండటంతో.. కొందరు అధికారులకు అనుమానం వచ్చి స్వయంగా సీఎండీకి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. 9702068556 అనే నంబర్ నుంచి పలువురికి వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది స్పామ్ నంబర్ అనీ.. ఈ నంబర్‌తో వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించొద్దంటూ సీఎండీ ఫృథ్వీతేజ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో మెసేజ్‌లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎండీ తెలిపారు. -
స్టీల్‌ప్లాంట్ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
పెదగంట్యాడ: అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్డులోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. నిర్వాసితుల నుంచి 26 వేల ఎకరాల భూమిని తీసుకుని కేవలం 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చి అందులో కేవలం 8 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని కోరారు. నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారని.. ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, పల్లా చినతల్లి, ధర్మాల శ్రీను, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్‌నారాయణ, బొడ్డ గోవింద్, సిరట్ల శ్రీనివాస్ గౌడ్, చిత్రాడ వెంకటరమణ, మద్దాల అప్పారావు, డీవీ రమణారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు కౌన్సిల్‌కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు టీడీపీ కార్పొరేటర్లు(కాకి గోవిందరెడ్డి తప్ప) ఎవరూ హాజరు కాలేదు. మరో అరగంట మాత్రమే సమావేశం నిర్వహించేందుకు సమయం ఉంది. ఇంతలో ఒకరినొకరు చెవులు కొరుక్కునే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే మేయర్ పీలా శ్రీనివాస్‌తో పాటు జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మళ్లగుల్లాలు పడుతున్నారు. 11.53 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి రాక ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. (వాస్తవానికి సభ్యులకు ఇచ్చిన సమయానికే రావాలి). వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. కోరం సరిపడా సభ్యులు లేకపోయినా ఇద్దరు అధికారులు (ఏడీసీ డి.వి.రమణమూర్తి, కార్యదర్శి బి.వెంకటరమణ) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంకా వస్తారా.. సార్ అంటూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. 12.10 గంటలైనా అధికారులిద్దరూ లెక్కపెడుతూనే ఉన్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ నేరుగా సభ్యులను లెక్కించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
బుద్ధిస్ట్ సర్క్యూట్స్ కోసం డీఎంవో
సాక్షి, విశాఖపట్నం: బౌద్ధారామాల్ని పర్యాటక ప్రాంతాలుగా మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం అథారిటీ(ఏపీటీఏ) కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బౌద్ధారామాల్ని గుర్తిస్తూ.. ఆయా ప్రాంతాల్లో ఉన్నవాటిని బుద్ధిస్ట్ సర్క్యూట్స్గా అభివృద్ధి చేయాలని సంక ల్పించింది. గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. దానికనుగుణంగా విశాఖలోనూ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు కోసం రెండు సర్క్యూట్స్‌ను ప్రతిపాదించారు. కంప్లీట్ బుద్ధిస్ట్ సర్క్యూట్‌గా విశాఖలోని బౌద్ధారామాలు, అమరావతిలోని బౌద్ధారామాల్ని గుర్తించారు. అదేవిధంగా విశాఖపట్నం సర్క్యూట్‌గా శ్రీకాకుళంలోని శాలిహుండం, విశాఖలోని బావికొండ, తొట్లకొండ, అనకాపల్లిలోని బొజ్జనకొండ, తూర్పుగోదావరి జిల్లాలోని అదుర్రు బౌద్ధారామాల్ని గుర్తించారు. ఈ సర్క్యూట్స్ అభివృద్ధి, నిర్వహణ, మార్కెటింగ్, ప్రమోషన్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్(డీఎంవో)ను ఏర్పాటు చేస్తూ టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డీఎంవోకు విశాఖ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గానూ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కో–చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వీఎంఆర్డీఏ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, ఏయూ ప్రొఫెసర్, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల ప్రతినిధులు, టూరిజం శాఖ విశాఖ ఆర్డీ, విశాఖ, అనకాపల్లి జిల్లా టూరిజం అధికారులు, ఏపీటీడీసీ విశాఖ డివిజనల్ మేనేజర్, ఈఈలు మెంబర్లుగా వ్యవహరించనున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్స్ వద్ద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థలు, అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, స్పాన్సర్‌షిప్‌ల సహాయంతో బౌద్ధారామాల వద్ద పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడం మొదలైనవన్నీ డీఎంవోలు చూస్తాయని పేర్కొన్నారు. -
రేపు డీఈవో కార్యాలయం ముట్టడిస్తాం..
● ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక అల్టిమేటం ● కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం ● డీఈవోకు నోటీస్ అందజేసిన నాయకులు విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్‌కు ముందస్తు నోటీస్ అందజేశారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంత వరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధమన్నారు. అంతకుముందు డీఈవో కార్యాలయం వద్ద సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు విద్యారంగానికి తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు. తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఐక్యవేదిక పిలుపులో భాగంగా చేపట్టే డీఈవో కార్యాలయ ముట్టడికి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు అంతా తరలిరావాలన్నారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని వినిపించేలా ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక జిల్లా స్టీరింగ్ కమిటీ చొక్కాకుల సూర్యనారాయణ(వైఎస్సార్‌టీఏ), వేణుగోపాల్ (ఏపీహెచ్‌ఎంఏ), టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్–257) జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్.ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938)బి.చిన్నారావు, పీఆర్టీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సమ్మెతో చావో రేవో తేల్చుకుందాం..
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం జరగనున్న సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. ప్లాంట్ ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కార్మికవర్గం మరింత ఐక్యంగా ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరింత పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్భందాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె విజయవంతం చేయాలన్నారు. స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, కార్పొరేటర్ గంగారావు, జిల్లా సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, ఆర్.ఎస్.వి.కుమార్, కె.ఎం.శ్రీనివాస్, నాయకులు వై.టి.దాస్, గణపతిరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, కె.సత్యనారాయణ, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ నేడు స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె -
‘మహిళలకు ఫ్రీ బస్సు పథకానికి ముహూర్తం ఏంటి?’
విశాఖ : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ ఆ పథకం ప్రస్తావన తీసుకురాకపోవడంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చెయ్యాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని బొత్స తెలిపారు.ఈరోజు( సోమవారం) విశాఖ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన బొత్స.. ‘ తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు p4కి సంబంధం ఏమిటి?, p4 కి పథకాలకు లింక్ పెట్టడం ఏమిటి..? , లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ పథకం అమలు చేయనట్టేనా.. ఆడ బిడ్డ నిధి పథకంపై కూటమి నేతలు స్పందించాలి. ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో మహిళలు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ డొంక తిరుగుడు వ్యవహారాన్ని గమనించాలి. ఆడ బిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. లేదంటే మహిళలను మోసం చేసిన వారు అవుతారు. విశాఖ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 6 నెలలుగా జీవీఎంసీ కమిషనర్ లేరు.కీలకమైన జీవీఎంసీ కమిషనర్ స్థానాన్ని భర్తీ చేయకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వానికి అధికారం, దోచుకోవడం మాత్రమే అవసరం. కూటమి పార్టీల మధ్య సంఖ్యత లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవు. పోలీసులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని అబాసూపాలు చేస్తుంది. ఏడాది పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం చేతిలో పెట్టుకుని చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు నష్టపోతారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తరువాత మోసం చెయ్యడం బాబుకి అలవాటే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన
విశాఖ : రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంట్లలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక బాపల్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
సాక్షి, విశాఖ: విశాఖ డిప్యూటీ మేయర్ ఎంపిక విషయమై కూటమిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమిలో చిచ్చు రాజేసింది. జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో, పలువురు టీడీపీ నేతలు ఎన్నికకు హాజరు కాకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.వివరాల ప్రకారం.. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జనసేనకు చెందిన డల్లి గోవింద రెడ్డికి డిప్యూటీ మేయర్ అవకాశం ఇవ్వడంపై టీడీపీ నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు జరిగిన సమన్వయ సమావేశం నుంచి కాపు, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేటర్లు అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఈ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరుకాలేదు. కోరం సరిపడకపోవడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కావలసిన సంఖ్యాబలం 56 కావాల్సి ఉండగా.. 54 మంది హాజరయ్యారు. దీంతో, ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో అలకబూనిన కౌన్సిలర్లతో టీడీపీ హైకమాండ్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ..‘అధికార దాహంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ను పదవి నుంచి దింపేశారు. నగర అభివృద్ధిపై కూటమికి చిత్తశుద్ధి లేదు. కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సభ్యులు కూడా లేరు. మేము చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకుంటుంది. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సామాజిక వర్గాల వారీగా జీవీఎంసీ కార్పొరేటర్లు విడిపోయారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అంతా ఒకే మాట మీద ఉన్నాం’ అని అన్నారు. -
చిట్టి తల్లి.. బుజ్జి కన్నా.!
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జూలో ఇండియన్ తోడేలు, బెంగాల్ నక్క, మడగాస్కర్ ప్రాంతానికి చెందిన లెమూర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ఈ మూడు పిల్లలు జూ వైద్యులు, సిబ్బంది సంరక్షణలో ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ వెల్లడించారు.అంతరించిపోతున్న జాబితాలో ఉన్న తోడేళ్లు జూలో సంతానోత్పత్తి చేయడం శుభసూచికమని క్యూరేటర్ పేర్కొన్నారు. కాగా, ఇక్కడ సంతానోత్పత్తి చేసిన తోడేళ్లను 2019లో మైసూరు జూ పార్కు నుంచి, బెంగాల్ నక్కలను 2021లో ఢిల్లీ జూ నుంచి తీసుకువచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక లెమూర్లను సుమారు పదేళ్ల కిందట ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చామని వివరించారు. ప్రస్తుతం జూలో ఈ కొత్త పిల్లలతో కలిపి మొత్తం 8 ఇండియన్ తోడేళ్లు, 15 రింగ్‌టైల్డ్ లెమూర్స్, 4 బెంగాల్ నక్కలు ఉన్నాయని క్యూరేటర్ తెలిపారు. -
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమొరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. మరోవైపు పశి్చమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.ఈ ఉపరితల ఆవర్తనంలో దక్షిణ కోస్తా నుంచి యానాం వరకూ విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. ఈనెలాఖరుకు వేసవి ముగింపు ఈనెల నాలుగో వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసి పోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 4.9 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా డిజిపేటలో 4.7, కర్నూలులో 4.6, చిత్తూరు జిల్లా ముత్తుకూరు 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్.రాఘవపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
శ్రీశైలం డ్యామ్ విపత్తుతో అమరావతికీ ముప్పు.!
సాక్షి, విశాఖపట్నం: శ్రీశైలం డ్యామ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) హెచ్చరించినా ఇంతవరకు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఘాటుగా ప్రశ్నించారు. ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 7న ఓ లేఖ రాసినా.. ఎందుకు స్పందించలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి శనివారం మరోసారి శర్మ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. 2012లో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరద వల్ల డ్యామ్ క్రమక్రమంగా ప్రమాద స్థితికి చేరుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.చంద్రబాబుకు రాసిన లేఖలో శర్మ ఏం చెప్పారంటే... ‘2014లోనూ అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్యామ్ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఎన్డీఎస్ఏ మరోసారి హెచ్చరించినా.. ఎందుకు స్పందించలేదు.? తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని పట్టించుకోవడం లేదు. శ్రీశైలం డ్యామ్ కింద వైపున.. పునాదికి దగ్గరలో పెద్ద ఎత్తున కోతకు గురైంది. దీని వల్ల డ్యామ్ కట్టడానికి ముప్పు ఉందని, 2025 వర్షా కాలంలోగా తాము సూచించిన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలంటూ ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఇంత వరకూ మీ ప్రభుత్వం అలాంటి మరమ్మతులేవీ చేపట్టలేదు. దీనిపై ఎన్డీఎస్ఏ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.తాత్కాలిక మరమ్మతులతోపాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని, పునాది కింద ఏర్పడిన భౌగోళిక మార్పులపై నిపుణుల సహాయంతో అధ్యయనం చేసి త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కూడా ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో గనుక విపత్తు సంభవిస్తే.. కృష్ణానది కింద ఉన్న ప్రాంతాలు అంటే నాగార్జున సాగర్ డ్యామ్‌కు, గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాలకు ముంపు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వందలాది గ్రామాలు నీటమునిగిపోతాయి. విజయవాడ, గుంటూరు నగరాలే కాకుండా.. కొత్తగా నిర్మిస్తున్న అమరావతి కట్టడాలకూ ముంపు ముప్పు వాటిల్లక తప్పదు.వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలోని అన్ని నదుల్లోనూ వర్షాకాలంలో ప్రమాద స్థాయిలో వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా శ్రీశైలం డ్యామ్‌కి మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టండి. ఎన్డీఎస్ఏ హెచ్చరికలకు అనుగుణంగా.. డ్యామ్ పనుల్ని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) నిపుణుల పర్యవేక్షణలో చేపట్టాలి. అని ఈఏఎస్ శర్మ బాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ సమ్మెకు జేఏసీ మద్దతు
● కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి.. బకాయిలకు జమ చేసుకుంది ● జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ గళమెత్తింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకోవడం కోసం ఈ నెల 20న శాశ్వత కార్మికులు, 20 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నగరంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌లోని వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని.. పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇళ్లకు పంపిస్తోందని మండిపడ్డారు. రూ. 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ఆ నిధులను కార్మికుల జీతభత్యాలకు, ప్లాంట్ అభివృద్ధికి వినియోగించకుండా ఆంక్షలు పెట్టిందన్నారు. రూ.9,654 కోట్లను కేంద్ర జీఎస్టీకి, బ్యాంకు బకాయిలకు జమ చేసుకుందని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని హామీలిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఇప్పుడు నోరు మెదపడంలేదని మండిపడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించిందన్నారు. ఈ సమ్మెకు జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. ఈ నెల 18న నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్రలు, బైక్ యాత్రలు, 19న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వద్ద నిరసనలు, 20న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన, సభ నిర్వహించాలని జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ ఎం.జగ్గునాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నాగభూషణం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, సీఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షుడు ఎ.కనకారావు, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్.అనిల్‌కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్‌తో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ డేటా ఆధారిత నిర్ణయాలను బలోపేతం చేసుకునేందుకు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం సీజీఎం పి.శ్రీనివాస్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు చొక్కాకుల శ్రీనివాస్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మున్సిపల్ శాఖ వంటి అనేక శాఖలతో కలిసి పనిచేసిన అనుభవంతో ఇకపై ఏపీఈపీడీసీఎల్‌తో పనిచేయనుంది. విద్యుత్ పంపిణీ సామర్థ్యం, ఆదాయ వృద్ధే లక్ష్యంగా సీపీఆర్ సంస్థ ఏపీఈపీడీసీఎల్‌కు డేటా ఆధారిత విశ్లేషణలు చేయడంతో పాటు సంస్థ సిబ్బందికి అధ్యయనాలు, సూచనలు చేయనుంది. ఈపీడీసీఎల్‌లో ఏర్పాటు చేసిన డేటా అనలిటిక్ యూనిట్ (డీఏయూ)ను అభివృద్ధి పరచడం ద్వారా సంస్థ అంతర్గత వ్యవస్థ సామర్థ్యాలను పెంచడం, ఏపీఈపీడీసీఎల్ బిల్లింగ్ వ్యవస్థలోని రెవెన్యూ నష్టాలను తగ్గించడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి డేటా విశ్లేషణలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సీపీఆర్ సహకరిస్తుంది. -
మెట్రో భూసేకరణ ప్రక్రియపై సమీక్ష
మహారాణిపేట: మెట్రోతోపాటు జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్‌పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్‌కు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి తుది చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాథుర్, ఎస్డీసీ సుధాసాగర్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పోరుబాట
విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులలో అసంబద్ధమైన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పోరుబాటకు సిద్ధమైంది. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 21న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు డాబాగార్డెన్స్ ఆర్బీఎం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ అధ్యక్షుడు గోపీనాథ్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడుతూ 117 జీవో రద్దు పేరుతో ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన తొమ్మిది రకాల బడులు విద్యారంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే అవకాశం ఉందన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంఘాల నాయకుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం సరైందికాదన్నారు. బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్‌కు సంబంధించిన 16 రకాల డిమాండ్లతో పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈనెల 21న డీఈవో కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దీనిని పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా వి.ఎస్.వేణుగోపాల్ (ఏపీహెచ్‌ఎంఏ), గోపీనాథ్ (పీఆర్టీయూ), ఇమంది పైడిరాజు (ఎస్టీయూ) టి.రామకృష్ణ (ఏపీటీఎఫ్ –257), జి.చిన్నబ్బాయి (యూటీఎఫ్), ఎ.అరుణ్ కుమార్ (ఏపీయూఎస్) ఎన్. ధనుంజయరావు (ఏపీటీఎఫ్–1938), బి.చిన్నారావు (ఏపీపీటీఏ) చొక్కాకుల సూర్యనారాయణ (వైఎస్సార్‌టీఏ) లను ఎన్నుకున్నారు. సోమవారం సాయంత్రం స్టీరింగ్ కమిటీ సమావేశమై డీఈవో కార్యాలయ ముట్టడికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. 21న డీఈవో కార్యాలయం ముట్టడి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సన్నద్ధత సమావేశం 9 రకాల బడులపై తీవ్ర వ్యతిరేకత -
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025భారీగా దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ వారీగా అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి. 19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న నిర్వహించే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు.. ఆ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గంటలకు తమ గుర్తింపు కార్డులతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని జేసీ సూచించారు.విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్‌లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. బీసీ–ఈ 423 ఎస్సీ–1 479 ఎస్సీ–2 876 ఎస్సీ–3 2,821 ఎస్టీ 10,523 ఈడబ్ల్యూఎస్ 890 కేటగిరీ వచ్చిన దరఖాస్తులు ఓసీ 1,626 బీసీ–ఏ 1,940 బీసీ–బీ 2,563 బీసీ–సీ 198 బీసీ–డీ 8,330 వీటితో పాటు దివ్యాంగ కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయిన్యూస్రీల్ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే..దరఖాస్తులు ఇలా.. మొత్తం అభ్యర్థులు 29,779 సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 49,658 పురుషులు 11,773 మహిళలు 18,006 -
సాంకేతిక ఆవిష్కరణలతోనే సుస్థిర భవిష్యత్తు
● హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా ● ఘనంగా ఐఐపీఈ స్నాతకోత్సవం విశాఖ విద్య: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సీఈవో అరుణ్ మిశ్రా పిలుపునిచ్చారు. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) 5వ వార్షిక స్నాతకోత్సవం శనివారం నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థులు భిన్నంగా ఆలోచించాలన్నారు. చదువుకునే రోజుల్లోనే దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. హిందుస్థాన్ జింక్ ఇన్నోవేషన్ జర్నీలోని ఉదాహరణలను వివరిస్తూ.. సుస్థిర ఇంధన భవిష్యత్తును రూపొందించడంలో కృత్రిమ మేధ, హైడ్రోజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పాత్రను తెలియజేశారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పరితోష్ కె.బానిక్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ పరివర్తన భారతదేశానికి అత్యంత ఆవశ్యకమని, ఈ దిశగా సుస్థిర ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. క్లిష్టమైన ఇంధన సవాళ్లను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయాలని గ్రాడ్యుయేట్లకు సూచించారు. రూ.150 కోట్లతో రీసెర్చ్ పార్కు సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్ మాట్లాడుతూ రూ.150 కోట్లతో ఐఐపీఈ–మాగ్నివియా బిజినెస్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ పార్క్‌ను సబ్బవరంలోని సొంత క్యాంపస్‌లో త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఐఐపీఈ చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. సహజ హైడ్రోజన్‌పై భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. కెమ్ టెక్ ఫౌండేషన్ నుంచి ఎనర్జీ ఎక్సలెన్స్ అవార్డు–2025ను అందుకోవడంతో సంస్థ ప్రతిష్ట పెరిగిందన్నారు. 15 శాతం అంతర్జాతీయ ప్రాజెక్టులు, గ్లోబల్ ఎలెక్టివ్లతో అంతర్జాతీయ స్థాయిలో ఐఐపీఈ ముందంజలో ఉందన్నారు. 51 మందికి డిగ్రీలు ప్రదానంస్నాతకోత్సవంలో మొత్తం 51 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరికి పీహెచ్డీ, ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో 15 మందికి, బీటెక్‌లో 34 మందికి(పెట్రోలియం ఇంజినీరింగ్–8, కెమికల్ ఇంజినీరింగ్–26) డిగ్రీలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ప్రదా నం చేశారు. ఆల్బర్ట్ ఇజాక్ మొహంతి (బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్) అకడమిక్ ఎక్సలెన్స్, ఆల్ రౌండ్ ప్రతిభకు గాను ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో అహోల్జియా నందీష్ అమిత్‌కుమార్ (గోల్డ్), ఆయుష్ గుప్తా (వెండి), బీటెక్ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బిశ్వజిత్ పాటి (గోల్డ్), బోకం శ్రీరామ మణికంఠ గణేష్ (వెండి), ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీలో డెబాసిస్ సాహు (గోల్డ్), సుజాత మాఝీ (వెండి) ప్రతిభ చూపా రు. బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో అందించే బెస్ట్ అవుట్ గోయింగ్ గర్ల్ స్టూడెంట్ మెడల్‌ను ఎమ్మెస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థిని సుజాత మాఝీకి ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫాల్ ద్వివేది, సెనేట్ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పచ్చదనం పెంపుపై దృష్టి
నగర ప్రజలకు మేయర్ పిలుపు ఎంవీపీకాలనీ: నగర ప్రజలు పచ్చదనం పెంపుపై దృష్టిసారించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శివాజీ పార్కులోని యోగా సాధన సెంటర్ వేదికగా శనివారం ‘బీట్ ద హీట్’నినాదంతో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణకు అన్ని వార్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్డుల్లోని ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఉండాలని స్పష్టం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ వేసవి ఉపశమనం కోసం నగరంలో గ్రీన్ షేడ్స్, 106 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు భవనాలపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, విశాఖ జిల్లా ప్రత్యేక అధికారి ఎస్.ఢిల్లీరావు, కార్పొరేటర్లతో కలిసి మేయర్, కలెక్టర్ బీట్ ద హీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పార్కులో మొక్కలు నాటారు. తొలుత కేంద్ర సబ్సిడీ నిధులు రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను మేయర్, కలెక్టర్ ప్రారంభించారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్రస్ గార్డెన్ నమూనా, వరి కంకులు, వాటర్ బౌల్స్, చిరుధాన్యాల స్టాళ్లను పరిశీలించి.. నిర్వాహకులను అభినందించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్ రాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు శివప్రసాద్, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..
తీర్మానాలు ● ఈ నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ కమిటీలు ఏర్పాటుకావాలి. ● జూన్, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు పూర్తిచేయాలి. ● ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ● 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలి. ● వార్డు, జిల్లా స్థాయి ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాడాలి. ● 19న జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక వైఎస్సార్ సీపీ బహిష్కరణ. సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.కె.రాజు, విశాఖ పార్లమెంట్ పరిశీలకుడిగా కదిరి బాబూరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అంతా శూన్యమే.. ఉన్నదల్లా రూ.1.5 లక్షల కోట్లు అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోలు జరగక కళ్లాల్లోనే నిలిచిపోయిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం దాహంతో విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం బోల్తా పడకతప్పదని జోస్యం చెప్పారు. గతంలో రుషికొండ బోడిగుండు అంటూ పచ్చ పత్రికలు అదేపనిగా కథనాలు రాశాయి.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అడ్డంగా దోచుకుంటుంటే ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వం తీరు మారడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో హ్యూమన్ ట్రాకింగ్ జరిగిందని హడావుడి చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. జీవీఎంసీ కమిషనర్ లేకపోవడంతో నగర వీధుల్లో ఎక్కడిపడితే అక్కడ చెత్త పేరుకుపోతుందన్నారు. కమిషనర్‌ను నియమించుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పార్టీ నేతలు తమ ప్రాంతంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ జగనన్న 2.ఓలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయి సమావేశం, ఆరు నెలలకు ఒకసారి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందామన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది అరాచక పాలన నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమంగా కేసులు నమోదు పెడుతున్నారన్నారు. దేశంలో పరిస్థితులు చూస్తే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అబద్ధపు హామీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, ముఖ్యనేతలు రవిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, రొంగళి జగన్నాథం, ఉడారవి, ఫరూఖీ, రవిరాజు, మొల్లి అప్పారావు, బా ణాల శ్రీనివాసరావు, ఉరుకూటి అప్పారావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, పి.వి.నారాయణ్, జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రాజు, అల్లు శంకర్రావు, అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్ కుమార్ జైన్, చెన్నా జానకిరామ్, గుండపు నాగేశ్వరరావు, వావి లపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, శశికళ, పి.వి.సురేష్, బల్లా లక్ష్మణ్, గులివిందల లావణ్య, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ సాయి అనుషా, ఊరుకూటి రామచంద్రరావు, కె.భూపతిరాజు సుజాత, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్‌రెడ్డి, పల్లా దుర్గారావు, దొడ్డి రామనాథ్, డా.మంచా నాగమల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, షేక్ మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు. జగన్ 2.ఓలో కార్యకర్తలకే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై పోరాటలకు సిద్ధంకండి కూటమి నేతల దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేకే రాజు -
కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
విశాఖ: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఆ చిన్నారిని గాజువాకలో గుర్తించారు పోలీసులు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి, విక్రయించేందుకు జరిగిన యత్నంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారికి లక్ష్మీ, అప్పలస్వామిలుగా గుర్తించారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అనకాపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళగా గుర్తించారు. అనంతరం గాలింపు ముమ్మరం చేయడంతో ఆ చిన్నారి కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని గాజువాకలో విక్రయానికి పెట్టే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు పోలీసులు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. -
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్ట్‌లు’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక, హామీలు అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.హామీల అమలు విషయంలో అన్నివర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేసి, మద్యం షాపులు తగ్గించి, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతులిచ్చాడని, గత వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గత మా వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంటలూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకి దమ్ముంటే తన మీద నమోదైన ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని, ఐఏఎస్, ఐపీఎస్‌లనే కాకుండా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అరాచక పాలనతో ఎంతోకాలం ప్రజాచైతన్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
స్టీల్‌ప్లాంట్ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్
ఉక్కునగరం: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో స్టీల్‌ప్లాంట్ మాజీ ఉద్యోగి బి.వి.ఎస్.కె.లింగేశ్వరరావు జంట విజేతగా నిలిచింది. ఈ నెల 10 నుంచి 14 వరకు తైపీలో తైవాన్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 12 దేశాలకు చెందిన 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55+ కేటగిరీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సుజానే వెంగిలెట్తో లింగేశ్వరరావు పాల్గొన్నారు. సెమీఫైనల్స్‌లో మలేషి యాతో పోటీపడి గెలిచిన లింగేశ్వరరావు జంట.. ఫైనల్స్‌లో జపాన్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ని స్టీల్‌ప్లాంట్ అధికారులు, పలువురు క్రీడాకారులు అభినందించారు. -
వాల్తేర్ డిపో కండక్టర్, డ్రైవర్ నిజాయితీ
ఎంవీపీకాలనీ: బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును బస్సులో మర్చిపోయిన ఓ ప్రయాణికురాలికి ఆర్టీసీ సిబ్బంది తిరిగి అప్పగించారు. గురువారం రాత్రి 999 నంబర్ గల బస్సులో ప్రయాణించిన ఓ మహిళ ఐదు తులాల బంగారంతో పాటు దుస్తులున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయి దిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత బ్యాగును గమనించిన ఆ బస్సు కండక్టర్ జి.గిరిబాబు, డ్రైవర్ డి.ఎ.బాబు దానిని వాల్తేరు డిపో సూపరింటెండెంట్‌కు సెక్యూరిటీ సమక్షంలో అప్ప గించారు. తమ బ్యాగు పోగొట్టుకున్నట్లు గుర్తించిన ప్రయా ణికురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం డిపోను సంప్రదించగా.. అధికారులు ఆ బ్యాగును వారికి అందజేశారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. కండక్టర్, డ్రైవర్ల వివరాలు తెలుసుకుని వారు విధుల్లో ఉన్న బస్సు వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఘనంగా సన్మానించారు. అనంతరం సిబ్బంది చేతులమీదుగా తమ ఆభరణాలను తిరిగి తీసుకుని సంతోషించారు. ఆర్టీసీ ప్రతిష్టను పెంచిన కండక్టర్, డ్రైవర్‌ను డిపో యాజమాన్యంతో పాటు ఉద్యోగులు అభినందించారు. -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● ‘అపస్’ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికిఅందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలన విశాఖ విద్య: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీల చట్టం మేరకు ఖాళీల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. పాఠశాలల పునర్నిర్మాణంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చినా.. బదిలీలు చేపట్టేలా విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతల పాయింట్లు కేటాయింపునకు సంబంధిత ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని డీఈవో కార్యాలయ అధికారులు ప్రత్యేక గూగుల్ ఫాంను విడుదల చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఉపాధ్యాయులు వెంటనే ఈ ఫాం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే జిల్లా స్థాయి ప్రత్యేక శిబిరానికి హాజరైనా.. నేటికి కూడా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గూగుల్ ఫాం పూర్తి చేయాలని ఆదేశించడంతో అయ్యవార్లకు తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిజమేనా? బదిలీల సందర్భంగా ప్రాధాన్యత కోరుతున్న ఉపాధ్యాయులు గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటి కోసం మళ్లీ వైద్యుల ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 1,200 మంది వరకు ప్రాధాన్యత పాయింట్లు పొందే ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 56 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు గతంలో సమర్పించిన సర్టిఫికెట్లలో వాస్తవమెంత అనేది తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెడికల్ బోర్డు ముందు 442 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సర్టిఫికెట్ల జారీ కోసం కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులను మేనేజ్ చేశారని ప్రచారం సాగుతోంది. 20 రోజులు గడిచినా అందని సర్టిఫికెట్లు జిల్లా స్థాయి మెడికల్ బోర్డు ముందు హాజరై 20 రోజులు గడుస్తున్నా.. వైకల్య ధ్రువీకరణ పత్రాలు(మెడికల్ సర్టిఫికెట్లు) అందకపోవడంపై కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అపస్ సంఘం జిల్లా నాయకులు శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. దీంతో తేరుకున్న కేజీహెచ్ పాలనాధికారులు ఆయా విభాగాల్లో ఉన్న సర్టిఫికెట్లు సేకరించి, హుటాహుటిన డీఈవో కార్యాలయానికి పంపించారు. ఎంఈవోలకు పంపించాం కేజీహెచ్ నుంచి శుక్రవారం మెడికల్ సర్టిఫికెట్లు అందాయి. వాటిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోలకు వెంటనే పంపించాం. విశాఖ జిల్లాకు సంబంధించి ఎంఈవోల ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. – ఎన్.ప్రేమ్ కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగులకు న్యాయం చేయాలి దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి దివ్యాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. –ఎ.శ్రీనివాసరావు, వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నం -
మధురవాడలో 87.8 ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: మధురవాడలోని 87.80 ఎకరాల వీఎంఆర్డీఏ భూమిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ ప్రణవ్‌గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో క్రెడాయ్, నేరెడ్కో, అప్రెడా ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై ఈ ప్రాజెక్టుకు గల అవకాశాలను వివరించారు. ఈ భూమికి బీచ్ కారిడార్, డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు, ఐటీ సిటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడం అదనపు ఆకర్షణ అని వివరించారు. ఈ నెల 23న హైదరాబాద్‌లో, 30న బెంగళూరులో ఈ భూమికి సంబంధించి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, బలరామరాజు, ప్రణాళికాధికారులు వెంకటేశ్వరరావు, అరుణవల్లి, చామంతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 23న హైదరాబాద్, 30న బెంగళూరులో రోడ్ షో -
ఇద్దరు యువకులను రక్షించిన బీచ్గార్డ్స్
బీచ్‌రోడ్డు: ప్రమాదకరమైన అలల్లో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులను బీచ్గార్డ్స్ అతికష్టం మీద రక్షించారు. వివరాలివి. తాడేపల్లిగూడెంకు చెందిన యువకులైన సాయి, కృష్ణ శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్కేబీచ్ను సందర్శించారు. ఆ తర్వాత స్నానం కోసం సముద్రంలోకి వెళ్లిన వారిని ఓ పెద్ద కెరటం ఒక్కసారిగా లోపలకు లాగేసింది. ఈ విషయాన్ని గమనించిన పర్యాటకులు వెంటనే మైరెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు బీచ్గార్డ్స్ రాకేష్, సాగర్‌ను ఘటన స్థలానికి పంపారు. బీచ్గార్డ్స్ అతికష్టం మీద సంద్రంలో చిక్కుకుపోయిన వారిద్దరినీ రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని బంధువులకు అప్పగించారు. -
ఏపీఎస్పీ బెటాలియన్‌లో సేవా పతకాల ప్రదానం
పీఎంపాలెం: బక్కన్నపాలెం సమీపంలోని ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్‌లో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి 16వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ సేవా పతకాలు అందజేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఐదు ఉత్కృష్ట, రెండు అతి ఉత్కృష్ట, నాలుగు 75 సంవత్సరాల సేవా పతకాలను అందించారు. అలాగే 8వ ఎన్డీఆర్ఎఫ్ స్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీల్లో మూడవ స్థానంలో నిలిచి రూ.50 వేలు నగదు బహుమతి సాధించిన బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రవాదుల ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఇన్చార్జ్ అడిషనల్ కమాండెంట్ పి.సత్యం, అసిస్టెంట్ కమాండెట్లు వి. నారాయణరావు, జి.ఇలయా సాగర్, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. తాజాగా 82 యూపీఎస్‌లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను సమీప హైస్కూళ్లకు తరలించనున్నారు. అనకాపల్లి జిల్లాలో అత్యధి కంగా 52 స్కూళ్లను మూసివేయనుండటంతో, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హైస్కూల్చదువులు దూరం కానున్నాయి. ఈ చర్యల వల్ల గ్రామాల్లో డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ జిల్లా లోనూ డ్రాపౌట్లుపెరిగే అవకాశం ఉంది. విశాఖ విద్య: జిల్లాలో పద్మనాభం మండలం కొత్తకొవ్వాడ ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేయడంతో ఇక్కడ 6, 7, 8 తరగతులు చదువుతున్న 14 మంది విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతవరం జెడ్పీహెచ్‌ఎస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే భీమునిపట్నం మండలం రెండో వార్డు మున్సిపల్ యూపీఎస్‌ను రద్దు చేసి 17వ వార్డులోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌కు మ్యాప్ చేశారు. ఇక్కడ 6, 7, 8 తరగతుల్లో 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ పాఠశాలను రద్దు చేయడం గమనార్హం. జిల్లాలో ఇలా మూడు యూపీఎస్‌లను రద్దు చేశారు. ఈ నిర్ణయాల వల్ల విద్యార్థులు హైస్కూల్ చదువు కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం మిగతా IIవ పేజీలో -
పర్యాటక ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
మహారాణిపేట: జిల్లాలోని పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, ఔత్సాహిక కంపెనీలకు భూ కేటాయింపులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు చేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటక శాఖకు అశోక్ లేల్యాండ్, పోర్ట్‌లు అందిస్తున్న డబుల్ డెక్కర్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం, జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మాయాజాలం
ఇంజినీరింగ్● తమ వారికే టెండర్లు దక్కేలా ప్రణాళికలు ● టెండర్లలో పాల్గొనొద్దంటూ కాంట్రాక్టర్లకు బెదిరింపులు ● ‘ది డెక్’ నిర్వహణకు సింగిల్ టెండర్.. అయినా అప్పగించేందుకు ప్లాన్ ● ఇప్పటికే జనసేన మహిళా నేతకు కీలక కాంట్రాక్టులు అప్పగింత ● సీ హారియర్ నిర్వహణలో తక్కువకు టెండర్ వేసిన వారిని తప్పుకోవాలంటూ ఫోన్లు విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఇంజినీరింగ్ అధికారుల వ్యవహారశైలి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టర్ల ను బెదిరించారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టెండర్లో పాల్గొనవద్దని ఒకరికి, టెండర్ దక్కించుకున్నా కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా మరొకరికి ఇబ్బందులు కలిగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ భవన నిర్వహణకు సంబంధించి సింగిల్ టెండర్ వచ్చేలా ప్రయత్నాలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సదరు టెండర్దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫోన్లు చేసి బెదిరింపులు వీఎంఆర్డీఏ ఇటీవల సీ హారియర్, ది డెక్ (మల్టీ లెవెల్ కార్ పార్కింగ్) వార్షిక నిర్వహణకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఒక ఇంజినీరింగ్ అధికారి రింగ్ మాస్టర్‌గా మారినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ టెండర్లను దక్కించుకోవడానికి కాంట్రాక్టర్ల మధ్య పోటీ నెలకొన్నప్పటికీ, సదరు అధికారులు తమ వారికి ఈ కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తూ కాంట్రాక్టర్లను బెదిరించినట్లు విభాగంలోని సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుం టున్నారు. బీచ్ రోడ్డులో ఉన్న సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణకు 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో వీఎంఆర్డీఏ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గత నెల 17వ తేదీతో టెండర్ల సమర్పణకు గడువు ముగిసింది. అయితే ఈ టెండర్లో పాల్గొనవద్దని ఒక కాంట్రాక్టర్‌కు ఫోన్ వచ్చిందట. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ వేరే సంస్థ పేరుతో టెండర్ వేశారు. మొత్తంగా ఈ పనుల కోసం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొన్నారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ. 29,48,036కు ఒకరు టెండర్ వేయగా, ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. తక్కువకు టెండర్ వేసిన సంస్థకు కాకుండా రెండో స్థానంలో ఉన్న సంస్థకు టెండర్ పనులను అప్పగించేందుకు ఇంజనీరింగ్ అధికారి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ టెండర్‌ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్‌కు చెప్పినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీఎంఆర్డీఏలో బరితెగిస్తున్న అధికారులుసింగిల్ టెండర్.. అయినా ఓకే..! సిరిపురం జంక్షన్లో వీఎంఆర్డీఏ నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1,33,48,537కు టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్లో పాల్గొనేందుకు పలువురు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. అయితే, ఈ ఇంజినీరింగ్ అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి, జనసేనకు చెందిన ఒక మహిళా నేతకు ఈ పనులు అప్పగించేందుకు ఒక కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి టెండర్లో పాల్గొనవద్దని చెప్పినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్‌కు ఇప్పటికే వీఎంఆర్డీఏలో రూ. కోటి వరకు బిల్లు పెండింగ్‌లో ఉండగా, ఆ బిల్లు కావాలంటే ఈ టెండర్‌కు దూరంగా ఉండాలని బెదిరించినట్లు సిబ్బంది అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయలేదు. ఈ నెల 8వ తేదీతో టెండర్ సమర్పణకు గడువు ముగిసింది. ఆశ్చర్యకరంగా, కేవలం ఒకరు మాత్రమే బిడ్ వేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్‌ను తిరస్కరించాల్సి ఉండగా, సదరు ఇంజనీరింగ్ అధికారి మాత్రం ఆ సింగిల్ టెండర్దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
మూడుముక్కలాట
● జీవీఎంసీలో తారాస్థాయికి కూటమి రాజకీయం ● టీడీపీ, జనసేన అధిష్టానం దృష్టికి పంచాయితీ ● తమకే ఇవ్వాలంటూపట్టుబడుతున్న జనసేన ● ససేమిరా అంటున్న టీడీపీ ● ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్న డిప్యూటీ మేయర్ పదవిడాబాగార్డెన్స్: జీవీఎంసీలో కూటమి రాజకీయం తారాస్థాయికి చేరింది. అవిశ్వాసం ద్వారా గత మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌లను పదవుల నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత మేయర్‌ను తొలగించి, తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్‌ను కూటమి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాజాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయానికి వస్తే, కూటమిలో విభేదాలు మొదలయ్యా యి. మేయర్ పదవిని తీసుకున్నందున, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ వివాదం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల దృష్టికి చేరింది. తమకంటే తమకు కావాలంటూ.. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకున్నందున, పొత్తులో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ కార్పొరేటర్లు, పెద్దలు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పార్టీ అధినేతకు బహిరంగంగా లేఖ పంపారు. దీంతో కూటమి రాజకీయం వేడెక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవి తమకు కావాలని జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, జనసేన పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన పెద్దిరెడ్డి ఉష, వంశీరెడ్డి, మాసిపోగు మేరీజోన్స్, ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలో చేరిన మహ్మద్ సాదిక్, కందుల నాగరాజుతో పాటు ఆ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. తాడోపేడో.. డిప్యూటీ మేయర్ ఒక్క పోస్టు కోసం రెండు పార్టీలు పట్టువిడవకుండా ఉన్నాయి. ఈ విషయంలో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబడుతుండగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోస్టును వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఈ నెల 19న ఎన్నిక జరగనుంది. మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడంతో, డిప్యూటీ మేయర్ తమకు కేటాయించాలని జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజీనామా చేస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ శుక్రవారం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపడంపై కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అంత సీన్ లేదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్‌కే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలంటూ సాక్షాత్తు నూతనంగా ఎన్నికై న మేయరే అధిష్టానానికి లేఖ పంపినట్టు భోగట్టా. వీరిద్దరి మధ్య నేను అర్హురాలినేనంటూ బీజేపీ కార్పొరేటర్ కూడా రేస్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కూటమిలో అంతర్గత తగాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ కుమ్ములాటలే నిదర్శనం. నువ్వా..నేనా? డిప్యూటీ మేయర్ పదవిపై పార్టీల అధినాయకులు తేల్చకపోవడంతో ఇరు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య పెరిగింది. టీడీపీలో 10 మంది వరకు ఈ పదవి కోసం పోటీ పడతుండగా, జనసేనలో ఉన్న వారంతా (ఒక్క మూర్తి యాదవ్ తప్ప..ఎందుకంటే మూర్తి యాదవే తనను మినహాయించి ఎవరికై నా ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు) రేసులో ఉన్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వారు సీనియర్ల ద్వారా అధినాయకుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల నుంచి ఇద్దరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలని ఆ పార్టీలో పలువురు కార్పొరేటర్లు భావిస్తూ..ఆ పేరు ప్రతిపాదించినట్టు సమాచారం. ఇక జనసేన విషయానికొస్తే..ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మేయర్‌గా టీడీపీ నేత ఉండడంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ పదవిని జనసేన వదులుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన నుంచి ఎందరో ఆశావాహులున్నా..ఎమ్మెల్యేలు మాత్రం ఉషశ్రీ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కూటమిలో డిప్యూటీ మేయర్ పదవి పెద్ద రాద్ధాంతం చేస్తోంది. -
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’థీమ్‌తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న యోగాసనాల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యోగా అభ్యాసకులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, డిఫెన్స్ స్టాఫ్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, క్రీడాకారులు, ఇతర సంస్థల కార్యకర్తలు సహా సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యం కానున్నారు.ఇందుకోసం జిల్లా యంత్రాంగం 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోటా 3 నుంచి 4 వేల మంది యోగాసనాలు వేసేలా అనువైన మైదానాలను గుర్తిస్తున్నారు. ప్రధానితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు స్థానిక ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు వారాల పాటు యోగా దినోత్సవంపై ప్రచారం చేస్తారు. జూన్ 5 నుంచి వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ, 17 నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరినీ ప్రధాని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. -
లారీని ఢీకొని ఆటోడ్రైవర్ దుర్మరణం
పీఎంపాలెం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూరగాయలు రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ బాలకృష్ణ వెల్లడించిన వివరాలివి. ఆనందపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బంగారు రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున ఆనందపురం కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలను తన ఆటోలో వేసుకుని నగరంలోని పెదవాల్తేరుకు బయలుదేరాడు. తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో ఎండాడ కూడలికి సమీపంలోని వరాహగిరి కాలనీ ఎదురుగా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రమణ నడుపుతున్న ఆటో ముందు అతివేగంగా వెళుతున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఊహించని ఈ పరిణామానికి రమణ తన ఆటోను అదుపు చేయలేక లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న నరసింగరావు అనే వ్యక్తి స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. -
నైపుణ్యతకు మెరుగు!
ఆర్ట్ శిక్షణ పొందుతున్న మహిళలుక్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న మహిళలుఉపాధి కోసం.. నా డిగ్రీ చదువు అనివార్య కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. నాకు ముగ్గురు పిల్లలు. క్రాఫ్ట్‌లో ఇప్పటికే లోయర్, హయ్యర్ కంప్లీట్ చేశాను. టీటీసీ పూర్తి చేస్తే ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నేను నేర్చుకున్న విద్యలో మరింత నైపుణ్యత పొందుతూ.. ఇంటి వద్ద మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాను. – కర్రి చంద్రిక, గవరపాలెం, అనకాపల్లి జిల్లా విశాఖ విద్య: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తూనే.. సత్వర ఉపాధి లక్ష్యంగా నైపుణ్యతతో కూడిన స్వల్పకాలిక టెక్నికల్ కోర్సుల వైపు ఆసక్తి కనబరుస్తోంది. ఇటువంటివారి కోసం విద్యాశాఖ ఏటా వేసవిలో ‘టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్’(టీటీసీ) కోర్సులను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. 42 రోజుల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 42 ఏళ్ల వరకు వయస్సు గల వారు అర్హులు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కోర్సులను అభ్యసించేందుకు 180 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం నగరంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ హైస్కూల్లో ప్రత్యేక క్యాంప్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఎన్ఈపీ అమలుతో టీటీసీకి డిమాండ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అడ్మిషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. జాతీయ విద్యావిధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆర్ట్, క్రాఫ్ట్ సబ్జెక్టు టీచర్లను నియమించాలనే నిబంధన పెట్టారు. టీటీసీ కోర్సు చేసిన వారు మాత్రమే ఆయా పోస్టులకు అర్హులు కావటంతో డిమాండ్ పెరిగింది. మానసిక, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే అంశాలతో కూడిన సబ్జెక్టులు కావటంతో వచ్చే ఏడాది నుంచి కోర్సు వ్యవధి 42 రోజులకు బదులుగా 6 నెలలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఉత్తమశిక్షణ ఈనెల ఒకటో తేదీన ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ 11వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఆరుగురు టీచర్లు.. సైకాలజీ, స్కూల్ అడ్మిస్ట్రేషన్ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు మరో ఇద్దరు టీచర్లను నియమించారు. వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నైపుణ్యతతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. స్వయం ఉపాధి వైపు అడుగు టీటీసీ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ఆర్ట్, క్రాఫ్ట్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు వేసవిలో 42 రోజుల పాటు శిక్షణా తరగతులు బొమ్మలు వేయడం ఇష్టం నేను బీటెక్ కంప్యూటర్ సైన్సు పూర్తి చేశాను. ఎంటెక్‌లో చేరేందుకు ఎంట్రన్స్ రాస్తున్నాను. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టం. నాన్న ప్రోత్సాహంతో ఆర్ట్‌లో శిక్షణ పొందుతున్నాను. ఆర్ట్ కోర్సులో లోయర్, హయ్యర్ ఇప్పటికే పూర్తి చేశాను. మరింత నైపుణ్యత పొందేందుకు టీటీసీ శిక్షణ ఉపయోగపడుతుంది. –ఎం.పీ.శ్లేఘన, సుజాతనగర్, విశాఖ జిల్లా -
జీవీఎంసీ ఆర్పీ ఆత్మహత్య
అల్లిపురం: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 34వ వార్డులో ఆర్పీగా పని చేస్తున్న సాయి(29), గండిబోయిన సతీష్ తొమ్మిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. సతీష్ పూర్ణామార్కెట్‌లో ఒక దుకాణంలో పని చేస్తున్నాడు. అతను జనసేన కార్యకర్త. వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్లో మాట్లాడిన ఆమె గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా? భర్త జనసేన కార్యకర్త -
నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ అన్నారు. ఇటీవల డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. డిస్కమ్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రస్తుతం డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు సూర్యప్రకాష్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు వెల్లడించారు. సర్కిళ్ల వారీగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సరఫరాలో లోపాలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ మూడు ఫేజుల విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ కోటా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, రోజూ 18 నుంచి 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. గాలి, వర్షాల కారణంగా వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు మినహా, మిగతా సమయాల్లో ఈపీడీసీఎల్ పరిధిలో అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉన్నందున.. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రతి లైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుతున్నామని.. వర్షాకాలంలో సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తామని సూర్యప్రకాష్ వివరించారు. ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ -
కూటమి మాస్టర్ ప్లాన్
● ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ● ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట ● వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ ● నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను, అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్‌కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్‌లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్– 2041లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. -
రెగ్యులర్ vs ఎయిడెడ్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు మళ్లీ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్సిటీలోని కొంతమంది ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి, పాలనలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసుపై ఏయూకు వచ్చిన అధ్యాపకుల పట్ల వర్సిటీలోని ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. 1000 మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం 140 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే కాలేజీల్లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను వినియోగించుకోవాల్సింది పోయి.. తామేదో పరాయి దేశం నుంచి వచ్చినట్లుగా, వెళ్లిపోండంటూ కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎయిడెడ్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. క్యాంపస్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లతో మంగళవారం జరిగిన వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఓ వర్గం ఇదే అంశంపై పట్టుబట్టడం.. ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో మల్లగుల్లాలు ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నందున ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఇందుకు అనుమతించారు. కాగా.. ఎయిడెడ్ అధ్యాపకుల రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నచ్చక దాదాపు 40 మంది వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృ సంస్థకు వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. క్యాంపస్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో తరగతుల నిర్వహణలో వీరంతా కీలకంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాలని ఓ వర్గం పట్టు వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఇదే చర్చ పాఠాలు పక్కన పెట్టి.. పెత్తనంపై ఆరాటం ఏయూలో అధ్యాపకుల తీరుపై విమర్శలు తెరపైకి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేలా ఓ వర్గం ఒత్తిడిచేస్తూనే ఉంది. కానీ ఫారిన్ సర్వీసుపై వచ్చినందున 2026 జూన్ వరకు వారికి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. వర్సిటీనే వేతనాలు చెల్లిస్తున్నందున, వారి సేవలను కొనసాగించాలనుకుంటున్నారా? లేదా? అంటూ మార్చిలో హయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఇక్కడి అధికారులకు లేఖ రాశారు. వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని వర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన వర్సిటీలోని ఓ వర్గం ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాల్సిందేనని ప్రస్తుత వైస్ చాన్సలర్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఖాళీల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? రాష్ట్రంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో టీచింగ్ 10 మంది, నాన్ టీచింగ్ 20 మంది అవసరం ఉందని, ఆన్ డ్యూటీ బేసిస్/ఫారిన్ సర్వీసు కింద పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చే విషయమేనని ఏయూలో ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు అంటున్నారు. అయితే ఆయా యూనివర్సిటీలు 2025–26 విద్యా సంవత్సరానికి తమ అవసరాల మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం బట్టి, ఇప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఆలోచనలో లేదని అర్థమవుతోంది. -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్ష మహారాణిపేట: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. జూన్ 21న ఉదయం 6 నుంచి 8 మధ్య 45 నిమిషాలు పాటు కార్యక్రమం జరగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నిర్దేశించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా ఏయూ కన్వెన్షన్ హాలు, మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్ లేదా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రధాన వేదికల వద్ద భాగస్వామ్యం అయ్యే వారికి ముందస్తు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ప్రత్యేకాధికారులు సత్తిబాబు, సుధాసాగర్, శేషశైలజ, మధుసూదన్ రావు, డీఈవో ప్రేమకుమార్, ఆర్ఐవో, ఇతర విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
మహారాణిపేట: గ్రీన్ విశాఖ మిషన్‌లో భాగంగా జిల్లాలో పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీఎంఆర్డీఏ ద్వారా లక్ష మొక్కలు, జీవీఎంసీ 2.50 లక్షలు, అటవీ శాఖ 84 వేలు, డూమా 60 వేలు, పరిశ్రమల శాఖ 50 వేలు, విశాఖ పోర్టు 25 వేలు, విద్యాశాఖ 12 వేలు, ఇతర శాఖల ద్వారా 4.28 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6 నుంచి వివిధ దశల్లో ఈ మొక్కల్ని నాటేలా ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డూమా పీడీ ఆర్.పూర్ణిమాదేవి, డీఎఫ్‌వో మంగమ్మ, జీవీఎంసి హార్టికల్చర్ డీడీ దామోదర్, వీఎంఆర్డీఏ డీఎఫ్‌వో శివాని, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, పోర్టు హార్టికల్చర్ అధికారి రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలందిస్తామని సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. ఇటీవలే డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. డిస్కమ్ పరిధిలోని పలు సర్కిళ్లలో పర్యటించి, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లోని అన్ని విభాగాల్లో 37 ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం తనకుందన్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్‌లో జరుగుతున్న పనులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానని, చేపట్టిన పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగర పరిధిలో రెండో దశలో భాగంగా రూ.909 కోట్ల వ్యయంతో 1,876 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 120 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్‌ఎంఈఎస్, డీటీఆర్స్ మొదలైన వాటిపై కసరత్తు జరుగుతోందని, ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే తవ్వకాల కోసం జీవీఎంసీ నుంచి అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్‌ల కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విభజన పనులపై సమీక్ష నిర్వహించామని, ఫీడర్ బైఫరకేషన్ పనుల్లో ప్యాకేజీ–1 గత నెలాఖరు చివరి నాటికి 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇండోర్, అవుట్డోర్ సబ్స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. ముందుగానే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం జుగా’(ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద ఎస్టీ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ వనజ వివరించారు. ఆగస్ట్ 15 నాటికి రెండో దశ భూగర్భ విద్యుత్ వ్యవస్థ పూర్తి చేస్తాం ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వనజ -
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన ఈ అదాలత్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నిరాధరణకు గురైన చెక్కులు కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశాఖలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్‌లో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో, మండల న్యాయ సేవా సంఘాల్లో సంప్రదించాలన్నారు. -
ఏపీకి బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది. నిన్న శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
అంకితభావంతో ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహించాలి
మహారాణిపేట: ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై బుధవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కులు, బస్, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో ఈ నెల మూడో శనివారం స్వచ్ఛందంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. వేసవిలో వడగాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా, పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్మికులు, వీధి వ్యాపారులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. టెర్రస్ గార్డెనింగ్, తడిపొడి చెత్త నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో సీఎంవో నరేష్కుమార్, డిపివో శ్రీనివాసరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
మశకం వేటకుహైటెక్ ప్లాన్
డాబాగార్డెన్స్: దోమ చిన్నదే.. అది కుడితే ప్రాణాలే పోతున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గతంలో వర్షాలు మొదలు కాగానే దోమలు విజృంభించేవి. కానీ ఇప్పుడు ఏడాదంతా దాడి చేస్తున్నాయి. రాత్రయితే దోమల మోత మోగుతోంది. నగరంలో దోమల బెడద తీవ్రం కావడంతో పౌరులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో దోమల నియంత్రణకు సంప్రదాయ పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఆధారిత ‘మస్కి టో’ అనే సంస్థ అభివృద్ధి చేసిన మస్కిటో ట్రాప్ మెషీన్లను నగరంలో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ యంత్రాల పనితీరును అధ్యయనం చేసేందుకు జీవీఎంసీ అధికారుల బృందం తిరువనంతపురం, హైదరాబాద్‌లలో పర్యటించనుంది. అక్కడి అనుభవాలను, యంత్రాల పనితీరును విశ్లేషించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనుంది. జోన్–4, జోన్–5లో పైలట్ ప్రాజెక్టు? తిరువనంతపురం, హైదరాబాద్‌లలో ఈ యంత్రాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే విశాఖలోను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా జోన్–4, జోన్–5లలో సుమారు 120 మస్కిటో ట్రాప్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని సంబంధిత సంస్థ నివేదికలో పేర్కొంది. మరోవైపు దోమల నియంత్రణలో భాగంగా జీవీఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఈ డ్రైవ్ కోసం కాంట్రాక్టు పద్ధతిలో 400 మంది సిబ్బందిని నియమించి.. వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. దోమల వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై వీరు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సాంకేతికతతో నియంత్రణ సాంకేతికత సాయంతో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. మస్కిటో ట్రాప్ మెషీన్ల ద్వారా దోమల నివారణతో పాటు ఏ ప్రాంతాల్లో ఎటువంటి వ్యాధికారక దోమలు ఉన్నాయో గుర్తించడం సులభతరం అవుతుంది. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టవచ్చు. అధికారుల అధ్యయనం అనంతరం ఈ ప్రాజెక్టుపై కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. –డాక్టర్ నరేష్కుమార్, ప్రధాన వైద్యాధికారి, జీవీఎంసీ సాంకేతిక పరిజ్ఞానంతో దోమల నియంత్రణకు చర్యలు సన్నద్ధమవుతున్న జీవీఎంసీ ‘మస్కిటో’ కంపెనీతో ఒప్పందానికి ఆలోచన ఎలా పనిచేస్తుందంటే.? దోమలు మనుషుల శ్వాస, వాసనలు పసిగట్టి కుడతాయి. ఇదే సిద్ధాంతంతో ఈ ట్రాపర్ మిషన్ పనిచేస్తుంది. ఈ అత్యాధునిక యంత్రాలు మనుషుల శ్వాస, శరీర ఉష్ణోగ్రత, వాసనలను అనుకరించడం ద్వారా దోమలను ఆకర్షిస్తాయి. యూవీ కిరణాలు, కార్బన్ డయాకై ్సడ్ విడుదల, 39–40 డిగ్రీల ఉష్ణోగ్రతతో సుమారు 500 మీటర్ల దూరం వరకు దోమలను వలలోకి రప్పిస్తాయి. అలా యంత్రంలో చిక్కిన దోమలు లోపల ఉన్న ఫ్యాన్ గాలికి ఎయిర్బ్యాగ్లోకి వెళ్లి చనిపోతాయి. ఫలితంగా నగరంలో ఏయే ప్రాంతాల్లో దోమలు అధికంగా ఉన్నాయి? ఏ రకం దోమల వల్ల ఎలాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇవి ‘క్యాచ్(పట్టుకోవడం), కౌంట్(లెక్కించడం), క్లాసిఫై(వర్గీకరించడం)’అనే మూడు ప్రధాన పనులు చేస్తాయి. యంత్రాల్లో ఉపయోగించే సువాసనతో కూడిన ద్రవాలు, సెన్సర్ల సాయంతో దోమలను ఆకర్షించి, వాటిని వర్గీకరించి వ్యాధి కారక దోమల వ్యాప్తి ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడతాయి. -
విశాఖ గడ్డ
దోపిడీదారుల అడ్డా.. కూటమి ప్రభుత్వంలో క్రైమ్ క్యాపిటల్‌గా మారిన జిల్లా ● నగరంలో వరుస దారి దోపిడీ ఘటనలు ● పట్టపగలే ప్రజలు,పర్యాటకులపై కర్రలు, కత్తులతో దాడులు ● ఐదు నెలల్లో ఆరు ఘటనలతో భయాందోళనలో ప్రజలు ● అడ్డూ అదుపు లేకుండా దొంగతనాలతో బెంబేలు విశాఖ సిటీ: ● బీచ్ రోడ్డులో దోపిడీ దొంగలు ఇద్దరు పర్యాటకులపై బీరు సీసాలతో దాడి చేశారు. వారి నుంచి నగదు, సెల్ఫోన్లు ఎత్తుపోయారు. ● పెందుర్తిలో జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో తెగబడ్డారు. రెండు చేతులు కోసి రూ.10 వేలు అపహరించుకుపోయారు. ● కంచరపాలెంలో ఆటోలో కూర్చున్న వ్యక్తిని బెదిరించి డబ్బు కాజేసి పరారయ్యారు. ఇలా.. దోపిడీదారులకు విశాఖ అడ్డాగా మారిపోయింది. ప్రశాంత నగరం కాస్తా.. క్రైమ్ క్యాపిటల్‌గా తయారవుతోంది. విజిబుల్ పోలీసింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీ నేరాలకు కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. నగరంలో వరుస దోపిడీ ఘటనలే ఇందుకు నిదర్శనం. గత ఐదు నెలల కాలంలో ఆరు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయాల్లోనే కాకుండా పట్టపగలు.. నగర నడిబొడ్డున కూడా దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కత్తులు, కర్రలతో బెదిరిస్తూ ప్రజలతో పాటు పర్యటకులను సైతం నిలువు దోపిడీ చేస్తున్నారు. నగరంలోనూ దోపిడీలు నగరంలో చోరీలు, రోడ్డు ప్రమాదాలు, అత్యల్పంగా హత్యా ఘటనలు సాధారణంగా జరిగేవి. కానీ దోపిడీ ఘటనలు ఏడాదికి ఒకటి, రెండు మాత్రమే చోటుచేసుకునేవి. అదీ కూడా శివారు నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దోపిడీ దొంగలు చేలరేగిపోతున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. నగరంలో కూడా పెట్రేగిపోతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కంచరపాలెంలో జరిగిన ఘటన నగరంలో పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కంచరపాలెంలో పద్మశ్రీ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద వి.జీవన్‌కుమార్ ఆటోలో కూర్చొని ఉండగా.. ఇద్దరు అగంతకులు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఒకరు సెల్‌ఫోన్ ఇవ్వమని బెదిరించగా.. మరొకరు జీవన్‌కుమార్ జేబులో ఉన్న రూ.1,700 బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సాంకేతికత ఆధారంగా దోపిడీకి పాల్పడిన కంచరపాలెంకు చెందిన రౌడీషీటర్ అయిన దమరసింగ్ మోహన్ కన్నాను అరెస్టు చేశారు. మరో వ్యక్తి జాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం నగరంలో జరిగిన ఈ దోపిడీ ఘటన పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది. దొంగతనాలకు అయితే అడ్డూ అదుపు లేకుండా పోయింది. కనిపించని విజిబుల్ పోలీసింగ్ శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో 24/7 నిఘా, విజిబుల్ పోలీసింగ్ కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైనట్లు ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. నగరంలో నేరాలు పెరిగిపోతున్నా.. పోలీసులు మాత్రం కేవలం ట్రాఫిక్ చలానాలు వేయడంలో బిజీగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత హడావుడిగా బృందాలు వేసి దర్యాప్తు చేయడం మినహా నేరాల నియంత్రణలో విఫలమవుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా కేసులను గోప్యంగా ఉంచుతుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దర్యాప్తు పేరుతో ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసు వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ కేసును ఛేదించిన తర్వాతే మాత్రమే మీడియా సమావేశాలు పెట్టి ఊదరగొట్టడం పరిపాటిగా మారింది. కేసు పరిష్కారం కాని పక్షంలో నేరం జరిగిందన్న విషయం కూడా తెలియకుండా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలకో దోపిడీ ఘటన స్టీల్‌ప్లాంట్‌లో 17 ఏళ్ల బాలుడు కూడా దారి దోపిడీకి పాల్పడడం గమనార్హం. గత నెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ర్యాపిడో బుక్ చేసిన బైక్ ఎక్కిన మైనర్.. మార్గంమధ్యలో రైడర్ కిషోర్‌ను కొట్టి రూ.48,100 లాక్కొని పరారయ్యాడు. పెందుర్తిలో ఫిబ్రవరి, మరో నెల వ్యవధిలో రెండు దారి దోపిడీలు జరిగాయి. 16వ తేదీన ఒక బాధితుడి నుంచి భారీగా నగదు, నగలు దోచుకున్నారు. అలాగే అంతకుముందు తెల్లవారుజామున 4.30 గంటలకు జీవీఎంసీ పంప్ ఆపరేటర్‌పై కత్తులతో దాడి చేసి, చేతులు కోసేసి రూ.10 వేలు కాజేశారు. గతేడాది చివరలో బీచ్ రోడ్డులో పర్యాటకులపై దోపిడీదారులు బీరు సీసాలతో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అంతకుముందే పాత డైరీ ఫారంలో జాతీయ రహదారిపైన రెండు దోపిడీ ఘటనలు చోటుచేసుకున్నాయి. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్‌పై కన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్‌కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్‌ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్‌పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్‌లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్‌కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్‌తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్‌కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్‌కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్‌కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కూటమిప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్‌కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. -
సాహితీ కృషీవలుడు ‘కొమర్రాజు’
విశాఖ విద్య : తెలుగు జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణరావు అని కేంద్ర ప్రభుత్వ హిందీ సలహా మండలి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సాహితీ కృషీవలుడని కొనియాడారు. కొమర్రాజు జీవిత సాహిత్య కృషిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య వెలమల సిమ్మన్న, విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు డా.గుమ్మా సాంబశివరావు రచించిన ‘విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావు’ గ్రంథాన్ని యార్లగడ్డ ఆవిష్కరించారు. ఏయూలోని హిందీ భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి అపూర్వమైన కానుకలను అందించిన ఆ మహనీయుడి ఘనత ఈ తరానికి తెలియజేసేందుకు సిమ్మన్న, సాంబశివరావు అమూల్యమైన గ్రంథం రచించారని కొనియాడారు. -
వేలి ముద్రలే పట్టించాయి..
విశాల విశాఖపట్నం.. పేరుకు తగినట్లుగానే సుందర దృశ్యాల సమాహారం. ఒకవైపు అనంతమైన సాగరతీరం.. మరో వైపు గంభీరమైన పర్వత శ్రేణులు. వీటి నడుమ సువిశాలంగా విస్తరించిన మహా నగరం విశాఖ. ప్రపంచంలోనే ఇలాంటి అపురూప భౌగోళిక స్వరూపం కలిగిన నగరాలు చాలా తక్కువ. అందుకే ఇక్కడ జీవించడానికి ఎంతో మంది మక్కువ చూపుతారు. ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ.. నేడు బహుముఖాభివృద్ధి సాధించి మహా నగరంగా రూపాంతరం చెందింది. వివిధ రంగాల్లో దూసుకుపోతూ నగరం తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. పర్యాటకులకు ఇది స్వర్గధామం అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి విశాఖ నగరాన్ని ఆకాశం నుంచి వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. మబ్బుల పొరల మాటు నుంచి నగరాన్ని చూస్తే దాని సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. యారాడ కొండలు, పోర్టు ప్రాంతం, పాత నగరాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఎంవీపీకాలనీ: ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్‌లో ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ (26)ను ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం క్రైం ఏడీసీపీ మోహనరావు ఈ కేసు వివరాలు వెల్లడించారు. మార్చి ఒకటో తేదీ ఉదయం రాధా మాధవ్ టవర్స్ ఫ్లాట్ నంబర్ 2లో నివాసం ఉంటున్న మరకాని రామకృష్ణ తన అమ్మమ్మ వర్ధంతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయం అదే అపార్ట్మెంట్లో ఉంటున్న శ్రావణి అతనికి ఫోన్ చేసి.. మీ ఇంటి తాళం పగలగొట్టి ఉంది అని సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఆయన విశాఖ వచ్చి ఇంటిని పరిశీలించగా.. 23 తులాల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాను దొంగ బెడ్‌పై పడుకోబెట్టి తాళాలు పగలగొట్టి నగదు, బంగారం చోరీ చేశాడు. వెంటనే రామకృష్ణ ద్వారకా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావు బృందం ఘటన ప్రాంతాన్ని పరిశీలించింది. ఫింగర్ ప్రింట్స్ విభాగం ద్వారా వేలిముద్రలను సేకరించి పరిశీలనకు పంపించగా.. తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ వేలిముద్రలతో సరిపోయినట్లు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సమాచారం అందించింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా క్రైం ఎస్ఐ రాజు, ఏఎస్ఐ కిశోర్‌బాబు ఇతర సిబ్బంది బృందాలుగా విడిపోయి హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అతని నివాస ప్రాంతాల్లో దర్యాప్తు చేసి రామకృష్ణ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నంబర్లు, వివరాలు సేకరించారు. దీంతో నిందితుడు విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు. ద్వారకా క్రైం పోలీసులు, ఆరిలోవ క్రైం ఎస్ఐ రామకృష్ణ బృందం నిందితుడు రామకృష్ణను మద్దిలపాలెం వద్ద మంగళవారం అరెస్ట్ చేసింది. విశాఖలో తొలిసారి దొంగతనంకాగా.. రామకృష్ణ మేనల్లుడు అశోక్, అక్క భాగ్యమ్మలను హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు ఈ నెల 6న వేరే కేసులో అరెస్ట్ చేసి వారి ఇంట్లో తనిఖీలు చేయగా రూ.3,40,000, 77 గ్రాముల బంగారు వస్తువులు లభించాయి. అశోక్‌ను విచారించగాా.. తన మేనమామ రామకృష్ణ విశాఖలో చేసిన దొంగతనానికి సంబంధించినవిగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా మరికొన్ని బంగారు నగలను పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు ద్వారకా క్రైం పోలీసుల విచారణలో రామకృష్ణ తెలిపాడు. రామకృష్ణను పట్టుకున్న సమయంలో అతని వద్ద నుంచి రూ.10 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.3.40 లక్షలు, 77 గ్రాముల బంగారంతో పాటు రామకృష్ణ వద్ద దొరికిన రూ.10 వేలను కలిపి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదు, బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని ఏడీసీపీ తెలిపారు. రామకృష్ణపై 90 వరకు పాత కేసులు ఉన్నా యి. అందులో 77 దొంగతనం కేసులున్నట్లు ఏడీసీపీ వివరించారు. విశాఖలో తొలిసారి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ద్వారకా క్రైం ఎస్ఐ రాజు, ఏఎస్ఐ డి.కిశోర్‌బాబు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, రాజు, అప్పలరాజు, అగస్టీన్, జగత్ కిరణ్‌లను ఏడీసీపీ మోహనరావు, ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్‌రావు అభినందించారు. గ‘ఘన’ విశాఖ ఘరానా దొంగ అరెస్ట్ నిందితుడు తెలంగాణకు చెందిన పాత నేరస్తుడు 90 వరకు కేసుల నమోదు అందులో 77 దొంగతనం కేసులే.. ద్వారకానగర్ రాధామాధవ్ టవర్స్ కేసును ఛేదించిన పోలీసులు -
ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం
సీతంపేట: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష)ను ఒకే రోజు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా డీఎస్సీలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు, విధానాలు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని వాపోతున్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్‌లో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసినప్పటికీ.. 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కేవలం 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 50 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ వస్తుందని ఆశించిన వారికి ఇది శరాఘాతంగా మారింది. సమాన అవకాశాలకు విఘాతం ప్రభుత్వం తాజాగా డీఎస్సీ పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రకటించడం అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొంటున్నారు. నెల రోజుల పాటు జరిగే పరీక్షల్లో ప్రతి రోజూ వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఉంటాయని.. దీని వల్ల ఏ రోజు పేపర్ కష్టంగా వస్తుందో.. ఏ రోజు సులువుగా వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. కష్టమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మొదటి రోజుల్లో పరీక్ష రాసే అభ్యర్థులు తదుపరి రోజుల్లో ప్రిపరేషన్‌కు సమయం కోల్పోతారని, ఇది సమాన అవకాశాలకు విఘాతమని వాపోతున్నారు. గతంలో మాదిరిగా రాష్ట్రమంతటా ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రంతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రమంతా ఒకే రోజు డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థుల డిమాండ్ నెల రోజులు నిర్వహిస్తే ప్రిపరేషన్సమయాన్ని కోల్పోతామని ఆవేదన స్పెషల్ డీఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేయాలని డిమాండ్ వయో పరిమితి పెంచాలి గత ఏడేళ్లుగా డీఎస్సీ నియామకాలు లేకపోవడంతో వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా చెవిటి, మూగ, అంధ విద్యార్థులకు బోధించే 2,600 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో చేర్చకపోవడంపై స్పెషల్ బీఈడీ, డైట్ చదివిన లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ నూతన డీఎస్సీ విధానాలు, నిబంధనలు తమ ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని.. ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని, వయోపరిమితిని పెంచాలని, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
కూటమి నేతల అండతో యథేచ్ఛగా ఇసుక దందా!
తగరపువలస: అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న నాలుగు లారీలను బుధవారం జిల్లా క్వారీ, లారీ యజమానుల సంఘంతో పాటు స్థానిక లారీ సంఘాల యజమానులు చెరకుపల్లి వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నారాయణపురం ఇసుక రీచ్ నుంచి 35 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలపై 70 నుంచి 80 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నట్టు గుర్తించిన జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు మద్దిల వెంకటరమణ, మిగిలిన యజమానులతో కలిసి ఉదయం 4 గంటల నుంచి కాపు కాశారు. ఉదయం 6 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్తున్న మూడు లారీలను అడ్డుకున్నారు. వాటి సిబ్బంది మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర పేర్లు చెప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా కదలనీయలేదు. తగరపువలస ఫ్లై ఓవర్ వద్ద మరొక లారీని కూడా నిలిపివేశారు. సుమారు 10 గంటల సమయంలో భీమిలి పోలీసులు వచ్చి బేషరతుగా లారీలను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మద్దిల వెంకటరమణను బెదిరించినట్టు తెలిసింది. తన ఇసుక లారీలను అడ్డుకుంటే ఎఫ్ఐఆర్ వేయిస్తామని హెచ్చరించినట్టు సమాచారం. అనంతరం స్థానిక లారీ యజమానులు మాట్లాడుతూ రెట్టింపు లోడుతో ఇసుకను రవాణా చేస్తున్నా.. రవాణా శాఖ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెట్టింపు లోడుతో వాహనాలకు ప్రమాదాలు జరిగితే ఇరు పార్టీలకు బీమా పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ సంస్థలు అంగీకరించవని చెప్పారు. లారీపై ఇసుకను పూర్తిగా కప్పివేయకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. అదనపు లోడు కారణంగా తరచూ టైర్లు ఒత్తిడికి గురై రన్నింగ్‌లో పేలిపోతుండటంతో వెనుక వచ్చే వాహనాలు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయన్నారు. అధిక లోడును పట్టించుకోకుండా ఉండేందుకు మూడు జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు నెలకు రూ.22 వేలు వంతున ఒక్కో లారీ యజమాని నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపించారు. ఇప్పుడు దౌర్జన్యంగా కూటమి నాయకుల అండతో ఇసుకను అధిక లోడుతో రవాణా చేస్తూ.. తమను నిలువునా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిగిలిన లారీ యజమానులతో సమావేశమై అధిక లోడుతో వచ్చే వాహనాలను ఇకపై కూడా అడ్డుకుంటామని లారీ యజమానులు బొట్ట సురేష్, కొయ్య శ్రీనివాసరెడ్డి, కర్రి రమణ, తుపాకుల సురేష్, వీడీఎం గిరి, మద్దిల శ్రీను హెచ్చరించారు. అధిక లోడుతో లారీల్లో దర్జాగా ఇసుక రవాణా మంత్రులు లోకేష్, రవీంద్ర పేర్లు చెప్పి వెళ్లేందుకు ప్రయత్నం రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, మామూళ్ల వసూళ్లపై ఆరోపణలు -
ఆహా.. ఆవకాయ
విశాఖపట్నం: వేడివేడి అన్నం ..ఆ తర్వాత స్వచ్ఛమైన నెయ్యి ..అందులో కాస్త ఆవకాయ ముక్కను కలుపుకొని తింటే... ఆహా! ఆ రుచిని వర్ణించలేం. మొదటి ముద్దతోనే నోరంతా పులకరించిపోతుంది. వేడి అన్నం, కమ్మటి నెయ్యి, ఘాటైన ఆవకాయ... ఈ మూడు రుచులు ఒకదానితో ఒకటి పోటీపడుతూ, నాలుకపై ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. ఒక్కో ముద్ద తింటుంటే కడుపు నిండిపోతున్నా, ఆ రుచి మాత్రం వదలాలనిపించదు. కళ్లల్లో ఒక విధమైన మెరుపు, పెదాలపై చిరునవ్వు అదే వస్తుంది. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ సీజన్ ఆరంభం అవుతుంది. మహిళలు ఏడాది అంతా తినడానికి సరిపోయే విధంగా ఆవకాయ పెడతారు. ఆవకాయ పెట్టడానికి ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరం. ఇటువంటి ఆవకాయ తయారీపై నగరంలో పోటీలు నిర్వహించారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో రెడ్ ఎఫ్ఎం, త్రీ మేంగోస్ స్పైసెస్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందమందికిపైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవపొడి, కారం, ఉప్పు, నూనె సమపాళ్లలో కలిపి నోరూరించే ఆవకాయను క్షణాలలో సిద్ధం చేశారు. యువతుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని, ఆవకాయ ఘాటును రుచిచూపించారు. ఆవకాయ తయారు చేసిన మహిళలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఆర్జేలు ప్రదీప్, కృష్ణ, షర్మిల, భావన, మధు కార్తీక్‌లతో పాటు ప్రోగ్రామింగ్ హెడ్ సుష్మ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో మాయా లోకం
విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది.మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ‘వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది.రూ.470 కోట్లతో హేబిటేట్ సెంటర్ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్’ను నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో ఐటీ స్పేస్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, ఆడిటోరియం, సెమినార్ హాల్, పార్టీ ఈవెంట్స్ లాన్లతో పాటు ట్రేడ్ ఫెయిర్లు, ఆర్ట్, కల్చర్ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్ హౌస్, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్ యాంఫీ థియేటర్, 400 మంది పట్టేలా కేఫ్టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డ్రైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్, 250 మందికి సరిపడా ఈవెంట్ లాన్, సూపర్ మార్కెట్, మెడికల్, స్పోర్ట్స్ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.2.82 ఎకరాల్లో వర్చువల్ ఎరీనావిశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.గేమింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్ టైమ్ ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్ రెస్టారెంట్ అవుట్లెట్లు, 10 శాతం కమర్షియల్ అవుట్లెట్లతో పాటు 100 రూమ్‌లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్ హాల్‌తో త్రీ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు.ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా..పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్ హేబిటేట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్ఎఫ్పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి. –కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ -
విపత్తు వేళ ఎలా స్పందించాలంటే..
జాలరిపేటలో సివిల్ మాక్ డ్రిల్ ఎంవీపీకాలనీ: విపత్తుల వేళ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ పనితీరును ట్రాఫిక్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. జాలరిపేటలో జరిగిన మాక్ డ్రిల్‌లో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం, ఉగ్రదాడుల వంటి ఘటనల్లో ప్రజలు, యంత్రాంగం ఎలా స్పందించాలో చూపించారు. పొగ బాంబులు పేలినప్పుడు మంటలార్పడం, క్షతగాత్రులను తరలించడం, పోలీసుల సూచనలు పాటించడం, విద్యుత్ నిలిపివేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. -
థియేటర్లలో నవ్వులే నవ్వులు
● సింగిల్.. అలరించే కామెడీ ఎంటర్టైనర్ ● విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్ డాబాగార్డెన్స్ : యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి దర్శకుడు కార్తీక్‌రాజు ప్రేక్షకులను నవ్వించారని, ముఖ్యంగా సెకండాఫ్‌లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని వారు కొనియాడారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
అక్కిరెడ్డిపాలెం: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసి ఏడేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాజువాక గణపతినగర్‌లో నివాసం ఉంటున్న కె. భాస్కర్ (35)కు అదే ప్రాంతానికి చెందిన సత్తెమ్మతో 2015 నుంచి వివాహేతర సంబంధం కొనసాగించాడు. మనస్పర్థలు కారణంగా భాస్కర్ 2017లో సత్తెమ్మను హత్య చేసి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌కు పారిపోయాడు. నిందితుడి కోసం అప్పటి సీపీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మంగళవారం నిందితుడిని కల్వకుర్తిలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
భారీగా గంజాయి స్వాధీనం
అల్లిపురం: గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆనందపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, ఒక బొలేరో వాహనం, ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు, సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి బోయపాలెం, పైడా కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన గంజాయి స్మగ్లర్లు బొలేరో వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో 200 కేజీల గంజాయి లభ్యమైంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువ పంచాయతీ జమ్ముగూడ గ్రామం నుంచి గంజాయి సేకరించి విశాఖలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రఘు హంతల్, నరేంద్ర పాంగీ, బినాయ్ మండల్ , రబీంద్ర కిలాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. నలుగురి అరెస్టు -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 31 కోట్లు కేటాయించామని, ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టనున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మురుగునీటి సమస్య పరిష్కారానికి ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో ఇంకుడు గుంతకు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని ఆమె వివరించారు. సమావేశంలో సామాజిక పింఛన్లు, గ్రామీణాభివృద్ధి పనులపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని, 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సభ్యులు కోరారు. దీనిపై చైర్పర్సన్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మధ్యతరగతి వారి కోసం..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో ఎంఐజీ అపార్ట్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాం. ప్రస్తుతం నివాస ప్రాంతాలుగా మంచి డిమాండ్ ఉన్న మధురవాడ, వేపగుంటలో ఉన్న వీఎంఆర్డీఏ స్థలాల్లోనే ఈ అపార్ట్మెంట్లను నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. ప్రజల సూచనలు, సలహాలతోపాటు వారి అభిరుచులకు తగ్గట్లుగా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం. మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లను అందించాలన్న సంకల్పంతో ఉన్నాం. – కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ ● -
షిప్‌యార్డ్ పురోగతిపై ప్రశంసలు
సింథియా : హిందుస్థాన్ షిప్‌యార్డ్ చేపట్టిన ‘గ్రీన్ అండ్ గ్రోత్ ఫోకస్డ్ ఇనిషియేటివ్స్’ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ అభినందించారు. షిప్‌యార్డ్ అభివృద్ధిని ఆయన సమీక్షించారు. కొత్త ఆవిష్కరణలు, దేశాభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. షిప్‌యార్డ్ 84 ఏళ్ల చరిత్రను, వాణిజ్య నౌకల నిర్మాణంలో సంస్థ సహకారాన్ని చైర్మన్ హేమంత్ ఖత్రి కార్యదర్శికి వివరించారు. గ్రీన్ టగ్‌లు, హైడ్రోజన్ నౌకల అభివృద్ధి ప్రణాళికలు తెలిపారు. గ్రీన్ టెక్నాలజీకి మద్దతుగా బ్యాటరీ టగ్‌ల వ్యయం అంచనా వేయాలని రామచంద్రన్ సూచించారు. పెట్రోలియం శాఖ అవసరమైన నౌకల నిర్మాణానికి షిప్‌యార్డ్ సిద్ధంగా ఉందని ఖత్రి పేర్కొన్నారు. కొత్త డ్రై డాక్‌లు, స్లిప్వేలతో షిప్‌యార్డ్ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు. -
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందన విక్రయాలను మంగళవారం నుంచి ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ రూ.10 చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్‌ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి కొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. -
పీపీపీ పేరుతో కాజేసే కుట్ర
ఒకవైపు సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టులపై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజకీయ నాయకులు వీఎంఆర్డీఏకు చెందిన విలువైన ఖాళీ స్థలాలను లేఅవుట్ల అభివృద్ధి, విల్లాలు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాల కోసం తీసుకొని రూ.కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. సంస్థకు నామమాత్రంగా పడేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా అదే తరహాలో ఈ ఎంఐజీ అపార్ట్మెంట్ల ప్రాజెక్టులను కూడా కై వసం చేసుకోవడానికి టీడీపీ నేతలు ఎత్తులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపీపీ పేరుతో ఈ అపార్ట్మెంట్లను చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
సాలూరు శ్యామలాంబ జాతరకు 100 బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు మద్దిలపాలెం: సాలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరకు ఏపీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఈ జాతర కోసం సుమారు 100 ప్రత్యేక బస్సు సర్వీసులను కేటాయించినట్లు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు వెల్లడించారు. మద్దిలపాలెంలోని సిటీ బస్ డిపోను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ జాతర కోసం 20 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. బస్సులన్నీ మంచి కండిషన్లో ఉండేలా చూసి.. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మద్దిలపాలెం డిపోలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. మద్దిలపాలెం డిపో మేనేజర్ అరుణ కుమారి, అసిస్టెంట్ ఇంజనీర్ బిందు, అసిస్టెంట్ మేనేజర్ మాధురి, స్టేషన్ మేనేజర్ మూర్తి, సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి
ఆనందపురం మండలం మామిడిలోవలో సర్వీస్ ఇనాం సర్వే నెంబర్ 33/1 నుంచి 14 వరకు 30 ఎకరాల 30 సెంట్ల భూమి మా పూర్వీకులైన నరసింహపాత్రుడు, సీతారాం పాత్రుడు పేరిట ఉండేది. ఈ భూములను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని వారి పేర్ల మీద మార్పు చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించి, మా భూములను తిరిగి ఇప్పించాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కుటుంబానికి న్యాయం చేసి.. తాతల కాలం నుంచి వస్తున్న ఆ భూములను తిరిగి ఇప్పించాలి. – పిళ్లా పాపయ్య పాత్రుడు, మామిడి లోవ, ఆనందపురం మండలం ● -
డీసీఐ పనితీరు మార్చుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పనితీరుపై కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రామచంద్రన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీసీఐ వార్షిక పనితీరుపై రామచంద్రన్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. డీసీఐ పనితీరు అసంతృప్తికరంగా ఉందనీ.. కన్సార్టియం పోర్టుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నించాలని సూచించారు. డ్రెడ్జింగ్ మార్కెట్లో పోటీతత్వం పెరిగిందనీ.. దానికనుగుణంగా పనితీరు మెరుగు పరచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. దేశశ్యాప్తంగా నేవిగేషన్ మార్గాల్ని నిర్వహించేందుకు డీసీఐ సహకారం ఎంతో ఉందన్న విషయం ప్రతి ఉద్యోగి, అధికారి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఐ, విశాఖ పోర్టు చైర్మన్ డా.అంగముత్తు, డీసీఐ ఎండీ దుర్గేష్‌కుమార్ దూబే ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గురువులకు సర్దుపోటు!
● ఉపాధ్యాయుల్లో బదిలీల గుబులు ● ఉమ్మడి జిల్లాలో భారీగా సర్ప్లస్ టీచర్లు ● మోడల్ స్కూళ్లకు హెచ్ఎంలుగా ఎస్ఏలు ● సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండంవిశాఖ విద్య : ఉపాధ్యాయుల బదిలీలకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో స్కూళ్లలో ఎక్క డెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే లెక్క తీసే పనిలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తలమునకలై ఉంది. మంగళవారం నాటికి వాస్తవ ఖాళీలను ధ్రువీకరించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంఈవోలు, డీఈవో కార్యాలయ సిబ్బంది అంతా ఇదే పని లో నిమగ్నమయ్యారు. ఎంఈవోలను తన కార్యాలయానికి పిలిపించి.. వారి సమక్షంలోనే వాస్తవ ఖాళీ లను లెక్క తీసి, వాటిని ధ్రువీకరించేలా డీఈవో ప్రేమ్‌కుమార్ దృష్టి సారించారు. దీంతో సోమవారం రాత్రి కూడా డీఈవో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించారు. జిల్లాలో ఏడు రకాల బడులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఏడు రకాల బడులు ఏర్పాటుకు అంతా సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 3,158 పాఠశాలలు ఉండగా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ఏడు రకాలుగా బడులు(ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు) కూర్పు చేసి ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. 2024 డిసెంబర్ నాటికి స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను లెక్క కట్టి, ఇందుకనుగుణంగానే ఖాళీల జాబితాలను సిద్ధం చేశారు. ఎస్జీటీ పోస్టుల్లో ఎస్ఏలు ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారుగా 596 మోడల్ ప్రాథమిక స్కూళ్లును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయిస్తున్నారు. కాగా వీటిలో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించనున్నారు. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండిపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. హైస్కూళ్లలో భారీగా సర్ప్లస్ టీచర్లు కొత్తగా ఏర్పాటు కాబోయే స్కూళ్లకు అనుగుణంగా పోస్టులు రేషనలైజేషన్ చేపట్టగా, హైస్కూళ్లలో భారీగా మిగులు ఉపాధ్యాయులు లెక్క తేలారు. గణితం, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ పోస్టుల్లో పనిచేసే వారే ఎక్కువగా మిగులుగా తేలారు. తాజా లెక్కల ప్రకారం సుమారుగా 234 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ కాబోతున్నారు. వీరందరినీ మోడల్ ప్రాథమిక స్కూళ్లలో సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ఆందోళన రేషనలైజేషన్ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. బదిలీలకు అంతా సిద్ధం చేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో భారీగా సర్‌ప్లస్‌లో ఉపాధ్యాయులు ఉండటంతో.. బదిలీల్లో ఎక్కడికి స్థానభ్రంశం కలుగుతుందోనని ఆందోళన ఉపాధ్యాయుల్లో మొదలైంది. రేషనలైజేషన్ మేరకు ఏ పోస్టులు పోతున్నాయి? ఏ పోస్టులు మిగులుతున్నాయనేది డీఈవో కార్యాలయ అధికారులు ఎప్పుడు ప్రకటిస్తారని ఉపాధ్యాయులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
● సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. తొలుత కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. వంటలు వండుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. గరిడీ నృత్యాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, భక్తులతో నిండిపోయాయి. వరాహ పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులతో కిక్కిరిసిన వరాహ పుష్కరిణి -
మారుతున్న పరిస్థితులకు సాంకేతికతే పరిష్కారం
ఎన్ఎస్టీఎల్లో జాతీయ సాంకేతిక దినోత్సవం గోపాలపట్నం: మారుతున్న పరిస్థితులను బట్టి సాంకేతికత వృద్ధి చెందాలని, వాటి పురోగతులే సమస్యలకు పరిష్కారాలు అవుతాయని కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి సౌజన్ పి జాన్ అన్నారు. ఎన్ఎస్టీఎల్లో సోమవారం జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి కొచ్చిలో వాటర్ మెట్రో ఎలా ప్రారంభమైంది, విజయవంతంగా అభివృద్ధి చెందిన అంశాలను వివరించారు. ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటరింగ్ అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. సాంకేతిక పురోగతులను ఉపయోగించుకుంటే దేశాన్ని బలోపేతంగా తయారు చేయవచ్చని, వికసిత భారత్ దార్శనీకతను సాకారం చేసుకోవచ్చన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం చైర్మన్ యుగాంతర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ, యాక్సలరేషన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ‘థర్మల్ సప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఎగ్జాస్ట్ ఇన్ కాంపాక్ట్ టన్నెల్ ఆఫ్ వార్‌షిప్’ అనే అంశంపై ప్రసంగించిన శాస్త్రవేత్త ఖగేష్ కుమార్ చౌదరిని టైటానియం పతకం, ప్రశంసాపత్రం అందించి సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ హెచ్.ఎన్.దాస్, డాక్టర్ డి.ఆర్.రాజేశ్వరి, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ ధర్నా
విశాఖ విద్య: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, బదిలీలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ఏ విధమైన స్పష్టమైన జీవోలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరిలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. సమస్యలపై ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. బదిలీలు, పదోన్నతులు, పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 15న విజయవాడలోని విద్యాభవన్‌ను వేలాది మంది ఉపాధ్యాయులతో ముట్టడిస్తామన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ కుమార్ వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కలెక్టరేట్ అధికారులకు కూడా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, టి.జగన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
అవిశ్వాస తీర్మాన సమావేశం మినిట్స్ ఇవ్వండి
కలెక్టర్‌కు తైనాల, రవిరెడ్డి వినతి మహారాణిపేట: జీవీఎంసీ ప్రత్యేక సమావేశం మినిట్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి రవిరెడ్డి కోరారు. గత నెల 19న జరిగిన ఈ సమావేశం ప్రక్రియల మినిట్స్, వాటి ప్రతిని వెంటనే అందించాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తాను రాసిన లేఖకు ఈ వినతి అనుసంధానంగా ఇస్తున్నట్లు తైనాల విజయకుమార్ పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించిన సమావేశం వివరాలు, చేపట్టిన చర్యల మినిట్స్ కాపీని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విప్‌గా, తాను కోరిన పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు. -
అర్జీల రీ ఓపెన్‌పై అసంతృప్తి
● పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశం ● ‘పీజీఆర్ఎస్’లో 208 వినతుల స్వీకరణ మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో నమోదైన అర్జీలు తరచూ పునరావృతం అవుతుండటంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఆయన వినతులపై సమీక్షించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను 24 గంటలలోపు తెరిచి, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి.. సమస్య పూర్వాపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం అందించాలని స్పష్టం చేశారు. అర్జీలు పునరావృతం అయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి వచ్చే అర్జీలకు, ముఖ్యంగా భూసర్వే, రెవెన్యూ, జీవీఎంసీలకు సంబంధించిన వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 208 వినతులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు 80, పోలీసు శాఖకు 19, జీవీఎంసీకి 52, ఇతర విభాగాలకు 57 అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల స్థితిని తెలుసుకోవడానికి లేదా కొత్త ఫిర్యాదులు నమోదు చేయడానికి 1100 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 120 వినతులు వచ్చినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. -
ఏయూ వీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
విశాఖ విద్య : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (హైదరాబాద్) అందించిన ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాదులోని ఐఐసీటీలో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆచార్య రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండో విడత చందనం సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి పూజలు నిర్వహించారు. అనంతరం మూడు మణుగుల పచ్చి చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థానమండపంలో అధిష్టించి అభిషే కం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి చందనం సమర్పణ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కూటమి పాలనలో కుట్రలు, వేధింపులే..
డాబాగార్డెన్స్: యావత్ ప్రపంచమంతా భారత్–పాక్ యుద్ధంపైనే చర్చించుకుంటుంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందంటూ వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. మాజీ మంత్రి విడదల రజని, దళిత ఎంపీటీసీ కల్పనపై పోలీసుల దాడిని నిరసిస్తూ సోమవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లు ధరించి పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయన్నారు. పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజని పట్ల సీఐ సుబ్బరాయుడు దురుసుగా ప్రవర్తించడం చూస్తుంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా యో అర్థమవుతుందన్నారు. చంద్రబాబూ.. ఇదంతా ప్రజలు గమస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధిచెబుతారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు నిరసన తెలుపుతున్నారంటే కూటమి పాలన ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోందన్నారు. పోలీసులు ఓ మాజీ మంత్రిపై ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, రాష్ట్ర డీజీపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పార్టీ మహిళా నాయకులు పేడాడ రమణికుమారి, పల్లా చినతల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మాజీ మంత్రిపై దురుసుగా ప్రవర్తించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు బోని శివరామకృష్ణ మాట్లాడుతూ దళిత ఎంపీటీసీ కల్పనాపై కూటమి ప్రభుత్వం విరుచుకుపడడంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకి దళితులంటే చులకనగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, పార్టీ ముఖ్య నేతలు గొలగాని శ్రీనివాస్, కొండా రాజీవ్‌గాంధీ, ఉడా రవి, నడింపల్లి కృష్ణంరాజు, డాక్టర్ జహీర్ అహ్మద్, పోతిన హనుమంత్, అల్లు శంకరరావు, ద్రోణంరాజు శ్రీవత్సవ్, సనపల రవీంద్రభరత్, కర్రి రామారెడ్డి, మారుతీ ప్రసాద్, దేవరకొండ మార్కండేయలు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, శశికళ, బిపిన్‌కుమార్ జైన్, అనుబంధ సంఘాల నాయకులు మహ్మద్ షరీఫ్, వాసు గౌడ్, దేవరకొండ మార్కండేయలు, కనకల ఈశ్వర్, ఇమంది సత్యనారాయణ, పద్మ శేఖర్, వాసుపల్లి బంగారమ్మ, చిత్రాడ వెంకటరమణ, కంట్రెడ్డి రామన్నపాత్రుడు, జీలకర్ర నాగేంద్ర, అంబటి శైలేష్, శ్రీదేవి వర్మ, సత్యాల సాగరిక, రోజా రాణి, శిరీష, మోహన్‌రావు, రీసు అనురాధ, బి గోవింద్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కరువు మండిపడ్డ వైఎస్సార్ సీపీ శ్రేణులు మాజీ మంత్రి రజని, ఎంపీటీసీపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఆందోళన -
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
అక్కిరెడ్డిపాలెం: మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాకకు చెందిన చింతలపూడి లావణ్య వెంకటసత్యకుమార్, కొండపల్లి తరుణ్ వద్ద 2.4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, వారు ఆటోనగర్ వద్ద ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేసి, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. -
మినరల్ దోపిడీ
● ఆర్వో ప్లాంట్ల బరితెగింపు● ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. ఆర్వో ప్లాంట్లకు వరం ● భూగర్భ జలాలు, ప్రజల డబ్బులు తోడేస్తున్న జలకాసురులు ● జిల్లాలో రోజుకు 30 లక్షల లీటర్ల నీరు వృథా ● కేవలం 10 శాతం ప్లాంట్స్‌కు మాత్రమే బీఐఎస్ గుర్తింపు సాక్షి, విశాఖపట్నం : సకల జీవరాశులకు నిత్యం అవసరమైనది నీరు. తిండి లేకుండా రెండు మూడు రోజులు ఉండగలవేమో కానీ.. నీరు లేకుండా బతకడం కష్టం. వృథా అయిన నీటిని తిరిగి సంపాదించుకోవడం అసాధ్యం. అందుకే నీటిని వృథా చేయకుండా ఎంతో జాగ్రత్తగా వినియోగించాలి. జిల్లా పరిధిలో నీటి వ్యాపారం చేస్తున్న ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులకు మాత్రం కాసుల గలగలలే తప్ప.. నీటి గలగలల గురించి పట్టింపే లేదు. విచ్చలవిడిగా భూగర్భ జలాలను శక్తివంతమైన మోటార్లు పెట్టి తోడేస్తూ.. రూ.కోట్లలో నీటి వ్యాపారం చేస్తున్నారు. లీటర్ మినరల్ వాటర్ కోసం మూడు లీటర్ల నీటిని వృథా చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటేందుకు కారణమవుతున్నారు. ఓవైపు కాంక్రీట్ జంగిల్లా నగరాన్ని మార్చేస్తుండటంతో చుక్కనీటిని ఒడిసిపట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుండగా.. అలా ఒడిసిపడుతున్న ఒక్కో నీటి బొట్టును వాటర్ ప్లాంట్ల పేరుతో పీల్చేస్తూ జలకాసురుల్లా మారిపోతున్నారు. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కాసుల కక్కుర్తితో నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోంది. వీటి ఏర్పాటుకు ఉన్న కొద్దిపాటి నిబంధనలు కూడా మామూళ్ల నీటిలో కొట్టుకుపోతున్నాయి. వ్యాపారం రూ.కోట్లలో.. లంచాలు రూ.లక్షల్లో.. మంచినీటిపై నియంత్రణ లేకపోవడంతో ఇప్పుడు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మంచినీటిని వ్యాపారంగా మలుచుకొని కొందరు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌ను రూ.15 నుంచి రూ.30 వరకూ అమ్ముతున్నారు. ఒక్కో ప్లాంట్ రోజుకు రూ.5 వేల నుంచి రూ.7 వేలు వరకు వ్యాపారం చేస్తోంది. రోజుకు నగరంలో రూ.50 లక్షల నుంచి 70 లక్షల చొప్పున నెలకు రూ.15 కోట్ల వరకూ నీటి వ్యాపారం సాగుతోంది. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ జిల్లాలోని 90 శాతానికిపైగా ప్లాంట్లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. అయినా అధికారులెవరూ వాటి జోలికి వెళ్లకపోవడం విస్తు చెందాల్సిన అంశం. వీటిపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారైనా వస్తే చాలు.. వారికి రూ.లక్షల్లో ముట్టజెప్పి తమ పని కానిచ్చేస్తున్నారు. ఆ వ్యవస్థ మా పరిధిలోకి రాదు..! జిల్లాలో ఎక్కువ శాతం జీవీఎంసీ పరిధే ఉంది. దీంతో ఆర్వో ప్లాంట్లు తమ పరిధిలోకి రావంటూ టౌన్‌ప్లానింగ్, నీటిసరఫరా, రెవెన్యూ విభాగాల అధికారులు తప్పించుకుంటున్నారు. అయితే తమ పరిధిలో ఉన్న ఆర్వో ప్లాంట్ల నుంచి వసూళ్లకు మాత్రం ఆయా జోన్లలో ఉన్న మూడు విభాగాల సిబ్బందీ సిద్ధమైపోతున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. నెలవారీ మామూళ్ల మాదిరిగా వసూలు చేసుకుంటూ.. ఆర్వో ప్లాంట్లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఆర్వో ప్లాంట్ వ్యాపారుల దందా పెరిగిపోతూ వస్తోంది. జిల్లాలో ఉన్న ఆర్వో ప్లాంట్లు సుమారు 1000 ఒక రోజుకు మొత్తం ప్లాంట్లు తయారు చేస్తున్న మంచినీరు 10,00,000 లీటర్లు ఒక రోజుకు వృథా చేస్తున్న నీరు 30,00,000 లీటర్లు 20 లీటర్ల క్యాన్ తయారీకి వృథా అవుతున్న నీరు 60 లీటర్లు జిల్లాలో నెలకు నీటి వ్యాపారం దాదాపు రూ.15 కోట్లులీటర్ నీటికి 3 లీటర్ల వృథా ఇంట్లో ఉన్న కుళాయి నుంచి చుక్క నీటి బొట్టు వృథాగా పోతుంటే విలవిల్లాడిపోతుంటాం. ఆ వృథాని అరికట్టేందుకు నానా తంటాలు పడుతుంటాం. కానీ వాటర్ ప్లాంట్‌లో మంచినీటి క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు కదా.. అవి తయారయ్యేందుకు ఎంత నీరు వృథా అవుతుందో ఓసారైనా ఆలోచించారా..? ఆర్వోప్లాంట్లో ఒక లీటరు నీటిని శుద్ధి చేసి మంచినీటిగా తయారు చెయ్యాలంటే 3 లీటర్ల నీరు వృథా అవుతుంది. ఒకప్పుడైతే లీటరు నీటికి 6 లీటర్లు వృథా అయ్యేది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో 3 లీటర్లు మాత్రమే వృథా అవుతోంది. అంటే ప్రతి ఇంటికి తీసుకొస్తున్న 20 లీటర్ల క్యాన్‌లో మంచినీరు తయారీకీ 60 లీటర్ల నీరు వ్యర్థ జలాల్లో కలిసిపోతోంది. ఈ లెక్కన జిల్లా పరిధిలో దాదాపు 1000 ప్లాంట్లు ఉన్నాయి. రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల నీటిని తయారు చేస్తున్నారు. ఇందుకోసం 30 లక్షల లీటర్ల నీరు మురుగు కాల్వలో కలిసిపోతోంది. ఇలా కోట్ల లీటర్ల నీటిని తోడేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా నగరంలో 3 మీటర్లలో భూగర్భ జలాలుండాల్సి ఉండగా.. ప్రస్తుతం 9.50 మీటర్ల లోతుకు చేరి అథమ స్థాయికి చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. -
అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకరణ
● మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా.. ● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్ అల్లిపురం : కూటమి ప్రభుత్వం అమరావతినే అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించడాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం ఇప్పటికే 40 వేల ఎకరాలు సేకరించారని, మరో 40 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, అక్కడ ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తుండగా అక్కడకు దగ్గరలోని అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 వేల ఎకరాలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. అమరావతిలో రైల్వే స్టేషన్ కోసం 2,600 ఎకరాలు కేటాయించారని, దేశంలో ఏ రైల్వే స్టేషన్ చూసినా వంద ఎకరాలలోపే ఉన్నాయన్నారు. విశాఖ కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పి అమరావతిలో ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుని, ఎకరం 99 పైసలకు భూములను కేటాయించారన్నారు. టీసీఎస్ ఎప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తుందో తెలియదన్నారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూములు కేటాయించారని, అక్కడ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు ఖర్చు చేశారని, ఇప్పటి వరకు ఆ సంస్థ పునాదిరాయి కూడా వేయలేదని విమర్శించారు. 2026లో భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినప్పటికీ, విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ రహదారులను ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదన్నారు. విశాఖ మెట్రో కారిడార్ పై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదని అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గం, నూతన సమితి ఎన్నిక జిల్లా కార్యదర్శిగా ఎస్.కె.రెహమాన్, జిల్లా సహాయ కార్యదర్శిగా కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఎం.పైడిరాజు, కె.సత్యాంజనేయ, ఆర్.శ్రీనివాసరావు, ఎం.మన్మధరావు, సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి, కె.వనజాక్షి, ఎన్.నాగభూషణం పాటు మొత్తం 33 మందితో నూతన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
జీవీఎంసీకి 88 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 వినతులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత సమయంలో ఈ ఫిర్యాదులను పరిష్కారించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. కాగా.. పరిపాలన అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూకి 7, పబ్లిక్ హెల్త్‌కు 7, పట్టణ ప్రణాళికా విభాగానికి 43, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 18, యూసీడీ విభాగానికి 3, మొక్కల విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాదరాజు, చీఫ్‌సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏపీకి చల్లని కబురు.. నాలుగురోజుల పాటు విస్తార వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలో నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడగులు పడే ప్రమాదం ఉందని.. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల తీవ్రత ఉండన్నాయని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.కాగా, తెలంగాణలో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రానున్న రెండు రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి.అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా వచ్చే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదైనప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.దక్షిణాది జిల్లాలకు వర్ష సూచన ప్రస్తుతం మరత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశంం ఉంది. -
నీ తోడే.. నా కనుచూపుగా..
విశాఖపట్నం: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది.డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటరీ్మడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు. అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అండగా నిలిచిన దాతలు ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్‌రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి ఈ వేడుకలో అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు. -
సింహాచలం ఈవోగా సుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్‌కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.. -
● ఎప్పుడొస్తుందో రేషన్?
నిరీక్షణలో పేదలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ లబ్ధిదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వం అందించిన విధంగా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు సరఫరా చేయకపోగా.. పంపిణీ ప్రక్రియ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నెల 11వ తేదీ గడిచినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. నిత్యం రేషన్ వాహనం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు తప్పడం లేదు. పేదలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి శివాజీపాలెంలోని చిన్నపూలమ్మ గుడి వద్ద చోటుచేసుకున్న ఈ దృశ్యం అద్దం పట్టింది. ఇక్కడ వృద్ధులు తమ రేషన్ సరుకుల కోసం గోనె సంచులు క్యూలో పెట్టుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ పంపిణీలో జరుగుతున్న ఈ ఆలస్యంపై లబ్ధిదారులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు ● పరీక్షలకు హాజరుకానున్న 39,992 మంది విద్యార్థులు విశాఖ విద్య: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులతో ఆర్ఐవో మురళీధర్ ఆదివారం సమీక్షించారు. ఆర్ఐవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందున, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలన చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలోని 188 జూనియర్ కాలేజీల నుంచి 32,780 మంది ఫస్టియర్ విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం జిల్లాలో 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా సెకండ్ ఇయర్ పరీక్షలకు 7,212 మంది నమోదు చేసుకోగా, వీరి కోసం 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా జిల్లాను ఏడు జోన్లగా విభజించి, పరీక్షల పర్యవేక్షణకు తనిఖీ అధికారులను నియమించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర సామగ్రిని భద్రపరిచేందుకు 14 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించారు. రెండు పూటలా పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 20 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజూ ఫస్టియర్ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30గంటల సాయంత్రం 5.30గంటల వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. జూన్ 4న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 6న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని ఆర్ఐవో మురళీధర్ తెలిపారు. -
నిఘా..
● మెడికల్ మాఫియానామ‘మాత్ర’మే! ● ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ ● ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందుల విక్రయం ● రికార్డుల నిర్వహణకు తిలోదకాలు ● మొద్దు నిద్రలో ఔషధ నియంత్రణ శాఖ ● విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూసిన వాస్తవాలు మహారాణిపేట: నగరంలో ఔషధ విక్రయాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. కాలం చెల్లిన మందులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేని మత్తు ఇంజెక్షన్లు, దగ్గు మందుల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఫార్మసిస్టులు లేకుండా, కనీస వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నిర్వహిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔషధ విక్రయాలపై సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడటం రోగులకు శాపంగా మారింది. అనేక మందుల షాపులు ప్రాథమిక నిబంధనలను కూడా పాటించకుండా నిర్వహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 పైగా మెడికల్ షాపులు ఉండగా.. ఇందులో సుమారు 3,000 రిటైల్ షాపులు కాగా, 1,500 ఏజెన్సీలు, హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కనీస పారదర్శకత లేకుండానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి మందుల షాపులో ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో మందుల విక్రయాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అమ్మకపు బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాలు, ఇంజెక్షన్లు విక్రయించడం, సరైన రికార్డుల నిర్వహణ లేకపోవడం, కంప్యూటర్లు వాడకపోవడం వంటివి సర్వసాధారణంగా మారాయి. నొప్పి నివారణ మందులు, మత్తు కలిగించే ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైన అక్రమాలు ఇటీవల మందుల విక్రయాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) అధికారులతో కూడిన 40 మంది సభ్యుల నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 16 మందుల షాపులు, ఏజెన్సీలపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ సోదాల్లో అనేక అక్రమాలు వెలుగు చూశాయి. ఈ తనిఖీల్లో రెండు షాపుల్లో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఎంవీపీ కాలనీలోని త్యాగరాయ మెడికల్స్‌లో రూ.50 వేల విలువైన గడువు ముగిసిన మందులను, గాజువాకలోని శ్రీ సాయి వెంకటేశ్వర మెడికల్స్‌లో రూ.90 వేల విలువైన కాలం చెల్లిన మందులను అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన మందులను స్వాధీనం చేసుకుని షాపులను సీజ్ చేశారు. ఈ దాడులు మందుల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలను బహిర్గతం చేశాయి. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఔషధ నియంత్రణ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొక్కుబడి కేసులు ఈ అక్రమాలపై సంబంధిత ఔషధ నియంత్రణ శాఖ నిఘా పూర్తిగా కొరవడిందని ఆరోపణలున్నాయి. ఔషధ నియంత్రణ మండలి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్ రావు, అభిప్రియ, కూన కల్యాణి, ఎన్.కల్యాణి వంటి అధికారులు ఉన్నప్పటికీ.. తనిఖీలు, సోదాలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెలవారీ, వార్షిక తనిఖీల లక్ష్యాలను చేరుకోవడానికే ఈ శాఖ పరిమితమైందన్న విమర్శలున్నాయి. -
కడలి ఒడిలోకి..
ఉగ్రవాద నిర్మూలనతోనే ప్రపంచ శాంతివిశాఖ విద్య: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారానే ప్రపంచశాంతి సాధ్యపడుతుందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం–దేశ సమైక్యతను పెంపొందిద్దాం–మేరా భారత్ మహాన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి సంఘీభావం లభిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు. ఐకమత్యమే భారతీయుల బలమని ప్రపంచం గుర్తించిందన్నారు. ప్రజలంతా దేశ భద్రతకు, అభివృద్ధికి, పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అదే సమయంలో దేశ ప్రజలకు ముప్పు తలపెట్టేవారిని ఎంత మాత్రం ఉపేక్షించదన్నారు. దేశ భద్రత కోసం సరిహద్దులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న త్రివిధ దళాల సిబ్బందికి భారతీయులంతా బాసటగా నిలవాలని కోరారు. యుద్ధంలో మృతి చెందిన తెలుగు జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం త్రివర్ణ పతాకాలను పట్టుకుని ‘భారత్ మాతాకీ జై.. మేరా భారత్ మహాన్..’అంటూ నినాదాలు చేశారు. -
నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండవ విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. ఏఈవో ఆనంద్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు. వీరంతా సోమవారం కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కొండపై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కోలలకు పూజలు చేసి.. సహపంక్తి భోజనాలు చేస్తారు. భక్తులతో అడవివరం పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. -
నీ తోడే.. నా కనుచూపుగా..
● దాతల దీవెనలు.. పెద్దల ఆశీస్సులతోఒక్కటైన అంధ జంట ● అతిథుల రాకతో కళకళలాడిన ప్రేమ సమాజం డాబాగార్డెన్స్: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది. డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు. అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అండగా నిలిచిన దాతలు ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్‌రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి ఈ వేడుకలో అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు. -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్‌కు వైఎస్సార్ సీపీ నేతల నివాళి మహరాణిపేట: పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఇమంది సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామి రెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్‌రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యాడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోవింద్ బోదపు, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రంభ నారాయణమూర్తి పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు(25) అనే యువకుడు మనస్తాపంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉన్న మృతుడికి ఆ కారణంతోనే వివాహం కాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా పని చేస్తున్న తాతారావు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1.30 సమయంలో సమీపంలోని అమ్మమ్మ వారి ఇంటి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి అమ్మానాన్న అప్పలకొండ, నారాయణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయ ప్రయోజనాలే బీజేపీ లక్ష్యం
● వామపక్ష పార్టీల మూడో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించ లేదు ● సీపీఐ జిల్లా మహా సభల్లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్లమురళీనగర్: రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. విశాఖలోని మురళీనగర్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టి, తమ వైపు తిప్పుకొని బీజేపీ అధికారంలోకి వస్తోందని విమర్శించారు. 2014లో కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వీటిలో ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. 2019లో రెండోసారి అనేక కుయుక్తులతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మూడో సారి 420 సీట్లు సొంతంగా గెలుస్తామని చెప్పి, నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు తెచ్చుకోలేకపోయిందన్నారు. యూపీఏ –1 ప్రభుత్వానికి వామపక్షాలు బయట నుంచి మద్దతిచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపేందుకు కృషి చేసిందని, వామపక్షాల వల్లే ఉపాధి హామీ వంటి పలు చట్టాలు వచ్చాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అధికారం కోసం రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను రూపొందించుకుని ప్రజలతో మమేకమవడానికి పార్టీ కృషి చేయాలన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పల్లెటి పోలయ్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కె.వనజాక్షి, కె.సత్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన మహాసభలో పార్టీ సీనియర్ నాయకులు మానం ఆంజనేయులు, పి.దుర్గాభవాని, జేవీ సత్యనారాయణమూర్తి, ఏజే స్టాలిన్, డి.ఆదినారాయణ, సీహెచ్ రాఘవేంద్రరావు, జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 162 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
3
అప్పన్న సేవలోశతాబ్దాలుగా.. ఒడిశా దాసులు● తరతరాల కుటుంబ సంప్రదాయం.. ఒడిశా దాసుల సొంతం ● ప్రస్తుతం స్వామి సేవలో 4వ తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ పది.. ఇరవయ్యేళ్లు కాదు.. ఏకంగా 300 ఏళ్లకు పైనే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సేవలో ఆ కుటుంబం తరిస్తోంది. ఏటా మూడు మాసాలు సింహగిరిపైనే ఉంటూ.. స్వామిని పూజిస్తూ, ఆర్జిత సేవలు చేస్తూ.. భక్తులకు ఇతోధికంగా సాయపడుతోంది. వారే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుంటుంబం. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన నాలుగో తరం వారైన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ అప్పన్నస్వామి సేవలో తరించేందుకు సింహాచలానికి చేరుకున్నారు. సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్‌దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్‌దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్‌నాయక్‌దాస్ ఏడేళ్ల వయసు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్‌దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తులకు ఆశ్రయం.. దాస సత్రం రుషికేష్‌నాయక్‌దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్‌దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్‌దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. ●300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్‌నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్‌నాయక్ దాస్ (రుషికేష్‌నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్‌నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) -
ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..
● ఒడిశాలోని తమ స్వగృహంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సింహాచల క్షేత్రంలో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలన్నీ ఆచరిస్తుంటారు. ● సింహాచలం క్షేత్రంలో లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ ఉన్న మూడు నెలల్లో స్వామికి ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఏటా నృసింహ హోమాన్ని నిర్వహిస్తుంటారు. ● దాసుడి దగ్గర తమకున్న మానసిక, ఆరోగ్య రుగ్మతలు చెప్పుకుంటే అవి కచ్చితంగా నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. దానికనుగుణంగానే సింహగిరిపై ఉన్న దాస సదనంలో తమను ఆశ్రయించేవారికి దాసుడు వైద్య సేవలందిస్తారు. ● స్వామికి అంతరాలయంలో ప్రతి రోజు పూజ అనంతరం దాసుడు భక్తులకు తులసి ప్రసాదాన్ని, గంగమ్మతల్లి సన్నిధిలో దీపం వెలగించిన నూనెను ఇస్తారు. ఆ తులసి ప్రసాదం తిన్నా, నూనెను శరీరానికి, తలకు పట్టించుకున్నా రోగాలు నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. ● 2008లో సింహగిరి దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా దాస సత్రాన్ని దేవస్థానం తొలగించింది. ప్రత్యామ్నాయంగా జఠల్‌సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇవ్వడంతో అక్కడే లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ సత్రాన్ని నిర్మించారు. ఆ సత్రంలోనే ఈ మూడు మాసాలు ఆయన బస చేస్తారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గోపాలపట్నం: భార్యకు కడుపులో నొప్పిగా ఉందని మాత్రలు తీసుకొచ్చేందుకు గోపాలపట్నం వచ్చిన అక్కిరెడ్డి బాబూరావు(52)ను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖారవేలనగర్కు చెందిన అక్కిరెడ్డి బాబూరావు ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం భార్యకు కడుపులో నొప్పిగా ఉందని గోపాలపట్నంలోని మందుల దుకాణానికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతుని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పెద్ద కొడుకు జగదీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామారావు కేసు దర్యాప్తు చేపట్టారు. ారీ ఆచూకీ లభ్యమైనట్లు తెలిసింది. ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టిని తరలించేందుకు వచ్చింది. లారీ డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
జూలో సన్దడే సందడి
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కు ఆదివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, అందులోనూ ఆదివారం కావడంతో సందర్శకులు పోటెత్తారు. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ సమయం జూ లోపల చెట్ల కిందే గడిపారు. చిన్నారులు చెట్ల నీడలో గంటల తరబడి ఆటలాడుతూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టాక జూలో వన్యప్రాణులను తిలకించారు. వాటికి ఫొటోలు తీస్తూ, ఎన్క్లోజర్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులు, పులులు, కోతులు, జిరాఫీ, జీబ్రాలు, జింకలతో పాటు నెమళ్లు, ఆఫ్రికన్ చిలుకలు, ఆస్ట్రిచ్‌లు, ఈములు వాటి ఎన్క్లోజర్లలో ఉదయం, సాయంత్రం సమయంలో హుషారుగా తిరుగుతూ జూకు వచ్చిన పిల్లల్ని, పెద్దలను అలరించాయి. మొసళ్ల జోన్ కొలనులో నీరు వేడెక్కడంతో వాటిలో మొసళ్లు సాయంత్రం వరకు బయటకు రాకుండా అడుగు భాగంలోనే ఉండిపోయాయి. ఆదివారం 4,303 మంది సందర్శించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ 3.62 లక్షల ఆదాయం లభించిందన్నారు. పోటెత్తిన సందర్శకులు.. రూ.3.62 లక్షల ఆదాయం -
నవాచర్ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం
అల్లిపురం: ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–టెక్నాలజీ(ఎన్ఐఎస్టీ) విశ్వవిద్యాలయంలో ఈ నెల 8 నుంచి మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాం(ఎఫ్డీపీ)ను బీఎస్ఎన్ఎల్ విశాఖ ట్రైనింగ్ పాయింట్ నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 14న జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ఆదివారం బెర్హంపూర్‌లో పరిశోధన–ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎం.సత్యప్రసాద్ ఇది బీఎస్ఎన్ఎల్ స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయం అని పేర్కొన్నారు. నిస్ట్ విద్యార్థులు క్యాంపస్‌లో ఆచరణాత్మక ప్రయోగాలు, కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను స్థాపించడానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం పలు అంశాలపై సదస్సులు నిర్వహించారు. -
అండర్–11 చెస్ విజేతలు సౌర్యాజేష్, అఫ్షిన్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–11 చదరంగం జట్ల ఎంపిక పోటీల్లో సౌర్యాజేష్, అఫ్షిన్ విజేతలుగా, శశాంక్, కమలప్రియ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విశాఖ జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో గాజువాక లయన్స్‌క్లబ్‌లో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. ఓపెన్ కేటగిరీలో ఏడు రౌండ్లలో సాగిన పోరులో 97 మంది, బాలికల కేటగిరీ ఆరు రౌండ్లలో 40 మంది పోటీపడ్డారు. ఓపెన్‌లో ఫిడే రేటింగ్ ఉన్న 9 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారు. ఓపెన్‌లో ఆరున్నర పాయింట్లతో ఎ.సౌరాజేష్(1422) విజేతగా, ఆరు పాయింట్లతో కె.శశాంక్(అన్‌రేటెడ్) ద్వితీయస్థానంలో నిలిచారు. బాలికల్లో ఐదున్నర పాయింట్లతో సమఉజ్జీగా నిలిచిన ప్రోగ్రసివ్తో ఎండీ అఫ్షిన్(1480) విజేతగా, బి.కమలప్రియ(1499) ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. ఓపెన్, బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు జిల్లా జట్టుగా ఎంపికయ్యారు. -
రిజర్వాయర్ల నిర్వహణ అస్తవ్యస్తం
● కూటమి ప్రభుత్వం వచ్చాక మరింత దిగజారిన పరిస్థితి ● తుప్పు పడుతున్న గేట్లు, విద్యుత్ బిల్లులకూ నిధుల కటకట ● జీవీఎంసీ నుంచి నీటిపారుదల శాఖకు పేరుకుపోయిన బకాయిలు ● ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి మహారాణిపేట: విశాఖపట్నం, అనకాపల్లి ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కీలక జలాశయాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్లపై దృష్టి సారించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఉమ్మడి జిల్లాలోని మేహాద్రి గెడ్డ, రైవాడ, గంభీరం, తాటిపూడి వంటి నాలుగు కీలక రిజర్వాయర్లలో గేట్లు తుప్పుపట్టి పాడైపోయా యి. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌లోని ఆరు గేట్లలో రెండు పూర్తిగా పని చేయడం లేదు. ప్రభుత్వం కనీసం విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కూడా నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దీనికి తోడు ఈ జలాశయాల నుంచి నీటిని వినియోగించుకుంటున్న జీవీఎంసీ.. నీటి పారుదల శాఖకు రూ.210 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిల వసూలు కోసం నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎన్ స్వర్ణకుమార్ పలుమార్లు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. తాజాగా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా పట్టణ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని, తమ వద్ద నిధులు లేవని జీవీఎంసీ అధికారులు నీటిపారుదల శాఖకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.210 కోట్ల మేర బకాయిలు విశాఖ నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో రైవాడ, మేహాద్రి గెడ్డ, గంభీరం, తాటిపూడి జలాశయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా రైవాడ రిజర్వాయర్ ద్వారా తాగునీటితో పాటు ఆయకట్టు రైతులకూ నీరు అందుతోంది. 114.00 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ నుంచి జీవీఎంసీకి రోజుకు 50 క్యూసెక్కుల నీరు అందిస్తున్నారు. ఇలా 1985 నుంచి ఏటా 1.6 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందుకు గాను ఏటా రూ.5.42 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. జీవీఎంసీ అరకొరగా మాత్రమే చెల్లింపులు చేస్తోంది. 1997 మే నుంచి బకాయిలు పేరుకుపోయి, మొత్తం రూ.156 కోట్లకు చేరినట్లు నీటిపారుదల శాఖ అధికారులు జీవీఎంసీకి నోటీసులు జారీ చేశారు. ఈ రిజర్వాయర్ పరిధిలో 12 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి జీతాలు, విద్యుత్ చార్జీలు, నిర్వహణ, జనరేటర్ ఖర్చులను కూడా నీటి పారుదల శాఖే భరిస్తోంది. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ నగర పరిధిలోని ఈ జలాశయాన్ని పూర్తిగా జీవీఎంసీ తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. 169 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లోని ఆరు గేట్లు మరమ్మతులకు గురి కాగా.. రెండు గేట్లు పూర్తిగా పని చేయడం లేదు. ఏటా రూ.1.60 కోట్లు నీటిపారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది. గంభీరం రిజర్వాయర్ 125 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం కూడా జీవీఎంసీ తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతోంది. జీవీఎంసీ రూ.4.3632 కోట్లను నీటి పారుదల శాఖకు చెల్లించాల్సి ఉంది. తాటిపూడి రిజర్వాయర్ 297 అడుగుల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. నీటి పారుదల శాఖకు రూ.74 లక్షలు బకాయిలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా బకాయిల వివరాలు(రూ.కోట్లలో) -
విశాఖలో మాయా లోకం
● మధురవాడలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు వీఎంఆర్డీఏ ప్రణాళికలు ● రూ.460 కోట్లతో ఈస్ట్‌కోస్ట్ హేబిటేట్ సెంటర్ ● 2.82 ఎకరాల్లో వర్చువల్ రియాల్టీ ఎరీనా,త్రీ స్టార్ హోటల్ ● పీపీపీ విధానంలో చేపట్టేందుకు కసరత్తు ● ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ దరఖాస్తుల ఆహ్వానం రూ.470 కోట్లతో హేబిటేట్ సెంటర్ విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ‘వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా.. పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్ హేబిటేట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్ఎఫ్పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి. –కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్2.82 ఎకరాల్లో వర్చువల్ ఎరీనా ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్’ను నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఐటీ స్పేస్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, ఆడిటోరియం, సెమినార్ హాల్, పార్టీ ఈవెంట్స్ లాన్లతో పాటు ట్రేడ్ ఫెయిర్లు, ఆర్ట్, కల్చర్ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్ హౌస్, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్ యాంఫీ థియేటర్, 400 మంది పట్టేలా కేఫ్టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డ్రైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్, 250 మందికి సరిపడా ఈవెంట్ లాన్్, సూపర్ మార్కెట్, మెడికల్, స్పోర్ట్స్ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. విశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. గేమింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్ టైమ్ ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్ రెస్టారెంట్ అవుట్లెట్లు, 10 శాతం కమర్షియల్ అవుట్లెట్లతో పాటు 100 రూమ్‌లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్ హాల్‌తో త్రీ స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు. -
ప్రేమ సమాజానికి పెళ్లి కళ
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజానికి పెళ్లి కళ వచ్చేసింది. విద్యుత్ వెలుగులు.. పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న అంధురాలు శివజ్యోతికి అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన రాఘవేంద్రతో ఆదివారం పెళ్లి జరగనుంది. అతడు కోయంబత్తూర్‌లో పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి తంతులో భాగంగా శనివారం పెండ్లి రాట వేసి శివజ్యోతిని పెండ్లి కుమార్తెను చేశారు. ఆదివారం రాత్రి 7.05 గంటలకు వీరిద్దరికి వివాహం జరగనుంది. అందుకు ప్రేమ సమాజం కమిటీ అన్నీ తానై వ్యవహరిస్తోంది. పెండ్లి కుమార్తె శివజ్యోతికి బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి మెట్టెలు, పసుపు, కుంకుమ, స్వీట్స్‌తో పాటు మరికొన్ని చీరలు, పెండ్లి కుమారుడు రాఘవేంద్రకు పట్టు వస్త్రాలను నగర సీపీ శంఖబ్రాత బాగ్చి చేతుల మీదుగా కార్పొరేటర్ కందుల నాగరాజు, నళినిదేవి దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహనరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయులు, ఎ.జె.స్టాలిన్, సిహెచ్ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, నాయుడు, నాగభూషణం పాల్గొన్నారు. అమరావతి తప్ప వారికి మరొకటి కనిపించడం లేదు సీపీఐ సహాయ కార్యదర్శుల విమర్శ -
ఎండల్లో హాయ్ హాయ్
అల్లిపురం: ఎండల్లో హాయ్.. హాయ్ అంటూ నగర ట్రాఫిక్ పోలీసులు ఇక నుంచి విధులు నిర్వహించనున్నారు. మొన్న కూలింగ్ జాకెట్లు, నేడు ఏసీ హెల్మెట్లతో నగర రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దర్శనమివ్వనున్నారు. మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కొంత ఉపశమనం కలిగే విధంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శఽంఖబ్రత బాగ్చి చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కోసం ఏసీ హెల్మెట్లను నోయిడాలోని కరమ్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దాతల సహాయంతో కొనుగోలు చేశారు. శనివారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో రూ.6 లక్షలు విలువ గల 30 ఏసీ హెల్మెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది వీటిని తలకు పెట్టుకుంటే శరీర ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు తగ్గుతుందన్నారు. హెల్మెట్ బరువు 740 గ్రాములు ఉంటుందన్నారు. 4 గంటల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుందన్నారు. బ్యాటరీ 10 సంవత్సరాలు వారంటీ ఉందన్నారు. అలాగే ఇప్పటి వరకు 220 కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశామన్నారు. కోరమాండల్ సిమెంట్స్, వైశ్యరాజ్ జ్యుయలర్స్, లడ్డు గోపాల్, మీరా కలెక్షన్స్ సహకారంతో మరో 40 కూల్ జాకెట్లను గుర్గావ్ నుంచి రప్పించి ట్రాఫిక్ సిబ్బందికి అందజేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ల పంపిణీ మండుటెండల నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడి -
పెళ్లిలో ప్రతీకారం!
తాళ్లతో బంధించి ఒకరిని హింసించిన బంధువులు తగరపువలస: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తాతారావును ఆసుపత్రికి తరలించారు. వివరాలివి. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువ తితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్ల తో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తాటిచెట్లపాలెం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు భరోసా కల్పించారు. పార్టీ బలోపేతానికి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డుల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయంలో ప్రతి రోజూ అందుబాటులో ఉంటానని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలెవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానన్నారు. వార్డుల్లో ప్రజా సమస్యలపై సమన్వయంతో కలిసి పోరాడాలని.. అధికారులు స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. -
నోరూరగాయ..
● ఆంధ్రులకు ఆవకాయతో అనుబంధం ● వేసవి కాలంలోఇంటింటా సందడే సందడి ● కానీ అదంతా ఒకప్పటి మాట ● మారిన అభిరుచులతో తగ్గిన ఆదరణ ● పెరిగిన ధరలతో తయారీ భారమే.. నక్కపల్లి: ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురంఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది. -
అతను.. మాజీ సైనికుడు
● అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన పోలీసులు ●● మానసిక సమస్యతోబాధపడుతున్నట్లుగా నిర్ధారణ విశాఖ సిటీ/మధురవాడ: సోషల్ మీడియాలో వైరల్ అయిన అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విచారించగా అతడు ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో 24 గంటల టెన్షన్‌కు తెరపడింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం పెద్ద గడ్డంతో సూట్ ధరించిన సుమారు 40 ఏళ్ల వ్యక్తి సిరిపురంలోని పలు ప్రాంతాల్లో ఫొటోలు తీశాడు. అతడు అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడాన్ని అక్కడున్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధ నేపథ్యంలో ఆ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. అనుమానాస్పదంగా తిరుగు తూ ఫొటోలు తీస్తుండడంతో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై సీపీ శంఖబ్రత బాగ్చి అతన్ని పట్టుకోవాలని ఆదేశించారు. ఆ వ్యక్తి కోసం నగరంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో గాలింపు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి కార్‌షెడ్ జంక్షన్ వద్ద బస్సులో వెళ్తున్నట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించారు. అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామానికి చెందిన పెంకి ప్రవీణ్‌కుమార్‌గా తెలుసుకున్నారు. అతడు 2023లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాడు. అతని తల్లిదండ్రులు, అన్నదమ్ములతో ఫోన్లో మాట్లాడారు. ఆ వ్యక్తి ఆర్మీ నుంచి రిటైర్ అయిన తరువాత కొంత కాలంగా మానసిక, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతడిపై ఎటువంటి నేరపూరితమైన, చెడు నడత ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో అతని బంధువులకు ఇచ్చి పంపించారు. -
మోదకొండమ్మ జాతరకు 20 బస్సులు
మద్దిలపాలెం: పాడేరులో జరిగే శ్రీ మోదకొండమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం విశాఖ నుంచి 20 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రజా రవాణా శాఖ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని, పాడేరు నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మద్దిలపాలెంలోని విశాఖ ఆర్టీసీ డిపోను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల గురుతర బాధ్యత అని స్పష్టం చేశారు. బస్సులను మంచి కండిషన్లో ఉంచాల్సిన బాధ్యత గ్యారేజ్ సిబ్బందిపై ఉందన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు సేవలు అందించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, నీరు, ఓఆర్ఎస్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిన విజయ నాయుడు, జి.బి.రావు, ఎం.ఎం.రావులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ కె.గంగాధర్ రావు, అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) కె.రామకృష్ణ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
గీతం ఆసుపత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు
కొమ్మాది: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(జిమ్సర్)కు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు లభించింది. ఈ మేరకు ప్రో వైస్ చాన్సలర్ డా.బి.గీతాంజలి శనివారం ఈ వివరాలు వెల్లడించారు. అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం, ఆసుపత్రి నిర్వ హణ, సామాన్యులకు సైతం వైద్య సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ఏబీహెచ్ ఈ సర్టిఫికెట్‌ను మంజూరు చేసిందని ఆమె వివరించారు. జిమ్సర్ అక్రిడిటేషన్ కో–ఆర్డినేటర్ డా. కృష్ణకాంత్ బోగవల్లి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.వి.నరసింహారావు పాల్గొన్నారు. -
14వ పోప్‌గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్: రోమన్ క్యాథలిక్ మిషన్‌కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్‌గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్‌కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్‌గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్‌ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిల్లో వారం రోజుల పాటు దేవునికి కృతజ్ఞత బలిపూజలు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫాదర్స్ దుగ్గంపూడి బాలశౌరీ, జాన్ ప్రకాష్, కె.జయరాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత
గోపాలపట్నం: దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో భద్రతను పటిష్టం చేశారు. శనివారం విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి వాహనాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు పలు ప్రాంతాల్లో నిఘా ఉంచి పహారా కాశారు. టెర్మినల్ భవనంలో కూడా విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులతో పాటు దుస్తులను స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల నేపథ్యంలో ప్రయాణికులు కనీసం మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. హై అలర్ట్ కారణంగా విమానాశ్రయం లోపలికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. సందర్శకుల టిక్కెట్ల అమ్మకాలను కూడా నిలిపివేశారు.