
కడలి ఒడిలోకి..
ఉగ్రవాద నిర్మూలనతోనే ప్రపంచ శాంతి
విశాఖ విద్య: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం ద్వారానే ప్రపంచశాంతి సాధ్యపడుతుందని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం–దేశ సమైక్యతను పెంపొందిద్దాం–మేరా భారత్ మహాన్’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉగ్రవాద నిర్మూలనకు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి సంఘీభావం లభిస్తోందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కలిసి పనిచేయాలని సూచించారు. ఐకమత్యమే భారతీయుల బలమని ప్రపంచం గుర్తించిందన్నారు. ప్రజలంతా దేశ భద్రతకు, అభివృద్ధికి, పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అదే సమయంలో దేశ ప్రజలకు ముప్పు తలపెట్టేవారిని ఎంత మాత్రం ఉపేక్షించదన్నారు. దేశ భద్రత కోసం సరిహద్దులో అవిశ్రాంతంగా పనిచేస్తున్న త్రివిధ దళాల సిబ్బందికి భారతీయులంతా బాసటగా నిలవాలని కోరారు. యుద్ధంలో మృతి చెందిన తెలుగు జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం త్రివర్ణ పతాకాలను పట్టుకుని ‘భారత్ మాతాకీ జై.. మేరా భారత్ మహాన్..’అంటూ నినాదాలు చేశారు.

కడలి ఒడిలోకి..