
సీఎస్‌ఆర్‌ఎంవోగాడాక్టర్ శ్రీహరి
మహారాణిపేట: కేజీహెచ్‌లో ఎట్టకేలకు సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(సీఎస్‌ఆర్‌ఎంవో) పోస్టు భర్తీ అయింది. ఎన్నో ఏళ్లుగా ఈ పోస్టు భర్తీ కాలేదు. ఇన్‌చార్జిలతో ఈ పోస్టు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీహరిని కేజిహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోగా నియమించారు. ఈ మేరకు బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా డీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ మోహర్ కుమార్ పనిచేస్తున్నారు. తొలుత కేజీహెచ్‌కు చేరుకున్న డాక్టర్ సీహెచ్ శ్రీహరి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు వైద్యులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.