
విశాఖలో ధర్నా చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లు
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని తొలగించేందుకు బాబు, పవన్ కుట్ర
మమ్మల్ని తొలగిస్తే ఉద్యమాలే
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎండీయూ ఆపరేటర్ల నిరసన
తిరుపతి మంగళం/తణుకు అర్బన్/బీచ్‌రోడ్డు (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనే తీసేసేందుకు కుట్రలు చేస్తున్నారని మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు మండిపడ్డారు.
ఈ ఎండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఎండీయూ ఆపరేటర్లు ఉద్యమబాట పట్టారు. తిరుపతిలో అర్ధనగ్న ప్రదర్శన చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విశాఖలో పెద్దఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి పేదవాడి ముంగిటకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి ఎండీయూ విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు చంద్రబాబు ఆపరేటర్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎండీయూ ఆపరేటర్లు జేసీకి, తణుకులో తహసీల్దార్ డి. అశోక్‌వర్మకు వినతిపత్రం అందించారు.