
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపై ససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యతా రాగం ‘కౌన్సిల్ సాక్షిగా’ విచ్ఛిన్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు
మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025
ముగ్గురు సీఐలకు స్థానచలనం
విశాఖ సిటీ: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపట్నం లా అండ్ ఆర్డర్ ఇన్‌స్పెక్టర్ జి.అప్పారావును మల్కాపురం లా అండ్ ఆర్డర్‌కు బదిలీ చేశారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వర్తించిన విద్యాసాగర్‌పై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయనపై వేటు పడింది. ఒక ఫిర్యాదు చేయడానికి ఆమె స్టేషన్‌కు వస్తే.. సీఐ ఫోన్లు, మెసేజ్‌లతో వేధింపులకు గురిచేస్తున్నారని సీపీ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ అనంతరం విద్యాసాగర్‌ను రేంజ్‌కు సరెండర్ చేశారు. దీంతో ఆ స్థానంలో అప్పారావును నియమించారు. అలాగే సీఎస్‌బీ–3లో ఉన్న ఎన్.వి.ప్రభాకరరావును గోపాలపట్నం లా అండ్ ఆర్డర్‌కు, వీఆర్–1లో ఉన్న జి.గోవిందరావును సీఎస్‌బీ–3కు బదిలీ చేశారు.
హాజరైన ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి, ఎమ్మెల్సీ వేపాడ
డాబాగార్డెన్స్ : ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లు కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. పదవుల కోసం తప్ప ప్రజలకు మేలు చేయాలని వారు కలవలేదని తేలిపోయింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం జరిగింది. ఈ పదవిని జనసేనకు కేటాయించగా టీడీపీ ఆశావహులు సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎలాగైనా తమకే ఈ పదవి దక్కాలని భీష్మించారు. దీంతో కోరం లేక సమావేశం మంగళవారం నాటికి వాయిదా పడింది. జనసేన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
చివరి వరకు ఆశావహుల ప్రయత్నాలు
మేయర్‌గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు.
కారాలు మిరియాలు
జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు.
న్యూస్‌రీల్
జంప్ జిలానీలు తెల్లముఖం
స్వార్థ రాజకీయాలు, డబ్బులకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్లముఖం వేసినట్టయింది.
ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇంతలోనే అంత..
దల్లిపై ఎన్ని ఫిర్యాదులో..
డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని నమ్మిన పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా ఖంగుతిన్నట్టయింది.
టీడీపీలో ముసలానికి కారణంవీరే..
డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ గాజవాక నియోజకవర్గానికి చెందిన గంధం శ్రీనివాస్‌కు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆ నియోజకవర్గ యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రెక్కిత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ఏది ఏమైనా కూటమిలో చిచ్చుకు కారకులు వీరేనంటూ పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు.
గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు.
చరిత్రలోనే లేదు..
కోరం లేక సమావేశం వాయిదా పడడం జీవీఎంసీ చరిత్రలోనే లేదని వైఎస్సార్ సీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల సత్య శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమిలో సఖ్యత లేదనడానికి సోమవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికే నిదర్శనమని పేర్కొన్నారు. 63 మంది కార్పొరేటర్లలో 20 మంది వరకు డిప్యూటీ మేయర్ ఎన్నికకు డుమ్మా కొట్టారంటే కూటమిలో లుకలుకలు తేటతెల్లమయ్యాయన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప.. ప్రజాసమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు.

కూటమిలోడిప్యూటీ చిచ్చు

కూటమిలోడిప్యూటీ చిచ్చు