ట్రాన్స్‌ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష
డాబాగార్డెన్స్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు చేపట్టే చర్యలపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(యూఎన్‌యూ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్(ఎన్‌ఐయూఏ), ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్‌ఐ) ప్రతినిధులు నగర మేయర్ పీలా శ్రీనివాస్‌ను మంగళవారం కలిసి వివరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయా సంస్థల ప్రతినిధులు ట్రాన్స్‌ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఆవశ్యకతను తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో కలిగే విపత్తులు, వడగాల్పులు, వరదలు తదితర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల సహకారంతో నష్ట నివారణ ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు.


