మిస్ ఎర్త్ ఇండియాగా ముస్కాన్
ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ముస్కాన్ నయ్యర్ ప్రతిష్టాత్మక ‘మిస్ ఎర్త్ ఇండియా–2025’ కిరీటాన్ని కై వసం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఫినాలేలో బ్రెజిల్, స్పెయిన్, వెనిజులా వంటి దేశాల నుంచి వచ్చిన కఠిన పోటీని తట్టుకుని ఆమె ఈ విజేతగా నిలిచారు. చివరి దశలో ఎనిమిది మందితో తలపడిన ముస్కాన్, తన ప్రతిభతో విజయాన్ని అందుకున్నారు. గతంలో మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ వైజాగ్ రన్నరప్, మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ వంటి టైటిళ్లను గెలుచుకున్న ముస్కాన్, తన పాఠశాల స్థాయిలోనే మిస్ టింపనీగా గుర్తింపు పొందారు. కోల్‌కతాలో బీబీఏ చదువుతున్న సమయంలోనే ఫ్యాషన్ బృందానికి నాయకత్వం వహించిన ఆమె, ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తూ విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.


