జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 100 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తం 100 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను అదే రోజు పరిశీలించి, నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్‌కు 43 ఫిర్యాదులు అందగా.. ఇంజినీరింగ్–18, అడ్మినిస్ట్రేషన్–14, రెవెన్యూ–11, ప్రజారోగ్యం–6, యూసీడీ–5, హార్టికల్చర్ విభాగానికి 3 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎంహెచ్‌వో నరేష్ కుమార్ పాల్గొన్నారు.


