సింటర్ ప్లాంట్‌లో ఫ్లక్స్ కన్వేయర్ ప్రారంభం
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ సింటర్ ప్లాంట్ విభాగం ఉత్పాదక అభివృద్ధిలో ముందడుగు పడింది. విభాగం సొంత వనరులతో ఏర్పాటు చేసిన 25 ఎంటీఆర్‌ఎస్ ఫ్లక్స్ కన్వేయర్‌ను సోమవారం స్టీల్‌ప్లాంట్ సీజీఎం (వర్క్స్) రంజన్ మహంతి ప్రారంభించారు. ఈ నూతన కన్వేయర్ వల్ల 1,500 టన్నుల వరకు అదనపు లైమ్‌ను మాన్యువల్‌గా లోడింగ్ చేయవచ్చన్నారు. తద్వారా సింటర్ ప్లాంట్‌కు లైమ్ స్టోన్ కొరత చాలా వరకు తగ్గుతుందన్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులతో కన్వేయర్‌ను తయారు చేసిన విభాగం అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీజీఎం (మెయింటెనెన్స్) ప్రవీణ్‌కుమార్, జీఎం (స్టీల్, మిల్స్, ప్లానింగ్) ఇన్‌చార్జ్ పి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఇన్‌చార్జ్ జి.ఎస్.రావు, సింటర్ ప్లాంట్ జీఎం ఆచార్యులు పాల్గొన్నారు.


