
సాహితీ కృషీవలుడు ‘కొమర్రాజు’
విశాఖ విద్య : తెలుగు జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడు కొమర్రాజు లక్ష్మణరావు అని కేంద్ర ప్రభుత్వ హిందీ సలహా మండలి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. సాహితీ కృషీవలుడని కొనియాడారు. కొమర్రాజు జీవిత సాహిత్య కృషిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య వెలమల సిమ్మన్న, విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు డా.గుమ్మా సాంబశివరావు రచించిన ‘విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు లక్ష్మణరావు’ గ్రంథాన్ని యార్లగడ్డ ఆవిష్కరించారు. ఏయూలోని హిందీ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి అపూర్వమైన కానుకలను అందించిన ఆ మహనీయుడి ఘనత ఈ తరానికి తెలియజేసేందుకు సిమ్మన్న, సాంబశివరావు అమూల్యమైన గ్రంథం రచించారని కొనియాడారు.