
విశాఖ : రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంట్లలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఇక బాపల్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
