
మెట్రో భూసేకరణ ప్రక్రియపై సమీక్ష
మహారాణిపేట: మెట్రోతోపాటు జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్‌పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్ల విస్తరణ తదితర ప్రాజెక్టులపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సమీక్షించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్‌కు అనుగుణంగా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి తుది చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ, భీమిలి ఆర్డీవోలు పి.శ్రీలేఖ, సంగీత్ మాథుర్, ఎస్డీసీ సుధాసాగర్ పాల్గొన్నారు.