ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
జీవీఎంసీ జోన్–2, మధురవాడలోని ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. బొట్టవానిపాలెంలోని ఈడబ్ల్యూఎస్ లేఔట్, స్వతంత్ర నగర్‌లోని కోట్ల రూపాయల విలువైన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ఆలయం పేరుతో ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నెల 5న జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. కళానగర్‌లోని కృష్ణ నగర్ పార్కు, బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో పార్కు స్థలం కూడా కబ్జాకు గురయ్యాయి. ఆక్రమణదారులకు జోనల్ కమిషనర్ మద్దతు ఇస్తున్నారు. కలెక్టర్, జీవీఎంసీ అధికారులు స్పందించి పార్కులను కాపాడాలి. –చేకూరి రజని, సామాజిక కార్యకర్త, మధురవాడ


