
కూటమి పాలనలో కుట్రలు, వేధింపులే..
డాబాగార్డెన్స్: యావత్ ప్రపంచమంతా భారత్–పాక్ యుద్ధంపైనే చర్చించుకుంటుంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందంటూ వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. మాజీ మంత్రి విడదల రజని, దళిత ఎంపీటీసీ కల్పనపై పోలీసుల దాడిని నిరసిస్తూ సోమవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్లు ధరించి పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయన్నారు. పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజని పట్ల సీఐ సుబ్బరాయుడు దురుసుగా ప్రవర్తించడం చూస్తుంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా యో అర్థమవుతుందన్నారు. చంద్రబాబూ.. ఇదంతా ప్రజలు గమస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన బుద్ధిచెబుతారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు నిరసన తెలుపుతున్నారంటే కూటమి పాలన ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోందన్నారు. పోలీసులు ఓ మాజీ మంత్రిపై ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, రాష్ట్ర డీజీపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
పార్టీ మహిళా నాయకులు పేడాడ రమణికుమారి, పల్లా చినతల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మాజీ మంత్రిపై దురుసుగా ప్రవర్తించిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు బోని శివరామకృష్ణ మాట్లాడుతూ దళిత ఎంపీటీసీ కల్పనాపై కూటమి ప్రభుత్వం విరుచుకుపడడంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకి దళితులంటే చులకనగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, పార్టీ ముఖ్య నేతలు గొలగాని శ్రీనివాస్, కొండా రాజీవ్‌గాంధీ, ఉడా రవి, నడింపల్లి కృష్ణంరాజు, డాక్టర్ జహీర్ అహ్మద్, పోతిన హనుమంత్, అల్లు శంకరరావు, ద్రోణంరాజు శ్రీవత్సవ్, సనపల రవీంద్రభరత్, కర్రి రామారెడ్డి, మారుతీ ప్రసాద్, దేవరకొండ మార్కండేయలు, కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డి, శశికళ, బిపిన్‌కుమార్ జైన్, అనుబంధ సంఘాల నాయకులు మహ్మద్ షరీఫ్, వాసు గౌడ్, దేవరకొండ మార్కండేయలు, కనకల ఈశ్వర్, ఇమంది సత్యనారాయణ, పద్మ శేఖర్, వాసుపల్లి బంగారమ్మ, చిత్రాడ వెంకటరమణ, కంట్రెడ్డి రామన్నపాత్రుడు, జీలకర్ర నాగేంద్ర, అంబటి శైలేష్, శ్రీదేవి వర్మ, సత్యాల సాగరిక, రోజా రాణి, శిరీష, మోహన్‌రావు, రీసు అనురాధ, బి గోవింద్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు రక్షణ కరువు
మండిపడ్డ వైఎస్సార్ సీపీ శ్రేణులు
మాజీ మంత్రి రజని, ఎంపీటీసీపై
పోలీసుల దాడిని నిరసిస్తూ ఆందోళన