
● ఎప్పుడొస్తుందో రేషన్?
నిరీక్షణలో పేదలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ లబ్ధిదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వం అందించిన విధంగా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు సరఫరా చేయకపోగా.. పంపిణీ ప్రక్రియ కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నెల 11వ తేదీ గడిచినా ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రేషన్ సరుకులు అందని పరిస్థితి నెలకొంది. నిత్యం రేషన్ వాహనం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూపులు తప్పడం లేదు. పేదలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి శివాజీపాలెంలోని చిన్నపూలమ్మ గుడి వద్ద చోటుచేసుకున్న ఈ దృశ్యం అద్దం పట్టింది. ఇక్కడ వృద్ధులు తమ రేషన్ సరుకుల కోసం గోనె సంచులు క్యూలో పెట్టుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ పంపిణీలో జరుగుతున్న ఈ ఆలస్యంపై లబ్ధిదారులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

● ఎప్పుడొస్తుందో రేషన్?