కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే.. | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..

May 18 2025 12:46 AM | Updated on May 18 2025 12:46 AM

కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..

కూటమి ప్రభుత్వంపై ఇక పోరాటమే..

తీర్మానాలు

ఈ నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్‌ కమిటీలు ఏర్పాటుకావాలి.

జూన్‌, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు పూర్తిచేయాలి.

ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నాటికి బూత్‌ కమిటీలు ఏర్పాటు చేయాలి.

20 రోజులకు ఒకసారి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలి.

వార్డు, జిల్లా స్థాయి ప్రజా సమస్యలపై పార్టీ తరపున పోరాడాలి.

19న జరిగే డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వైఎస్సార్‌ సీపీ బహిష్కరణ.

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా కె.కె.రాజు, విశాఖ పార్లమెంట్‌ పరిశీలకుడిగా కదిరి బాబూరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రంలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు అంతా శూన్యమే.. ఉన్నదల్లా రూ.1.5 లక్షల కోట్లు అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, గిట్టుబాటు ధర లేక, ధాన్యం కొనుగోలు జరగక కళ్లాల్లోనే నిలిచిపోయిన పరిస్థితులు చూస్తున్నామన్నారు. మెట్ట ప్రాంతాల్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పొగాకు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం దాహంతో విర్రవీగుతున్న కూటమి ప్రభుత్వం బోల్తా పడకతప్పదని జోస్యం చెప్పారు. గతంలో రుషికొండ బోడిగుండు అంటూ పచ్చ పత్రికలు అదేపనిగా కథనాలు రాశాయి.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అడ్డంగా దోచుకుంటుంటే ఎందుకు వార్తలు రాయడం లేదని ప్రశ్నించారు. న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా కూటమి ప్రభుత్వం తీరు మారడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో హ్యూమన్‌ ట్రాకింగ్‌ జరిగిందని హడావుడి చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. జీవీఎంసీ కమిషనర్‌ లేకపోవడంతో నగర వీధుల్లో ఎక్కడిపడితే అక్కడ చెత్త పేరుకుపోతుందన్నారు. కమిషనర్‌ను నియమించుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. పార్టీ నేతలు తమ ప్రాంతంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ జగనన్న 2.ఓలో కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. 20 రోజులకు ఒకసారి నియోజకవర్గ స్థాయి సమావేశం, ఆరు నెలలకు ఒకసారి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందామన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది అరాచక పాలన నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమంగా కేసులు నమోదు పెడుతున్నారన్నారు. దేశంలో పరిస్థితులు చూస్తే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. అబద్ధపు హామీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్‌, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌, ముఖ్యనేతలు రవిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్‌ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, రొంగళి జగన్నాథం, ఉడారవి, ఫరూఖీ, రవిరాజు, మొల్లి అప్పారావు, బా ణాల శ్రీనివాసరావు, ఉరుకూటి అప్పారావు, గొలగాని శ్రీనివాస్‌, నడింపల్లి కృష్ణంరాజు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, పి.వి.నారాయణ్‌, జియ్యాని శ్రీధర్‌, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రాజు, అల్లు శంకర్‌రావు, అక్కరమాని పద్మ, దౌలపల్లి ఏడుకొండలు, కోరుకొండ వెంకటరత్న స్వాతి, నక్కిల లక్ష్మి, సాడి పద్మారెడ్డి, బిపిన్‌ కుమార్‌ జైన్‌, చెన్నా జానకిరామ్‌, గుండపు నాగేశ్వరరావు, వావి లపల్లి ప్రసాద్‌, రెయ్యి వెంకటరమణ, శశికళ, పి.వి.సురేష్‌, బల్లా లక్ష్మణ్‌, గులివిందల లావణ్య, మహమ్మద్‌ ఇమ్రాన్‌, గుడివాడ సాయి అనుషా, ఊరుకూటి రామచంద్రరావు, కె.భూపతిరాజు సుజాత, జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్‌రెడ్డి, పల్లా దుర్గారావు, దొడ్డి రామనాథ్‌, డా.మంచా నాగమల్లీశ్వరి, ఆల్ఫా కృష్ణ, షేక్‌ మహ్మద్‌ గౌస్‌, తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ 2.ఓలో కార్యకర్తలకే ప్రాధాన్యం

ప్రజా సమస్యలపై పోరాటలకు సిద్ధంకండి

కూటమి నేతల దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది

జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేకే రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement