మధురవాడలో 87.8 ఎకరాల అభివృద్ధికి ప్రణాళికలు
విశాఖ సిటీ: మధురవాడలోని 87.80 ఎకరాల వీఎంఆర్డీఏ భూమిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చైర్మన్ ప్రణవ్‌గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో క్రెడాయ్, నేరెడ్కో, అప్రెడా ప్రతినిధులతో శుక్రవారం సమావేశమై ఈ ప్రాజెక్టుకు గల అవకాశాలను వివరించారు. ఈ భూమికి బీచ్ కారిడార్, డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు, ఐటీ సిటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండడం అదనపు ఆకర్షణ అని వివరించారు. ఈ నెల 23న హైదరాబాద్‌లో, 30న బెంగళూరులో ఈ భూమికి సంబంధించి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, బలరామరాజు, ప్రణాళికాధికారులు వెంకటేశ్వరరావు, అరుణవల్లి, చామంతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
23న హైదరాబాద్, 30న బెంగళూరులో రోడ్ షో


