థ్రిల్
చిల్
● పర్యాటకులతో కిటకిటలాడుతున్న మహానగరం
● స్టార్ హోటల్స్, పబ్, రిసార్ట్స్‌లో ప్రత్యేక ఈవెంట్లు
● గ్రీటింగ్, గిఫ్ట్, బొకే, బేకరీ, స్వీట్, షాపుల వద్ద రద్దీ
విశాఖకు నూతన సంవత్సర శోభ వచ్చేసింది. రెండు రోజుల ముందే
సాగరతీరంలో సందడి మొదలైంది. దేశ, విదేశాల పర్యటకులతో
బీచ్ రోడ్డు కిటకిటలాడుతోంది. న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని
తాకేలా హోటళ్లు, రిసార్టులు, పబ్‌ల నిర్వాహకులు ఈవెంట్ల
నిర్వహణకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 31వ తేదీన డీజే, డ్యాన్స్,
ఇతర ప్రత్యేక కార్యక్రమాలతో అదరగొట్టే ఏర్పాట్లలో
నిమగ్నమయ్యారు. యువతతో పాటు ఫ్యామిలీలు సైతం ఎంజాయ్
చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే నగరంలో గ్రీటింగ్,
గిఫ్ట్, బొకే, బేకరీ, స్వీట్, షాపులు కూడా రద్దీగా మారాయి. దీంతో
ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. – విశాఖ సిటీ


