హోటళ్లు హౌస్‌ఫుల్
వారం రోజుల ముందే హోటళ్లకు న్యూ ఇయర్ జోష్ వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు విశాఖలో సందడి చేస్తున్నారు. నగరంలో పర్యాటక ప్రాంతాలతో పాటు ఏజెన్సీ కూడా పర్యాటకులో నిండిపోయింది. దీంతో విశాఖలో హోటళ్లు హౌస్‌ఫుల్‌గా మారాయి. నగరంలో 24 స్టార్ హోటళ్లు, 200 వరకు సాధారణ హోటళ్లు, రిసార్టులు, గెస్ట్ హౌస్‌లు, ఉన్నాయి. సుమారుగా 5 వేల రూమ్స్ ఉండగా.. ప్రస్తుతం ఎక్కడా రూమ్ దొరకని పరిస్థితి నెలకొంది. డిమాండ్ విపరీతంగా పెరగడంతో రూమ్స్ ధరలు మూడు, నాలుగింతలు పెంచేశారు. నొవోటెల్ హోటల్‌లో రూ.7 వేలు ఉండే రూమ్ ప్రస్తుతం రూ.25 వేలు, రూ.30 వేలుగా ఉంది. సాధారణ హోటళ్లలో రూ.1,500 దొరికే రూమ్స్ ప్రస్తుతం రూ.3, రూ.4 వేలు ఛార్జ్ చేస్తున్నారు. అయినప్పటికీ దొరికే పరిస్థితి లేదు.


