ఆకట్టుకునేలా ప్రత్యేక ఈవెంట్లు
న్యూ ఇయర్ వేడుకలకు మరింత కిక్ ఇచ్చేలా నగరంలో ఈవెంట్లు జరగనున్నాయి. స్టార్ హోటళ్ల నుంచి పబ్‌ల వరకు అన్నింట్లోను కస్టమర్లను ఆకర్షించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో 14 చోట్ల ఈ ఈవెంట్ల నిర్వహణకు దరఖాస్తులు వచ్చాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య లైవ్ మ్యూజిక్‌లు, డీజీలు, ప్రత్యేక డ్యాన్స్‌లతో అందరినీ ఉర్రూతలూగించనున్నారు. ఒకవైపు కేరింతలు కొట్టించే మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ.. మద్యంతో పాటు దేశీయ, విదేశీ రుచులను అస్వాదించే అవకాశాన్ని కల్పించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు సైతం సిద్ధం చేశాయి. కొన్ని హోటల్స్‌లో రోరింగ్ ట్వంటీస్, జంగిల్ పార్టీ, కార్మివాల్ బాష్, ఫెస్టివల్ కలర్స్, డీజే సన్నీ, టోబో వుడ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మధ్యాహ్నం స్పెషల్ లంచ్ నుంచి మొదలుకొని రాత్రికి ఈవ్ డిన్నర్, గాలా డిన్నర్, కౌంట్‌డౌన్ డిన్నర్, న్యూ ఇయర్ బ్రంచ్‌లతో ప్రత్యేక రుచులను అందించనున్నారు. అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్, లిక్కర్, ఫుడ్ అందించే ఈ ఈవెంట్లలో ప్రవేశానికి రూ.8 వేల నుంచి రూ.18 వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు.


