
లారీ ఢీకొని వ్యక్తి మృతి
గోపాలపట్నం: భార్యకు కడుపులో నొప్పిగా ఉందని మాత్రలు తీసుకొచ్చేందుకు గోపాలపట్నం వచ్చిన అక్కిరెడ్డి బాబూరావు(52)ను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం ఖారవేలనగర్‌కు చెందిన అక్కిరెడ్డి బాబూరావు ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం భార్యకు కడుపులో నొప్పిగా ఉందని గోపాలపట్నంలోని మందుల దుకాణానికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతుని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. పెద్ద కొడుకు జగదీష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామారావు కేసు దర్యాప్తు చేపట్టారు. ారీ ఆచూకీ లభ్యమైనట్లు తెలిసింది. ఇక్కడి హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా మట్టిని తరలించేందుకు వచ్చింది. లారీ డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

లారీ ఢీకొని వ్యక్తి మృతి