
జీవీఎంసీకి 88 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 88 వినతులు అందాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నిర్ణీత సమయంలో ఈ ఫిర్యాదులను పరిష్కారించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. కాగా.. పరిపాలన అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూకి 7, పబ్లిక్ హెల్త్‌కు 7, పట్టణ ప్రణాళికా విభాగానికి 43, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 18, యూసీడీ విభాగానికి 3, మొక్కల విభాగానికి ఒక ఫిర్యాదు అందింది. ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాదరాజు, చీఫ్‌సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.