
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
భారీగా దరఖాస్తులు
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ వారీగా అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి.
19న డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న నిర్వహించే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు.. ఆ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 11 గంటలకు తమ గుర్తింపు కార్డులతో సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని జేసీ సూచించారు.
విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్‌మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ
డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.
భర్తీ కానున్న పోస్టులు ఇవే..
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్‌మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్‌లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
బీసీ–ఈ 423
ఎస్సీ–1 479
ఎస్సీ–2 876
ఎస్సీ–3 2,821
ఎస్టీ 10,523
ఈడబ్ల్యూఎస్ 890
కేటగిరీ వచ్చిన
దరఖాస్తులు
ఓసీ 1,626
బీసీ–ఏ 1,940
బీసీ–బీ 2,563
బీసీ–సీ 198
బీసీ–డీ 8,330
వీటితో పాటు దివ్యాంగ కేటగిరీకి దరఖాస్తులు వచ్చాయి
న్యూస్‌రీల్
ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ
1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు
కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే..
దరఖాస్తులు ఇలా..
మొత్తం అభ్యర్థులు 29,779
సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 49,658
పురుషులు 11,773
మహిళలు 18,006