
షిప్‌యార్డ్ పురోగతిపై ప్రశంసలు
సింథియా : హిందుస్థాన్ షిప్‌యార్డ్ చేపట్టిన ‘గ్రీన్ అండ్ గ్రోత్ ఫోకస్డ్ ఇనిషియేటివ్స్’ను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్ అభినందించారు. షిప్‌యార్డ్ అభివృద్ధిని ఆయన సమీక్షించారు. కొత్త ఆవిష్కరణలు, దేశాభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. షిప్‌యార్డ్ 84 ఏళ్ల చరిత్రను, వాణిజ్య నౌకల నిర్మాణంలో సంస్థ సహకారాన్ని చైర్మన్ హేమంత్ ఖత్రి కార్యదర్శికి వివరించారు. గ్రీన్ టగ్‌లు, హైడ్రోజన్ నౌకల అభివృద్ధి ప్రణాళికలు తెలిపారు. గ్రీన్ టెక్నాలజీకి మద్దతుగా బ్యాటరీ టగ్‌ల వ్యయం అంచనా వేయాలని రామచంద్రన్ సూచించారు. పెట్రోలియం శాఖ అవసరమైన నౌకల నిర్మాణానికి షిప్‌యార్డ్ సిద్ధంగా ఉందని ఖత్రి పేర్కొన్నారు. కొత్త డ్రై డాక్‌లు, స్లిప్‌వేలతో షిప్‌యార్డ్ సామర్థ్యం పెరుగుతుందని ఆయన అన్నారు.