
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మైన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతలు అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్‌లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
–మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

● తల్లీబిడ్డ అవస్థలు