
రాజకీయ అండదండలతో..
నగరంలో పలువురు రౌడీషీటర్లకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్లు ప్రతిరోజు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది రౌడీషీటర్లు తమకు సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో పోలీసులపై ఒత్తిడి చేయించి రోజువారీ హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.రాజకీయ నేతలే స్వయంగా ఫోన్ చేసి ఆదేశించడంతో పోలీసులు రౌడీషీటర్ల జోలికి వెళ్లడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పోలీసులు వీరిని పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నగరంలో శాంతిభద్రతలకు సవాలుగా మారింది