
పీపీపీ పేరుతో కాజేసే కుట్ర
ఒకవైపు సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రాజెక్టులపై కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో రాజకీయ నాయకులు వీఎంఆర్‌డీఏకు చెందిన విలువైన ఖాళీ స్థలాలను లేఅవుట్ల అభివృద్ధి, విల్లాలు, అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాల కోసం తీసుకొని రూ.కోట్లకు కోట్లు వెనకేసుకున్నారు. సంస్థకు నామమాత్రంగా పడేసి చేతులు దులుపుకున్నారు. తాజాగా అదే తరహాలో ఈ ఎంఐజీ అపార్ట్‌మెంట్ల ప్రాజెక్టులను కూడా కై వసం చేసుకోవడానికి టీడీపీ నేతలు ఎత్తులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపీపీ పేరుతో ఈ అపార్ట్‌మెంట్లను చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.