స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్‌ | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్‌

May 17 2025 7:17 AM | Updated on May 17 2025 7:17 AM

స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్‌

స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగికి అంతర్జాతీయ టైటిల్‌

ఉక్కునగరం: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో స్టీల్‌ప్లాంట్‌ మాజీ ఉద్యోగి బి.వి.ఎస్‌.కె.లింగేశ్వరరావు జంట విజేతగా నిలిచింది. ఈ నెల 10 నుంచి 14 వరకు తైపీలో తైవాన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 12 దేశాలకు చెందిన 2,500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 55+ కేటగిరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సుజానే వెంగిలెట్‌తో లింగేశ్వరరావు పాల్గొన్నారు. సెమీఫైనల్స్‌లో మలేషి యాతో పోటీపడి గెలిచిన లింగేశ్వరరావు జంట.. ఫైనల్స్‌లో జపాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ని స్టీల్‌ప్లాంట్‌ అధికారులు, పలువురు క్రీడాకారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement